Jan2010
చెప్పుకోవటానికేంలే
చెప్పుకోవటానికేం,
తలుపులు తెరిచే వుంటాయి! కోయిలల
ఋతువులు స్వేచ్ఛా గాలుల నినాదాల్ని
హోరు హోరుగా వినిపిస్తూనే వుంటాయి.
అయినా … ఎక్కడో
గొంతునొక్క బడ్డ మర్మ ధ్వనులు వినిపిస్తున్నాయి
ఇక్కడే …, తెరిచిన తలుపులకటూ… ఇటూ
స్వేచ్ఛానినాదాల హోరుల్లోనే!
చెప్పుకోటానికేంలే
తలుపులు తెరిచే ఉంటాయి
అందుకే …, వాటిల్లోంచి
ఆగమనాల కంటే…
నిష్క్రమణల పద ధ్వనులే ఎక్కువ…
February 5th, 2010 at 4:39 pm
[...] చెప్పుకోవటానికేంలే [...]