గులాబీలు, ఓ వేసవి చివర

(మేరీ ఆలివర్ 2004 కవిత్వం “బ్లూ ఐరిస్ “లో “రోసెస్, లేట్ సమ్మర్” కి అనువాదం)

ఏమవుతుంది,

mary-oliver1
mary-oliver1

ఈ ఆకులన్నీ
ఎరుపెక్కి, బంగారు రంగు దాల్చి
రాలిపోయాక?

ఏమవుతుంది,
ఎప్పుడూ పాడే ఆ పిట్టలు
ఇక పాడలేనప్పుడు?

ఏమవుతుంది,
బిరాన పోయే ఆ రెక్కలకు?

అవునంటావా,
ఇక్కడ ఎవరి స్వర్గం వాళ్ళదేనా?

అవునంటావా,
ఆ చీకటి ఆవలి నించి
ఎవరో వొకరు
మనల్నే పనిమాలా పిలుస్తారంటావా?

ఆ చెట్ల ఆవల
పిల్లలకి పాఠాలు చెబ్తూనే వుంటాయి నక్కలు
లోయలో దిలాసగా బతికేదెలాగో?

అవి ఎప్పుడూ కనుమరుగు కావు నిజానికి,
ఎప్పుడూ అక్కడే వుంటాయి
ప్రతి పొద్దూ విరిసే
వెలుగు మొగ్గల్లో
ప్రతి చీకట్లో
ఆకసాన నిలిచి.

ఆ కొండ కోనల వరసలో
సముద్రం వెంబడి
చివరి గులాబీలు
తీయని వాసనల తయారీలో తలమునకలు

లోకానికి ఏదయినా ఇద్దామన్న తపనతో.

ఇంకో జన్మంటూ వుంటే
నేను

వొక చెక్కు చెదరని ఈ సంతోషం కోసమే
అంతా గడిపేస్తా.

నేనో నక్కనవుతాను
వూగే కొమ్మల
చిన్ని చెట్టునవుతాను

ఆ గులాబీల తోటలో
వొక చిన్ని పూవునయినా దిగులు లేదు

భయమంటే ఏమిటో
తెలీదు కదా వాటికి.

కోరిక అంటే ఏమిటో
తెలీదు కదా వాటికి.

అసలు ఎందుకు అన్న ప్రశ్న
మనసులో పుట్టనే పుట్టదు కదా వాటికి.

పోనీ,
ఈ పూవు బతుకు ఎంత కాలం అన్న
దిగులు అసలు లేనే లేదు కదా వాటికి.

అసలు అలాంటెలాంటి
పిచ్చి ప్రశ్నా వాటి మనసుని తొలిచెయ్యదు కదా!

5 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు, దర్వాజ

5 Responses to “గులాబీలు, ఓ వేసవి చివర”

  1. 1
    కెక్యూబ్ వర్మ Says:

    ఆ గులాబీల వాసన యిలా పరిచయంచేసినందుకు ధన్యవాదాలు

  2. 2
    ravikiran timmireddy Says:

    చాలా బావుందండి మీ అనువాదం.

    దిగులు అసలు లేనే లేదు కదా వాటికి!
    కానీ నాకు మాత్రం దిగులు కావాలి
    మనసుని మెలిపెట్టే దిగులు కావాలి
    అప్పుడే కదా చిరు నవ్వు
    వెలుగుల విలువలు తెలిసేది
    కోరికలతో కాలిపోవాలి
    వాటి కోసం తపనతో మనసు ఎర్రబడాలి
    రక్తం పరుగులు పెట్టాలి
    తీరని కోరికల నిరాశ నన్ను నిస్తేజం చెయ్యాలి
    బతుకు ఉయ్యాలని దిగంతాల వరకు ఊగాలి
    మనిషనే ఈ అవకాశాన్ని
    బతుకనే ఈ ఒక్క అనుభవాన్ని అద్యంతాలమేర
    నా మనసునిండా నింపుకోవాలి

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  3. 3
    హెచ్చార్కె Says:

    రవికిరణ్ తిమ్మిరెడ్డి రాసింది మరింత్ బాగుంది.

  4. 4
    madhurasree Says:

    ఆ కొండా కోనల వరుసలో వొక చెక్కు చెదరని సంతోషం కోసమే అన్న పదప్రయొగం చాలా బాగుంది మధుర శ్రీ అనంతపురం

  5. 5
    geetaanjali Says:

    లొకానికి ఎమైనా ఇవ్వదానికి నెనూ ఒక గులాబీ నౌవుతాను,,మంచి అనువాదము…గీతాంజలి

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో