Jan2010
హుకిటోల
(ఒరియా మూలం: రాజకిషోర్ దాస్ )
ఎంత దివ్యమైనది
ఏకాంతం
ఎవరు అవునన్నా కాదన్నా
అవును అవును అనే అంటావు
నాతో పాటు నువ్వూ
ఓ హుకిటోలా!
హింసా కలహాల కల్లోలాల
ఉన్మాద సమాజానికి దూరంగా
దురాశల అత్యాశల కశ్మలానికి
సంతల నుండి మార్కెట్ల నుండి
బహు దూరంగా
సరికొత్త గూడు సరికొత్త లోకం
కట్టుకోవాలని ఉబలాటపడుతోంది
ఉవ్విళ్ళూరుతోంది
నా మనస్సు !
నా హృదయపు
పొలిమేరలకి ఆవల
నిర్మించాలని
ప్రస్తర స్నిగ్ధ మేఘనాథని
నా స్వేదంతో కట్టాలని
కాంతి ప్రభానిలయాన్ని
దేదీప్యమానంగా దీప స్థంభాన్ని
పగిలిపోయిన నా మనో దర్పణంలో
చూడాలని
నాముఖాన్ని
నీ నీలవర్ణపు
దృశ్య సామ్రాజ్యాన్ని!
అదిగో
అలాచూడు
హుకిటోల!
ఏకాంతం
ఎలా వెల్లి విరుస్తోందో
గూటి మొహం పట్టిన
పక్షుల రెక్కల్లో
ఎంత దీప్తివంతంగా
గోచరిస్తోందో
నీ చుట్టూరా
మిలమిలలాడే
సముద్రం!
ఒక్కొక్క తరుణంలో
అనిపిస్తోంది
తప్పనిసరిగా
విస్మరించాలని
నా భాధలని
దగ్దమైన ప్రేమని
గాయపడిన
మనస్సుని
అలుపూ సొలుపూ
మరిచిపోవాలని!
ఆనందంతో
అప్పుడు
మనసారా
నీ హింతాల్ వనాల్లో
ఏర్పరుచుకోవాలని ఏకాంత
కుటీర జీవితాన్ని !
* * *
పాదసూచిక
- హుకీటోల — బంగాళఖాతం తీరంలో హింతాల్ చెట్ల మధ్య ఉన్న చిన్న ద్వీపం వందేళ్ళక్రితం ఆంగ్లేయులు నిర్మించింది. ఇప్పటికి ఉన్నది.
- మేఘనాధ — పూరి జగన్నాధంలో శ్రీ మందిరం నాలుగు వైపుల కట్టిన ప్రాచీరం.
- హింతాల్ చెట్లు — సముద్రం ముందుకు పొంగి రాకుండా చేసే గిరక తాడి చెట్లు.
5 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు
January 10th, 2010 at 8:28 am
అచ్చు తప్పులు ఉన్నాయి.1
1.కాదన్నా
2.కలహాల
3.పట్టిన
4.చేసే
5.గిరక తాడి
అని ఉండాలి.
చాగంటి తులసి
January 13th, 2010 at 3:13 pm
తులసి గారికి
అచ్చు తప్పులు దొర్లినందుకు క్షంతవ్యులం. చూపినందుకు మీకు మా ధన్యవాదాలు. వాటిని సరిదిద్దాం.
ప్రాణహిత సంపాదకవర్గం
January 18th, 2010 at 6:42 am
మనుషుల మీద భ్రమలు పొయాక ,,నిజనగానె ,హుకిటొల లొ ఎగిరి వెల్లి ఒక ఎకాంత మందిరాన్ని నిర్మించుకొవాలని అనిపిస్థొంది ..ఎక కాలమ్ లొ ప్రెమలు.,కుట్ర్లు కురిపించె మనుషులకు దూరంగా,హింతాల్ వనాలను వెతుక్కుంటూవెల్లలని ఉంది..గీతాంజలి
March 3rd, 2010 at 1:09 pm
we can reach there through our imagination tulasi
October 23rd, 2010 at 5:48 am
మీ అనువాదం చాలా బాగుంది.
అభినందనలు.