Comments on: ఇప్పుడు నువ్వన్నదే సై

By: ramnarsimha
సత్యదర్షన గారి అభిప్రాయాన్ని,

జర ఎవరైనా…

తెలుగులోకి అనువాదం చెయ్యండి…. ప్లీజ్..

By: ramnarsimha
సత్యద్రర్షన గారు,

మీ అభిప్రాయాన్ని జర తెలుగులో్ చెప్పుండ్రి…..

By: tirumalesa
ఎవరైనా ఈక్రింది వాక్యాలకు అర్థం చెప్పగలరా.. హరగోపాల్ గారూ, ఉపేంద్రగారూ కాస్త మిగిలిన పాఠకులకు హెల్ప్ చేయండి ప్లీజ్.. హెచ్చార్కే గారూ మీరుకూడా..

there are many job vacancies in australia . including washing of empty beer bottles, cleaning the floors of pubs and looking at the motherless sky with dead eyes. the sky, always blue blue blue for ever. are you hold tools with me?.

హా.. సత్యదర్శనా ఎంతపనిచేశావయ్యా….

By: పవనకుమార్
rameshnishani  గారూ, ఈ పని బాగా అలవాటు లేని మన్లాంటి వాళ్లం కామెంటును ముందుగా వర్ద్ లో రాసి, చదువుకుని, ఆ తరువాత కాపీ చేసి, కావలసిన చోటికి తెచ్చి అతికించడం మేలు అనుకుంటా.

By: rameshnishani
నీకు ఆ షక్తని  ప్రషాదించమని నీ బాద  ని  మీ దెవునికి విన్నవించుకొ

By: rameshnishani
చకిరెవు ఉపెంద్ర గరు నీ కలమ్ లొ సిర విషయమ్ పక్కన పెదితె అసలు నీకు ఒక కవితె వెనకల ఉన్న బవొద్వెగన్ని అర్తమ్ చెసుకొలెని పరిస్తిథి లొ నువ్వుందదమ్ చుసి నకు బాద గ ఉంది ఆ ఆలొచనె నీకు రలెదు ఇలంతి అర కొర గ్జ్ననమ్ తొ నువ్వు రాసె చర్చ నీకు అర్హమయితె చలు అనిపిస్తుంది అలాంతి   ని నీకు ప్రసదించుమని నీవు దన్నమ్ పెత్తుకునె దెవునికి నా మతగ చెప్పుకొ నీ దాద విన్నవించుకొ

By: చాకిరేవు ఉపేంద్ర
పని వొత్తిడిలో వుండటం వలన  జాగ్రత్తగా చదవటం కానీ, తప్పులు లేకుండా రాయటం kaanకానీ ఒక్కొక్క సారి కష్టమవుతోంది.

తిరునగరి గారు కూడా అలాగే తొందరలో చదివి వుంటారని అనుకుంటున్నాను.  వెల్చేరు నారాయణ రావు అభిప్రాయమూ , నా అభిప్రాయమూ ఒకటే అయి వుంటే , నేనే ఆ మాట చెప్పిన తరువాతే ఆ లింకు ఇచ్చి వుందును. వెల్చేరు అభిప్రాయం చదవదగినది – అని మాత్రమే నేను చెప్పినది.

నాకు అర్ధమయినంతలో ఆ వ్యాసంలో ఆయన చెప్పినది, సాహిత్యకారులూ, విమర్శకులూ మాత్రమే  సాహిత్యం విలువ నిర్ణయించాలని కాదు. సాహిత్యకారులూ, విమర్శకులూ  కూడా సాహిత్య విలువలని నిర్ణయించే చర్చలో పాల్గొనాలని.  చాలా కాలంగా వాళ్ళు ఆ పని చేయటం మానుకున్నారని.  విస్తృత సమాజం నిర్ణయిస్తుంది అన్న వొక మాట అనేసి,  సాహిత్యకారులూ విమర్శకులూ పరమ సోమరిపోతులుగానూ, అవకాశవాదులు గానూ మారిపోయినారని. ఈ బాధ్యతా రాహిత్యం వలన తెలుగు సాహిత్యం ముఠా రాజకీయాలకు  మారు పేరుగా మారిపోయిందని.  ఇది విమర్శ అయితే, దీనికి జవాబు,  ఈ మాట సాహిత్యానికి జంధ్యము వేయటం అని చెప్పేయ్యటమో,  వందేళ్ళ కిందటి రష్యన్  రచయితలను  అడ్డుపెట్టుకుంటేనో .  ఈనాటి సాహిత్యకారులూ, విమర్శకులూ ఎట్లా అవకాశవాదులు కారో, వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో నిరూపించాలి.

మీకు నా పేరు మీద ఏదో కుతూహలం వున్నట్లుంది.  కలం పేర్లు పెట్టుకోవటం అంతా వింతైన విషయమా ? తెలంగాణలో నాకు చాలా వృత్తి పనుల పట్ల ప్రత్యేకమైన అభిమానం వుంది. చాకలి వృత్తి పట్ల కొంచెం ఎక్కువగా వుందనుకుంటాను.  ప్రతాపరుద్రీయం నాటకములో  చాకలి వాడు లేకపోతే  యుగంధరుడు ఢిల్లీ కి వెళ్ళ గలిగి వుండే వాడు కాదు. ఆసిరిగాడు లేకపోతే కన్యాశుల్కం నాటకం లేదు. నాకు జీవితంలో కొన్ని ముఖ్యమైన  పాఠాలు నేర్పిన వొక చాకలి పేరు నేను కలం పేరుగా పెట్టుకున్నాను.

By: చాకిరేవు ఉపేంద్ర
రవి కిరణ్,

సమాజంలో వుండే ప్రతి మనిషికి కళ ని అనుభవించే, విమర్శించే హక్కు వుంటుంది అన్న విషయం ఇప్పుడు మళ్ళీ నిరూపించనవసరం లేదు.  దాన్ని నిరూపించిన తరువాత  ఇంక కళని అనుభవించటం  ఎట్లాగ, విమర్శించటం ఎట్లాగ అన్నదాని మీద ఇంక  దాని  గురించి chepచెప్పుకోవలసిన విషయం చర్చించవలసిన విషయం ఏమీ లేదు అని అని దబాయించటం  – ఇదీ మూడు తరాల రచయితలు కళాకారులు ఇప్పటికే చేసి వున్నారు.

‘విస్తృత సమాజమే’  అని అన్న మాటని జాగ్రతగా  విస్లెషించకపోతే  – రాజకీయంగా  బలం వున్నవాడే, నోరున్న వాడే, తుపాకీ వున్న వాడే, ఆస్తిబలం కండ బలం  అని అవుతుంది – ఇది ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు చాలా మందే వున్నారు  కాబట్టి  విషయం వచ్చింది.   కాబట్టి  విస్తృత సమాజం అంటే  ఏమిటి, అందులో ఎవరు మాట్లాడుతారు, ఎట్లా మాట్లాడుతారు, ఎట్లా మాట్లాడుతారు. ఎప్పుడూ మాట్లాడుతారు ఇవన్నీటి పట్ల మీకున్న అవగాహన చెప్పక పోతే మీ మాటలని ఎట్లా అర్ధం చేసుకోవాలో తెలియదు.

వెల్చేరు నారాయణ రావు వ్యాసంలో  పనికొచ్చే ముక్క వొక్కటీ కనపడక పోతే  ఇప్పుడు వచ్చిన పెద్ద నష్టమేమీ లేదు.  మీరూ విస్తృత సమాజంలో ఒక సభ్యులే కాబట్టి ఎలా వుండాలో మీరు చెప్పండి. సాహిత్య విలువ మీద చర్చ ఎట్లావుండాలో ?

పాపులారిటీ  రేటింగులు సరిపోతాయా ? బాక్సాఫీసు కలెక్షన్లు  సాహిత్యానికి ఒక కొలమానంగా  మీరు  ఒప్పుకుంటారా ? ప్రజలందరి aakaanskhalanఆకాంక్షలనూ  నేను వ్యక్తీకరిస్తున్నాను అని ఒక కవో విమర్శకుదో  అంటే ,  అది నిజమో కాదో మీరు ఎట్లా తేల్చు కుంటారు ? దానికి తూనిక రాళ్ళు ఏమిటి ? అటువంటి తూనిక రాళ్ళు అట్లా వుందాలా  ఇట్లా వుందాలా అన్నది సమస్య కావచ్చును . అసలు తూనిక రాళ్ళు వుండకూడదు   అని కూడా సిద్ధాంతీకరించవచ్చును.  అది మీ సిద్ధాంతమయితే  ఇక ఆ తరువాత  సాహిత్యం  అన్న ప్రత్యేక పదం వుపయోగం ఏమిటై వుండవచ్చును  అన్నది కూడా చెప్పాలి.

ఎవరైనా ఏదైనా రాయచ్చును. అది ఎవరికి ఎట్లా అర్ధమైతే అట్లా అర్ధమవుతుంది.  నేను రాసింది నీకు నచ్చకపోతే ఇంక దాని గురించి మాట్లాడుకోవలసిన పని లేదు.  ఇట్లా సాహిత్యానికి వ్యక్తిగత  టేస్ట్  తప్ప మరేమీ  తూనిక అక్కరలేదు అని మీ అభిప్రాయమా ? అట్లా అయితే mlaeeమళ్ళీ  సమాజమ్మూ, విస్తృత సమాజమూ అన్న మాటలెందుకు?

ఎలీటిస్ట్  విమర్శలకి  మీరు చెప్తున్న జవాబు  పాపులిజమో , అతి వుదారవాద ఇండివిడ్యుయలిజమో   అయితే  అది కోందనాలిక్కి మందేసి వున్న నాలికని వూదగోట్టుకోవటం అవుతుంది – ఈ రెండు ధోరణులూ తెలుగులో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆవిష్కరించవలసిన అవసరం లేదు. నిజానికి  ఈ ధోరణులు  సాహిత్యానికి వేసిన జంధ్యము వేయటమే కాదు. ఆ జంధ్యం కనిపించకుండా పైనించి  చెర్మాస్ చొక్కా తొడిగాయి.   వదిలించికోవలసిన అవసరం వచ్చింది కాబట్టి  ఈ గొడవంతా జరుగుతున్నది .

By: ravikran timmireddy
ఇప్పటి సంగతిని ఎప్పటో సంగతి చెయ్యాలనేకదా !

కవి హరగోపాల్ గారికి, మిగిలిన పాఠకులకి నా క్షమాపణలు. ఈ అభిప్రాయం ఇక్కడ బహుశా అప్రస్తుతవేవో. కానీ ఉపేంద్ర గారు లేవనెత్తేరుగాబట్టి ఇక్కడ వేల్చేరు గారి వ్యాసం మీద నా అభిప్రాయం వ్రాయదల్చుకున్నాను.

వేల్చేరు గారు వ్రాసిన ఇప్పటి సంగతి, వారు ఇప్పటిని అప్పటికెప్పటికో తీసుకపోడానికి చేసిన ప్రయత్నం నాకు దాంట్లో కనిపించింది. ఎన్ని ముసుగులు కప్పినా, ఆ వ్యాసానికి మరెన్ని రంగులేసినా, అది కళ, కళకోసవే అని, ఆ  కళ కోసవే అయినప్పుడు, ఆ కళని (సాహిత్యం) సృష్టించ గలిగిన వారు, ఆ కళని ఆనందించగలిగిన వారు, ఆ కళని బేరీజు వేసి, విమర్సించ గలిగిన వారు, కలాకారులే అయ్యుండాల్ని వారి అభిప్రాయం. అందుకనే సాహిత్యాన్ని సాహిత్యకారులే బేరీజు వెయ్యాలనే వాదని వారు తీసుకొచ్చారు. ఆ వాదాన్ని సమర్ధించు కోవడానికి, వారు ఇంజినీరింగు, ఫిజిక్సు మొదలైన శాస్త్రాలని ఉదాహరించారు. నిజవే ఒక ఇంజినీరు గొప్ప ఇంజినీరుని, ఆ ఇంజినీర్లతో ఏర్పడిన ప్రత్యేక సమాజవే గుర్తించగలదు. ఆ దారిలోనే ఫిజిస్టులు మొదలిన వారి గొప్పతానాన్ని కూడా, ఆయా రంగాలలో నిష్టాతులైన వారే గుర్తించగలరు. ఆ రకవైన గుర్తింపే వారికి వన్నెతెస్తుంది. మీరూ, నేనూ, మనలాటి సామాన్యుల అభిప్రాయాలు వారికేం గుర్తింపునియ్యవు.

అదే రీతిలో వేల్చూరి గారు సాహిత్యానికికూడా, ఒక జంధ్యం వేయదలచుకున్నారు. నిజం చెప్పాలంటే అప్పుడెప్పుడో వుండి, తెగిపోయిన ఆ పోగుని మరోసారి వారు పీఠంమీద కూర్చోపెట్టదలచుకున్నారు.

ఫిజిక్సు, ఇంజినీరింగు, వాటికి ఆలంబనగా వున్న గణిత శాస్త్రాం ఒక భాషే అయిన, అది ఒక ఎలీట్ సమాజాని అర్థవయ్యే భాషే. సామాన్యులకి ఆ భాష అర్థం కాదు. ఫలితాలని సామాన్యుడు అనుభవిస్తున్నా, ఆ ఫలితాల వెనుక వున్న భాషమాత్రం సామాన్యులకి అలవిగానిది. కానీ తెలుగు భాష ఆవిధంగా కాదు. ఇది ఏ ఎలీట్ సమాజానికో మాత్రవే పరిమితవంది కాదు. తెలుగుగానీ, మరో భాషగానీ ఆయా ప్రజల పరస్పర వ్యక్తీకరణకు ఆలంబనంగా రూపుదిద్దుకున్నదే. సాహిత్యం ఆ వ్యక్తీకరనకు ఒక రూపవే కానీ, అది ఆ వ్యక్తీకరణనుంచి వేరు కాదు. నిజవే, అనుమానవే లేదు, భాష కూడా ఎన్నోతరగతులగా, ఎన్నో రూపాలుగా అభివృద్దిచెందింది. కానీ ఏ తరగతి భాషైనా, ఏ భాషా రూపాంతరవైనా, దాన్ని సాహిత్యంగా వ్యక్తీకరించడవనేది సమాజంతో ఒక కాన్వర్జేషన్ కోసవే. అంటే ఇక్కడ ఫిజిసిస్టుల్లాగా, ఇంజినీర్ల లాగా, గణితవేత్తలలాగా ప్రాకృతిక వ్యక్తీకరణని అర్థం చేసుకోవటం కోసం, ఆ వ్యక్తీకరణని అర్థం చేసుకోగలిగే ఆ ప్రత్యేకవైన ఎలీట్ సమాజం కోసం మాత్రవే కాకుండా, సాహిత్యవనేది మనల్ని మనం మనల్ని వ్యక్థం చేసుకోవటం కోసం. ఆ దిశలో మన వ్యక్థీకరణ ఏ ప్రత్యేకవైన నలుగురుకోసవో కాకుండా, ఒక విశాలవైన సమాజం కోసం అయ్యుంటుంది. అంటే సాహిత్యం సాహిత్యకారులకోసం కాకుండా, సాహిత్యం సమాజం కోసం అయ్యుంటుంది. కాబట్టి సమాజంలో అందరికి ఆ సాహిత్యాన్ని, అనుభవించి ఆనందించేహక్కు, నచ్చకపోతే విమర్సించే హక్కు వుండితీరుతాయి.

గణితం మొదలైన శాస్త్రాలన్నీ, ప్రకృతి మాట్లడే భాషని అర్థం చేసుకోడానికి మాత్రవే వుపయోగం. ఇక్కడ మీకు కాన్వర్జేషన్ వుండదు. మీతో ప్రకృతికి పనిలేదు, మనం దానిని అర్థంచేసుకోవాలే కానీ, అది మననేం పట్టించుకోదు. కానీ సాహిత్య ప్రక్రియ ఒక సంభాషణ. సాహిత్యకారుడికి, సమాజానికి మధ్య ఒక సంభాషణ. ఇక్కడ ఆ సంభాషణ మంచి చెడులు నిర్ణయించగలిగింది విసృత సమాజవేగాని, మరో సాహిత్యకారుడు కాదు. సాహిత్యానికి పరిధిని నిర్ణయించి, దానికొక ఎలీట్ స్టేటస్ ఇచ్చి, తిరిగి సాహిత్యాన్ని ఏ కొందరి చేతుల్లోకో పరిమితం చెయ్యాలనే తలంపు నాకు   వేల్చేరు గారి వ్యాసంలో నిండుగా కనపడుతుంది. పాఠకులా బహుపరాక్ .

By: bollojubaba
సాహిత్యానికి సంబంధించిన ప్రతి చర్చ కవిత్వానికీ వర్తిస్తుందనే నేననుకుంటునాను.

నేను పై స్టేట్మెంట్ ను వెనుకనుంచి అన్వయించుకొంటాను. :-)

its ok

By: Tirunagari Satyanarayana
బాబా గారూ – అవును నిజమే! సాహిత్యమంతా కవిత్వం కాదు. కవిత్వం సాహిత్యం లో ఒక భాగం! ఉపేంద్ర గారు సూచించిన వేల్చేరు గారి వ్యాసం సాహిత్యం మొత్తాన్ని పరిశీలిస్తుంది. కాబట్టే సాహిత్యం అన్నాన్నేను.సాహిత్యానికి సంబంధించిన ప్రతి చర్చ కవిత్వానికీ వర్తిస్తుందనే నేననుకుంటునాను.

By: బొల్లోజు బాబా
తిరునగరి గారికి

మీ ఉద్దేసం సాహిత్యం కవిత్వం ఒకటే ననా?  కవిత్వం అంతా సాహిత్యం కావొచ్చేమో కానీ సాహిత్యమంతా కవిత్వం కాదు కదా?

ఇక్కడ జరుగుతున్న చర్చ కవిత్వం గురించననుకొంటున్నాను.

By: Tirunagari Satyanarayana
హరగోపాల్ కవిత మీద చాలా చర్చ జరుతున్నది. అయితే ముందుగా ఆయన కవిత లో రాసిన గుంటూరు గుడిసెలు అనే విషయం గురించి. కవిత లో గుంటూరు గుడిసె అనేది ఒక ప్రతీక మాత్రమే! ఏ గుడిసెలోనైనా పేదలే ఉంటారనే విషయం హరగోపాల్ కూ తెలుసు అని నేను అనుకుంటున్నా! అయితే తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఉద్యోగ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందనేది ఒక వాస్తవం. 610 జీవో అమలు జరగకపోవడం, ముల్కి నియమాన్ని తుంగలో తొక్కడం గత 50 ఏండ్లలో జరిగినవి. ప్రభుత్వం నియమించిన గిర్గ్లానీ కమిటీ ఉద్యోగ నియామకాల విషయంలో తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయాన్ని చాలా స్పష్టంగా బయట పెట్టింది. అది ప్రభుత్వం పెడచెవిన పెట్టడం, 610 జీవో అమలుకు ఏ మాత్రం  చొరవ తీసుకోకపోవడం తెలంగాణ ప్రజలను మరింత అన్యాయానికి గురిచేసింది. అందుకే కడుపు మండిన కవి ‘కొలువులు గుంటూరు గుడిసెల పాలాయె’ అన్నాడు. ఇక్కడ గుడిసెల్లో పేదవాళ్ళే ఉంటారనే స్పృహ కంటే  అస్తిత్వ స్పహ ఎక్కువ కనబడుతుంది. అందులో తప్పు లేదు. చాలా సార్లు అస్తిత్వ ఉద్యమాలు, వాటి స్పృహతో వచ్చిన కవిత్వం ఒక విశాల దృక్పథ్, స్ఫ్రహా కంటే నిర్దిష్ట విషయాల మీదే కేంద్రీకరిస్తాయి. స్త్రీ వాద ఉద్యమం “పురుషులలో మంచి పురుషులు వేరయా” అనుకన్నట్టు నాకు గుర్తు లేదు.

అయితే హరగోపాల్ తన తర్వాతి సమధానాల్లో కొ్త ఉద్రేక పడ్డ మాట వాస్తవమే! అయితే దాని ఫాసిస్టు ధోరణి అని అనాల్సిన అవసరం లేదు. నిజానికి ఫాసిజం అనేది చాలా పెద్ద మాట. చారిత్రికంగా దానికి చాలా అర్థాలూ, పరమర్థాలూ ఉన్నాయి. హరగోపాల్ ది కానీ, ఇవాళ్ళ తెలంగాణ ఉద్యమం లో కొన్ని చోట్ల కనబడుతున్న ధోరణులు కానీ అప్రజాస్వామిక ధోరణులు మాత్రమే. కొన్ని కారణాల వల్ల (వాటికున్న అస్తిత్వ నిర్దిష్టత వల్ల)  ధోరణులు ముందుకొచ్చినవి.. వీటిని తప్పనిసరిగా సరిదిద్దాల్సిందే! అయితే వాటిని ఫాసిస్టు ధోరణులని నిందించడం వల్ల వాటిని సరిదిద్దలేము. అట్లే ఈ ధోరణులని మాత్రమే చూపించి తెలంగాణా ఉద్యమాన్నే మొత్తంగా అప్రజాస్వామ్యమిక ఉద్యమమని, అది ఫాసిస్టుల చేతిలో ఉందనీ నిర్ణయానికి రావడమూ సరైంది కాదు. ప్రజాఉద్యమాల చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజలు ఫాసిజాన్ని సమర్థవంతంగా తిప్పికొడతారు. తెలంగాణ ప్రజలు అంతిమంగా ప్రజాస్వామ్యాన్నే గెలిపిస్తారు.

ఇకపోతే చాకిరేవు ఉపేంద్ర (ఆయన ఈ పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు) చివరికి సాహిత్యం గురించి తన అభిప్రాయంగా వేల్చేరు గారి వ్యాసాన్ని చూపించారు. దాని గురించి ఇక్కడ ఒకటి రెందు మాటల్లో చర్చించడం సులభం కాదు. వేల్చేరు గారు ఆ వ్యాసంలో చర్చించిన ముఖ్య విషయం సాహిత్యం మంచిచెడ్దలు సాహిత్యం పరిధిలోనే జరగాలి, ఏది మంచి సాహిత్యమో సాహిత్యకారులే నిర్ణయిస్తారు అని. అంటే సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ముఖ్యం కాదు, అది గొప్ప సాహిత్యం అనేది పిడికెడు సాహిత్యకారులే వారి వారి అభిరుచులను బట్టి నిర్ణయిస్తారు. సాహిత్యం చిత్రించిన వస్తువు గొప్ప వస్తువు కాకుండా, అది సమాజానికి ఉపయోగపడేది కాకుండా, దానివల్ల  సమాజంలో అత్యధిక ప్రజానీకం ప్రేరణ పొందకుండా అది గొప్ప సాహితం ఎలా అవుతుంది? దాని గొప్ప తనాన్ని పిడికెడు కవులో, సాహిత్యకారులో విమర్శకులో ఎట్లా నిర్ణయిస్తారు? విమర్శకులు దాని గొప్పతనాన్ని విడమర్చి చెప్పవచ్చు కాక! కానీ అంతిమంగా ఆ సాహిత్యం ఏ ప్రజలని ఉద్దేశించి సృష్టించబడిందో ఆ ప్రజలే కదా దాని గొప్ప తనాన్ని నిర్ణయించేదయింసాహిత్యానికి రూపం మాత్రమే ముఖ్యం సారం కాదు అనే వాదనే కాదా ఇది? ఏది రాసినా గొప్ప సాహిత్యంగా రాయి కానీ సారమేంటో, వస్తువేంటో పట్టించుకోవల్సిన అవసరం లేదు అనడం కాదా ఇది? నిజమే ఎంత గొప్ప వస్తువైనా, సారమైనా గొప్ప గా చెప్పక పోతే అది మంచి సాహిత్యం కాదు. దాన్ని సమాజం గుర్తించదు. చిరకాలం అది నిలవదు. అందుకని గొప్పగా చెప్పడమే మంచి సాహిత్యానికి  గీటురాయి అవుతుందా! అదీ కొంతమంది సాహిత్యకారులు గుర్తిస్తే అవుతుందా? ప్రపంచ సాహిత్య చరిత్రలో ఎక్కడైనా జరిగిందా అట్లా? టాల్స్టాయి, డాస్టోవిస్కీ, గోర్కీ, డికెన్స్ , నెరూడా, మయకోవిస్కీ, మార్క్వజ్ – ఏ గొప్ప సాహిత్యకారులైనా వారు సాహిత్యం లో తీసుకున్న వస్తువు గొప్పది కావడం వల్ల, అది జీవితానికీ, ప్రజలకూ చెందినది కావడం వల్ల  గొప్ప సాహిత్యాన్ని సృష్టించారే తప్ప వాళ్ళెన్నుకున్న రూపం వల్ల కాదు. అట్లే వారి సాహిత్యాన్ని ప్రజలూ, సమాజమూ గొప్ప సాహిత్యంగా నిలబెట్టాయి తప్ప ఏ పిడికెడు ‘అభిరుచి’ ఉన్న సాహిత్యకారులో కాదు. ప్రపంచంలోని గొప్ప సాహిత్యం అంతా,  సాహిత్యరంగం దాని విశిష్టతనిలుపుకుని ఆ రంగం మేరకే విశ్లేషించి గొప్ప సాహిత్యమని నిర్ధారణ చేయబడలేదు. అది చిత్రించిన జీవితం వల్ల, వస్తువు వల్ల, దాన్ని అక్కున చేర్చుకున్న ప్రజల వల్లా, పదిల పర్చుకున్న సమాజం వల్లా గొప్ప సాహిత్యంగా నిలిచి పోయింది.

By: చాకిరేవు ఉపేంద్ర
లింకు లో పొరపాటున్నట్లుంది.  సరైన లింక్ ఇది.

http://www.eemaata.com/em/printerfriendly/?id=547

By: చాకిరేవు ఉపేంద్ర
హరగోపాల్,

రూపం గురించి  గొల్లుమన వలసిన అవసరం చాలా వుంది.   మనిషిదే వూరు, ఆయన అసలు పేరు ఆదేనా  లాంటి ప్రశ్నలు  కొంచెం పక్కకి పెట్టి, ఈ కింద లింకులో వున్నవ్యాసంలోని సారాన్ని  చదివి చూడండి.  తెలంగాణకీ   కవిత్వానికీ కూడా పనికొచ్చే  మాటలు కొన్నైనా కనపడవచ్చును.

http://tinyurl.com/yk9aoh8

By: హెచ్చార్కె
సాగతీత అవుతోందని అనిపిస్తున్నా, అపార్థాలు తొలగించడం కోసం రెండు రిపిటిషన్లు:

1). “ఎంత మెత్తగా ఉన్నప్పటికీ, కవి ఉద్దేశం అది కానప్పటికీ; హ‍ర‍గోపాల్ కవితలోని ‘గుంటూరి గుడిసెల’ ప్రస్తావన, ఆంధ్ర ప్రాంత పేదల(గుడిసెల)ను టార్గెట్‍ చేస్తుంది. ఉద్యమంలోని ‘ఫాసిస్టు’ధోరణులకు ఊతం ఇస్తుంది.” ఊతం ఇస్తుందంటే అదే ఫాసిజం అని కాదు. ఉద్యమంలో ఆ ధోరణి ఉన్నప్పుడు, దానికి ఊతం ఇచ్చే మాట ఉద్యమ కవితలో దొర్లినప్పుడు, ఎత్తి చూపడం సరైనదే.

2) “చర్చ ఆ ఒక్క వాక్యం గురించయితే, అది మొదటి వ్యాఖ్యతోనే ముగిసింది. హ‍ర‍గోపాల్‍ ‘దమ్ముంటే’, ‘సంస్కారమ్’ వంటి రకరకాల తీవ్ర పదజాలంతో జోక్యం చేసుకోడం వల్లనే చర్చ నడిచింది.” దీనికి వివరణ అవసరం లేదు. ఆసక్తి ఉన్న వారు మొత్తం చర్చను మరోసారి చూడాలి.

హ‍రగోపాల్‍, నా జోక్యం చర్చకు మాత్రమే పరిమితం. మీ కవితను మొదట చదివినప్పుడే ఎంజాయ్ చేశాను. ఒక నిర్దిష్ట వేదనను మీరు చాల బలంగా చెప్పారు. మాండలికంలో నప్పదు గాని, ‘కన్నీటి తులాభారం’ అనే వ్యక్తీకరణ కూడా నాకు బాగుంది. ఇక, రూప విమర్శ నుంచి మీరే కాదు, అందరం నేర్చుకోవలసిందే. ఆ ఉద్దేశంతోనే ఉపేంద్ర మాటలు బాగున్నాయన్నాను.  లోలోపలి ఆవేదన కారణంగా, సందర్భం రావడంతో, కాస్త ఎక్కువగా జోక్యం చేసుకున్నాను. అదాటుగా… మిమ్మల్ని నొప్పించాను. సారీ.

By: haragopal
విమర్శించిన అందరికి థాన్క్స్.గుంటూరు అన్న మాట,గుడిసెలు అన్న మాట సన్కేతాలే.నేనేదో నా కవితను ఓ గోప్పగా రాసానని విర్రవీగలేదు.రూపాన్ని పట్టుకుని గొల్లుమంటె ఏమ్ చేసేది. ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అనాలనే కోరికా కాదు. ఎవరీ అనర్థాలకు కారణమో వాళ్ళను పరామర్శిస్తే చాలు నా కవిత.రాజకీయాల రగడ కాదు నా ఉద్దేశమ్. విలువైన విషయాలు రాసిన అందరిని అభినందిస్తున్నా. నా కవిత ఒక సాకుగ ఇలాగే సాగతీతలు మీకు నచ్చితే ఆల్రైట్. నాకు మారుపేరుతో రాసే అవసరమ్  లేదు.అట్లా రాసింది నేను కాను.