Jan2010
కరిగిన స్వప్నం
నివ్వెరపోయాను
నిశ్చేష్టుడనయ్యాను
ఇంతటి సున్నిత మనస్కున్ని కోల్పోవడం
ఈ పాడులోకపు ప్రారబ్ధం
నిన్న మొన్నటి వరకు మనం కలిసి
జరిపిన సభలు సమావేశాలు
పంచుకున్న ఙ్ఞాపకాలు తీపిగురుతులూ
వేదనలూ సంఘర్షణలూ
ఇప్పటికీ కనులముందు కదలాడుతున్నాయి
ప్రతీసారీ నీవు చెప్పిన గుండెలింకినతనం
నిన్ను ఇలా మింగేస్తుందని ఊహించలేకపోయాను
మేము ఒరిగిన ప్రతిసారీ ఆసరాగా నిలిచి
వెన్ను చరిచి ముందుకు తీసుకుపోయిన
నీ ధైర్యాన్ని మింగిన రాహువేదో
తెలియక మూగగా రోదిస్తున్నాము
నీ నవ్వుల వరికంకులు లేని
ఈ శరత్కాలపు వెన్నెల మసకబారిపోయి
నాగావళి ఇసుకలో ముఖం దాచుకుంది
రాబోయే యుద్ధకాలానికి
నీపదునెక్కిన కలంతో
మమ్మల్ని కవాతు చేయిస్తావని కన్న కలల్ని
యిలా ఙ్ఞాపకాల కన్నీటి వరద మధ్య
చుక్కాని లేని నావలో
ఒంటరిగా చేసిపోవడం
భావ్యమా ?
(మిత్రుడు , సహచరుడు, గైడ్ పడాల జోగారావు గారి అకాల మరణం కల్పించిన వెలితితో)
January 24th, 2010 at 3:02 am
losing of true friend is painfull for anybody . as a reader i move with your sentences
January 26th, 2010 at 9:02 pm
ధన్యవాదాలు సత్యదర్శన గారు.
January 27th, 2010 at 5:08 am
ధన్యవాదాలు.
January 27th, 2010 at 5:11 am
సత్యదర్షన గారి అభిప్రాయంతొ నెను పూర్తిగా ఏకిభవిస్తున్నాను.