Jan2010
కుటుంబరావుగారి అనువాదరచన

Study in Scarlet

ఆర్థర్ కోనన్‌డాయిల్
1945 ప్రాంతాల మద్రాసులో చక్రపాణి ఆంధ్రజ్యోతి అనే పత్రికను కొన్నేళ్ళు నడిపారు. మా నాన్న కుటుంబరావుగారి రచనలు అందులో పడుతూఉండేవి. చందమామలాగే ఇందులోకూడా పేరు లేకుండా మా నాన్న చాలా రచనలు చేశారు. అంతకుముందు ఆంధ్రపత్రికలో మొదలుపెట్టిన ఇంగ్లీషు నవలల అనువాదాలు ఆంధ్రజ్యోతిలోకూడా సీరియల్ ధారావాహికగా కొనసాగించారు. వీటిలో ఒకటి సర్ ఆర్థర్ కోనన్‌డాయిల్ (1859-1930) 1887లో రాసిన డిటెక్టివ్ నవల A Study in Scarlet. ప్రపంచసాహిత్యంలోనే అన్నిటికన్నా ప్రసిద్ధమైన పాత్రగా పేరు పొందిన షెర్లాక్ హోమ్స్‌ను డిటెక్టివ్ గా పరిచయం చేసే అపరాధ పరిశోధక నవల ఇది. బ్రిటిష్ సైన్యంలో డాక్టర్‌గా పనిచేసి రిటైరైన వాట్సన్ అనే వ్యక్తి ఉత్తమపురుషలో చెప్పిన ఈ కథనంలో మనకు షెర్లాక్ హోమ్స్ పాత్ర పరిచయమవుతుంది. ఈ కథలన్నీ మా నాన్న తెనాలి స్కూలు రోజుల్లో సీరియల్‌గా వచ్చేవి. మా నాన్నకు బాగా నచ్చి, ఆయన శైలిని ప్రభావితం చేసిన రచయిత కోనన్‌డాయిల్.
స్వయంగా వైద్యం అభ్యసించిన కోనన్‌డాయిల్ వైద్యరంగంలో రాణించకపోయినప్పటికీ, రచయితగా పేరుపొందాడు. డిటెక్టివ్ నవలలే కాక, చారిత్రాత్మక నవలలూ, ప్రొఫెసర్ చాలెంజర్ అనే పాత్రతో సైన్స్ ఫిక్షన్ రచనలూ, ఇతర కథలూ రాశాడు. పరిశోధనల గురించిన నాలుగు నవలలూ, 56 కథలూ రాశాడు. ఇదంతా కాక విలేకరిగా, రాజకీయ విశ్లేషకుడుగా బ్రిటిష్ ప్రభుత్వం కోనన్‌డాయిల్ ను గౌరవించింది. అతనికి అతీంద్రియశక్తుల గురించీ, ప్రేతాత్మల గురించీ కూడా ఆసక్తి ఉండేది. రచయితగా, మేధావిగా కోనన్‌డాయిల్ ఇటువంటి విషయాల్లో ఆసక్తి కనబరచడంవల్ల ప్రపంచవ్యాప్తంగా మా నాన్నవంటివారికి కూడా అవి తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది.
నేరపరిశోధన అనే ఈ నవల 1955లో చందమామ ప్రచురణగా పుస్తకరూపంలో విడుదల అయింది. అది 55 సంవత్సరాల తరవాత తొలిసారిగా ప్రాణహిత ద్వారా తెలుగు పాఠకులకు అందుతోంది.
(గమనిక: వచ్చే సంచిక నుండి కుటుంబరావు గారు అనువాదం చేసిన ఈ నవల ధారావాహికంగా ప్రచురింపబడుతుంది)
January 19th, 2010 at 12:33 pm
http://www.nytimes.com/2010/01/19/books/19sherlock.html
ఇన్నేళ్ళు గడిచినప్పటికీ షెర్లాక్ హోంస్ పాత్రకు ఎంతటి జనాదరణ ఉందో పై లింకును చూస్తే తెలుస్తుంది.
February 5th, 2010 at 1:36 pm
కొకు అనువదించిన కోనన్ డాయిల్ నవలను ప్రాణహితలో ప్రచురిస్తున్నారా,.. భలే… ఆసక్తిగా ఎదురు చూస్తాను.
ఇటీవల మా తమ్ముని కొడుకు పవన్ ” పెదనాన్నా, డాన్ బ్రౌన్ ‘ డా విన్సీ కోడ్ ‘ , ఇర్వింగ్ వాలెస్ ‘ ఆల్మైటీ ‘ వంటి నవలలు తెలుగులో ఏమయినా వున్నాయా, వుండకపోతే, ఎందుకు లేవు? ” అని అడిగాడు. ఏం చెప్పాలో తెలియలేదు. ఏం చెప్పబోయినా కుంటి సాకే అనిపించింది నాకు. కొకు వంటి పెద్దలు అనువాదాల రూపంలో చేసిన కృషి అయినా పరిచయం అయితే బాగుంటుంది.
పిల్లల్లో చదవడం అనే అలవాటు పోయిందని వగచే పెద్దలు, ఆ వగపోత మానేసి, పిల్లలతో చదివించే పుస్తకాలు రాకపోవడం గురించి ఆలోచిస్తే చాల మేలు జరుగుతుంది. (పిల్లలంటే, కేవలం పిల్లలు కాదు, ఎంత వయస్సు వచ్చినా, పిల్లల మనస్సు వున్న వాళ్లందరూ)
ఆరుద్ర, శ్రీశ్రీ సొంతంగా ‘పలకల వెండి గ్లాసు’ వంటి ‘డికెక్సీ’ నవలలు రాశారని విన్నాను. ఇలాగే ఎవరయినా వాటిని సంపాదించి ప్రచురిస్తే బాగుణ్ను.. హెచ్చార్కె..
February 6th, 2010 at 2:13 pm
[...] కుటుంబరావు గారి అనువాద రచన – పరిచయం – … [...]
February 16th, 2010 at 3:34 am
ఇది చాల ఆసక్తి కలిగించినది.చదవాలని ఎదురు చూస్థున్నాము.
రవిబాబు,కొత్తపల్లి,