‘మనలో మనం’ సాహిత్య సదస్సు

‘మనలో మనం ‘  విశాఖలో తనను తను పరిచయం చేసుకుంటూ వునికిని చాటు కుంటూ అవిష్కరించుకుంది. వరంగల్ లో  తెలంగాణ దళిత స్త్రీల సాహిత్యం పై, కడపలో ముస్లిం మైనారిటీ మహిళల సమస్యలను చర్చిస్తూ ,గుంటూరులో క్రైస్తవ మైనార్టీ మహిళల స్త్రీల సాహిత్యం. బి.సి, కోస్తాంధ్ర స్త్రీల సాహిత్యం పై రాష్ట్ర స్థాయి స్త్రీల రచయిత్రుల సదస్సును విజయవంతంగా జరుపుకుంది. రెండు రోజుల సదస్సులో భాగంగా విష్ణుప్రియ పాటతో సభ మొదలైంది.
15 వ తేదీ 11 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డైక్ మన్ ఆడిటోరియంలో సభ ప్రారంభమైంది. మొదటగా పి.రాజ్యలక్ష్మి సభకు విచ్చేసిన మహిళలకు, విద్యార్థిని విద్యార్థులకు ఆహ్వానం పలికారు. ఈ సభకు తేళ్ళ సత్యవతి అధ్యక్షత వహించారు. సదస్సు లక్ష్యాలు రత్నమాల వివరించారు. రత్నమాల మాట్లాడుతూ తప్పటడుగైనా పడుతూలేస్తూ మంచిగా నడవడం నేర్చుకుందాం. ఇంకా బాగా నిలదొక్కుకుందాం. విశాఖ ,వరంగల్, కడప , గుంటూరు  రూపం రావడానికి సభలు , సమావేశాలు జరుపుతూ స్థిరంగా నడవడానికి భవిష్యత్తులో ప్రణాళికా మరింత దృఢంగా వుండటానికి ఈ సభలు సమావేశాలు చాలా అవసరం అన్నారు. ఆరోగ్యకరమైన ఘర్షణ కూడా కావాలి. అన్ని భావాలు కలవడానికి , సంఘర్షించుకోవడాన్ని భాధ్యతగా వుండటానికి ఐక్యంగా వుండటానికి సమస్యలను చర్చించుకోవటానికి కలవడం అనే ప్రాముఖ్యత సంతరించుకుంటుంది కలిసి వెతలు బాధలు పరిష్కరించుకుందాం  అన్నారు.
తేళ్ళ సత్యవతిగారు, ఉమెన్స్ ష్టడీస్ హెడ్  , గుంటూరు, మాట్లాడుతూ విభిన్నమైన వృత్తుల ఒకే లక్ష్యంతో అందరం ఇక్కడ కలిసాం.మొదటి మహిళా రచయిత తాళ్లపాక తిమ్మక్క వీళ్ళ రచనలు అంతా కూడా మనం గమనిస్తే చాలా వొదిగి చేసారనిపిస్తుంది. 50 ల తర్వాతచదువు, వుద్యోగం కోసంసమాజంలో మార్పు , అధ్యయనం పెరిగింది. స్త్రీల అణచివేత నుంచి బయటకు రావాలి తనంతట తనే రావాలి అనేది . రంగనాయకమ్మ రచనలలో చూడచ్చు. ఆర్థిక రంగం గ్లోబలైజేషన్ గురించి ఈ కాలం రచయిత్రులు రాస్తున్నారు. అధ్యయనం పెరగడం ఆచరణలతో చేస్తున్న రచనలవలన స్త్రీలు కూడా చైతన్యవంతం అవుతున్నారని అన్నారు. స్త్రీ వ్యక్తిత్వంలేనిదని అంగడి బొమ్మగాను చిత్రించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ సమయంలోనే స్త్రీ వాద కవిత్వం పుట్టుకొచ్చింది మైనారిటీ స్త్రీల సమస్యల గురించి ప్రసంగించారు. ఈ సభలో హేమపరిమి పాల్గోన్నారు. నేను వక్తగా కాకుండా  ఇక్కడ అందరూ మాట్లాడింది వినడానికి వచ్చాను అన్నారు. స్త్రీల సమస్యలను అర్థం చేసుకుని సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నం వుండాలిఅన్నారు. వాడ్రేవు వీర లక్ష్మి దేవి ప్రముఖ రచయిత్రి మాట్లాడుతూ తెలిసో తెలియకో ఇక్కడకి వచ్చిన అందరూ పెద్ద బాధ్యతని నెత్తిన ఎత్తుకోవడానికి వచ్చారు. స్త్రీల  సమస్యలు ప్రపంచంలో అందరికి తెలుసు. ఇప్పుడు ప్రధాన సమస్య యాసిడ్ దాడులు . వీటిని ఎలా ఎదుర్కోవాలి , ఎలా పరిష్కరించుకోవాలి మనం చర్చించుకోవాల్సిన అవసరం వుంది. ప్రతి ఇద్దరి స్త్రీలకు భిన్నమైన సమస్యలు వుంటాయి. కొన్ని వేల సమస్యల్తో స్త్రీలు వున్నారు . వాటి నన్నింటిని పరిష్కరించుకునే దిశగా మనం సర్వశక్తులు వినియోగించి పనిచేయాల్సివుంటుంది అన్నారు..
ముఖ్య అతిధిగా  చల్లపల్లి స్వరూపరాణి వచ్చారు. స్త్రీ వాద సమస్యల్లో ఎంతో కాంట్రడిక్షన్స్ వున్నాయి. సునీతవిలియమ్స్, కల్పనా చావ్లా వొక వైపు… పురుషులతో సమానంగా వైఙ్ఞానిక రంగాలలో ముందుకు సాగుతుంటే అదే సమయంలో మన వూరిలో మనపక్కన ఆడవాళ్ళ మీద యాసిడ్ దాడులుజరుగుతున్నాయి.స్త్రీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. మనం వాడుతున్న భాష .. పురుష భాష సవరించుకోవాల్సి వుంది అని అన్నారు. మనం కొంతమేరకు మాత్రమే చేయగలుగుతున్నము. సమస్యని ఎక్స్ పోజ్ చేయగలుగుతున్నాము కాని ఇంకా వాటి పూర్తి పరిష్కారం చూపలేకపోతున్నాం.అన్ని సమస్యల దగ్గరికి పూర్తిగా వెళ్లలేకపోవడం. social activity లేకపోవడం జరుగుతోంది అన్నారు.కాల్పనిక సాహిత్యం రాసేవాళ్ళు ఎక్కడైనా కూర్చుని రాయచ్చు ఎక్కడైనా ఉండచ్చు. కాని , సామాజిక  కమిట్ మెంటు తో రాసేవాళ్ళు ఎక్కడో కూర్చుని రాయడం సరైంది కాదు. సామాజిక సమస్యలు పూర్తిగా సమస్య పరిష్కారం మార్గంగా వుండాలి. స్త్రీల అస్థిత్వాల గురించి చర్చ , ముస్లిం మైనారిటీ స్త్రీలు కోస్తాంధ్ర స్త్రీల సాహిత్యం,క్రైస్తవ మైనారిటీ స్త్రీల సమస్యలు పరిష్కారం చర్చ చేయడం ఇవన్నీ జరగాల్సిందే, ……………. మట్టి పూలు లాంటివి ఆవిర్భవించాల్సిందే అదనపు సమస్యల గురించి చెప్తూ కలిసి వచ్చే వాళ్ళని కలుపుకోవాలి. పోట్లాడుకుందాం రండి అని పిలిపునిస్తున్నాను. యుద్ధం శాంతి కోసమే ఘర్షణ ఐక్యత కోసమే అని పిలుపునిస్తున్నాను అన్నారు.
బి.సీ స్త్రీ సాహిత్యం సెషన్ కి ప్రముఖ రచయిత్రి కె. వరలక్ష్మి అధ్యక్షత వహించారు. ‘నవలా’ సాహిత్యం పై అనిశెట్టి రజిత, ‘కవిత్వం’ పై మందరపు హైమావతి, ‘కథాసాహిత్యం’ మీద త్రివేణి, స్త్రీల ‘వ్యాసం’ మీద సుజనా రామన్ పత్ర సమర్పణ చేశారు.
కోస్తాంధ్ర స్త్రీల సాహిత్యం [1947-1985] శిలాలోలిత అధ్యక్షత వహించారు. ‘ మరీచిక ‘ [వాసిరెడ్డి సీతాదేవి] నవల మీద మాధవి ప్రసంగించారు. శ్రీదేవి , కాకతీయ యూనివర్సిటీ … ‘కథల’ గురించి, నల్లూరి రుక్మిణి…’ నవల’ మీద,   సమీక్ష చేసారు. ‘కవిత్వం’ మీద శిలాలోలిత మాట్లాడారు.
కోస్తాంధ్ర స్త్రీల సాహిత్యం [1985 - 2000] నల్లూరి రుక్మిణి అధ్యక్షత వహించారు . కె.సుభాషిణి ‘ కథల’  గురించి ,కాత్యాయిని   కోస్తాంధ్ర సమకాలీన ‘నవలమీద’,  అత్తాలూరి విజయలక్ష్మి ‘కోస్తాంధ్ర కవిత్వం ‘మీద……….. యస్.యస్.వి.రంగనాయకి ‘ఓల్గా కథలు” తోడు’, ‘ప్రయోగం’ గురించి ప్రసంగించారు.
కోస్తాంధ్ర స్త్రీల సాహిత్యం 1947 కు ముందు సాహిత్యం………….పి. రామలక్ష్మి హిస్టరీ డిపార్ట్ మెంటు ఏయన్ యూ గుంటూరు.అధ్యక్షత వహించారు….. చారిత్రక నేపధ్యం గురించి చెప్పారు. చరిత్రని సాహిత్యాన్ని కలుపుతూ చాలా చక్కగా ప్రసంగించారు.కాత్యాయిని విద్మహే ‘కథ’ గురించి…………… కె.రామలక్ష్మి ‘నవల’ గురించి, కె.శోభారాణి కె.శ్రీదేవి ‘ వ్యాసల’మీద పత్ర సమర్పణ చేసారు. వైదేహి, అబ్బూరి ఛాయాదేవి ‘మూడు కధల’ గురించి మాట్లాడారు  నాగ రాజ్యలక్ష్మి’ కోస్తాంధ్ర కవయిత్రి పాటిబండ్ల రజని’ రాసిన ‘యర్రజాబిల్ల యరీనా’, ‘రెప్పకాటేసిన పాప’ కవితలు మీద ప్రసంగించారు
క్రైస్తవ మైనార్టీ స్త్రీల సాహిత్య వేదికకు హేమలలిత అధ్యక్షత వహించారు. ఝాన్సి కె.వి కుమారి  విహంగ వీక్షణం  [క్రైస్తవ మైనారిటీ రచనల గురించి ] చేసారు. ‘కథ , నవల ‘గురించి పుట్ల హేమలత , ‘వ్యాసాల ‘గురించి కొలకలూరి స్వరూపరాణి ,’ క్రైస్తవ మైనారిటీ కవిత్వం’ గురించి బండారు జ్యోతి స్వరూపరాణి పత్రాలను సమర్పించారు.’ సంగీత , నృత్య, నాటకం’ గురించి స్కాలర్ లావణ్య పత్ర సమర్పణ చేసారు. ఈ సభకు వందన సమర్పణ విజయభాను  అభినందనలు తెలుపుతూ ముగించారు.

ముగింపు సమావేశానికి అధ్యక్షత పి.సత్యవతి వహించారు. సత్యవతి మాట్లాడుతూ మనకు స్పేస్ కావాలి  . మహిళ దానికోసం పోరాడుతూ వుంటుంది.  మహిళగా  మనకు మాత్రమే వున్న సమస్యలని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదాం. రెండు రోజులు జరిగిన సమావేశాన్ని జాజుల గౌరి సమీక్ష చేసారు  క్రైస్తవ మైనారిటీ టాపిక్ పెట్టుకోవడం దాని మీద పత్ర సమర్పణ చేయడం చర్చ చేయడం చారిత్రకమైనది అన్నారు. .ముగింపు సమావేశానికి నాగార్జునా యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ హర గోపాల్ ముఖ్య అతిధిగా పాల్గోన్నారు . కాత్యాయిని విద్మహే భవిష్యత్తు ప్రణాళిక గురించి మాట్లాడుతూ వుత్తరాంధ్ర స్త్రీల సాహిత్యం, ఆదీవాసీ స్త్రీల సాహిత్యం సామాజిక ఆలోచనలు తో సభ వుంటుంది అని అన్నారు. మధ్యలో విష్ణుప్రియ , హేమలలిత, జాజుల గౌరి పాటలతో సభ దద్దరిల్లింది.
పుట్ల హేమలలిత వందన సమర్పణతో సభ ముగిసింది.

అభిప్రాయాలు లేవు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో