పచ్చ సంచి

(ఇండోనేషియన్ మూలం — పుతు ఓక సుకాంత)

“అదేం లేదు, నేనేమీ ఇబ్బంది పడటం లేదు,” అతన్ని నమ్మించటానికి ప్రయత్నించింది లియా. “ఆఫీసు పని అయింతర్వాత సాయంత్రం ఒక డాక్టర్ దగ్గర పని చేస్తున్నాను. ఒక్కోసారి ప్రైవేటు రోగుల్నిచూసుకునే అవకాశం కూడా ఉంటుంది.”

“అలాగా, అయితే బాగా అలసిపోతూ ఉంటావు,” అని ప్రేమగా చూశాడు బావా.

“ఫరవాలేదు, ఏదోవిధంగా నీకు సహాయం చెయ్యగలిగితే…”

వారి మునివేళ్ళు తాకాయి. ఇద్దరి మధ్యా బంగారు వంతెన వేశాయి చూపులు.

“నేను పంపించే వస్తువులు ఎక్కడ పెట్టుకుంటున్నావు?” బావా అడిగాడు.

“నా మంచానికి ఎదురుగా గోడకు తగిలించాను. పడుకుని వాటిని చూస్తూ ఉంటాను. అన్నట్టు, నువ్విప్పుడు చెక్కబొమ్మలు చెయ్యటం నేర్చుకుంటున్నావా?”

తల ఊపాడు బావా. “నీకోసం అయితే ఏపనైనా చెయ్యగలను అనిపిస్తుంది. మరి నేను చెక్కిన  బొమ్మలు బాగున్నాయా?”
తల ఊపింది లియా.

ఇద్దరూ నవ్వుకున్నారు. కొన్నాళ్ళ క్రితం లియాకి కొబ్బరి పెంకులతో చెక్కిన బొమ్మలు కొన్ని పంపించాడు బావా. వాటిలో ఒకదాంట్లో రెండు పక్షులున్నాయి. పంజరంలో ఒకటి. బయట ఒకటి.

***

ఆ తర్వాత చానాళ్ళు లియా రాలేదు. కాని పచ్చ సంచిలో బావాకు కావాల్సిన వస్తువులను ఎవరితోనైనా పంపిస్తూనే ఉంది. అవి అతనికి చేరుతూనే ఉన్నాయి.  ప్రతిసారీ పంపించే వస్తువులే. పంపించటంలో ఏమీ తక్కువ చెయ్యదు లియా. కానీ తనెందుకు రావటం లేదూ? పని దగ్గర ఇంకో షిఫ్టు కు మారిందేమో? ఇలా ఆలోచిస్తుండగా ఒకరోజు లియా వచ్చింది. బాగా సన్నబడి ఉంది. ముఖంలో ఇదివరకటి రంగులేదు. జబ్బు చేసిందట. కాని నవ్వుతూ తన కష్టాలను దాచిపెట్టటానికి ప్రయత్నం చేసింది.

“అబ్బే, నాకేం కష్టం లేదు. ఇప్పుడు పూర్తిగా బాగయ్యింది. మునుపటిలాగే చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను,” అంది ఆమె.

“నేను మరీ అంత మూర్ఖుణ్ణి కాదులే లియా. చూస్తుంటే తెలియటంలేదూ నువ్వెలా ఉంది. నీ ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉంటూండు. ప్రతిసారీ నాకీ వస్తువులు పంపించక పోయినా ఫరవాలేదు.”

లియా మౌనంగా ఉండి పోయింది.

“ఇదంతా నీకొక పెద్ద భారమని నాకు తెలుసు. నీ భవిష్యత్తు గురించి నువ్వే ఆలోచించుకో. నీకేది మంచిదనిపిస్తే అలా చెయ్యి.”

“పిచ్చిపిచ్చి ఆలోచనలు చెయ్యకు,” అంది లియా అతని ముఖంలోకి చూస్తూ. ఆమె కళ్ళు వానకు తడిచిన కిటికీల్లా ఉన్నాయి. తల వంచుకుని చేతి రుమాలుతో కళ్ళు తుడుచుకుంది ఆమె.

“నీ మీద నాకు నమ్మకం ఉంది, లియా. కాని నీకేది మంచిదో కూడా ఆలోచించాలి కదా. నీ వయసులో…. నన్నెప్పుడు విడుదల చేస్తారో కూడా తెలియకపోయె.”

లియాకి కూడా ఒక పరిమితి అంటూ ఉంటుంది కదా. ఎంతకాలం ఇలా ప్రయాస పడుతుంది? ఈ పరిస్థితిలో ఆమెకు తను చెయ్యగల సహాయం ఇంకేముంది?

బావాకు చాలా విచారంగా ఉంది ఆ రోజు. లియా పీక్కుపోయి నట్లు కనబడుతుంది. రక్త హీనంగా ఉంది. జుట్టు బాగా పైకి ముడివేసింది. మెడ సన్నగా కనిపిస్తుంది.

“నీకసలు ఏమయింది లియా? ఉన్నదున్నట్లు చెప్పు. నువ్వేదో ఇబ్బందిలో ఉన్నావనిపిస్తుంది. నిజం చెప్పు.”
“ఇబ్బంది అని కాదు…” చెప్పటం మొదలెట్టింది ఆమె.

ఇంతలో గంట మోగింది. గడువు ముగిసింది. ఆమె నుదిటిమీద ముద్దుపెట్టాలనుకున్నాడు బావా. కాని కిటికీకి అటువైపు ఆమె. ఇటువైపు తనూ. మధ్యలో గోడలా ఇనుపతీగ.

ఆమె చేతి వేళ్ళు మృదువుగా నొక్కాడు బావా. అంతకంటే ఏం చెయ్యగలడు. పోతూపోతూ అతని వైపు మరోసారి చూసింది లియా. ఆమె కళ్ళలోతుల్లో ఎక్కడో మిణుగుమిణుగు మంటున్న జ్యోతి కనిపించిందతనికి. ఇద్దరూ చిరునవ్వుతో వీడ్కోలు చెప్పుకుంటూ ఉండగా బావా భుజం తట్టాడు గార్డ్, లోపలికి నడవమని.

***

ఇలా చూట్టానికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళగురించి తోటి ఖైదీలకు చెప్పటం ఆనవాయితీ. చుట్టూ చేరిన స్నేహితులకు లియా గురించి చెప్పాడు బావా.

“ఎలా ఉంది? ఇంతకు ముందుకంటే అందంగా ఉందా?” అడిగాడు దిగ్డో.

“ఏంటీ సంగతులు?” అడిగాడు ఇమామ్.

“జబ్బునపడి ఇప్పుడే కోలుకుంది. చాలా సన్నబడింది. పాపం అనిపించింది. పైగా ఆమెకి నేనొక భారం.”

“అయితే నువ్వేమన్నావు?”

” ‘బాగా ఆలోచించి నీకు మేలుజరిగే మార్గాన్ని ఎంచుకో,’ అని చెప్పాను.”

“అంటే, ఇంకెవర్నన్నా పెళ్ళిచేసుకోమనా?” నమ్మలేనట్లు అడిగాడు ఇమామ్.

బావా సమాధానం చెప్పేలోపలే మరొకరు, “నీకేమన్నా పిచ్చిబట్టిందా? అలాంటి నమ్మకమైన అమ్మాయిలు దొరకటం ఎంత కష్టమో తెలుసా? నిజంగానే ఇంకెవర్నన్నా చేసుకోమని చెప్పావా? మరి నీకు తిండెవరు పంపిస్తారిక బయట్నించి?” అని అడిగాడు.

“ఇదిగో చూడు, విషయం పూర్తిగా విని అప్పుడు మాట్లాడు,” అన్నాడు బావా. లియాకి తనకీ మధ్య జరిగిన సంభాషణ అంతా వివరంగా వినిపించాడు.

“నువ్వొక వింత మనిషివి,” అని మొదలుపెట్టి గుక్కతిప్పకుండా మాట్లాడాడు ఇమామ్. “తిండికి ఆమె మీద ఆధారపడుతున్నవాడికి మరీ ఇంత స్వాభిమానం పనికిరాదు. రేపు ఆ అమ్మాయి నిజంగా ఇంకొకడ్ని చేసుకుందనుకో, నీకు మళ్ళా జైలు రేషన్ తినటం తప్పదు. లేక తిండి పంపించేవాళ్ళింకెవరైనా ఉన్నారా నీకు? నీ పరిస్థితి చూసి జాలిపడి మాలోనే ఎవరో ఒకరి  బంధువులు నీక్కూడా తిండి పంపించటానికి నానా అవస్థలు పడితే అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? మనకి తిండి పంపించేవాళ్ళు ఎంతమంది ఉంటే అంత మంచిది. ఒద్దని చెప్పటం తలతిక్క వ్యవహారం. నువ్వేంటో నీ ఆలోచనేంటో నాకసలు అర్థమవ్వటం లేదు.”

“ఒద్దన లేదు, ఇంకొకడ్ని చేసుకొమ్మని కూడా అన్లేదు. తనకేది మంచిదో ఆలోచించుకొమ్మన్నాను. అంతే. ”

“బావా, నువ్వు మరీ గుడ్డోడిలాగున్నావు. మేం బయట పడిందాకా ఓపిగ్గా ఉండమని వాళ్ళ కుటుంబాలను అడుగుతున్నారు మనవాళ్ళందరూ. పార్సెళ్ళు పంపిస్తూ ఉండమని బతిమాల్తున్నారు. నువ్వేమో ఇట్లా తలతిక్కగా మాట్లాడుతున్నావు. ‘లియా, నాకోసం చూస్తూ ఉండు. నువ్వు పంపిస్తూ వున్న వస్తువులు నాకు చాలా అవసరం. దయచేసి నన్ను వదిలెయ్యకు,’ అని కాళ్ళావేళ్ళా పడాల్సింది నువ్వు. ఇంకోవిషయం. నీకు తెలుసో లేదో గాని – ఇక్కడి వాళ్ళందరూ ఆశ్చర్య పడుతున్నారు నీకిలాంటి స్నేహితురాలుందని. అదీ ఈ గడుసురోజుల్లో. రోజులు బాగున్నప్పుడు ఆడది విశ్వాసంగా ఉందంటే అది సహజమైన విషయం. ఈ అమ్మాయేమో నీ భార్యకూడా కాదు. అయినా ఇంత విశ్వాసంగా నిన్ను కనిపెట్టుకోని ఉంటూంది. ముందుముందు ఇంకా బాగా చూసుకుంటుంది నిన్ను. నాకైతే చాలా అసూయగా ఉంది. నీకవసరం లేకపోతే బయటపడింతర్వాత నాకు పరిచయం చెయ్యి. ఏమంటావ్?”

అందరూ నవ్వారు. బావా సమాధానం చెప్పలేదు. ఇమాం మంచి స్నేహితుడు. కాని కొంచెం సంకుచిత స్వభావి.

కొంచెం సేపయింతర్వాత ఇమామ్ తో అన్నాడు బావా. “చూడూ, లియాకు తన బతుకు బాటను తనే నిర్ణయించుకునే అధికారం ఉందంటావా లేదంటావా? జైల్లో కూర్చోని స్వేచ్ఛగురించి మాట్లాడుకునే మనం మనల్ని ప్రేమించేవారి మీద నిరంకుశంగా ప్రవర్తిస్తే న్యాయంగా ఉంటుందా? ప్రేమంటే ఇవ్వటం, అడగటం కాదు. ప్రేమంటే బాధ్యత, ఒట్టి తేలిక మాటలు చెప్పటం కాదు. అదీ ప్రేమంటే నీ ఇష్టమొచ్చినప్పుడు వొదిలించుకునే బాధ్యత కాదు. స్నాయం చెయ్యదల్చినప్పుడు తడవటానికి సిద్ధంగా ఉండాలి. ”

“నువ్విప్పుడు ఉపదేశం చెయ్యటం మొదలెట్టావు. కొంచెం నేలమీదికి దిగొచ్చి ఆలోచించు. లియా నీ సలహాని నిజంగా పాటించి రేపటినించీ నీకేమీ పంపలేదనుకో, నష్టం ఎవడికీ? చుట్టూ చూడు, మా పెళ్ళాలు వాళ్ళ దోవ వాళ్ళు చూసుకోబట్టే మేమిలా మిగిలాం. రేపు నీకూ ఈ గతే పడుతుంది.”

“ఇమామ్, పరిస్థితి తారుమారైతే నువ్వేం చేసేవాడివో ఎప్పుడైనా ఆలోచించావా? నీ భార్య జైల్లో ఉండి నువ్వు బయట ఉంటే నువ్వేంచేసేవాడివి?” అడిగాడు బావా.

అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.  “మనకు అహంకారం ఎక్కువ. అందరూ మన బరువు మొయ్యాలనుకుంటుంటాం. ప్రతి విషయాన్ని మన అవసరాలను దృష్టిలో ఉంచుకోనే చూస్తాం. ఇతరుల అవసరాలను పట్టించుకోం. ప్రతిరాత్రీ నీతో పడుకునే పెళ్ళాం విషయంలో కూడా అంతే. లియా కూడా మనిషే కదా. ఆమెక్కూడా అందరికి లాగే పరిమితులుంటాయి కదా. కోరికలూ ఉంటాయి కదా… ఆమె పంపించే పచ్చ సంచి మా ఆత్మలను కలిపే బంధం. కాని దాన్ని తప్పకుండా పంపించాలి అని అడిగే అధికారం నాకెవరిచ్చారు?” తీవ్రంగా ప్రశ్నించాడు బావా.

“ఇట్లాంటి చర్చల్లో నీతో నేను పోటీ పడలేనులే. అయినా మాట్లాడ్డం సులభం, తినటం లాగే. అది బయటికి పోయేటప్పుడే కష్టం,” అని నసిగాడు ఇమామ్.

***

ఈ సంభాషణ జరిగింతర్వాత కొన్నాళ్ళ వరకూ ఎప్పటిలాగే లియా పచ్చ సంచిలో వస్తువులు పంపించింది. ఆ తర్వాత ఒక నెలరోజులు సంచి రాలేదు. మొదట ఇమామ్ బావాతో హాస్యాలాడినా కొన్నాళ్ళు పోయింతర్వాత అతను కూడా విచారించసాగాడు.

నూలు కండెనుంచి అంతులేకుండా సాగుతున్న దారంలా కాలం గడిచిపోతూ ఉంది. నిశ్శబ్దంగా ఉన్న గదిలో వాద్య సంగీతం వినపడినట్లు బావా చెవుల్లో అప్పుడెప్పుడో లియా చెప్పిన మాటలు పదేపదే స్పష్టంగా వినపడసాగాయి.

“నాన్నకు మన స్నేహం ఇష్టం లేదు.”

“నాకు తెలుసు. అది నేనెప్పుడో ఊహించాను. నా కళ్ళు నీ కళ్ళలా ఏటవాలుగా లేవనేమో. కాని మన ఇద్దరిదీ దాదాపు ఒకే రంగు. అదీకాక మా అమ్మది మీజాతే.”

“మా అన్నయ్య మన వైపే. వాడు ఉత్తరాల్లో నాన్నకు మన గురించి చెప్తూనే ఉన్నాడు.”

“ఇది అన్యాయం లియా. నువ్వేగనక మగవాడివైతే చైనా జాతి అమ్మాయినే చేసుకోవాలని పట్టుబట్టేవాడు కాదు మీ నాన్న. ఆడ దానివి కాబట్టే ఈ గొడవంతా. మరి నువ్వు మీనాన్నకి ఏం చెప్పావు?”

“ఆయన ఇంకా పాతకాలంలో ఉన్నాడని చెప్పాను.”

“నిజంగా అలా అన్నావా?”

“ఏం? అనకూడదా? ఆయనకు అర్థమయినట్లే ఉంది. మౌనంగా ఉండిపోయాడు. ”

“మౌనంగా ఉన్నంత మాత్రాన ఒప్పుకున్నాడనుకోకూడదు. నీ మంచి చెడ్డలు నువ్వే చూసుకోగలవని చెప్పు ఆయనకు.”

“సరే, ఈసారి మళ్ళా ఈ విషయం మీద గొడవచేస్తే తప్పకుండా అలాగే చెప్తాను.”

***

ఒక రాత్రి బావాకు నిద్ర పట్టలేదు. లియాకు ఏమయిఉంటుంది? పెళ్ళిచేసుకుందేమో. లేక జబ్బు చేసిందో. ఆమెను కూడా ప్రభుత్వం నిర్బంధించిందా? ఇలాంటి ఆలోచనలు వస్తున్నా, మరుసటి రోజు విజిటింగ్ డే అవటంతో ఆమె వస్తుందేమోనని ఆశ పడ్డాడు బావా. ఉదయం అంతా వ్యాకులపడుతూ గడిపాడు. ఒక సారి పచ్చ సంచితో వస్తున్న జైలు అధికారిని చూసి ప్రాణం లేచొచ్చింది. కాని అది తనక్కాదు. బావాకు పిచ్చిపట్టినట్లనిపించింది. అటూ ఇటూ నడిచాడు గదిలో. మధ్యాన్నానికి విజిటింగ్ సమయం అయిపోయిందని గంట కొట్టారు. లియా రాలేదు. ఆ చేదు నిజం మింగుడు పడక మానసికంగా శారీరకంగా నీరసపడిపోయాడు.

బయట నుంచి చాలా పుకార్లు వస్తున్నాయి. పరిస్తితులు మరీ విషమిస్తున్నాయనీ, దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తుందనీ చెప్పుకుంటున్నారు. ఒక రోజు బావా ఆదుర్దా పడటం చూసి ఇమామ్ అతనితో మాట్లాడాడు, లియా గురించి.

“ఆమె విషయంలో నా ప్రవర్తన దుస్సాసహమే కావచ్చు. ఏమవుతుందో చూద్దాం,” అన్నాడు బావా పొడిగా.

తల ఊపాడు ఇమామ్. “ధైర్యంగా ఉండు. నా భార్య నన్నొదిలేసి ఇంకొకణ్ణి చేసుకుంది. నీకూ ఆ గతి పట్టలేదని ఆశిద్దాం. జబ్బు చేసిందనుకుందాం. లేక వూరికెళ్ళిందేమో. ఆశ వదులుకోవద్దు. మంచే జరుగుతుందనుకుందాం.”

మౌనంగా ఉండిపోయాడు బావా.

లియాకి ఏమయిందో తెలుసుకోవటానికి ఇద్దరూ గట్టిగా ప్రయత్నించారు. లియా పనిచేసే చోటికి దగ్గరగా ఒక పాత మిత్రుడున్న విషయం గుర్తొచ్చింది ఇమామ్ కు.  ఆ మిత్రుడి  భార్యను పంపించి లియా విషయం కనుక్కోమని అడుగుతానన్నాడు ఇమామ్.

కొన్ని వారాలు గడిచింతర్వాత ఒక రోజు బావా దగ్గరకొచ్చి,  “అధైర్య పడొద్దు,” అంటూ మొదలు ఎట్టాడు ఇమామ్.

“ఏమయింది? లియా పెళ్ళి చేసుకుందా? చెప్పు, ఫరవాలేదు చెప్పు, ” ఆత్రంగా అడిగాడు బావా.

“చెప్తాను. నువ్వు అదృష్టవంతుడివి. ఆమె ఇంకా నీ మనిషే. ఆమెను నువ్వింకా పోగొట్టుకోలేదు.”

“సరిగ్గా చెప్పు,  ఈ సస్పెన్స్ వొద్దు. అసలేం జరిగిందో చెప్పు.”

“లియా ఏదో దేశం వెళ్ళిందట ఉద్యోగం దిరికితే. ఎక్కడికెళ్ళిందో ఎవరికీ తెలియదు.”

“అలాగా. మనిషి మాయం కావటంలో మొదటి ఘట్టం ఇలాగే మొదలవుతుంది. సరే, చూద్దాం. నీ మంచి చెడ్డలు నువ్వే ఆలోచించుకోమని నేను లియాతో ఎప్పుడో చెప్పాను.”

“మరీ అంత నిరాశ పడకు. పచ్చ సంచి గురించి ఆలోచిస్తూ ధైర్యంగా ఉండు.”

“సరే చూద్దాం. లియా పచ్చ సంచిలో నాక్కావాల్సిన ముఖ్య మైన వస్తువు ఏదో ఒకటి ఎప్పుడూ ఉంటుంది. ”
“అంటే? నాకర్థం కాలా నువ్వేమంటున్నావో. ”

బావా ఏమీ సమాధానం చెప్పలేదు. మౌనంగా కన్నీళ్ళు తుడుచుకున్నాడు.

[1965 లో ఇండొనేషియాలో సుకర్ణో ప్రభుత్వాన్ని తొలగించి సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు జనరల్ సుహార్తో.  ఆ సందర్భంగా జరిగిన మారణకాండలో ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.   మరో పది లక్షల మందిని సుహార్తో ప్రభుత్వం అకారణంగా జైల్లో వేసింది. అలా జైల్లో పడిన వారిలో ఒకరు బాలి నివాసి పుతు ఓక సుకాంత. పది సంవత్సరాల పాటు జైల్లో ఉండి  1976 లో విడుదలయిన  సుకాంత  1977-90 మధ్య చాలా కథలు రాశాడు. వాటిలో ఒకటి 1985 లో రాసిన ఈ కథ. మొదట ఇండొనేషియా భాషలో వచ్చిన కథకు వెర్న్ కార్క్ చేసిన ఆంగ్లానువాదం ఈ తెలుగు సేతకు ఆధారం.]

3 అభిప్రాయాలు »అనువాదాలు, కథలు

3 Responses to “పచ్చ సంచి”

  1. 1
    Vishnu Veerapaneni Says:

    I liked the story very well and it really depicted the old days of social, economical and financial situations of Indonesia. I really liked one sentence in this “అయినా మాట్లాడ్డం సులభం, తినటం లాగే. అది బయటికి పోయేటప్పుడే కష్టం,” .
    Please keep writing these kind of stories Sitaramayya Garu.

  2. 2
    Prasad Mandava Says:

    సీతారామయ్య గారు,

    పచ్చ సంచి లొ నిండిన ప్రీమ అమూల్యమ్. విలువ కట్ట లెనిది.
    నాకు ఈ క్రింది వాక్యమ్ బాగ నచ్చింది.
    “ఇమామ్, పరిస్థితి తారుమారైతే నువ్వేం చేసేవాడివో ఎప్పుడైనా ఆలోచించావా? నీ భార్య జైల్లో ఉండి నువ్వు బయట ఉంటే నువ్వేంచేసేవాడివి?” అడిగాడు బావా.

  3. 3
    manchikanti Says:

    చాలా ఆలస్యంగా మీమంచి క్లాసిక్ చదివాను. .ప్రెమ కనుమరుగు అవుతున్న ఈ సందర్బంలొ తడి తగిలించె కద పరిచయమ్ చెసారు.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో