Jan2010
ప్రజల శక్తిగా…..!
అనుకుంటాం గాని – పారిపోవడం కష్టం
అసలింతకీ – దేనినుంచి ఎక్కడికి పారిపోవడం ?
తెలియదు గనుకనే పారబూనటం
వాస్తవాతీత తీరాలను చేరకోరడం
జీవితం నుండి వెలుపలికి ఈగడం నిట్టనిలువునాకష్టం
మృత్యువునుంచి మరలటం అంతకన్నా పెద్దకష్టం!
కష్టాలకతీతంగా – కామనలనుకసిరికొడుతూ
ఎవరూ మాత్రం ఏమేరకు పారిపోతాడు?
పారిపోబోయి చివరకు ఎక్కడికి చేరిపోతారు ?
పారిపోవడమనేదానికి అచ్చంగా వేరుదారే లేదు
అటో -ఇటో - ఎటో – అలక్ష్యంగా
దిక్కులనే ధిక్కరించగలనన్న ధీమాతో
ఎక్కడికి పారిపోతుంది ప్రాణం?
ఎంతగా – విలవిల్లాటల దిశగా సాగిపోతుంది ?
మీరి పోవడం తప్పమనిషికి
పారిపోయే తీరం ఎక్కడిది ?
చేరిపోవడం తప్ప జీవితంలో
కూరిపోవడంమెక్కడిది – కూపంలో ?
పారిపోవడమొక
ఎవడినుండి ఎవడు మాత్రం ఏమూలకు –
ఏమేరకు పారగలిగాడు?
పార (ము) ముట్టడం తప్ప – దారి దొరికేదెక్కడ ?
పరిపరివిధాల మనిషి – తన నుండి తాను
దూరం కావాలనుకోవడం తప్ప -
పారిపోవడమెక్కడిది బతుకులో పోరడం తప్ప
ప్రబలమైన శక్తిగా మారడం తప్ప !
February 6th, 2010 at 2:11 pm
[...] ప్రజల శక్తిగా … [...]
October 23rd, 2010 at 5:45 am
“పారిలపోవడమెక్కడిది బతుకులో పోరడం తప్ప
ప్రబల శక్తిగా మారడం్ తప్ప”
అనే కవితా పంక్తి చాలా బాగుంది.
అభినందనలు.
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in