Jan2010
సుదర్శనుడి కళ్ళు
సుదర్శన్ – నీ కళ్ళు
చిన్నపిల్లల కళ్ళలాంటి నీకళ్ళు
దుఃఖాన్ని చూశాయి , భయాన్ని చూశాయి
అభయాగ్ని చూశాయి, ఆనందాన్ని చూశాయి
ఆనందానికి అవతలవున్న హింసను చూశాయి
బుల్లెట్ కొస దూసిన అహింసను చూశాయి
సుదర్శన్ -
నీ కళ్ళు గాయాన్ని చూశాయి
గాయం నుంచి కారుతున్న రక్తాన్ని చూశాయి
మృదుత్వాన్ని, మొరటుదనాన్ని చూశాయి
చిన్నపిల్లల అమాయకపు నీకళ్ళు
అగాధ ప్రేమను చూశాయి,
అనంతమయిన ద్వేషాన్ని కూడా చూశాయి.
ఆర్తిగా కదులుతున్న గాలినీ,
ఆకుల్లో పెనవేసుకు మెదులుతున్న
ఒక సుందరమయిన ఊహనూ, ఊహకు
అంటి పైపైకి లేస్తున్న సాంబ్రాణి పొగల కరుణనూ చూశాయి-
అప్పుడప్పుడు నీ కళ్ళు
శిశిరాల తలవిరబోతల్ని
శీతాకాలపు పద్యచరణాల తడి అడుగుల్ని కూడా చూశాయి.
మేరునగధీరుడా!
అంతటి శరీరంలో నీ గొంతు నీ కళ్ళల్లో
మహానాజుగ్గా , మృదువుగా, చెమ్మగిల్లి చలించిపోతూ వుంటుంది.
మహా వృక్షాలతోనూ, మంత్ర శక్తులు నిండిన చీకటితోనూ
రహస్యంగా కదులుతున్న కాలిదోనల పాములతోనూ
విముక్తంగాని ఆత్మల అవిరళ ఘర్షణలతోనూ
రకరకాలపూల, చెట్ల బెరడుల, వెదురువనాల
కదలిక వాసనలతోనూ నిండి, దుర్బేధ్యంగా
ధీరుని వక్షస్థలంలా నిలిచిన ఒక మహాపర్వత సమానుడా!
నీకంటి చెలమల అంచుల
ఎవరో నుంచుని దోసలితో నీళ్ళు తాగుతున్నారు
సాగర్ వనమాలి కన్నులెలా వుంటాయి-
కరుణ పొంగిపొరలుతున్న సాగర్ లా వుంటాయి-
ఇప్పుడు గాదు
ఎప్పుడయినా ఎక్కడయినా
నీకళ్ళలాంటి కళ్ళున్న వాళ్ళు అరుదుగానే వుంటారు
ఆర్తిని పుక్కిటబట్టి ఆనందాన్ని చిమ్ముతూనే వుంటారు
కొందరి కళ్ళకు వయసులేదు
కొందరి మనసుకు వయసులేదు
కాలుష్యాలంటని నయనాల నావికుడా!
నిరంతర యాత్రలో ఒకింత విశ్రాంతి అవసరమేమో-
అయినా విశ్రాంతిగానీ, విరామంగానీ, విసుగుగానీ
లేని నయనశీలీ,
నీకళ్ళనిండా రంగుల లోకాల కదిలే మబ్బులు
ఈ బుజం మీంచి ఆ బుజం మీదికి వంగిన ఇంద్రధనస్సు-
ఎప్పుడయినా బుద్ధుని కళ్ళ కోపపు ఎర్ర జీర కదిలిందేమోగానీ,
ఆగ్రహంతో ఎప్పుడూ ఎర్రబడని కళ్ళ లోకాల సంచారీ!
దేహమంత కళ్ళున్న సుదర్శనా-
సుదర్శన చక్రమెందుకు,
ఒక కుంచె, ఒక కలం , ఒక కాయితం చాలు
లోకాల లోపలిలోకాలు ఆవిష్కరింపబడే
ఆకర్ణాంత నయనుడా!
ఏవి నీ కళ్ళు
నా కళ్ళతో ముద్దాడతా
(Federico Mayor ‘Your Child-eyes’ ప్రేరణతో ……)
January 8th, 2010 at 12:03 pm
ఆ కళ్ళలో సాంబ్రాణి పొగల కరుణ,తడి అడుగులపద్య చరణాల కాంతి,ధీరుని వక్షస్థల తేజో దైర్యం,రెండు భుజాల మీద వంగిన ఇంద్రధనుస్సు, లను కవి కళ్ళతో ముద్దాడడం …….శివారెడ్డి గారి సున్నిత చూపుల కవిత్వపు మహిమ. వీరుని కళ్ళను, కలం యోధుని అక్షరాల్ని……….అనుభవించాల్సిందె………..క్రుతఘ్యతలు సారు,
January 24th, 2010 at 1:05 am
sivareddy garu, yours whole poem is fine and pure with an immense image, in which everybody makes their own life. but i differ with a single sentence that was ” darkness with magical powers” . i hate fragnance of ignorance in poetry. in my sense the never dying capitalist is the true magician who plays with lifes of poor and, the capitalist who makes the fates of poor.
January 27th, 2010 at 4:55 am
bullet kosa doosina AHIMSA ane vakyam adbhuthamga unnadi.
08680-275125, nalgonda.
January 27th, 2010 at 4:59 am
Mee gurinchi chala vinnanu.
Ee roju chusthunnanu.
TV9 lo meeru mathrubhashapy iteevala matladinattunnaru?
congratulations.
February 5th, 2010 at 4:39 pm
[...] సుదర్శనుడి కళ్ళు – కె.శివారెడ్డి [...]
February 7th, 2010 at 3:45 am
“నీకంటి చెలమల అంచుల ఎవరో నుంచుని దోసలితో నీళ్ళు తాగుతున్నారు” …. ఆహ ఎంత అడుబుతమైన వర్ణన. చాల చక్కటి అనువాదం. కృతఙ్ఞతలు.