తెలంగాణ సాహిత్యం – ప్రాంతీయత

స్థల కాలాల చైతన్యంతో, ప్రాంతీయ ముద్రతో , జనహితాన్ని కోరుతూ సమాజాన్ని ముందుకు నడిపించే ఉత్తమ సాహిత్యం. మన పూర్వ లాక్షణికులు  చెప్పినట్టుగా ఆనందోపదేశాలతో మంచికి దోహదం చేసేదే అసలైన సాహిత్యం. రచయిత పేరు లేకుండా కథను చదివితే స్థలకాలాల చైతన్యముండి అది ఫలానా ప్రాంతం నుండి వచ్చిందని తెలుసుకోగలిగే కథే ప్రాంత ముద్ర గల కథవుతుంది. ఆ రచన ఆ ప్రాంతంలోని జన జీవన సంఘర్షణను, జీవన పోరాటాన్ని చిత్రించగలిగాలి. ప్రాంతీయ ముద్ర లేకుండా విశ్వజనీన సాహిత్యం కాని, గొప్ప సాహిత్యం కాని ఉండదన్న విషయం సత్యం -  ప్రపంచంలోని ఏ గొప్పసాహిత్యాన్ని చూసినా ప్రాంతీయ ముద్ర లేకుండా కనబడదు.
గోర్కీ సాహిత్యానికి రష్యన్ విప్లవ పోరాట ముద్ర వుంది. టాల్ స్టాయ్ సాహిత్యమంతా రష్యన్ జనజీవన సంఘర్షణే……… రష్యాలో జరిగిన మార్పులే!  ప్రేమచంద్ సాహిత్యం  ఉత్తరహిందుస్థాన్ జీవితాన్ని , సంఘర్షణను చిత్రించిందే. వీరేశలింగం పంతులు సాహిత్యానికి తన కాలంలోని సంఘర్షణలు సామాజిక నేపథ్యం. కోస్తా జీవితం ఆధారాలు. సురవరం ప్రతాప రెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేవలం సాహిత్యాధారాలను తీసుకుకొని రాసాడు. కళ కళ కోసం మాత్రమే కాకుండా ఆనందంకోసం , ప్రయోజనం కోసమని చాలా మంది గురించి రాసారు. అలాగే గురజాడ సాహిత్యానికి, స్వాతంత్ర్యానికి ముందు కాలంలో విజయనగర పరిసర ప్రాంతాల్లో బ్రాహ్మణ కుటుంబాల్లో  ఉన్న కంగాళీ , మూడనమ్మకాలు ఆధారాలయ్యాయి. రావి శాస్త్రి రచనలకు తాను నివసించిన ప్రాంతంలోని జీవితమే ఆధారం.కొకు రచనలకు కోస్తా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు కథా వస్తువులు. కవిత్వంలో కంటే వచనంలో ప్రాంతీయ ముద్ర స్పష్టంగా ఉంటుంది.
అలాగే తెలంగాణ సాహిత్యానికి స్పష్టమైన ప్రాంతీయ ముద్ర వుంది. స్థలకాలాల చైతన్యం , ప్రాంతీయ ముద్రతో రాసి దాన్ని విశ్వజనీనం చేయడమే రచయితల బాధ్యత. కోస్తా ప్రాంత సాహిత్యానికి మధ్యతరగతి , ఎగువ మధ్యతరగతి జీవితాలు, వ్యవసాయ నాగరికత, అభివృద్ధి ఆధారాలైనట్లే , రాయలసీమ ప్రాంతానికి కరువే నేపథ్యం. నీటికొరత , ఫ్యాక్షనిజం ఆధారాలు. అలాగే తెలంగాణ సాహిత్యానికి ఫ్యూడల్ నాగరికత నేపధ్యం.పోరాటాలు , ఉద్యమాలు, పేదరికం కారణాలు. స్వాంతంత్రం ముందు కోస్తాలోలా తెలంగాణలో మధ్యతరగతి ఆవిర్భావం జరుగకపోవడం వల్ల తమ సాహిత్యానికి అట్టడుగువర్గమే వస్తువైంది. మధ్యతరగతి జీవిత నేపధ్యంతో , మధ్యతరగతి పాఠకుల కోసం పుట్టిన కథ కూడా తెలంగాణలో అట్టడుగు వర్గం నేపథ్యంగానే వచ్చింది. స్వాతంత్ర్యానికి ముందు , స్వాతంత్ర్యానంతర  సమీప కాలం వరకు కూడా తెలంగాణలో అగ్రవర్ణేతరులు అంతగా చదువుకోకపోవడం వల్ల ఆ కులాల నుంచి పెద్దగా రచయితలు రాలేదు.అగ్రవర్ణాల నుంచి వచ్చిన రచయితలే అయినా వారు అట్టడుగువర్గాల గూర్చి రాయడం విశేషం .బి,సి.,ఎస్సీ కులాల నుంచి చదువుకొని రచయితలు రావడం వల్ల గత శతాబ్ద ఎనిమిదవ దశకం నుంచి అట్టడుగు కులాలపై బలమైన సాహిత్యం వచ్చింది.
తెలంగాణ నుంచి వచ్చిన మొదటి కథ హృదయ శల్యం , కోస్తా ప్రాంత కథకులాగే ఈ కథకు కూడా సంస్కరణే నేపథ్యం. ఈ కథ ఓరుగల్లు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మొదట పురుషవేషంలో వచ్చిన ఓరుగల్లు రాణి     రుద్రమదేవి ఆ తర్వాత, తన నిజరూపాన్ని చూపి ఓ స్త్రీ భర్తలో మార్పును తీసుకువచ్చిన క్రమాన్ని తెలుపుతుంది ఈ  కథ. సురవరం ప్రతాపరెడ్ది కథల్లో మనం హైదరాబాద్ ప్రాంత ఉర్దూ మిశ్రితమైన తెలంగాణ మాండలికాన్ని చూడవచ్చు. జీవితం హైదరాబాద్ హిందూ ముస్లిం జీవితాలు. ఇలా వస్తువు, భాష ఈ కథల్లో ప్రాంతీయ ముద్రను కలిగిఉన్నాయి. తెలంగాణ నుంచి బలమైన సాహిత్య ముద్రతో వచ్చిన సాహిత్యమే కాలానికి ఎదురుగాలి నిలబడింది. తెలంగాణ నుంచి మొదటి సాహిత్యమే కాలానికి ఎదురునిలిచి నిలబడింది. తెలంగాణ నుంచి మొదటి తరంలో సురవరం ప్రతాప రెడ్ది , గూడూరి సీతారాం,. సురమౌళి , కాళోజీ  ప్రాంతీయ ముద్రతో కథలు రాసారు. పి.వి.నరసింహారావు రాసిన గొల్లరామవ్వ కథ గొప్ప ప్రాంతీయ ముద్రగల కథ.
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వచ్చిన అతిగొప్ప పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటం. రజాకారు వ్యతిరేక పోరాటంగానూ, భూపోరాటంగానూ ఇది చరిత్ర ప్రసిద్ధికెక్కింది. ఈ పోరాటం గూర్చి కొన్ని కథలొచ్చాయి. పోరాటాన్ని దూరం నుంచి చూసి లేదా వార్తా పత్రికల ద్వారా చదివి చాలా మంది తెలంగాణ ప్రాంతేతరులు తెలంగాణ పోరాట కథలు రాసారు …పోరాటాన్ని దగ్గరగా చూడకపోవడం వల్ల , ప్రాంతం గూర్చి అవగాహన లేకపోవడం వల్ల, వీళ్ళు రాసిన కథల్లో ప్రాంతీయ ముద్ర ,స్థల కాలాల చైతన్యం కనబడదు. తెలంగాణ నుంచి రాసిన సి.వి.కృష్ణారావు , వట్టికోట ఆళ్వారు స్వామి, దాశరధి రంగాచార్య కథలలో ప్రాంతీయ ముద్ర కనబడుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లోనూ, విజయవాడలోనూ పత్రిక సంఖ్య పెరిగింది. రచనల సంఖ్య పెరిగింది. రెండవ తరంలో ముఖ్యంగా 60,70 లలో డిటెక్టివ్ నవలలు, ప్రేమ నవలల సంఖ్య పెరిగింది. వ్యాపార సాహిత్యం విరివిగా వచ్చింది. ఈ కాలంలో తెలంగాణ నుంచి తక్కువ సాహిత్యం వచ్చింది. వ్యాపార నవలల జోరులో తెలంగాణ రచయితలు ఎటూ తేల్చుకోలేకపోయారు. తమ మార్గాన్ని నిర్దేశించుకోలేకపోయారు.స్వతంత్రమార్గాన్ని ఏర్పరచుకొని ప్రభావితం చేయగల సామర్ధ్యం కొరవడింది. వేసిన దారెంట వెళ్ళడమూ ఇష్టం లేదు. అందుకోసం రచయితలు మధ్యేమార్గాన్ని అవలంబించారు . ఈ కాలంలో కథలెక్కువగా రాలేదు . నవలలు వచ్చాయి. నవీన్ నవలలు, దాశరధి రంగాచార్య  నవలలు, మలయశ్రీ నవలలు, వట్టికోట ఆళ్వారు స్వామి నవలలు, తాడిగిరి పోతురాజు కథలు ఈ కాలంలో వచ్చాయి. ఈ కాలంలో మొత్తంగా తెలంగాణ మాండలిక భాష అంతగా వాడలేక పోయారు . అందుకే రెండవతరంలో తెలంగాణ నుంచి వచ్చిన సాహిత్యం తక్కువని అంటారు.
1970 తర్వాత రెండు దశాబ్ధాలని విప్లవ సాహిత్య దశాబ్ధాలుగా పేర్కొనవచ్చు. తెలంగాణలో వేళ్ళూనుకుంటున్న ఉద్యమాలు, విరసం ఆవిర్భావం చాలా మందితో కలాలు పట్టించాయి. విప్లవకథలతో పాటు విప్లవేతర జీవన సంఘర్షణతో ఈ కాలంలో మంచి కథలు వచ్చాయి. ప్రాంతీయ ముద్రతో , మాండలిక బాషలో, ఇవీ తెలంగాణ కథలు అనేంత గొప్పగా కథలు వచ్చాయి. 1980 – 2000 ప్రాంతం, తెలంగాణ కథకు వేదికగా నిలిచింది. మొత్తం రాష్టాన్ని తన కథల్తో ప్రభావితం చేసింది. అట్టడుగు వర్గాల దృష్టికోణంలోంచి ఆశు సాంప్రదాయాన్ని స్వంతం చేసుకొని చాలామంది కథలు రాసారు. విప్లవ కథకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాట స్ఫూర్తి ఈ సమయంలోనే వచ్చింది. 1973 లో కరీంనగర్ నుంచి వచ్చిన ‘బద్ లా’ కథా సంకలనం ఎంతో మందికి  ప్రేరణ నిచ్చింది. విప్లవ కథను ముందుకు తీసుకువెళ్ళిన రచయితల్లో పేర్కొనదగినవారు అల్లంరాజయ్య , రఘోత్తమరెడ్డి, కాలువ మల్లయ్య , బి యస్ రాములు , పి.చంద్ , సరిపల్లి కృష్ణారెడ్ది , వుప్పల నరసింహలాంటి వారు . నేలతల్లి విముక్తి కోసం , శ్వేత రాత్రులు , రుతు పవనాలు , భూమిక , కోల్ బెల్ట్ లాంటి కథా సంకలనాలు వచ్చాయి. ఎదురు తిరిగితే , అడవిలో వెన్నెల , పగలూ రేయీ శ్రమ పడుతున్నా, వెలి , పాలేరు, భూమి నవ్వింది, కథ, సృష్టి కర్తలు , ధిక్కారం, భూమి లాంటి అనేక కథలు ఈ కాలంలో వచ్చాయి. ఆ తర్వాత కాలంలో మధ్యతరగతి దృష్టి కోణంలోంచి మనిషిలోపలి విధ్వంసం,  చావు విందు , యుద్ధభూమి , ఆంబోతు , దక్షయఙ్ఞం లాంటి కథలు వచ్చాయి. అట్టడుగు వర్గం జీవితాలు, మధ్యతరగతి కథనంతో కథలు వచ్చిన తర్వాత తెలంగాణ నుండి కథలు బాగా వస్తున్నాయన్న వాదం బయలు దేరింది.మొత్తంగా విప్లవ కథలు తెలంగాణ ప్రాంతీయ ముద్రతో రాష్ట్రానికి మార్గనిర్దేశం జరిగింది.
నాలుగవతరంలొ ప్రపంచీకరణంతో ప్రభావితమై తెలంగాణ నుంచి మొత్తంగా తెలుగు నుంచి చాలా కథలు వచ్చాయి. అయితే తెలంగాణ నుంచి వచ్చిన కథలకు ఇతర ప్రాంతాల కథలకు స్పష్టమైన తేడా వుంది. వృత్తుల పతనం ,విలువల పతనం, మానవీయ సంబంధాల విధ్వంసం ఈ కథల్లో చూడవచ్చు. విశాలాంధ్ర వారు ప్రచురించిన గ్లోబలైజేషన్ కథలు, బియస్ రాములు వేపచెట్టు కథలు, గ్లోబలైజేషన్ ,గ్లోబలి, పరాయి కథలు ఇందులో చెప్పుకోదగ్గవి. ప్రపంచీకరణ నేపథ్య కథలతో పాటు తెలంగాణ అస్తిత్వ పోరాట కథలు కూడా బలమైన ప్రాంతీయ ముద్రతో వచ్చాయి. నిత్యగాయాలనది, సంకర విత్తులు ఇంకా అనేక కథలు వచ్చాయి. ప్రపంచీకరణ ప్రవేశంతో పల్లెల్లో బతుకుతెరువు మార్గాలెలా చిన్నాభిన్నమయ్యామో చెబుతూ గొప్ప కథలు వచ్చాయి. ఈ కాలాల్లో బి.యస్ .రాములు , కాలువమల్లయ్య ,పెద్దింటి అశోక్ కుమార్, ముదిగంటి సుజాతారెడ్డి , ఆడెపు లక్ష్మీపతి , నవీన్, సదానంద శారద లాంటి వాళ్ళు చక్కని కథలు రాసారు.
ప్రాంతీయ ముద్ర తో, తెలంగాణ ముద్రతో అనేక కథాసంకలనాలు, సంపుటాలు వచ్చాయి. తొలితరం తెలంగాణ కథలు,  కరీంనగర్ జిల్లా కథలు, భూమిక ,కోల్ బెల్ట్ కథలు బద్ లా , అడవిలో వెన్నెల , భూమి, సృష్టి కర్తలు, తెలంగాణ పోరాట కథలు, కథావాటిక , కమ్మ తెమ్మెరలు , కథానికా గుచ్ఛం, తెలంగాణ పోరాట కథలు అడవిలో వెన్నెల, నేల తల్లి విముక్తి కోసం , చౌరస్తా, తెలంగాణ కథ 2004 – 2008 ,వతన్ మొII.
బండకింద బతుకులు, అవ్వతోడుగిది తెలంగాణ, అల్లం కారం , మొగలాయి కథలు, విశాలాంధ్ర తెలుగు కథ , విశాలాంధ్ర తెలంగాణ కథ, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి కథలు , అల్లం రాజయ్య కథలు , బి.యస్ రాములు కథలు, కాలువమల్లయ్య కథలు, మన ఊళ్ళో కూడానా , జైలు లోపల , చార్మినార్ కథలు , కాళోజీ కథలు, గూడూరి సీతారాం కథలు , దున్న, చీమలు , తెలంగాణ వెతలు , ఇప్పపూవు , పాలు, స్మృతి, మా కథలు, ఘర్మజలానికి ,ఆంబళ్ళబండ, రూల్ ఆఫ్ లా, నాలుగు దృశ్యాలు, ఊటబాయి, ఎనిమిదో అడుగు, మట్టి కథలు , తెలంగాణ మట్టి కథలు, చెప్పులు, చెరబండరాజు కథలు మన్నుబువ్వ ,గంటీలు నఖాబ్ లాంటి అనేక సంపుటాలు వచ్చాయి.
తెలంగాణ కథకు ప్రాణం లాంటిది ప్రజలభాష. చాలామంది రచయితలు తెలంగాణ మాండలికాన్ని ఉపయోగించి కథకు జవసత్వాలు అందించారు. మొదటి తరంలో సురవరం ప్రతాప్ రెడ్డి , గూడూరి సీతారాం , సురమౌళి, రెండవతరంలో మలయశ్రీ, మూడవ తరంలో అల్లం రాజయ్య , కాలువమల్లయ్య , బియస్ రాములు నాలుగవ తరంలో అశోక్ కుమార్ తెలంగాణ మాండలికాన్ని సమర్థవంతంగా ఉపయోగించారు.ఆశు సాంప్రదాయాన్ని కథలకు ఉపయోగించడంలోనూ , కథను  విప్లవకథగా మార్చడంలోనూ, దళిత బహుజన కథగా తీర్చిదిద్దిడంలోనూ, కార్మిక కథగానూ , అస్తిత్వ పోరాట కథగానూ తెలంగాణ కథ తెలుగుకథకు మార్గదర్శకత్వం వహించింది. ప్రాంతీయ కథల పద్ధతికి ఒరవడి అయింది. తెలంగాణ మాండలికంలో కథలు రాసి, ఆ భాషకు సాహిత్య గౌరవం తీసుకొచ్చారు.
వట్టికోట ఆళ్వారు స్వామి ‘ప్రజల మనిషి’, ఇతర నవలలు, దాశరధి రంగాచార్య చిల్లర దేవుళ్ళు , ఇతర నవలలు , జాతశ్రీ సింగరేణి మండుతోంది, లోకేశ్వర్ సలాం హైదరాబాద్ , అల్లంరాజయ్య కొలిమంటుకుంది, అగ్ని కణం , ఊరు , సాహు కొమురంభీం , తుమ్మేటి నల్లకలువలు , బి.యస్.రాములు బతుకుపోరు, కాలువమల్లయ్య భూమిపుత్రుడు, గువ్వలచెన్నా ,సాంబయ్య చదువు , బతుకు పుస్తకం, మాట్లాడే బొమ్మలు ఎల్లి నవల , పులి గోపిచంద్ వసంత గీతం,రాగో నవలలు తెలంగాణ ప్రాంత ముద్ర తో వచ్చిన మంచి రచనలు.
మత్తడి , పొక్కిలి ప్రాంతీయ ముద్రతో వచ్చిన అద్భుతమైన కవితా సంకలనాలు. అన్నవరం దేవేందర్, జూకంటి జగన్నాధం , సుంకిరెడ్డి నారాయణ రెడ్డి , నందిని సిధారెడ్డి, జూలూరి గౌరి శంకర్, వేణు సంకోజు ఇంకా చాలామంది కవులు ప్రాంతీయ ముద్రతో అస్తిత్వ కవిత్వం రాస్తున్నాను.
ఇలా తెలంగాణ సాహిత్యంలో మొదట్నించీ ప్రాంతీయ ముద్ర ప్రధానపాత్ర గా కొనసాగుతుంది.

3 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

3 Responses to “తెలంగాణ సాహిత్యం – ప్రాంతీయత”

  1. 1
    raki Says:

    (25) telangaanaa udyama geetaalu/paatalakai..plz visit http://www.raki9-4u.blogspot.com and spread dis msg

  2. 2
    geetanjali Says:

    కాలువ మల్లయ్యగారూ..తెలనగానాలొ..రచయిథ్రుల్లొ ఒక్క ముదిగంతి సుజాథరెద్ది గారె కనపద్దమ్ మీ పాక్షిక పరిసీలననని..బహుసా కవలని చెసింది అనుకొవచా..ఇదుగొ..తెలంగన రచథ్రుల జాబితా,, జాజుల గౌరి,,గొగుస్యమల.,సుబధ్ర..అనిసెత్తిరజిథ,,రమలక్ష్మి,,దుర్గబాయి..గొపిని భాగ్యలక్ష్మి..భాగ్యలక్ష్మి..థుర్లపాతి లక్ష్మి.షాజహాన..కతాయమ్మకరున,,గీతాంజలి ..ఇన్కా చాలా మంది పది జిల్లల తెలంగానకు జిల్లాకొక పదిమంది చొప్పున ఉన్నారు ..థెలుసుకొంది..సాహిత్య చరిథ్ర నమొదులొ..అన్యయంగ ,,పక్షికంగ ఉందదమ్ సన్కుచిథత్వమ్ కినందికి వస్థుంది,,గీతాంజలి

  3. 3
    ramnarsimhareddy Says:

    ధన్యవాదాలు.

    రామనర్సింహారెడ్డి, నల్లగొండ.

    08680_275125

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో