తెలంగాణ వాలే జాగో …………జగావో

గడచిన అరువైయేండ్ల సమైక్యవాద పొత్తుల సంసారంల తెలంగాణ బతుకు భాష, యాస , సంస్కృతి అంతా ఆగమైంది. అడివైందని అన్ని రంగాల్లో కోస్తాంధ్ర వలసవాదుల కుట్ర క్షణ క్షణానికి బలిపెట్టాలనే చూస్తూంది.తెలంగాణ గుండె కాయలాగ తెలంగాణ సంస్కృతికి, చరిత్రకు నిలువెత్తు సాక్షమైన హైదరాబాద్ ను ప్రీజోన్ పేరిట పూర్తి స్థాయిలో హస్తగతంచేసే కుట్రకు పాల్పడుతుండ్రు. చూస్తున్న కవిగాయకుల కండ్లల్ల కారం పొడి చల్లి, నడుస్తున్న ఉద్యమతొవ్వల్ల నడవకుంట మంగముండ్లు నాటి నినాదపు గొంతికెలయిన హైద్రాబాద్ కు ప్రీజోన్ పేరిట ఉరివెడ్తండ్రు. గందుకే తెలంగాణా కవులం, కళాకారులం అందరం ఒక్కపారి క్యాలికి అయి క్యాలి (మేల్కొల్పు)చేయాలనే ఉద్దేశ్యంతో “మేహైద్రాబాద్ హమారా హై / హమారా హీ రహేగా!/ జాగో ఔర్ జగావో !!!” నినాదాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినాన్ని నిరసన దినంగా, తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణను గ్రంధాలయోద్యమ కర్తయై అక్షరాల్తో మేల్కొల్పిన మట్టిమనిషి ‘వట్టి కోట ఆళ్వారుస్వామి’శాందిరి కింద పొద్దుగాల పదిగంటలకు సభ సురువైంది.
సురువైన సభలో కిక్కిరిసిన కవులు కళాకారులు లేచి నిలబడి, అందెశ్రీ గారిచే రచింపబడిన తెలంగాణా జాతీయగీతం అందేశ్రీ గారితో అందరు ‘జయజయహో తెలంగాణా/ జననీ జయకేతనం / ముక్కోటి గొంతుకల ఒక్కటైన కేతనం ‘అంటూ గీతాలాపన గావించారు. జైతెలంగాణ నినాదాలతో హాలు మారు మ్రోగింది. ప్రారంభ సభకు అధ్యక్షత వహించి స్కైబాబా గారు తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు రూపమయిన జయశంకర్ గారిని సందేశమివ్వాల్సిందిగాకోరాడు.
జయశంకర్ గారు మాట్లాడుతూ మేధావులనబడేటోల్లు కవులకు , కళాకారులకు ప్రసంగాల అందిస్తున్న ముడిపదార్థాన్ని స్వీకరించి, పాటలుగా , కవితలుగా మలిచి ప్రజానాలుకలౌతారు. ఉద్యమాన్ని నిలబడతారు. హైద్రాబాద్ నిజాం రాష్ట్రంగా వెలుగు వెలిగిన హైద్రాబాద్ ను ప్రీజోన్ గా మార్చితే ఎంతమాత్రము సహించేది లేదని, అందుకోసము , తెలంగాణా యువతను మేల్కొల్పి కనుమరుగవుతున్న భవితను తెలుపాలని, తెలంగాణా ప్రజల్ని పాటలతో మేల్కొల్పవలసిన బాధ్యత కవిగాయకులదేనని పేర్కొన్నాడు.
అల్లం నారాయణగారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ప్రతి దినపత్రికలో తెలుగుతల్లిని ముద్రించి ఆంధ్రప్రదేశ్ చరిత్రను, విపులీకరించి రాసిన అందులో ఎక్కడా తెలంగాణ గురించి కాని, తెలంగాణ సంస్కృతి గురించి కాని రాయరు. కనీసం తెలంగాణ లో తమ పత్రికలు అమ్మబడుతున్నందుకైనా నోటిమాటకైనా రాసే పద్దతిలో తెలుగు దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా లేదని పేర్కొన్నారు. కోస్తాంధ్రుల కుట్రల్ని రోజురోజుకీ అధికం చేయడానికి ఉదా: ప్రీజోన్ అంశాన్ని మనం పెర్కోనవచ్చు. వాళ్ళు మనల్ని మోసం చేసారని చెప్పడానికి లక్షకారణైల చెప్పొచ్చు. వాల్ల పాలనలో మనల్ని (తెలంగాణకు) బాగు చేసామని ఒక్కమాటైనా చెప్పలేరన్నాడు. మనందరం మేల్కొవాలే తెలంగాణొల్లను మేల్కొల్పాలే. అందుకోసం కవిగాయకుల కృషి అవసరం అని నొక్కి వక్కానించాడు.
కాకతీయ యూనివర్సిటి ప్రొఫెసర్ కొమ్రన్న గారు తనదైన శైలిలో మా తెలుగు తల్లికి ముళ్ళపూదండ………….., గలగలాగోదారి పారుతుంటేను ఆంధ్రా పంటలే పండుతాయి బిరబిరా కృష్ణమ్మ ఉరుకుతుంటేను తెలంగాణ భూములన్ని బీళ్ళు అవుతాయి” అంటూ వ్యంగంగా ఆలపిస్తూ ఆ పాటను తెలంగాణోల్లమై. ఎవరమూ ఎక్కడా ఆలపించమని ప్రకటించినపుడు సభనుండి తెలంగాణా నినాదాలు మారు మ్రోగాయి. దొడ్డికొమురయ్య బిడ్డలమై , సాకలి ఐలమ్మ కొడుకులమై, కొమురంభీం వారసులమై కాళోజీ చెప్పినట్లు వలస దాడుల్ని ప్రాంతం దాట తన్ని తరుముదామని , ఆ రీతిగా సాహిత్య సృజన చేసి తెలంగాణా ఉద్యమాన్ని తట్టిలేపుదామని, పేర్కొన్నారు.
తదనంతరం పదిమంది కవుల చొప్పున ‘జాగో… జగావో …’ కవి సమ్మేళనం నిర్వహించారు. మొదటి సెషన్ కు పసునూరి రవిందర్ అధ్యక్షతన తైదల అంజయ్య, వేముగంటి మురళి , జ్వలిత, జూపాక సుభద్ర మొదలగువారు కవితా పఠనం గావించారు. తైదల అంజయ్య’ తెలంగాణా స్కూల్ అసెంబ్లీ ‘ కవిత వ్యంగ్యా హాస్యంతో సభికులందర్ని ఆకట్టుకుంది. “నీరు ఆంధ్ర నెరుగు, నిజం తెలంగాణానెరుగు” అంటూ చమత్కరించారు.
2వసెషన్ కి అన్నవరం దేవేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిద్దెంకి యాదగిరి, పొన్నాల బాలయ్య, బూర్ల వెంకటేశ్, దొంత భద్రయ్యలు పాల్గొన్నారు. తమతమ నిరసనల్ని కవితల ద్వారా నివేదించినపుడు మంచి స్పందన వచ్చింది.
3వసెషన్ కి గోగు శ్యామల అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ వాగ్గేయ కారులు జయరాజుగారు తన పాటలతో హోరెత్తించాడు. అంబటి యెంకన్న తన గళంతో సభికుల్ని మేల్కొల్పాడు. సభను గాయిగాయి జేసిండు. ఇదే సేషన్ లో యశ్ పాల్ గారు ” ఆశెన్న ఊశేన్నా తమ్ములాల/ఆశెన్న ఊశెన్నలాం” అంటూ తెలంగాణ ఆవేశాన్ని వినిపించారు. ఆ తర్వాత భోజన విరామం ప్రకటించారు.
4వసెషన్ కి తెలంగాణ ప్రసిద్ది నవలా రచయిత వేముల ఎల్లయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సేషన్ ప్రారంభంలో వట్టికోట జయంతిని ఉద్దేశించి దేశపతి శ్రీనివాస్ వీనుల విందైన గేయాన్ని పాడివినిపించాడు. ఈ సమావేశంలో జనజ్వాల , కదిరెకృష్ణ , పప్పుల రాజారెడ్డి, విప్లవ్ దత్ శుక్లా ,డా.కాశీం. డా.కాంచనపల్లి కవితల్ని పఠనం చేశారు. వేముల ఎల్లయ్య కవిత అమ్ముడువోయే ఉద్యమ ద్రోహులున్నా కొనెటోడు గూసెండని చమత్కరించారు.
5వ సెషన్ కి ముస్లింవాద కవయిత్రి షాజహానాగారు అధ్యక్షత వహించారు .పరిశోధన విధ్యార్థి నలిగంటి శరత్ ‘కంచెరేగు తీపివోలె లచ్చుమమ్మ నీ కంఠమెంతామధురమే లచ్చుమమ్మ.’ అంటూ అద్భుతంగా పాటను విన్పించారు. కొండ రాజశేఖర్ గౌడ్ ‘లొల్లికతం ఖేల కతం, దుకానంబంద్’, ఆకట్టుకునే విధంగా పాడి వినిపించారు.
6 వసెషన్ లో సీనియర్ కవులు నాళేశ్వరం శంకరంగారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాంలో అందరు కవులు సీనియర్లే అమ్మంగి వేణుగోపాల్ , సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ఏ .సూర్యప్రకాశ్, దేంచనాల శ్రీనివాస్ ,పగడాల నాగేందర్ తెలంగాణ బాధను వినిపించారు.
7 వ సెషన్ కి స్కైబాబా అధ్యక్షత వహించాడు. ఈ సేషన్ ప్రారంభంలో పరిశోధక విద్యార్థి పసునూరు రవీందర్ తెలంగాణ సంస్కృతిని గానంచేసాడు. వేణు … మొదలగువారుపాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని కవిగాయకులమై మనవంతు పాత్రను మనం నిర్వహిద్దామనే పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో చదివిన కవితల్ని పుస్తకంతీసుకు రావటానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్లు , పసునూరి రవీందర్ , షాజహానా, గోగుశ్యామల , అన్వర్ , అన్నవరం దేవేందర్, వేముగంటి మురళి కృష్ణకు, అతిధిలకు , పాల్గొన్న కవిగాయకులకు పొన్నాల బాలయ్య వందన సమర్పణ గావించారు.

3 అభిప్రాయాలు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

3 అభిప్రాయాలు

  1. ramnarsimhareddy Jan 27, 2010 1

    ధన్యవాదాలు.

    08680-275125

    నల్లగొండ.

  2. ramnarsimhareddy Jan 27, 2010 2

    అన్నవరం, పసునూరి, పెద్దింటి, అన్నయ్యలకు
    సలాములు.

  3. ప్రాణహిత » ప్రాణహిత జనవరి 2010 సంచిక Feb 5, 2010 3

    [...] తెలంగాణ వాలే జాగో .. జగావో – సిద్దెంకి [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో