Jan2010
తిష్ట !
ఇప్పటి హైదరాబాదును చెప్పటం
స్కూల్ ఫైనల్ కాదుకదా – జీవితాన్నే తప్పటం
దీనిమీద లేని ప్రేమను గుప్పటం
అయిన వారిని మత్పరిచ్చటం – మాయజేయటం
నిర్ ‘దయ’తో కొందరు దీనిని
‘హైడ్రా బ్యాడ’ని అనబోతాడు-
ఉచ్చారణ సౌకర్యం వలకబోస్తూ
హైడ్రాహెడెడ్ ప్రాణి కాదు కదా ?
అన్నం పెట్టి ఆదుకున్న తల్లి నదిని
నీరై మాత్రమే కాదు ఆమువై ప్రవహించిన
మూసీనదిని చూసి మురికిగా పేల్తారు
హైటెక్కులకు పోయి-
అమ్మలా నలుదిక్కులాచాపి-
చేతులెత్తే చార్ మినార్ దాచి ను
కొత్తబూత్ బంగ్లాలకే తావుతావంటూ సాగుతాడు
ఇప్పటి హైదరాబాదును చెప్పటం
కొత్తరకమైన విషం గుప్పటం కాదుకదా ?
ఇక్కడ పుట్టిన వారి గుడిసెలు పాతాళంకింది దాకా
పాకి పాకి ‘పాకి’గా మారిపోతుంటే
బతుకు చేజారిపోతుంటే-
లేచిన వికారాకారాల కాంక్రీటు అడవి
వొత్తి పెట్టిందెవరిని ?
కన్నపేగు బంధాలను – కనికారాల్ని కాదుకదా ?
ఏమేమి గుడ్లు పెడుతున్నయో యిక్కడ
ఎప్పటికీ నాల్గేసి డిగ్రీల ఎండలు మండుతున్నవి అధికంగా
ఎంతలేసి పుణ్యం చేతులు మారిందో
ఐశ్వరం అంతకంతకూ హెచ్చి-
వానల్ని మింగిన భావదారిద్ర్యం కురిసి కురిసి
అలసిపోతున్నది
ప్రగతి తంత్రం – కూలి మంత్రం
మాయరోగం తిష్ట వేయలేదు కదా !
February 5th, 2010 at 4:40 pm
[...] తిష్ఠ [...]
October 23rd, 2010 at 5:41 am
మీ కవిత చాలా బాగుంది.
అభినందనలు.
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
(nallagonda)