February 2010 సంచిక

అజ్నబీ షాయర్

ఎవరస్తారనో
ఇంత విరగ కాస్తోందీ వెన్నెల
ఎంత సంబర పడుతుందో
ఇప్పపూల వింత వాసన

మొత్తం చదవండి »

7 అభిప్రాయాలు »కవితలు

కొన్ని మరణాల్లోంచి

మరణాల్ని కీర్తించడం కొత్తేమీ కాదు
మణికర్ణికా ఘాట్ లో
రగిలే ఆరని చితిమంటల్లో
నిత్యం నన్ను నేను దహించుకొంటున్నవాడ్నే
మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »కవితలు

నాగలికర్రొకటి తీసుకునిరా

సమూహంలొ నిన్ను నువ్వు తప్పిపోవటం

నిన్ను నువ్వే వెతుక్కోవటమంటే
అల్లుకున్న బురద తీవెకింద
మాయమైన బతుకుపిందెల్ని వెతుక్కోవటమే

మొత్తం చదవండి »

7 అభిప్రాయాలు »కవితలు

నీకెలా నమస్కరించను?

చందమామను జేబులోకి తెచ్చుకున్నవాడా

మబ్బుల గిన్నెలో వెన్నెలని జీవితం చేసుకున్నవాడా
ఉద్యమ సముద్రంలో అలుపు లేకుండా ఈదినవాడా
వీరుడా నీకు జోహార్ మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

నీ దారెప్పుడూ ఇంతే…

మర్రి చెట్టు ఊడల్లా నువ్వూ నేను అల్లుకుంటూ పోతామా
నీడల్ని పరుచుకుంటూ గలగలలు లేకుండా ప్రవహిస్తామా

మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

అలిసిన అలలు

ఒరియా మూలం – రాజకిషోర్ దాస్

ఏమవుతుందిట
అలలు పొంగి పొరలకపోతే

సాగరం నీరవమైపోతే
శ్మశాన భయ కంపనలు
యావత్తు శరీరాన్నీ ఆవహిస్తే

మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు

నిప్పు రాజుకుంది…

రచయిత: యస్. గణేశ లింగం

“అమ్మా …! అని కొడుకు సుగంతన్ పిలిచినట్లై తంగమ్మ మూతపడుతున్న కళ్ళను ఉలిక్కిపడి తెరిచింది. కొడుకొచ్చాడన్న ఆరాటంతో బైటికొచ్చిన తంగమ్మకి ఎవరూ కనిపించలేదు. ‘ఏదో కల గని వుంటనులే’ అనుకుంటూ తిరిగొచ్చి పడుకుంది.. ఇంత రాత్రయినా సుగంతన్ జాడలేదు. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »అనువాదాలు, కథలు

రెక్కల హరివిల్లులు

దసరా పండక్కి నాలుగు రోజులు శెలవిస్తారని విన్న క్షణం నుంచీ నా మనసుకి రెక్కలు మొలిచాయి. ఎపుడెపుడు యింటికెళ్ళిపోతానా అన్న ఆరాటం. అమ్మా నాన్నల్తోపాటు అస్తమానం గుర్తొచ్చే మా తోటలోని పూలని పలకరించి ఎన్నాళ్ళయిందో . . . పూలరెక్కల సీతాకోక చిలుకల్ని పరామర్శించాలన్న తహతహ . . . జైల్లాంటి మా హాస్టల్ చుట్టూతా ఉన్న ఎత్తైన ప్రహరీగోడ మీంచి ఎగిరెళ్ళి మా తోటలో వాలిపోవాలన్న కోరిక . . .
సీతాకోక చిలుక . . . ఎంతందమైన పేరు ! దాని సోయగమంతా రంగురంగుల రెక్కల్లో దాచుకుని పూలవనాలమీద ఎగుర్తుంటే చూట్టం ఎంత తీయటి అనుభవమో . . . . మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కథలు

పొక్కిలి

అగ్గిపెట్టె గుగ్గిపెట్టె
లవ్వో లాటో
చెంచో బైటో
ఠాంగు ఠీంగు
తమ్మళ్ళ పెద్దవ్వ
తసుక్కు… తుసుక్కు

వాడకట్టు పిల్లలు ముగ్గురు నల్గురు కలిసి ఇంటి ముంగటి గచ్చుమీద అర్సేతులు బోర్లేసి ఆడుకుంటుండ్రు. ఒక చెయ్యి అగ్గిపెట్టె గుగ్గిపెట్టె… అనుకుంట బోర్లేసిన వేళ్ళను తాకుకుంట పోతంది.. దానితోనే మిగిలినోళ్ళ కండ్లూ పోతున్నాయి… తుసుక్కుమన్న దగ్గర వేలు లోపలికి ముడుసుక పోతంది. ముడుసుకపోయిన వేలు పానం పోయినంత తల్లడిల్లుతంది. అగ్గిపెట్టె గుగ్గిపెట్టె… మళ్ళా మొదలైతంది… మళ్ళా వేలు ముడుసుకుపోతంది…

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కథలు

నల్ల నినాదం అతని కవిత్వం!

చాలా కాలంగా వెంటాడుతున్న కవి లాంగ్స్టన్ హ్యూస్!

ఎప్పుడో 1902లో పుట్టి, ఏ 1967లోనో కన్నుమూసిన ఈ కవి ఇప్పుడు నా లోకంలో ఎలా కన్ను తెరుచుకున్నాడు?! అతని కవిత్వ పాదాల్లోని ఏ శక్తి నన్ను అటు వైపు జర జరా ఈడ్చుకెళ్ళింది? ఇటీవల హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో హెన్రీ గేట్స్ అనే వొక నల్ల ప్రొఫెసర్ మీద పోలీసు దాడికి నిరసనగా “తోలు మందం” అనే శీర్షికతో (ఈ కవిత నా కొత్త సంపుటి “వూరి చివర” లో వుంది) కవిత రాసినప్పటి నించీ లాంగ్స్టన్ హ్యూస్ కవిత్వం రోజూ కొంత కొంత చదువుతున్నా. వొకే సారి అతన్ని అంతా చదవడం కష్టం. మొత్తం చదవండి »

7 అభిప్రాయాలు »దర్వాజ

రాయలసీమ జానపద సాహిత్య సౌరభం

రాయలసీమ రతనాలసీమ. రతనాలకంటే విలువైన జానపద సాహిత్యానికి కూడా ఈ సీమే ప్రసిద్ధి. జానపద సాహిత్యం అక్షర ఙ్ఞానం లేని పల్లీయుల సాహిత్యం. మనదేశంలో నూటికి 75 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్తూ పల్లెల్లోనే జీవిస్తున్నారు. శిష్ట సాహిత్యాన్ని మనమెంత చదువుకున్నా మన తెలుగు సాహిత్యంలోని సౌరభాల్ని, స్వచ్ఛతను, తియ్యదనాలను రుచి చూడాలంటే జానపద సాహిత్యాన్ని పరిశీలించక తప్పదు. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

బోల్షెవిక్ విప్లవ పొలికేక "బ్యాటిల్‌షిప్ పొటెంకిన్"

దాదాపు పాతికేళ్ల క్రితం ఎస్వీ యూనివర్శిటీలో పీజీ చేస్తున్న రోజుల్లో దూరదర్శన్‌లో ఒక మూకీ చిత్రం చూపించారు. నాటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు గోర్బచేవ్ భారత్‌ను సందర్శించిన సందర్భంగా చిత్రమేళా రూపొందించి రష్యన్ సినిమాలను వరుసగా చూపించారు. ఓ రాత్రి పది గంటల తర్వాత దూరదర్శన్‌లో చూసిన ఆ సినిమా వీక్షణ అనుభూతులు ఇప్పటికీ నాలో చెక్కుచెదరకుండా ఉన్నాయి. అప్పటికే యుద్దనౌక పొటెంకిన్‌లోతిరుగుబాటు గురించి పుస్తకాల్లో, పేపర్లలో చదివి తెలుసుకోవడం వల్ల కూడా ఈ సినిమా అంటే పెద్ద కుతూహలం.

మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »వీడియో / ఆడియో

పడమటి నీడ – సమీక్ష

లోకంలో రెండు రకాల కథకులు ఉంటారు. “నిరుపహతు స్థలము, బంగరు టూగుటుయ్యల, రమణీప్రియ దూతిక, కప్పురపు ఇడెము”లాంటి హంగులు సమకూర్చుకుని, ఊహాలోకాల్లో తేలిపోతూ, పడవల్లాంటికార్లు, ఇంద్ర భవనాలు, అరడజను నౌకర్లు సృష్టించి, పాఠకులను గాల్లో తేల్చేస్తారు కొందరు. ఇక రెండవ రకం కథకులుంటారు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

నవలను చదివించే విమర్శ ‘అతడు – ఆమె : మనం’

మంచి సాహిత్య విమర్శ మంచి సాహిత్యాన్ని చదివేట్టు పాఠకుల్ని ప్రోత్సహిస్తుంది. సాహిత్య పఠనను ప్రోత్సహించడం మాత్రమే గాక, పాఠకులలో సాహిత్యంపట్ల, సమాజంపట్ల ఆలోచనల్ని రేకెత్తించి వాళ్ళ సంస్కారంలో మార్పు తీసుకొని వస్తుంది. రచయితలు సమాజం ఎలా ఉంది, అలా ఎందుకుందో చెబితే; విమర్శకులు సాహిత్యం ఎలా ఉందో, అలా ఎందుకుందో చెబుతారు. ఇద్దరి ప్రయత్నమూ పాఠకులలో ఆలోచనలు రేకెత్తించి కర్తవ్యోన్ముఖులను చేయడమే.

మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

నేర పరిశోధన

ఆంగ్ల మూలం: సర్ ఆర్థర్ కోనన్ డాయిల్
తెలుగు: కొడవటిగంటి కుటుంబరావు

పూర్వ భాగం

1. మిస్టర్ షెర్లాక్ హోమ్స్

1878లో లండన్ విశ్వవిద్యాలయంలో డాక్టరాఫ్ మెడిసన్ పట్టం సంపాదించి, సైనిక వైద్యాధికారి కావటానికిగాను ప్రత్యేక శిక్షణ పొందటానికై నెట్లీ వెళ్ళాను. అక్కడ శిక్షణ పూర్తికాగానే నన్ను ఫిప్త్ నార్తంబర్లాండ్ ఫ్యుసిలియర్స్ దళంలొ అసిస్టెంట్ సర్జన్ గా నియమించారు. ఆ సమయంలో ఈ దళం ఇండియాలో ఉన్నది. నేను దానిని చేరుకునే లోపుగా రెండవ ఆఫ్ఘన్ యుద్ధం ఆరంభమయింది. మొత్తం చదవండి »

12 అభిప్రాయాలు »అనువాదాలు, ధారావాహికలు, నేర పరిశోధన

కళాకృతులూ, డైనొసార్లూ

వివిధ నాగరికతలు మొదలైన కొన్నివేల ఏళ్ళ క్రితం వాటిని ప్రతిబింబించే తాత్వికచింతనలూ, కళల చిహ్నాలూకూడా రూపొంది, ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. వీటిలో కొన్ని సరిగా అర్థంకావు. ఉదాహరణకు మనదేశంలో వీణ తదితర సంగీతవాద్యాలలోనూ, కొన్ని దేవాలయశిల్పాలలోనూ ‘యాళి’ ముఖాలు కనిపిస్తాయి. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్