అజ్నబీ షాయర్

ఎవరస్తారనో
ఇంత విరగ కాస్తోందీ వెన్నెల
ఎంత సంబర పడుతుందో
ఇప్పపూల వింత వాసన

ఎవరస్తారనో
నీటి చెలమల్లో -
పులకిస్తున్న ఊటలు
ఎన్ని సాహస ఊహలో
ఇసుక మీద పొర్లి
తీయగా పరుగులు తీస్తున్న
మనసులాంటి జలాలు

ఎవరస్తారనో
బాటల వెంట-
పూల తోరణాల్లా
చేరిన పిల్లల గుంపులు
ఏమి తెస్తారనో
దీపాలు వెలిగించిన పండగలా
నిర్మల నిశ్చల చూపుల్లో మెరుపులు

ఎవరస్తారనో
వర్షంలో తడిసిన ముత్యంలా
తెల్లవారు జాములో
నిరీక్షించే విప్పారిన ముఖాలు

ఎప్పుడొస్తారనో
కురులు దులిపి-
సవ్వడులు లేపినట్టు
నదిమీది తెప్పలకు
నిలకడలేని అలలకలలు

ఎవరస్తారనో
ఎన్ని ఆటంకాలనైనా
ఎదుర్కొని స్వాగతించటానికి
ప్రాణాల్ని వీణలుగా చేసిన
బతుకుపోరు తన్మయత్వాలు

ఎవరస్తారనో …………………….?!
ఎవరస్తారనో …………………….?!

7 అభిప్రాయాలు »కవితలు

7 Responses to “అజ్నబీ షాయర్”

  1. 1
    satyadarshana Says:

    -ఇప్ప పూల వింత వాసన- బాగుంది.

  2. 2
    కెక్యూబ్ వర్మ Says:

    ప్రాణాల్ని వీణలుగా చేసిన
    బతుకుపోరు తన్మయత్వాలు

    అద్భుతమైన కవిత్వీకరణ…

  3. 3
    mohan ram prasad Says:

    ఇఫ్ఫఫూల సువాసన కవితని కమ్ముకొని వి0తగా నన్నల్లుకు0ది

  4. 4
    హెచ్చార్కె Says:

    చాల బాగుంది పొయెమ్, కంగ్రాజ్యులేన్స్ రాజూ!
    ‘నదిమీది తెప్పల…నిలకడ లేని అలల కలల’ ను కాపాడుకుందాం.

  5. 5
    Uday bhaskar Says:

    Chala bagunnadi

  6. 6
    rkkosuri Says:

    ఆశారాజు జీ,ఇంత్ భావుకత్వం్ యెలాసాధ్హ్య్ మౌతుంది మీకు…..నా దగర..మీ ఉత్స్ వం ఒక్క్ టే వుంది..దాంతోనే..ఇప్ప్ టి దాకా…మునిగి..తేలుతున్నా…మత్తుగా్ ఉంది.ఇప్ప్ పూల్ వాసన..నన్ను చుట్టు ముట్టింది…ఆపె కో బహుత..షుక్రియా…ఆశా జీ…కోసూరోడు.

  7. 7
    ప్రాణహిత » ప్రాణహిత ఫిబ్రవరి 2010 సంచికకు స్వాగతం Says:

    [...] అజ్నబీ షాయర్ : ఆశారాజు [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో