నాగలికర్రొకటి తీసుకునిరా

సమూహంలొ నిన్ను నువ్వు తప్పిపోవటం

నిన్ను నువ్వే వెతుక్కోవటమంటే
అల్లుకున్న బురద తీవెకింద
మాయమైన బతుకుపిందెల్ని వెతుక్కోవటమే

బెదిరిన ఆబోతు మీదికి ఒరికినట్లు
కట్టలు తెంచుకుంది, ఈ ప్రాణ జలమేనా !

రెప్పలే లేనట్లు కాచుకున్నా
మట్టికట్ట ఉప్పై కరిగిందేమిటీ?

  కడుపులో పెట్టుకుని చూచుకున్న నదికి
కడుపు చించితే కాళ్లమీదేమిటి, కాటిమీదాపడుతుంది
ఊరుపోయింది, వాడపోయింది
బువ్వజాడపొయింది, పుస్తెల తాడూ పొయింది
పిల్ల పెళ్ళి కోసం తెచ్చిన అరివేణికుండలో
ఆకలి మేటేసింది

నువ్వు బురద సముద్రాన్ని ఈదుతున్నపుడు
  గంజిపెట్టి ఇస్త్రీ చేసిన తెల్లటి చీకటిని తొడుక్కుని
  బతుకు పుట్టిని నట్టేట ముంచేసే సరంగులు
పంట పొలాల లేజర్ షో నిర్వహించేసి
ఆహారపు పొట్లాల కింద పడి
మన బతుకులు పరిహారమవగానే
ఎవరికీ చెందక పోయినా
లబ్దిదారులై విచ్చేస్తారు

కొన్ని మెతుకుల కోసమో కాస్తంత నీడ కోసమో
నిన్ను నువ్వే సమూహంలొ తప్పిపోయాక
వెతుకులాటకూ, బతుకుపాటకూ,
నువ్వే వంత

నిన్ను నువ్వే వెతుక్కుందుకు
నాగలికర్రొకటి తీసుకునిరా

7 అభిప్రాయాలు »కవితలు

7 Responses to “నాగలికర్రొకటి తీసుకునిరా”

  1. 1
    satyadarshana Says:

    your poem stirred me to imagine myself as first ploughman of earth
    but there was no space for eternal joys in poverty. the vitality of eternity lost in chief liquers, hard labour.
    can you ever see a drunken sun fallen at sidewalks?
    just take it for a fun.

  2. 2
    venatesh E Says:

    మీ కవిత బాగుంది.

  3. 3
    హెచ్చార్కె Says:

    పద్యం చాల బాగుంది.
    రెప్పలే లేనట్లు కాచుకున్నా
    మట్టికట్ట ఉప్పై కరిగిందేమిటీ? వటి ఊహలు నిలబెత్తి ఆలోచింపజేస్తాయి.
    అక్కడ అచ్చు తప్పులు దొర్లాయేమో… కవి రాయడంలోనే అవి దొర్లాయో…ఉదాహరణకి- ‘నిన్ను నువ్వు తప్పిపోవటం’, ‘ఆబోతు మీదికి ఒరికినట్లు’ నదికి కడుపు… కాటిమీదాపడుతుంది”
    సత్యదర్శనా, మీ ఉద్దేశం చీప్ లిక్కర్ అనా? అయినా దానికి ఈ పద్యం సందర్భమేనా? మీకు ఇంకొక ఇమేజ్ తోచింది గనుక అలా అనేశారా? :)

  4. 4
    satyadarshana Says:

    to hrk,
    whenever, when i see the word -plough- especially in peotry or politics- the poor farmers (the lovers of soil ) come to mind as their souls run to fetch precious and marvelous nector of their humle life-cheif liquer. iam not a well educated reader of poetry. i just pick a word as i like- prana jalam ante chief liquer anukunna. – sorry dear poet.

  5. 5
    satyadarshana Says:

    to hrk,
    but actually i hate cheif liquer. the ruin of life. i forget to add these lines

  6. 6
    madhurasree Says:

    పిల్ల పెళ్ళి కోసం తెచ్చిన అరివేణికుండలో ఆకలి మేటేసింది
    నువ్వు బురద సముద్రాన్ని ఈదుతున్నపుడు
    గంజిపెట్టి ఇస్త్రీ చేసిన తెల్లటి చీకటిని తొడుక్కుని
    బతుకు పుట్టిని నట్టేట ముంచేసే సరంగులు
    Chalamanchi Bhavukathnu Pratheekalanu vadina mee kalam ku namaskaram
    Madhurasree, Anantapur

  7. 7
    rkkosuri Says:

    నా కవిత పైన మీ అభిప్రాయాలు తెలియజీసినందుకు మీకు ధన్యవాదాలు హెచె ఆర్కె , సత్యదర్సన,మధురస్రి….సదా మీ ఆసీస్సులు ఆసిస్థు…కోసూరోడు..

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో