నీ దారెప్పుడూ ఇంతే…

మర్రి చెట్టు ఊడల్లా నువ్వూ నేను అల్లుకుంటూ పోతామా
నీడల్ని పరుచుకుంటూ గలగలలు లేకుండా ప్రవహిస్తామా

ఐనా- చిరిగిన పేజీని ఇష్టంగా చదివించి ముగింపు తెలియకుండా తెలియనితనం లోకి నెట్టివేసినట్లు
సంగమం తరువాత ఎడారి మొక్కను చేస్తావు !
నీ దారెప్పుడూ ఇంతే – విందు పంక్తిలో చివరి విస్తరిలా…

బండికింద కుక్కపిల్లల్లా తోకలూపుకుంటూ
వెనక కాళ్లతో ప్రపంచాన్ని తన్నుకుంటూ వెళ్లిపోతుంటామా
దించిన తల ఎత్తకుండా గుండెమీద శిశిర సంధ్యలను మోస్తూ ఉంటామా
ఐనా- పుస్తకంలోని అక్షరాలు ఒలికిపోకుండా జాగ్రత్త పడలేని అమాయకత్వాన్ని

గానుగలో నలిగే విత్తనాన్ని చేస్తావు!
నీదారెప్పుడూ ఇంతే – ఇరుసు లేని బండి చక్రాల్లా…

ఖాళీ గిన్నెలోకి ఎన్ని దుఃఖాలను వొంపినా
కాళ్ళ కింద నలిగే చీకటిని కళ్లకింద కాటుకలా దిద్దుకుంటూ
నిద్రపోతున్న మనసును మేల్కోలుపుతావు,
చెట్టుకొమ్మకు లాంతరులా వేలాడ దీసి
భిన్న ధృవాల గాలులతో తడుపుతావు

ఐనా – ‘పర్యావరణ పుస్తకం ‘ మీద పేరుకున్న దుమ్ముపొరల్లో నిద్రించే సోమరితనాన్ని
కాడికింది ఎద్దును చేస్తావు !
నీ దారెప్పుడూ ఇంతే – ప్రవహించే ఏటిలో పలకరింపులేని రాయిలా…

సరే -
దారుల మీద వేయి చావులతో ఒక్క జీవితమని రాజీపడతాను
ఒక్క జీవితంలో అనేక ప్రపంచాలను ఆవిష్కరిస్తాను
ఐనా – మన ప్రపంచంలో గాయపడేది నీ జీవితమైనా నెత్తురోడేది నేనే

నెత్తుటి బీజమై మొలకెత్తేది నేనే

3 అభిప్రాయాలు »కవితలు

3 అభిప్రాయాలు

  1. satyadarshana Feb 7, 2010 1

    can you ever see seeds of tommato, bittergourd, red chillies, or watermelon. (etc.)- as a poet ? . take them into your hands observe them like a child.
    seeds ! they are looking at you as a poor farmer looking at them.

    with many hopes.

    spread them like a farmer, land never fails.

    be cause of life we were here. take it easy.

  2. janavaasi Feb 9, 2010 2

    మీ సత్తెకాలపు సత్య దర్షనాలతొ మా కెవరికీ అవసరము లెదు…….తమరిక….

  3. satyadarshana Feb 9, 2010 3

    రొంబ thanks!

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో