April 2010 సంచిక

వరవరరావు ‘సహచరులు’ ఆంగ్లం లో …..

వరవరరావు జైలు నుండి రాసిన ‘సహచరులు’ పెంగ్విన్ ఇండియా వారు ‘కాప్టివ్ ఇమాజినేషన్స్’ గా వెలువరించారు.

2 అభిప్రాయాలు »సాహిత్య ప్రకటనలు

పుణ్యం

రెండు వర్ష మేఘాలు
చినుకుల కత్తులు విసుర్తూ
ఒకదానికొకటి రాసుకున్నట్టై
పదం చటుక్కున మెరుస్తుంది మొత్తం చదవండి »

9 అభిప్రాయాలు »కవితలు

ప్రాణహిత ఫిబ్రవరి 2010 సంచికకు స్వాగతం

ఈ సంచికలో…

కవితలు

అభిప్రాయాలు లేవు »సూచిక

నేర పరిశోధన

ఆంగ్ల మూలం: సర్ ఆర్థర్ కోనన్ డాయిల్
తెలుగు: కొడవటిగంటి కుటుంబరావు

(గత సంచిక తరువాయి)

ఒక బంగారు గని కనిపెట్టినా అతను అంతకన్న ఆనందించి వుండడు.
“డాక్టర్ వాట్సన్- మిస్టర్ షెర్లాక్ హోమ్స్ , ” అని స్టామ్ ఫర్డ్ మమ్మల్ని పరిచయం చేశాడు.
“ఎట్లా వున్నారు?” అంటూ అతను నా చేతిని బలంగా పట్టుకున్నాడు. అతని వొంట్లో అంత సత్తువ వుంటుందని ఎవరూ వూహించలేదు. “ఆఫ్ఘనిస్తాన్ లో వుండి వచ్చారా ?”
“ఆ సంగతి మీకెలా తెలిసింది?” అన్నాను ఆశ్చర్యపోతూ. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »అనువాదాలు, ధారావాహికలు, నేర పరిశోధన

రోజ్ రోటీ

1

వొక ఆకలి మెతుకూ వొక అదనపు లాభం క్రాస్ రోడ్డు మీద నిలబడి పోట్లాడుకుంటున్నాయ్. ఆకలి మెతుకులు లక్షన్నర. అదనపు లాభాలు పది. అయినా సరే, పది గదమాయిస్తుంది, దబాయిస్తుంది, ఘరానా చేస్తుంది. చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది. మొత్తం చదవండి »

13 అభిప్రాయాలు »కవితలు

మంచు తాకని లేక్ టాహో

ఆకాశం వెన్నెల్ని  ముద్దలు ముద్దలుగా
నేలకి అతికించినట్లు- ఎటు చూసినా మంచు మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

గ్రీన్ హంట్ – ఆకుతేల్లదండయాత్ర

ఆకుతేల్ల దండయాత్రటో – రేలారే రేలా
గ్రీన్ హంట్ దాని పేరటో    – రేలారే..రేలా
చెట్టు మొదలుకె చేటటో  – అడవి బిడ్డలా వేటటో
పచ్చని అడివి ఖనిజ సంపదా…….
బహుళ జాతుల పాలటో                        IIఆకుII మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

మాయమ్మ

మునిమబ్బులలేసే
తొలి కోడి లెక్క,
అడివిల తిరుగాడే
మినుగురు లెక్క,
మసక చీకట్లనే ఆకిట్లమీ
అడుగుపెట్టిన మాయమ్మను
సలిసల్లటి దుప్పటిని కప్పి
అక్కున చేర్చుకున్న యాల; మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »కవితలు

రెండు కవితలు

దిరిసెన పువ్వు

కొన్ని రాత్రిళ్ళు చీకటిని
మీద బోర్లించుకున్నాను మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »కవితలు

పిట్టలేని ఆకాశం

సంకురాతిరికి ముందుగానే
చూరుకు వెలాడే వరికంకులపై వాలి
పలకరించిన పిచ్చిక గుంపులు
నేడు మచ్చుకైనా కానరాక
కోల్పోయిన దాని విలువ ఏమిటో
నేడు గుర్తుకొచ్చి ఒక దీర్ఘ నిట్టూర్పూతో
సరిపెట్టుకోవడమేనా ? మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు

నాకు చెప్పొద్దు

[‘ప్రజల కోసం అవసరమైతే కవిత్వాన్ని కూడా వదులుకుంటాను’ అన్నారొక సారి శ్రీ శ్రీ. ఇది ప్రతి కవి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సవాలు. ఎవరికి వారు ఈ ప్రశ్నకు ఏదో ఒక జవాబు చెప్పుకుని ఉంటారు. కొందరు ప్రజల్ని వదిలి ‘శుద్ధ’ కవిత్వాన్ని కావిలించుకుంటే, మరి కొందరు ప్రజలు ముఖ్యమని కవిత్వాన్ని వదిలేసి ఉంటారు. అలాగని ఎవరూ రాయడం మానరు. నీ కవిత్వంలో జీవితం ఎక్కడంటే సౌందర్యం గురించి ఊదరగొడతారు. అందులో కవిత్వం ఎక్కడంటే వర్గ దృక్పథం గురించి ఉపన్యసిస్తారు. రెండింటిలో దేన్నీ వదులుకునేది లేదన్నాడు చిలీ మహా కవి పాబ్లో నెరూడా. నిజానికి ఇదొక మిత్ర వైరుధ్యం. ప్రజలు, కవిత్వం... బాధ్యత, సౌంర్యం... రెండూ ముఖ్యమే. ఈ ‘లక్షణా’న్ని అద్భుతంగా ప్రతిపాదిస్తూ దానికి తానే ‘లక్ష్యం’గా నిలిచే కవిత ‘నాకు చెప్పొద్దు’ (‘ధిక్కార గీతం’- 1958-68). స్పానిష్ నుంచి మిగ్వెల్ అల్గారిన్ ఆంగ్లీకరించిన కవితకు తెలుగు: హెచ్చార్కె] మొత్తం చదవండి »

12 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు

నదికి ఆవలి వైపు

ఇంగ్లీషు మూలం: GLENN COLQUHOUN
తెలుగు సేత: నక్కా వెంకట్రావ్

మేము నదికి చెరో వైపు జీవిస్తాం
ఆమె పగటిపూట సూరీడు వెలుగులో కూర్చుంటుంది
అదంతా ఆమె చుట్టూ ఒక వలయంలా వుంటుంది
ఆమె పాదాలు గడ్డివలె మెత్తనివి
రాత్రిపూట నేను మైదానంలో ఒత్తిగిలుతాను
చుక్కలు నన్ను వణికిస్తాయి
నా కళ్ళు నిండు చందమామలవుతాయి మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »అనువాదాలు, కవితలు

కొడుకు

“స్వీటీ , ఎలాగున్నావు ? ఎంత ప్రయత్నించినా పెళ్ళికి రాలేకపోయాను. ఇదిగో అదిగో అంటూ తీరిక చేసుకునేసరికి ఇదిగో ఇన్నాళ్ళయింది ? సాయంత్రం మీ ఇంటికి రానా…. ఉహూ….. వస్తున్నాను”
తులసి మనసు  పొంగిపోయింది. రాకేష్ దూరపు బంధువే కాదు చిన్నప్పటి మిత్రుడు కూడా.
“సాయంత్రం ఎందుకు రాకేష్…. లీవ్ పెడతాను లంచ్  కి వచ్చేయ్యి.” మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కథలు

యమా ‘పండు’

ఒళ్ళంతా చలి చుట్టేసినట్లైంది పండూకి. అప్పటిదాకా మంచి నిద్రలో వున్నవాడికి వచ్చిరానట్టుగా  మెళకువ వచ్చింది. అమ్మ పొట్టమీద చెయ్యేసి పడుకుందామని పక్కకి ఒత్తిగిలాడు. చెయ్యి చాస్తే మంచం ఖాళీగా తగిలింది. అమ్మ అప్పటికే లేచేసి ఉంటుంది అనుకోగానే వాడికి ప్రాణం ఉసూరుమన్నది. కాళ్ళు కొద్దిగా దగ్గరికి లాక్కోని అమ్మ నడుంచుట్టూ చెయ్యేసి డొక్కలోకి దూరి పోయినట్టు పడుకుంటే వాడికి ఎంతహాయిగా వుంటుందో . అమ్మ తన చుట్టూ చేతులేసి దగ్గరగా పొదువుకుంటే చుట్టూ వెచ్చని కోట కట్టినట్లుగా ఉంటుంది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కథలు

రైతు రాజ్యంలో……

పొద్దంగి సీకటి ముసురుతుంది. గెట్టు మీద కూసున్న లచ్చన్నకు మనసు మనసుల లేదు. ఒక్క తీర్గ ఆలోచనల పడ్డడు. కండ్ల ముంగటి నారు ముదురుపోతానంది. ఏం చేసుడో ఏందో బొత్తిగా అర్థం అయితలేదు. నెత్తికి సుట్టుకున్న తువ్వాల తీసి మొకం తుడుసుకున్నడు. కంట్లే నుంచి కారిన నీళ్ళ చారికలు కూడా తుడుచుకున్నాడు. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కథలు

రైతు రాజయ్యే రోజొకటుందా?

వ్యవసాయం మానవ జీవిత చరిత్రలోనే సాటిలేని ఒక అద్భుతం.
చరిత్రలో మొట్టమెదటి సృజనాత్మక కళాకారుడు రైతే.
మట్టిని బంగారంగా మార్చే సువర్ణ విద్య తెలిసిన ఆల్ కెమిస్ట్ రైతు. దిగంతాల మధ్య ఆకాశమే కప్పుగా పచ్చదనాల మట్టితోటిదే రైతు జీవితం…. వ్యవసాయం చుట్టూ అల్లుకున్న మానవ జీవితమే ఒక గొప్ప సంస్కృతి అంటారు కుటుంబరావు గారో చోట…….. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

విశిష్ట సాంస్కృతిక రచయిత వి.ఆర్ రాసానితో ముఖాముఖి

సాహిత్యలోకానికిదివరకు పరిచయం లేని కొత్త కథా వస్తువుల్ని పరిచయం చేసినవాడు రాసాని. రాసాని విద్యావంతుడే గాక నవలాకారుడుగా, కథకుడిగా, కవిగా, సాహిత్య విమర్శకుడిగా అంతకుమించి నాటకకర్తగా, నటుడిగా బహుముఖమైన ప్రఙ్ఞని కనబరిచినవారు. కథా, నవలా సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలిగిన రాసానిని స్వామి, సింగమనేని వంటివారు సాంస్కృతిక రచయితగా మన్నన చేసి వున్నారు. అణగారిన కులాల వారి పట్ల , దారిద్ర్య రేఖకు దిగువనున్న తాడితుల పట్ల దీన స్త్రీ జనం పట్ల అపారమైన కరుణను రచనల్లో ప్రతిఫలింపచేసిన వాడు రాసాని. అంతే గాక రాయలసీమలోని చిత్తూరు జిల్లా యాసను, మాండలికాన్ని తన రచనల ద్వారా మధురంగా పలికించడం తెలిసిన రచయిత. అందుకే ఇతని రచనల్లో ఆయా సామాజిక వర్గ మాండలికాలు (sociolect), వ్యక్తి మాండలికాలు (ideolect) అతి సహజంగా ఒదిగి వుంటాయి. ఎక్కడ అభ్యుదయ అంశమున్నా, ప్రాచీన సాహిత్యంలోనైనా సరే వెదికి పట్టుకొని రచనలు సాగించినవాడు రాసాని.  రాసాని ఇదివరకు వందకు పైగా కథలు, 7 నవలలు , ఆరు నాటకాలు కొన్ని వందల వ్యాసాలు, కవితలు రాశాడు. రెండు కథల సంపుటాలు, రెండు పరిశోధనా గ్రంథాలు వెలువరించారు.  ప్రతి ఏడూ వచ్చే ‘కథా వార్షిక’ లకు సహ సంపాదకత్వం వహిస్తున్నారు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »ఇంటర్‌వ్యూలు

Next »