‘కాలస్పర్శ’ ను ముద్దాడిన కవిత్వం

వృత్తలేఖినితో చుట్టూ గుండ్రని గీత గీసుకొని జీవించే కవి అసలైన ప్రజాకవి కాలేడు. నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనల వెనుక ఉన్న కారణాల్ని శోధించి, కవిత్వీకరించినపుడే కవి తన సాహిత్య జీవిత సాఫల్యాన్ని పొందుతాడు.

బాల్యాన్ని కోల్పోయి ఙ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ,గతించిన కాలపు లోలోతుల్లోకి వెళ్ళి, అప్పుడు పొందిన ఆనందాన్ని గుర్తు చేసుకుంటున్న సంక్షుభిత వాతావరణంలో మనుషులు జీవిస్తున్న కాలమిది.

ఈ సందర్భంలోంచే తను జీవితంలో కోల్పోయిన సంతోషాలను కవిత్వీకరిస్తూ ‘కాలస్పర్శ’ అనే కవితా సంపుటిని వెలవరించారు కొత్త కవి కాసర్ల నరేష్ రావ్. భూమి లోపటి నుంచి ఉబికి వచ్చే స్వచ్ఛమైన ఊటనీళ్ళలాంటి కవిత్వాన్ని ప్రజల దోసిట్లో కుమ్మరించారు.

కవి ప్రాతదర్శి మాత్రమే కాదు. తన చుట్టూ ఉన్న దిశలలో జరిగిన సంఘటనలమీద కూడా కవితల ద్వారా స్పందించాడు. 2007 పాకిస్థాన్ లో సంభవించిన భూకంపం మీద మంచి కవితను రాసారు  భూకంపం అనే శీర్షికలో అక్కడెక్కడో భూకంపం సంభవించి చాలా ప్రాణ నష్టం జరిగితే, ఈ దేశంలో ఉన్న కవి పండుగకు కొత్త బట్టల్ని తొడుక్కో దల్చుకోలేదు.

” మా దసరాకని కొన్న కొత్త బట్టలు

సందూక్ ల నుంచి తీయబుద్ధి కాలేదు”

నువు నేలమీద మోకాల్లానించి

తలవంచి ఎన్నిసార్లు సలామ్ చేసినావ్ ? ఇలా సాగుతుంది .

దుర్భరమైన ముస్లిం సోదరుల జీవితాల్లోకి తొంగి చూసి, వాళ్ళ కష్టాల్ని తన కష్టాల్లాగా భావించి రాసిన కవిత ‘అల్లంమురబ్బా’. మనం ఎప్పుడైనా బస్సులో ప్రయాణం చేస్తుంటే వికారం చేయకుండా తినేది. వీటిని ఎక్కువగా  ముస్లిం పిల్లలే అమ్ముతారు.

అల్లం పొట్టు తీసి

ఆరోగ్య రహస్యం తెల్సిన

అపర ధన్వంతరిలా—–

రెప్పల్ని విప్పితే బోలెడన్ని వస్తువులు కండ్ల ముందు నుంచి కదిలిపోతై. అవి సాంప్రదాయిక జీవితంలో నివసించే ఇండ్లలోవి కావచ్చు, బయటి జీవితాల్లోనివి కావచ్చు. వర్తమానంలో కొన్ని వస్తువులు కనిపించకుండ పోతున్నవి. వాటి స్థానంలో ప్లాస్టిక్ వస్తువులు వచ్చి పడుతున్నాయి. కాని పాత ఙ్ఞాపకాలు కవి తలపుల్లో మిగిలే ఉన్నాయి. అలాంటి కవితే ‘పాన్ దాన్ ‘.

నేను పెరిగి పెద్దయ్యాక

పాన్ దాన్ ను ఒళ్ళో పెట్టుకొని

నోరార తాంబూలం వేసుకోవాలని

కలలు కనే వాణ్ణి——-  కాని కవి పెద్దగయ్యాక పరిస్థితులు తలకిందులయి పాన్ దాన్ మాయమైంది.

అందుకే ఈసారి

నా ఐదేళ్ళ కొడుకు పుట్టిన రోజుకు

పాన్ దాన్ ను బహుమతిగా ఇస్తాను ” అంటూ ముగించారు కాసర్ల.

ప్రపంచం కుగ్రామంలా మారిపోతున్నది. ప్రపంచీకరణ ప్రజల జీవితాల్లోకి జొరబడి చారాన సుఖాన్ని ఇస్తూ బారాన విధ్వంసాన్ని సృష్టిస్తున్న సందర్భం. గుండెకిచ్చినంత ప్రాధాన్యతను సెల్ ఫోన్ కి ఇస్తున్న సమయంలో

” నా గుండె పీఠం మీద గుదిబండలా కూర్చుండి

నా స్నేహితులకో , సన్నిహితులకో

ఆలోచనా పరిమళాలను , విస్తృత ఉత్తరంగా పంపించే

నా మనసు మీద మత్తు మందు జల్లి ” (సెల్ ఫోన్)

ఎండాకాలం సెలవుల్లో బాగా ఆటలాడుకొని మళ్ళీ బడికి  చేరుకుంటున్న పిల్లలమీద “గడిచిన స్వర్గం ” అనే కవిత ఉన్నది ఈ సంకలనం లో.

“వేసవి సెలవుల ఙ్ఞాపకాల చాపను ఇక చుట్టేయాలి ”

ప్రకృతి పలకరిస్తే వాన కురుస్తుంది, వాన కురిస్తే మట్టి మనసు తన్మయత్వంతోని బువ్వకుండను మనుషుల చేతుల్లో పెడుతుంది. ఇది ప్రకృతికి భూమికి ఉన్న సంబంధం , దీన్ని కవి చక్కగా పసిగట్టాడు.

విత్తనం గొంతులో ఊపిరి నింపి

మట్టి మల్లెదనం అద్దిన వాన అమృతం కాదా?

వానొస్తే , భూమి – బువ్వ కుండవుతుంది ( బువ్వ కుండ)

ఇదే ప్రకృతికి మనిషికి ఉండవలిసిన సందర్భం. కవికి ప్రకృతిని అర్థం చేసుకునే మంచి లక్షణం ఉన్నది.

వర్షంలో తొలిసారి తడిస్తే

ఎంత పెద్ద మనిషికైనా

అమ్మ స్పర్శ గుర్తుకురాదూ ?

మొత్తంగా ఈ “కాల స్పర్శ” సంకలనంలో విభిన్నమైన కవితలున్నాయి. బాల్యనది, కంకర సముద్రాలు, వానపందిరి లాంటి కొత్త పద ప్రయోగాలు బాగున్నాయి.

కొన్ని చోట్ల ప్రాస వస్తువును అధిగమించింది. ప్రాసల పట్ల కవి తనకున్న లౌల్యాన్ని వదిలిపెడితే మంచిది. వస్తువుతో బాటు శిల్పాన్ని కూడా మెరుగు పరుచుకుంటే కాసర్ల నరేష్ రావ్ మంచి కవిగా సాహిత్య లోకంలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడు.

15 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

15 Responses to “‘కాలస్పర్శ’ ను ముద్దాడిన కవిత్వం”

  1. 1
    C'nu Says:

    సమీక్ష్ బాగుంది.
    కవి గురించి గాని అతని చిరునామా గాని, పుస్తకం ముఖచిత్రం గాని ప్రదర్సిస్తె బాగుండు.

  2. 2
    M Sudhakar Says:

    సమీక్క్ష చాలా బాగుంది.
    కాసర్ల నరెష్ రావు గారు గురించి గాని , అతని చిరునామా గాని,
    పుస్తకం ముఖచిత్రం గాని ప్రదర్సిస్తె చాలా బాగుండు.

  3. 3
    Praveen Bala Says:

    Brother KASARLA looks like a cliff in natural poetry.
    “his poetry celebrated the slower pace of life in the country(village)”
    i proud to say that he is from my country(village).

    PRAVEEN BALA

  4. 4
    Sudharshan Rao Says:

    I Want to purchase the book, Kindly provide us the details of the author and address and price of the book to sudhhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=-B1lxEkMxeNVvzEah38r_QONAMprs-tDI2YUimj1pPc=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@gmail.com

    Regards,
    Sudharshan

  5. 5
    Ashok sharma Ganapathi Says:

    సమీక్ష చాలా బాగుంది. కవి హృదయాన్ని ఆవిష్కరించారు. ధన్యవాదానలు. కాసర్లకు అభివందనాలు.

  6. 6
    murali krishna vemuganti Says:

    కాసర్ల నరేష్ 10-14-1870/1, సీతారాం నగర్, నిజామాబాదు-503001.

  7. 7
    Sastri Vedula Says:

    ఆధునిక కవి కాసర్ల గారి ‘కాలస్పర్శ’ అనే కవితా సంపుటి గూర్చి సమీక్ష చాల బాగుంది. కవిత కవి హ్రుదయాన్ని ముద్దాడితే సమీక్షతో కవి మా హ్రుదయాలలో చెరగని ముద్ర వేసారు. తెలుగు కవిత్వాన్ని ఇంకా బతికిస్తున్న కవులందరికీ (కాసర్ల తో కలుపుకొని) జోహార్లు. కాసర్ల గారి ఇతర రచనలు గురించి కూద తెలియచేస్తే చాలా బాగుంటుంది.

    అభినందనలతో

    వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి

  8. 8
    srinivas pratapa Says:

    అమూల్యమైన పుస్తక0 విలువ రూ.50/- మాత్రమే. శ్రీ సుదర్శన్ గారు, పుస్తక0 కోస0
    శ్రీ కాసర్ల నరేశ్ రావు, 10-14-1870/1, సీతారాం నగర్, నిజామాబాదు-503001 అడ్రస్ కి మీ అడ్రస్ తెలియజేస్తూ డబ్బులు ప0ప0డి. నరేశ్ రావ్ గారి ఫొన్ న0.9441406252.
    కవి 20 సంవత్సరాలుగా ఇంటర్ చదువుతున్న నాటి ను0డి కవిగా మరియు వ్యక్తిగత0గా నాకు మంచి స్నేహితులు. ఆయనలో వున్న ప్రత్యేకతలు – తెలుగు వ్యాకరణ0 మీద మంచి పట్టు, సృజనాత్మకత మరియు ఆశు కవిత్వ0. సె0ట్రల్ యూనివర్సటీ, హైద్రాబాద్ నుండి పొ0ది్న య0.ఎ., తెలుగు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆయన కవితా జీవితానికి ఒక స్పూర్తి మరియు మలుపు.
    ప్రస్తుత0 ప్రభుత్వ ఊపాద్యాయునిగా పనిచేస్తూ, ప్రతి విద్యార్థికి కనీస0 100 తెలుగు పద్యాలు వచ్చేలా చేసిన/చేస్తున్న కృషి శ్లాఘనీయ0. ఇటీవల ఈటీవీ-2 లో ఈ ప్రాజెక్ట్ గురి0చి ప్రసార0 చేయబడి0ది. దీని నుండి స్పూర్తి పొంది, రాష్ట్ర వ్యాప్త0గా అన్ని పాఠశాలలో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తే, తెలుగు భాష అభివృద్ధి చెందడమే కాక విద్యార్థులకి తెలుగు భాష పట్ల గౌరవ0 చిన్ననాటి ను0డి అలవడి, రాబోయే తరతరాలకి పునదిగా నిలిచిపోతు0ది. దీని ఫలితాలు అనూహ్య0. ఇదే గనక అమలు ఐతే, మధుర గాయకులు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్య0 గారు చెప్పే మాట “తెలుగు పద్య0 నేర్చుకో0డి – తెలుగు భాషని కాపాడ0డి” తప్పకు0డా నిజమౌతు0ది. దీనికి నా0ది పలికిన శ్రీ కాసర్ల నరేశ్ రావు గారికి అభిన0దనలు. వారి పేరు తెలుగు భాషా చరిత్రలో అజరామర0గా నిలిచి పోతు0ది.
    తెలుగు భాషాభివృద్ధి కోరుకునే వార0దరూ దీని కోస0 తమవ0తు కృషి చేయవల్సి0దిగా మరియు శ్రీ కాసర్ల నరేశ్ రావు గారికి సహకరించాల్సి0దిగా ప్రార్థన.
    ఇట్లు
    ప్రతాప శ్రీ నివాస్
    ము0బాయి
    9820423224

  9. 9
    rajesh Says:

    ప్రపంచం కుగ్రామంలా మారిపోతోంది అనడం చాలా తప్పు డు మాటండి.

  10. 10
    sudhakar Says:

    రాజెష్ గారు,

    ప్రపంచం కుగ్రామంలా మారిపోతోంది అనడం తప్పు డు మాట అని మీరు ఏ విథముగా అంన్నరు అర్థము కావటము లెదు. కారణము ఈ Internet యుగము లొ ప్రపంచం కుగ్రామంలా మార లెదు అని అనగలరా, Now a days you can communicate, share ur views and make debate or business, cultural exchage with any person any where in the world at any time as u like,
    That it self indicates that Now Entire world is a small villege.
    I strongly belive your comment is wrong not only me the people who belive in techonology condems your view.

    Regards,
    Sudhakar

  11. 11
    nagaraju Says:

    మి సమీక్ష చాలా బాగుంది.

  12. 12
    ramnarsimha Says:

    మీ సమీక్ష చాలా బాగుంది.

    ధన్యవాదాలు.

  13. 13
    Prasada Varma Kamarushi Says:

    సమీక్ష బాగుంది. ప్రాత దర్శి, చుట్టూ ఉన్నదిశలలో లాంటి పద విన్యాసం్ మార్చుకుంటే బాగుంటుంది. పుస్తకం ముఖ చిత్రం వెయ్యటం తప్పని సరిగా చెయ్యవలసిన పని.

  14. 14
    Prasada Varma Kamarushi Says:

    కాల స్పర్శ మీద సమీక్ష బాగుంది. ప్రాత దర్శి , చుట్టూ ఉన్న దిశలలో లాంటి పద విన్యాసం మార్చుకుంటే బాగుంటుంది. పుస్తకం తాలూకు చిత్రం వెయ్యటం తప్పనిసరి. ఈ రోజుల్లో అది కష్టమయిన పని కాదు కదా.

  15. 15
    Prasada Varma Kamarushi Says:

    పత్రిక మొదటి పేజీలో సంపుటి సంచిక సంఖ్యలు వెయ్యటం మరచిపోకండి.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో