పిట్టలేని ఆకాశం

సంకురాతిరికి ముందుగానే
చూరుకు వెలాడే వరికంకులపై వాలి
పలకరించిన పిచ్చిక గుంపులు
నేడు మచ్చుకైనా కానరాక
కోల్పోయిన దాని విలువ ఏమిటో
నేడు గుర్తుకొచ్చి ఒక దీర్ఘ నిట్టూర్పూతో
సరిపెట్టుకోవడమేనా ?

గుండెలో దిగులు గొంతులు పెగలక
కీచుమని అరుపు బయటికి రాలేకపోతుంది…..
హరించుకుపోయిన పత్ర హరితంలో
ఆకులు ఎండిన ముసలిదాని చర్మంలా
ముడతలుపడి వంకరలు పోయినాయి

ఏరుకునేందుకు గింజలు జల్లిన పొలాలు కరువై
అసహజంగా పొడుచుకు వచ్చిన కాంక్రీటు దిమ్మెలలో
నగరం రోడ్లపై వుమ్మివేయబడ్డ పాన్ మరకలా మారిన
నాగరికత అపహాస్యతతో కుళ్ళిన పేగు వాసనల బారిన పడి
మాయమైన పిచ్చుకల గుంపులోని
చివరిపిట్ట చేసిన ఆర్తనాదం
నీ చెవిన పడకుండా అడ్డుకున్న సెల్ మోత!
ఇది నీకు చివరి వోడ్కోలు కాకూడదు మిత్రమా!!

4 అభిప్రాయాలు »కవితలు

4 Responses to “పిట్టలేని ఆకాశం”

  1. 1
    తవ్వా ఓబుల్ రెడ్డి Says:

    కవిత లో గుండెలు పిండే ఆర్ద్రత ఉంది. మంచి కవిత రాశారు వర్మ గారూ!
    .

  2. 2
    సాయిరాం Says:

    పిట్ట లేని ఆకాశం

    నేటి నాగరిక సమాజంలో అంతరించిపోతున్న ప్రకృతి సౌందర్యం గూర్చి
    మీ కవితలో బాగా వ్రాసారు..

    పల్లెకు, పట్టణ జీవనానికి గల వైరుధ్యం చక్కగా చూపారు

    పాన్ మసాలా, సెల్ వాడకంలో నేటి తరం ఏం కోల్పోతుందో వివరించారు

    చాలా చక్కని కవిత చదిఇన అనుభూతి మిగిలింది..

  3. 3
    rajesh Says:

    పిట్ట లేని ఆకాశం ఎక్క డా వుండదండీ . ఒక్క తెలుగు ఆకాశంలో తప్ప .

  4. 4
    ramnarsimha Says:

    మీ కవిత చాలా బాగుంది.
    అభినందనలు.

    ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో