పుణ్యం

రెండు వర్ష మేఘాలు
చినుకుల కత్తులు విసుర్తూ
ఒకదానికొకటి రాసుకున్నట్టై
పదం చటుక్కున మెరుస్తుంది
బుద్ధి విద్యుదావేశితమవుతుంది
ఏ పని చేయనీకుండా వెంట పడ్తుంది
అటక మీద అట్టపెట్టెల మధ్య
గుడ్లు పొదిగే పావురాయి మాదిరి
ఏదో ఒక మూలన ముడుక్కుంటావు

ఒక పదం రెండుగా రెండు నాలుగుగా
నాలుగు పదారుగా… విడిపోతుంది
అండం చిన్ని బ్రహ్మాండమవుతుంది
నువ్వు దేన్నీ నిర్ణయించలేవు
మస్తిష్కం కేవలం ఉమ్మ నీరు

ఉత్తినే అనుకోడమే గాని నువ్వు ఎవరూ కాదు
దిగులు పడకు, నువ్వు… నువ్వు కూడా కాదు
ఎవరికి ఏ మేలు తలచిన పుణ్య ఫలమో
నువ్వొక ఉమ్మ నీరున్న గర్భ కోశానివి
బాహిర జగత్తు నుంచి లోపలి కాంతిని
కాపాడుకునే పావురాయివి కూడా

9 అభిప్రాయాలు »కవితలు

9 Responses to “పుణ్యం”

  1. 1
    కెక్యూబ్ వర్మ Says:

    కవిలోంచి వాక్యం జనించే క్రమాన్ని అద్భుతంగా చెప్పారు సార్. .

  2. 2
    Tirunagari Satyanarayana Says:

    హెచ్హార్కె గారి కవిత బాగుంది. వైరుధ్య అంశాలని చెబుతూ వాటి మధ్య ఐక్యత ను ఎత్తిచూపిన పద్దతి బాగుంది. రెండు విరుద్ధ అంశాలు సంఘర్షిస్తున్నప్పుడు ఒక నూతన అంశం జనిస్తుందనీ, అది పదార్థాన్నయినా, భావాన్నయినా ముందుకు తీసుకుపోగలిగే శక్తి గల ప్రగతిశీల అంశంగా చోదకశక్తిగా మారేందుకు పురుటినొప్పులు పడుతుందనీ కవిత బలంగా చెప్పింది. బాహిర జగత్తు నుంచి లోపలి కాంతిని కాపాడుకునే పావురాయివి కూడా అని అనడం లో ఆ లోపలి కాంతి బాహిర జగత్తుకి అందజేయాలనే పోరాటం ఇమిడి ఉందనే సూచన ఇస్తోంది కవిత.

  3. 3
    bollojubaba Says:

    హెచ్చార్కె గారికి,

    మస్తిష్కం కేవలం ఉమ్మ నీరు

    అక్కడితో కవిత ముగిసిపోయినట్లు నేను ఊహించుకొంటున్నాను.

    మీరు వివరిస్తే కానీ తదుపరి చరణాల అన్వయం నాకు అందదనిపిస్తోంది. :-(

  4. 4
    హెచ్చార్కె Says:

    వర్మ గారు, తిరునగరి గారు, బాబా గారు కృతజ్ఙతలు.
    ఈ పద్యం ప్రధానంగా కవినే ఉద్దేశించినా, కవిని మాత్రమే ఉద్దేశించలేదు. ఆలోచించే వాళ్లందరిని ఉద్దేశించింది. ఒక సైంటిఫిక్ ఆలోచన కూడా (ఆవిష్కరణ స్థాయిది) ఇలాగే పుడుతుంది.
    బాబా గారన్నట్లు ఉమ్మ నీరు (మస్తిష్కం) వద్ద ఆగితే, కవిత ఒక యాంత్రిక స్థితి వద్దనే ఆగిపోయేది. ‘ఆలోచన’తో కవి/బుద్ధిజీవికి ఉన్న సజీవ సంబంధాన్ని (రిలేషన్ ని) సూచించలేక పోయేది. అందుకే, కొంత బాహిర స్వభావం కలిగిన పక్షి-గుడ్డు సంబంధం కవితకు అవసరమయ్యింది.
    బై ది బై, ఒక కవితాభిమానిగా నేను కవిత్వంలో ‘మెరుపు’ తప్ప మరేమీ ఉండకూడదనే వాదాన్ని ఇష్టపడను. అలాంటి ‘బ్రివిటీ’… ఏదో డిటర్జెంటు ప్రకటనలో చెప్పినట్లు ‘తళత్తళ తప్ప ఏమీ (గిన్నె కూడా) మిగలక’పోవడం వంటిదని భావిస్తాను.

  5. 5
    dr pulipati guruwamy Says:

    నమస్తె హెచ్చార్కె గారు
    చాలా రొజుల తర్వాత మీ పొయెమ్ చదివాను….(నేను ఫాలో కాలేక పోయా)
    నిన్నటి నుండి లోలోపల “రొద”
    కత్తులు విసురుతుంది .

  6. 6
    padmaja Says:

    హెచార్కె గారు,

    కవిత బావుంది..
    నేను పద్మజను.. న్యూస్ టైం లొ పని చేసెదాన్ని.. గుర్తున్నానా.. మీరు ఎక్కడున్నారిప్పుడు.. మీకు వీలుంటె ఒక మెయిల్ వ్రాయండి..

  7. 7
    డా.పులిపాటి గురుస్వామి Says:

    బాహిర జగత్తు నుండి
    లొపలి కాంతి ని కాపాడుకునే…..అవసరాన్ని ఎంత బాగా చెప్పారు సార్.

  8. 8
    హెచ్చార్కె Says:

    గురుస్వామి గారు, థాంక్యూ. లోపలి కాంతిని కాపాడుకోడం నిజంగా ఎంత కష్టం? ఆ పని కోసం మరింత మరింత ముడుచుకు పోవాల్సి వస్తోంది. ఎంత కష్టం లోపలి ‘చెమ్మ’ ను కాపాడుకోడం?
    పద్మజ గారూ, బాగున్నారా?! ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి. నా మెయిల్ ఐడీ ఇక్కడ ఇవ్వడం కుదరదనుకుంటాను. పద్మజ గారికి నా మెయిల్ ఐడీ పంపాల్సిందిగా ప్రాణహిత మితృలను కోరుతున్నాను.

  9. 9
    ప్రాణహిత » ప్రాణహిత ఏప్రిల్ 2010 సంచికకు స్వాగతం Says:

    [...] పుణ్యం – హెచ్చార్కె [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో