రోజ్ రోటీ

1

వొక ఆకలి మెతుకూ వొక అదనపు లాభం క్రాస్ రోడ్డు మీద నిలబడి పోట్లాడుకుంటున్నాయ్. ఆకలి మెతుకులు లక్షన్నర. అదనపు లాభాలు పది. అయినా సరే, పది గదమాయిస్తుంది, దబాయిస్తుంది, ఘరానా చేస్తుంది. చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది.

ఆకలి మెతుకు
వొక తల్వార్ లాగా మెరిసి వొక నెత్తుటి చార కసిగా ఆక్రోశిస్తుంది.
నీకు అసందర్భంగా కనిపిస్తుందా, కవీ?!

2

నాలుగు సగం చిక్కిపోయిన వూళ్ళు ఆరిపోతున్న చలి నెగడు ముందు కూర్చొని, కట్టెపుల్లల చేతుల్ని నిప్పుల మీదికి తోస్తున్నాయి, చెయ్యి కాల్తుందన్న భయం లేకుండా.

“ఎక్కడున్నాయి ఈ కాసిని కట్టెలయినా? పోనీ, ఈ నాలుగు చేతులయినా?” వొక ముసలి చెయ్యి నిట్టూరుస్తోంది, సగం ఖాళీ అయిన వూరు వైపు బలహీనంగా చూపు చాపి.

“వూరు సగం ఇళ్ళు, సగం వల్లకాడు. బతికి వున్న వాళ్ళు సగం శవాలు” ఇంకో గొంతు పిడచకట్టిన స్వరంతో మూల్గింది.

ఆ మూలుగు వినపడ్డదా, నగర కథకుడా! అద్భుత మాంత్రికుడా!

3

నా అక్షరాలు ఇసుకలో దూదుం పుల్లలు. చొక్కాలు రాల్చుకున్న పిల్లలు. నిద్రలో ఆకలి కేకలు. వొక వూరి నించి ఇంకో వూరికి పారుతున్న ఎండు కడుపులు. వొట్టిపోయిన నదులు. పక్క నించే బల్లెంలా దూసుకుపోయే పరాయి నీటి ధారలు. ఇంకేం లెక్కలు తీస్తావ్, నా ఎండు డొక్కల స్కేళ్ళ మీద.

చడ్డీ నించీ చుక్కల లెక్క నాది. ఇంకేం చెప్పమంటావ్, అధునాతన లెక్కల బుర్ర కథకుడా?!

4

నువ్వు చెప్పు, నేను వింటా, నీ బాంచ!  వినీ వినీ నా చెవుల్లో పుట్టలు మొలిచినయిలే! నువ్వు గొంతు సవరించుకునే లోగా నా వొళ్ళు వొంగి దండమయిపోయిందిలే!  ఇన్నాళ్ళూ. నిన్ను పీరీలాగా మోశానా, ఇప్పుడు నా కడుపు కర్బలా అయిపోయిందిలే!

చరిత్ర చొక్కాని  తిరగేసి తొడుక్కుంటున్నా, నన్ను దాచేసిన చిరుగు కంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా.

కలల కళల మాయా దర్పణమా, కాసేపు పగిలిపో!

5

రోజ్ రోటీ నా అద్దం. దాంట్లోంచి రాస్తున్నా కొత్త చరిత్ర.

*
(డల్లస్-టెక్సస్ తెలంగాణా సదస్సులో కొన్ని పల్లె బతుకు కథనాలు విన్నాక)

13 అభిప్రాయాలు »కవితలు

13 Responses to “రోజ్ రోటీ”

  1. 1
    buchi reddy Says:

    నిజాన్ని కెలికారు- బాగుంధి

  2. 2
    కొత్తపాళీ Says:

    అద్భుతమైన అభివ్యక్తి.

  3. 3
    Chitten Raju Vanguri Says:

    భావాలు మరీ కొత్తవి కాకపోయినా, పదప్రయోగం, భావప్రకటన నిర్మొహటంగానూ, కొంచెం కర్కశంగానూ ఉన్నాయి. “కసిగా వినిపింఛే ఈ ఆక్రోదన” ఎవరి మీద, ఎందరి మీద కవీ?

    _____వంగూరి చిట్టెన్ రాజు

  4. 4
    tirumalesa Says:

    ఇది కవిత్వమా..ఆవేదనా… లేక ఇంకేదన్నానా.. అప్పుడు నాకేదో అనిపించింది. కదిలించింది.. ఇట్లాంటి చవకబారు స్పందనలు తెలుగు సాహిత్యాన్ని ఇంకెంతకాలం పట్టిపీడిస్తాయో…

  5. 5
    కెక్యూబ్ వర్మ Says:

    తిరుమలేసా మీ అక్కసు ఎవరిమీద? కవిమీదా? కవిత మీదా? ఆకలి ప్రకటన మీకు మరి చవకబారు స్పందన కావడంలో తప్పులేదు. కడుపునిండిన వాడికి ఉప్పు రుచి తెలుస్తుందా?

  6. 6
    rajesh Says:

    hey,
    టిరుమలెష్ ,

    పట్టీ పీడీంచె సంగతుల గురించి నీకు బాగా తెలిసి నట్టూంది. ఆ పీడ గురించి విపులంగా చెప్పి పోరాదూ. తెలుగు సాహిత్యం నీకు రుణ పడ వుంతుంది.

  7. 7
    ravikiran timmireddy Says:

    కవిత బాగుంది. ఊర్కే బాగుండటం కాదు చాలా బాగుంది అప్సర్ గారు.

    చిట్టెన్ రాజు గారు, ప్రతి కవితా ఒక క్రొత్త భావాన్ని పలికించాలా? భావాలకి లిమిట్ ఉంటుంది గాని, వ్యక్తీకరణలే కదా అనంతం. ఆ దిశలో ఈ కవిత చాలా బాగుంది కదా. కవిత్వంలో మొహవాటానికి తావెక్కడ, ఇక కర్కశత్వం ఏవిటో నాకు బోధపడలేదు. ఒక నిజవైతే కవిత నిండా పరుచుకునుంది.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  8. 8
    bollojubaba Says:

    కవిత్వమూ బాగుంది, కవిత్వ ఫార్మెట్ (పారాగ్రాఫులో) కూడా బాగుంది.

  9. 9
    dasaraju ramarao Says:

    ఆకలి,దుఖం,అలజడి సాహిత్యంలో కనపడితె విచిత్రంగా చూడటం ఎ రకమైన గుడ్డి మాంద్యమో.ఇలా ఎందుకు రాయవలసి వస్తున్నదో సమాజ చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించితె అర్తమవ్వదా, ఆకలిమెతుకులు లక్షన్నర, అదనపు లాభాలు పది, నాఅక్షరాలు ఇసుకలో దూదుంపుల్లలు, దాచేసిన చిరుగు కంతలోంచి సూర్యుణ్ణి కంటున్నా….ఇవేవి కొత్తఅభివ్యక్తి కాకపోతే, సొదరా…నా అక్షరాలు వెన్నెల్లో ఆడపిల్లలు, తొడలో దిగిన పదునైన కెంపుల పిడిబాకుని, సబ్బురాసి బయటకు లాగుతోన్న ముగ్ధ మనోహర రహస్య ద్రుశ్యాల్ని మీటుతూ హాయిగా తేలిపో.

  10. 10
    dasaraju ramarao Says:

    ఆకలి,దుఖ్ఖం,అలజడి సాహిత్యంలో కనపడితె విచిత్రంగా చూడటం ఎ రకమైన గుడ్డి మాంద్యమో,కోటిమంది శ్రమను, సంపదను పదిమంది దోచుకునే నగ్నసత్యాలు కనబడక పోవడంఆశ్చర్యమే, నగరం లో అడుక్కుంటున్నవారి సంఖ్య జనాభా లా పెరుగుతున్న వైనాల వెనుక నిజాల్ని గ్రహించనక్కర లేదా, “నా అక్షరాలు ఇసుకలో దూదుంపుల్లలు, ఆకలిమెతుకులు లక్షన్నర, అదనపు లాభాలు పది, నన్ను (నిజాన్ని) దాచేసిన చిరుగు కంత లోంచి సూర్యున్ని కంటున్నా” అని అంటున్నా కొత్త అభివ్యక్తి కాకపోతే ……నా అక్షరాలు వెన్నెల్లో ఆడపిల్లలు,,,తొడలో దిగినపదునైన కెంపుల పిడిబాకుని , సబ్బురాసి బయటకు లాగుతోన్న ముగ్ధ మనోహర ద్రుశ్యాలలో తేలిపోగలరు గాక……………అఫ్సర్ గారూ కలల కళల మాయా దర్పణం కాసేపు కాదు ఎప్పటికి పగిలిపోనీ……..నిఝ్ఝంగా…..

  11. 11
    ethakota subbarao Says:

    బాగు0ది సార్.

  12. 12
    నచకి Says:

    <>

    <>

    <>

    <>

    ఇవి చాలా నవీనమైన అభివ్యక్తులుగా కనిపించాయి. ఇక పాదాల విఱుపుల గుఱించి… ఏమో, నా మటుకు నాకైతే విఱుపుతో చదవటం అలవాటేననవచ్చు… కవిత్వం కొత్తగా అలవడుతున్న వాళ్ళకెలా ఉంటుందో మఱి? (సంభాషణయినా పదునుగా ఉన్నా లేకున్నా పలకడానికి ఒక ఎస్వీరంగారావుంటే పట్టు అదే వస్తుంది. పలుకుతున్నవాడు కొత్తగా మొలిచిన పిల్లనటుడైతే?) …పదనాద సమబంధం గుఱించి నాకు అంతటి అవగాహన లేకున్నా నాకెందుకో పాదాలుగా విడదీస్తేనే బాగుంటుందన్న భావన. ఈ భావన యండమూరి నవలల్లో అక్కడక్కడా కవితాత్మకంగా సాగే వాక్యాలు చదివిన నాటి నుంచి మాఱలేదన్న ప్రస్తావన సముచితమేమో. కానీ కవిత్వాన్ని మాత్రమే గమనిస్తే బోలెడంత కనిపిస్తోంది!

  13. 13
    నచకి Says:

    పైన నేను ఉటంకించిన అభివ్యక్తులు యివీ:

    “చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది.”

    “నాలుగు సగం చిక్కిపోయిన వూళ్ళు ఆరిపోతున్న చలి నెగడు ముందు కూర్చొని, కట్టెపుల్లల చేతుల్ని నిప్పుల మీదికి తోస్తున్నాయి”

    “చరిత్ర చొక్కాని తిరగేసి తొడుక్కుంటున్నా, నన్ను దాచేసిన చిరుగు కంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా.”

    “కలల కళల మాయా దర్పణమా, కాసేపు పగిలిపో!”

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో