Jun2010
అంజలి
1
ఎపుడు తెగుతుందో తెలియని తొడిమ మీద పువ్వు
పని లేని గాలి, ప్రతి కదలికా ఒక పండిన పుండు
క్రీస్తు కాలపు పాతర, తవ్వితే నాలు గ్గింజ లుండక పోవు
పెత్తర్లమాస ఒక్కటే మనసు గురి కుదిరి ప్రార్థించే పండుగ
అదేంటో, మా తాతయ్యకు అన్నీ నా పోలికలే
2
ఇక్కడ అక్కడ అని కాదు ఎక్కడైనా సరే
చక్కగా కళ్లు మూసుకోడంలోనే ఉంది జీవన కళ
రెప్పల వెంట్రుకలతో తాళ్లు పేని, కట్టెయ్యాలి చూపుని
లోలోపల భయం భయంగా కదుల్తుంది పువ్వు
గాలికి పని లేదనడం తప్పకుండా తప్పే
భయమొక్కటే బతుకు బండి చక్రాలకు కందెన
3
ప్రతి స్టాంజాకు ఒక అంకె ఉంటుంది.
ఎప్పటికపుడు లెక్కలు మారిపోతాయి
మనుషులు బీజగణితంలోని సంకేతాక్షరాలు
చకచకా మారిపోతుంటాయి సమీకరణాలు
కుండలీకరణాలకు చిల్లులు పడి సంకేతితాలు కారిపోతాయి
పోనిద్దూ, నెత్తుటి సంతకాలకే దిక్కు లేదూ
4
పాచికలు తెల్లమొగాలేసుకుని ఎగిరి ఎగిరి పడతాయి
భగవంతుడు మురళి మ్రోయిస్తాడు, పాచికలాడడు, ఆడిస్తాడు
ఉఛ్వాస నిశ్వాసాల్ని పందెంగా ఒడ్డిస్తాడు
బతుకు ఒక ఏక వస్త్ర, చాల పల్చని వస్త్రం
ప్రేమ కూడా ఒక పాచికేనని చివరి ప్రస్థానంలో గుర్తించాక
కప్పుకోడానికి ఇంకేమీ ఉండదు, కసిగా మొలకెత్తే ప్రశ్న తప్ప
5
ఇది పద్యమా, చేతులు బార్లా చాచిన ‘వ్యాస’మా
గుండెను వదలక ఒడిసి పట్టిన వ్యాసార్థమా?
గిరి గిర గోల్, గింగిర గోల్ తిరుగు తిరుగూ తిమ్మప్పా
గిర గిర గిర గిర తిరగక తప్పదు తిమ్మప్పా
6.
ఇంకా తెగని తొడిమకు సుమాంజలి
21-5-2010
June 8th, 2010 at 11:20 am
ఒ.కె.
June 12th, 2010 at 9:50 am
ఎంత బాగా రాసారు. ఈ కవిత చదివిన తర్వాత నా కళ్లు పేలిపొయాయి
June 12th, 2010 at 10:36 am
ఎందుకంటే నేను ఆ మద్యన ఒ కధ చదివాను. అందులొ తిమ్మప్ప అనే ఒక పాత్ర వుంటుంది. అదొక వెర్రిబాగులవాడి పాత్ర.. కధ చివర లొ ఆ పాత్ర లొ నాలుగు గింజలు కూడా వుండవు. ఆ పాత్ర ని రోడ్డు మీద పడేస్తె చెల్లని నాణెము వలే చప్పుడు చేస్తావుంటుంది. భలే బాగుంటుందా కధ. అందుకే కవిత బాగుంది. కానీ కవిత సాంతం నాకు అర్థము కాలేదనుకొండి
June 16th, 2010 at 9:16 am
పీల్చిన పద్యం
పేర్చిన గుండెపోటు
ఎందులో దాచలేని
గుండ్రని కత్తి
June 16th, 2010 at 10:15 pm
ఒక్కసారిగా బలమైన హస్తమేదో రెక్కపట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి బాదితే దిమ్మతిరిగి పడినట్లుగా వుంది పధ్యం చదివాక…
June 17th, 2010 at 9:50 am
అయితే ఆ కథలో……
భయపడకండి అదేమీ ghost story కాదు.
June 18th, 2010 at 9:38 am
గురుస్వామి గారు,
నాకు తెలిసీ పద్యాల్ని ఎవరూ పీల్చరండి. ఒకవేళ ఎవరైనా అటువంటి మనుసులు అగుపడితే వాళ్ళ ని
రోగులు కింద జమ కట్టవ చ్చు. ఇకపోతే గుండెపోటు తెప్పించే కవితలు కవిత్వం కేట గరీ లోకి రావు. మరో సంగతి కత్తులు ఏ కాలం లో నైనా కొనదేలి వుంటాయి. గుండ్రంగా వుండవు.
June 22nd, 2010 at 12:38 pm
హెచ్చార్కే గారూ….
ధ్వనించే “హెచ్చరిక”నూ కాదని, మీ కవిత్వం తోటలో ఎన్నిసార్లు చొరబడ్డా ఏదో అనుభూతి…
ఇవాళ మాత్రం నిజంగానే…..ఇదేమిటో…..
ఎక్కడా పక్కా పట్టుచిక్కని ఈ ఆరు రిక్కల తెగని పువ్వు కేసర”దండం” మృదుత్వం లో నేను మాత్రం నా నుంచి తెగి, చేతికి చిక్కిన పరాగ పరిమళాల పసిడి కాంతికే మురిసి పోతూ….
ఈ మత్తైన, గమ్మత్తైన హాయి లోయల్లో ఎందాక జారిపోనూ…….
చేయందించరూ…..
June 24th, 2010 at 12:58 am
మరి ఆ కధ లో వెర్రిబాగులవాడు బతుకు మీద ఆశ చావక ఎక్కడికో ఎలబారిపోయిన త ర్వాత, కధకుడు జోక్యము చేసుకుని — ఆ వెర్రిబాగులవాడి జీవితాన్ని వేలెత్తి చూపించి చాలా మంది లోకం ద్రుస్టి నుంచి త ప్పించికుంటారు—అనిఅంటాడు.
లోక వాస్తవమే కదండి.
ఆ కధ మీకెక్కడయినా దొరికితే చదవండి. అందులో fools కి వుండే ఫనికిమాలిన లక్ష ణాలు ఒ వంద వరకయినా కనిపిస్తాయి.
thanks
ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు.
June 24th, 2010 at 4:01 am
మరి ఆ కధ లో
వెర్రివాగుల వాడు బతుకు మీద ఆశ తో ఎలబారిపోయిన తర్వాత కధకుడు జోక్యం చేసుకుని
ఇలా అంటాడు…..వెర్రిబాగులవాడి జీవితాన్ని వేలెత్తి చూపించి చాలా మంది లోకం ద్రుస్టీ లోంచి
తప్పించికుని విజయం సాధించుకుంటారని…
లోక వాస్తవమే కదండే.
వెర్రివాగులవాడీ ఖధ మీకెక్క డయినా దొరికితే వదలకండి
June 26th, 2010 at 10:51 am
మరి ఆ ఖధ లో
వెర్రి బాగుల వాడు బతుకు మీద ఆస వదులుకోలేక ఎటో పోయినాక
కధకుడు కలగజేసుకుని ఇలా అంటాడు;
–ఆ వెర్రిబాగులవాడి బతుకుని నలుగురికీ చూపించి the devil in the eden లో లాగా
ఎవరో ఒకరు లోకం కన్నుల ముందు మంచివాళ్ళుగా ………..ని. — అంటే ఫోజిస్తారని.
ఇంతకీ ఫోజు అంటే….