Jun2010
ఎదలో యాదన్నలు..
తెలంగాణా తెలంగాణా తెలంగాణా
కోటి గాయాల వీణ
నేడు నీ రొమ్ము పాలు తాగిన వారే
నీ కడుపులో చేయిపెట్ట చూస్తున్నారు
వీరి మోసకారి మాటలకు యింకెంతకాలం
దగా పడతావు తల్లీ….
చూడు చూడు నీ గాయాలు మాన్ప
నెత్తురోడుతున్న నీ శిశువులను
ముళ్ళ కంచెలకావలకు నెట్టాలని చూస్తున్నాడు
ఈ కొత్త నరసింహావతారుడు..
రక్తం రుచిమరిగిన తోడేళ్ళ గుంపు మధ్య
రణన్నినాదమై వేలగొంతులు నినదిస్తున్నాయి…
యిది పోరాట రూపం కాదనుకున్నా
కపట నాటకాల క్రిష్ణునికి ఈ కమురు వాసన
ముక్కు పుటాలకు తగులుతుందా?
అంతా దేవుళ్ళే,
కానీ ఇక్కడ ద్రౌపది మానభంగం తప్పలే!
గుండెల్లో రోజుకో మాటల మంట రగిలిస్తుంటే
తమదైన ఏకాభిప్రాయాన్ని ఇలా అగ్నిప్రవేశంతో
ప్రకటిస్తున్న యాదన్నలను మా ఎదకు
హత్తుకుంటున్నాం…
June 12th, 2010 at 2:46 am
మీ కవిత చాలా బాగుంది..
తెలంగాణ అమరవీరులకు….
ఈ కవితను అంకితమివ్వండి…
rputhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=HKxsJQVpM2Cqpq8x5AKrByhaAZSFxc9U-Kjq_Ae0iBA=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.com
June 15th, 2010 at 10:41 pm
వర్మగారు,
తెలంగాణా పై మీ సహానుభూతిని ఈ కవిత ద్వారా మరోసారి నిరూపించారు అభినందనలు
August 8th, 2010 at 10:54 am
అద్బుతం మీ కవితా. మనసుకు హత్తుకుంది. తెలంగాణ అమరవీరులకు జొహార్లు. మీకు అభినందనలు…