Jun2010
కాలం నిలిచిపోతే…….
ఆశల కళ్ళు ఆల్చిప్పలై చూపుల సందేశాలను
రేపటి ఆకాశం వంక
కాగితం విమానాలుగా విసురుతూనే వున్నా
ఎక్కడో నిత్య యౌవన నైరాశ్యం చీకటీ పొగమంచై
అస్తిత్వాన్ని అలుముతూనే వుంటుంది
అక్షరాల సవరింపుల్లోనే ఒదిగిన అభ్యుదయం
కత్తుల తోళ్ళు కప్పుకున్న అసహాయత
ఆర్తనాదాలను
గొంతుపెగలని కీచురాయిలా చెవుల్లో పూలు మొలిపించుకున్న
ఆధునికత గుండెల్లో రొదపెడుతూనేవుంది.
కనిపించని ఉచ్చులో చిక్కుకుపోయి
రెక్కలు తెగిన దౌర్భాగ్యం
నాచుట్టూ ఉన్నదే గగనపు హద్దంటూ
వాదాల వేదాలు వల్లెవేస్తోంది
మెళకువలో నిర్నిద్రలో మనసును బులిపిస్తున్న
దావానలం భావ జాలం పాకి పాకి
అణువణువూ నరనరానా
చితిపేరుస్తూ చిరుజల్లుగా విషాదం కురిపిస్తూ
పెదవులపై పరిహాసపు
వసంతాలు పూయిస్తోంది
కట్టెదుట శిలగా మారిన కాలం
రెప్పవాల్చని కంటి కొసల్లో కాటుకై
కలల చెక్కిలిపై దిష్టి చుక్కై
నిలిచిపోతే…..
June 7th, 2010 at 4:38 am
ఆహ…! స్వాతి గారు, మీరు వ్రాసిన ఈ కవిత చాల బాగుంది, క్రింద ఇచ్చిన రెండు లైన్స్ మరింతగా నచ్చాయి.
గొంతుపెగలని కీచురాయిలా చెవుల్లో పూలు మొలిపించుకున్న