కళ్ళజోడు

ఆరవ తరగతి క్లాసు నిశ్సబ్దంగా వుంది.
అందరు శ్రద్ధగా వింటున్నారు.
పిల్లలు కొంచెం ముందుకు వంగి రెండు అరచేతులు రెండు చెంపలకు ఆన్చుకొని కళ్ళు కదపకుండా మేడాం కరిష్మా వైపే చూస్తున్నారు.
మొదటి రెండు వరుసల బెంచీల్లో తెల్లగా నాజూగ్గా వుండే పిల్లలు…….
చివర వరుసల్లో ఛామనఛాయ నలుపు రంగులో వుండే పిల్లలు………
అది గర్ల్స్ ఇంగ్లీషు మీడియం పైవేటు హైస్కూల్ ………… పర్సనాలిటీ డెవలప్ మెం ట్ క్లాస్.
వారంలో ఒకరోజు మాత్రమే.
ఆ క్లాసుకోసం పిల్లలందరూ వారమంతా వేచి చూస్తారు.
శుక్రవారం కావడం వల్ల పిల్లలందరూ అప్పుడే పూచిన రోజాల్లా ముద్దుగా వచ్చారు.
ఇదంతా ఒకఎత్తైతే…..
ఆ క్లాసుకు మేడం కరిష్మా ఒక ఎత్తు.
సన్నగా….. నాజూగ్గా………….కత్తిరించిన ఐబ్రోస్ ………పొనీటైల్………సినిమాలో హీరోయిన్ లా వుంటుందు.ఆందుకే పిల్లలందరూ ఆమెవైపు అలా ఆరాధనగా చూస్తూ వుండిపోతారు.
ఆమె మాట్లాడే ప్రతిమాటా……..చేష్ట…………..పిల్లలకు… ఒక అద్భుతం
ఆడపిల్లలు ఎలా నడవాలో చెపుతుంది……….మేడం
నడకని మనం ఎనిమల్స్ ని చూసి నేర్చుకోవాలి…. ముఖ్యంగా  పిల్లి
మనం నడిస్తే బియ్యం బస్తా నడిచినట్టు అడుగులు భారంగా …….బరువుగా బలంగా వేస్తూ నడవకూడదు.
పిల్లిమాదిరి మెత్తగా……వయ్యారంగా……అసలు మనంనడిచినట్టు వుండకూడదు.
అందుకే మీరు ఇప్పటినుంచే నడకనేర్చుకోవాలి.
ఒకే……………..
ఒకే మేడం…………పిల్లలందరూ ఉత్సాహంగా గట్టిగా అరిచారు.
జాగ్రత్తగా వినండి……….
పిల్లలందరూ అటెన్షన్ లోకి వచ్చారు…..ఏ అక్షరం వినకపోతే
ఏం కొంప మునుగుతుందో అన్నట్తు………….
మనం నేలమీద చక్కగా చాక్ పీస్ తో ఒక లైన్ గీసుకోవాలి.
ఆ లైన్ మీద స్ట్రైట్ గా నిలబడి……..ఎదురుగా వున్న గోడమీద మన కళ్లకు సమానంగా ఒక చుక్క పెట్టుకోవాలి.
ఇప్పుడూ మనం ఆ చుక్కను చూస్తూ ఆ లైను మీదే ఒక్కొక్క అడుగు వేయాలి………..
అడుగు గీత ప్రక్కల పడకూడదు.
ఈ మొత్తం   చేసేటప్పుడు నెత్తిమీద ఒక నోట్ బుక్ పెట్టుకోవాలి……….
నడిచేటప్పుడు అది క్రింద పడకూడదు………….
దీనినే  ఫ్యాషన్ ప్రపంచంలో క్యాట్ వాక్ అంటారు.
మేడమ్ కొంచెంసేపు ఆపి పిల్లల వైపు చూసింది.
పిల్లలందరూ ఊపిరి బిగపట్టి వింటున్నారు.
ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి………..నెక్ట్స్ మంత్ జరిగే స్కూల్ డే సెలబ్రేషన్స్ లో మిస్ స్కూల్ పోటీలో పాల్గొనండి..
ఆ మాటతో బెల్ మోగడం……….మేడమ్ బైటకు వెళ్ళడం జరిగిపోయాయి. పిల్లలు అట్లానే నిశ్సబ్దంగా వున్నారు.
కొంచెం సేపు ఎవ్వరు మాట్లాడుకోలేదు………… తర్వాత ఒక్కసారిగా కేరింతలు కొట్టారు.
************                        ***************                ***************
కొంచెం తినమ్మా…..ఈ ఒక్క ముద్దే ……కళ్యాణి బుజ్జగిస్తూ అంది.
పో మమ్మీ……..
చూపుడు వేలికి ఫేర్ అండ్ లవ్ లీ వ్రాసుకుని మొహంమీద బొట్లుబొట్లుగా పెట్టుకుంటూ……… తర్వాత వ్రేళ్ళతో  మొత్తంగా మొహానికి అద్దంలో చూసుకుంటూ రాసుకుంటోంది…………లహరి.
మమ్మీ………..ఈ జడ బాగలా……బిగితుగా ఉంది…..కొంచెం వదులుచేయి విసుగ్గా అంది.
కళ్యాణికి కోపమొచ్చింది………….అది మూడో సారి……. ఆ జడ వెయ్యడం……..
దీని బాధ భరించలేక …….బ్యూటీపర్లల్లకెళ్ళి………….అనేక రకాల హేర్ స్టైల్స్ నేర్చుకోనొచ్చింది.
ఇంక నా వల్లకాదే………నువ్వే వేసుకో…..అంటూ విసుగ్గా కళ్యాణి కిచెన్ రూములోకి వెళ్ళిపోయింది.
లహరి బుంగమూతి పెట్టుకొని రెండు వెంట్రుకలు నుదురుమీదకి లాక్కొని డాడీ నేను రెడీ అని అరచింది.
మూర్తి పేపరు చూస్తూ …….టిఫెన్ తింటున్నాడు…….
ఆ ……..అరుపుతో ఉలిక్కి పడి లహరి వైపు చూశాడు.రోజు జరిగే ఈ తంతుకు అలవాటు పడినా………..ఇంకా అరుపులకు అలవాటు పడలా.
మళ్ళీ తలను పేపరు లోకి …..ఉప్మాని నోట్లోకి దూర్చాడు.
డాడీ ….రా…….డాడీ…….టైం అవుతుంది అంటూ మూర్తి బూజాలను రెండు చేతుల్తో కుదుపుతూ గారాలు పోతూ అంది.
ఆ ……సరే …….ఆ షల్ఫ్ లో ఎర్రగా కనిపిస్తుందే ఆ బుక్ తీసుకొ……….
ఏ బుక్…….
దానిలో రాసుంది చూడమ్మ …….ఎకనామిక్స్ అని………..
ఆ రోజు స్టూడెంట్స్ కు చెప్పబోయే పాఠాన్ని ఒక్కసారి చూసుకోవడం లెక్చరర్ మూర్తికి అలవాటు.
లహరి తలతిప్పి షెల్ఫ్ వైపు చూసింది.
ఒక్కసారిగా భయం వేసింది.
గత నెలరోజులుగా తను దూరంగా వుండే అక్షరాలను చదవ లేకపోతోంది.
ఈ మధ్య కళ్ళు విపరీతంగా మంట పుడ్తున్నాయి.
డాడీకీ చెప్తామంటే ……అమ్మొ……..కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు.
ఒక భయంకరమైన కళ్లజోడు………..
తన అందమైన మొహంమీద బూతద్దంలాంటి కళ్ళజోడు……
స్కూల్లో తనే అందంగావుంటుంది…క్లాస్ కొచ్చే ప్రతి టీచరు తన బుగ్గ నాజూగ్గా గిల్లాల్సిందే.
అప్పుడు క్లాసు పిల్లలందరూ నా వైపు అసూయగా చూసే చూపులు…………
చాలామంది తన ఫ్రెండ్ షిప్ కోసం వెంపర్లాడటం…….
డాడీతో షాపింగ్ కెళ్ళిన ప్రతిసారి……………
తెలిసిన వాళ్ళు కనబడితే………….
నా కూతురు అని భుజం మీద చెయ్యేసి దగ్గరగా లాక్కొంటూ చేప్పుకోవటం……
వాళ్ళ మెచ్చుకోలుగా నా కళ్లల్లోకి చూడటం……….
ఏంట్రా……..లహరి ..అంత గాఢంగా ఆలోచిస్తున్నావు….అంటూ మూర్తి లహరి బుగ్గ మీద చిటికెన వేలితో సుతారంగా కొట్టాడు.
దాంతో …………ఉలిక్కి పడుతూ ఏం లేదు . అని తడబడుతూ అంది…………
తర్వాత ఆలోచిస్తూనే షెల్ఫ్ లో వున్న ఎకనామిక్స్ బుక్ ని తీసి మూర్తికిచ్చింది.
తనకు ఈ అందం లేకపొతే సోసైటిలో తనను తక్కువగా చూసే ఆ చూపునే భరించలేకపోతుంది………
మూర్తి వెనకాల స్కూటర్ మీద కూర్చిని స్కూల్ కి బయలుదేరింది.
లహరికి ఠక్కున సింధు గుర్తుకొచ్చింది…….. నల్లగా. …….అందవిహీనంగా ఎప్పుడూ ఏదో పోగొట్టుకొని పోయిందానిమల్లే ……..ఉండే ఆ మొహం    దానికి తోడు ముక్కు మీద ఆకళ్ళజోడు
అమ్మో……………..సింధు మాదిరి తను కాకూడదు……
నేనెప్పుడూ గ్లామర్ గానే వుండాలి………………..
తనను కళ్ళజోడు పాప అని స్కూల్లో అందరూ ఎగతాళి చేస్తుంటే……….
ఒహ్……ఆ ఊహే ….భరించలేకపోతుంది.. వాతా ఈతా చెపితే మిస్ స్కూల్ కాంపిటీషన్స్ అయింతర్వాతే…….
ఏయ్…………లహరి …….సరిగ్గా కూర్చో……..మూర్తి గట్టిగా అరిచాడు.
ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది.
ఖర్చీఫ్ తో నుదుటికి పట్టిన చెమటను మెత్తగా అద్దుకుంది.
****************************************

స్కూల్………. డే సెలబ్రేషన్స్ ఇంకా వారం రోజులుంది.
అన్నీ ఐటమ్స్ లో కల్లా మిస్…. స్కూల్ టాక్ ఆఫ్ ది స్కూల్ ఆయ్యింది.
లహరి కూడా టాప్ టెన్ లో వుంది.
స్కూలంతా సందడి సందడిగా వుంది.
అందరూ చదువును ప్రక్కన పెట్టి …డాన్స్ లు ….డ్రామాల…. రిహర్శల్స్ తో బిజీగా వున్నారు.
సాయంకాలం రెండు గంటలు స్కూల డేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ అదనంగా వుండాల్సొస్తోంది.
లహరి బాగా అలసిపోతుంది….. అందరి పిల్లల అలసటలో ఉత్సాహం పొంగుతుంటే……
లహరి మానసికంగా బాగా నలుగుతోంది.
ఈ మధ్య కలల్లో కూడా కళ్ళజోడు భయపెడుతోంది.
లహరికి…. కళ్ళజోడు లైఫ్ అండ్ డెత్ సమస్యయ్యింది. ఉసూరంటూ ఇంటికొచ్చిన లహరికి …..వాళ్ళ అమ్మ కళ్యాణి బోర్నవిటా తీసుకొచ్చింది.టీవీ చూస్తూ బోర్నవిటా తాగుతొంది.
సాయంత్రం 7 గంటలవుతోంది.
మూర్తి అప్పుడే ఆఫీసునుండొచ్చాడు.
అలవాటుగా లహరి భుజం మీద చెయ్యేసి ప్రక్కన కుర్చున్నాడు.
లహరి కళ్ళు చిట్లిస్తూ టీవి చూస్తోంది …. అందులోను ఒక కన్ను పూర్తిగా మూస్తూ చూస్తోంది.
మూర్తి గత వారంగా లహరి ప్రవర్తన గమనిస్తున్నాడు……
తనెందుకో ఇబ్బంది పడ్తుందనుకున్నాడు… విషయం తెలీడం లేదు.
ఏం ఛానల్ చూస్తున్నావు…. పరధ్యానంగా అడిగాడు మూర్తి.
ఆ….ఏనిమల్ ప్లానెట్ …తడబడుతూ అంది….
నిజానికి లహరి ఆ ఛానల్ ను చదవలేకపోయింది.
మూర్తి క్యాజువల్  గా టీవీవైపు చూశాడు.
రేయ్…..  అది నేషనల్ జియో గ్రాఫికల్ ఛానల్ రా….
ఏమిటంత పరధ్యానం ….అంటూ మెత్తగా లహరి నెత్తిమీద ఒక మొట్టికాయ వేశాడు.
పరధ్యానమా హుఁ ! అసలు నాకు కనిపిస్తేగా చిన్నగా చేత్తో తలమీద రుద్దుకుంటూ లహరి తన మనసులో అనుకుంది టీవీ చూస్తున్న మాటే గానీ తన ఆలోచనలు వర్షాకాలంలో మబ్బు మూసుకున్నట్లు ముసురుకుంటున్నాయి. కళ్ళముందర ముఖ్యంగా దూరంగా వున్న మనుషులను వస్తువులను సరిగ్గా చూడలేకపోతుంది కొంచెం బూజరగా కనిపిస్తున్నాయి. అసలు అందాల పోటీలో నేను గెలవగలనా………..no…..no……ఈ నెగటీవ్ ఆలోచనలు ఎక్కువ అయిపోతున్నాయి. రెండు వేళ్ళతోటి కళ్ళని నెమ్మదిగా నొక్కుకుంటూ self discipline class లో సార్ చెప్పిన positive thinking concept ని గుర్తు చేసుకుంటుంది తను గెలవడం అనే negative thinking  నుంచి దూరం జరగాలి self confidence సంకల్ప బలం తన కుడి చేతి పిడీకిలి గట్టిగా బిగించుకుంటూ చిన్న గా కళ్ళు మూసుకుని తనలో తనే అనుకోసాగింది ఎట్లా అయినా Miss School పోటీల్లొ తనే సెలెక్ట్ అవ్వాలి తన పేరు మొదటగా సెలెక్ట్ కావాలి అయితే ఆ స్టేజ్ మీద తన తల మీద పెట్టే చిన్ని మిరుమిట్లు గొలిపే ఆ కిరీటం ఒక్కసారి హాలంతా టీచర్లు , పిల్లల చప్పట్లు తన మీద కెమరా ఫ్లాష్ లు స్కూలు పిల్లలంతా తన వైపు అసూయగా చూసే ఆ చూపులు తన వూహల్లో తేలిపోతుందో కాని చిన్నగా పిడీకిలి సడలుతోంది నెమ్మదిగ హాలంతా చీకటి ఆవరిస్తోంది ఆ చీకటిలో వొకేవొక వస్తువు తన వైపు చూసి నవ్వుతోంది.ఆ వస్తువు చిన్నది నుంచి కొంచెంకొంచెం పెద్దదవుతూ హాలంతయ్యింది అది తన భీకమైన నోరు తెరచి లహరి తనలో లాగేసుకోబోయింది అదీవొక పెద్ద కళ్ళజోడు. భయంతోలహరి కెవ్వున అరిచింది ఆ అరుపుకి మూర్తి ,కళ్యాణి …లహరి దగ్గరికి పరిగెత్తుకునివచ్చారు. లహరికి బాగా చమటలు పట్టాయి. కళ్ళు భయంతో బిత్తర పొయి మిడి గుడ్లతో చూస్తుంది వొళ్ళంతా బిగదీసుకుని కూర్చుంది. తన ఏదో వొక జంతువుచూసినట్లు భయపడిపోయింది. ‘లహరి’……… చిన్నగా వాళ్ళ అమ్మ చెంపతడుతున్న తను ఈ లోకంలోకి రాలేదు   . పెద్ద  సౌండ్ తో  టివీ పోతుంటే   మూర్తి  టక్కున  టివీ   ఆఫ్  చేసి  ఫ్రిజ్  లోంచి  చల్లని   నీళ్ళు తీసుకుని  లహరి   మీద  చిలకరించాడు. కళ్యాణి    ఆలాగే   లహరిని  పొదివి పట్టుకుని   చిన్నగా   తన  ఒళ్ళో    పడుకోబెట్టుకుంది  ఈ   లోపుగా  మూర్తి ఫాన్  స్పీడ్   పెంచాడు.కొంత   సేపటికి లహరి ఈ లోకంలోకి   వచ్చింది   టవల్  తో తన మొహం  లో చమటని   తుడుస్తున్న   అమ్మని   చూస్సి   వొక్కసారిగా   బిగ్గరగా  వెక్కి వెక్కి ఏడవడం  మొదలు పెట్టింది.   మూర్తి   కళ్ళ  వెంబడి  ధారా   పాతంగా కన్నీరు   కారుతోంది. మూర్తి  మోకాళ్ళ   మీద  లహరి ముందు  వంగి లహరి  తలని  తన దగ్గరికి తీసుకుంటూ   నుదుటిమీద  ముద్దు పెట్టుకున్నాడు.
***************************************************
ఏమిటి    మీరనేది….   ప్రిన్స్   పాల్   మేడమ్   అర్థం కానట్టు   అడిగింది.
అదే    మీరు   మిస్ స్కూల్ పోటీలు   రద్దు  చేయాలి …దృఢంగా   అన్నాడు  మూర్తి.
ఎందుకని …. రెట్టుస్తూ   అడిగింది     ప్రిన్స్ పాల్…..
మా లహరి    దాంట్లో గెలవలేదు కాబట్టి.
అంటే…..మీ    పాప     కోసం   మిగిలిన  పిల్లల  అందమైన  భవిష్యత్తు ని పాడుచేయాలి ….
ఇదే స్కూలు    నుండి  ఏంతో మంది  మోడల్స్ …  మిస్ ఇండియాలు…. అంతెందుకు   మీరు కూడా  మీ పిల్ల అందంగా వుంటుందని …. ఒక పెద్ద   మోడల్ అవ్వాలని మరీ   చేర్పించారు…    మర్చిపోయారా.  మీ  కూతురు కోసం  ఈ  పోటీల్ని  ఆపీయాలా….  దేశ  భవిష్యత్తు సర్వనాశనం అవుతున్నట్టు  ఆవేశంగా అంది.
తనేదో ఒలింపిక్ గేమ్స్ ఆపేయాల్నా  అన్నట్టు…..  చిన్నగా  గొణిగాడు.  మూర్తి.
లాహరి పరిస్థితి  ఇంకొకరికి  రాకూడదని…
అంటే ..  సూటిగా   చూస్తూ అడిగింది ప్రిన్స్ పాల్.
ఎందుకంటే ….. మా పాప మాదిరి అందరూ గుడ్డోళ్ళు కాకూడదని…
గట్టిగా  అరిచాడు  మూర్తి.
అందం…  మిస్ స్కూల్ డే  అనేవి  తన  లహరిని కంటి ఆపరేషన్  వరకు ఎట్లా   తీసుకేళ్ళాయో  ….  నిదానంగా  చెప్పాడు.
లహరి ఇప్పుడు ట్రీట్   మెంట్  లో   వుంది…   కళ్ళజోడు  పెట్టుకొని నేనింటి  బయటకి  కూడా  వెళ్ళలేనని ప్రాధేయపడుతూ చెప్పింది.
మూర్తి     కళ్ళ నీళ్ళను బలవంతంగా ఆపుకుంటూ   గద్గద  స్వరంతో   అన్నాడు
ఇంత   జరిగిందా…ఆశ్చర్యంగా అడిగింది ప్రిన్స్  పాల్
అవును…తడారి  పోయిన పెదాలను నాలికతో  చప్పరిస్స్తూ .. పొడిగా   అన్నాడు.
మీరింక  ఆలస్యం చెయ్యెద్దు ..వెంటనే  సైక్రియాటిస్టు   కి చూపించండి…..లాహరి  బాగా సెన్సిటివ్   అనుకుంటాను…    జాలిగా  అంది ప్రిన్స్  పాల్.  అంటే  అర్థం గానట్టు    చెమర్చిన   కళ్ళతో   అన్నాడు మూర్తి.
అదే…   మీ  లహరి  కళ్ళజోడుకు  … మిస్  స్కూల్ పోటికీ  సంబంధం లేదనేది…
ఇంకేం    మాట్లాడాల్సినవసరం లేనట్టు… సాయంత్రం  జరగాల్సిన    మిస్ స్కూల్ ఫంక్షన్ ఏర్పాట్లకు బయలు   దేరింది   ప్రిన్స్  పాల్.
బ్యూటిఫుల్ వైలెన్స్……  పిడికిళ్ళు బిగిస్తూ… పళ్లు  కొరుక్కుంటూ  అసహయంగా నసిగాడు   మూర్తి.

7 అభిప్రాయాలు »కథలు

7 Responses to “కళ్ళజోడు”

  1. 1
    ramnarsimha Says:

    చాలా బాగుంది.

    మొబైల్: 8099991076

  2. 2
    shivaratri sudhakar Says:

    చాలా బాగుంది. నాకు బాగా నచ్హింది.

  3. 3
    budugoy Says:

    ” అంటే…..మీ పాప కోసం మిగిలిన పిల్లల అందమైన భవిష్యత్తు ని పాడుచేయాలి ….
    ఇదే స్కూలు నుండి ఏంతో మంది మోడల్స్ … మిస్ ఇండియాలు…. అంతెందుకు మీరు కూడా మీ పిల్ల అందంగా వుంటుందని …. ఒక పెద్ద మోడల్ అవ్వాలని మరీ చేర్పించారు… మర్చిపోయారా. మీ కూతురు కోసం ఈ పోటీల్ని ఆపీయాలా…. దేశ భవిష్యత్తు సర్వనాశనం అవుతున్నట్టు ఆవేశంగా అంది.”

    కృతకంగా ఉంది.

  4. 4
    ramanrasimha Says:

    నా మొదటి అభిప్రాయానికి సిగ్గుపడుతున్నాను.

    budugoy….గారి అభిప్రాయం అభినందనీయం….

    rputhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=HKxsJQVpM2Cqpq8x5AKrByhaAZSFxc9U-Kjq_Ae0iBA=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.com

  5. 5
    Yuvi Says:

    Exellent Story
    విషయమ్ చాలా చిన్నదే కాని బాగా రాశారు. GOOD

  6. 6
    medavaram kanthikumar Says:

    the concept is very old, today the cataract lence is available in the market and not go for spets, and also in the present movies having sets on hereoine or hero face explores modernity. so the concet is not aplicable today. further, somesentenses are not framed naturally. the texture is average. the outcome of the story is not clerly stated.

  7. 7
    నారాయణ Says:

    కథ బాగా రాశారు. అయితే కథంతా చదివాక కాంటాక్టు లెన్సుల గురించి చదివేసరికి నవ్వు వచ్చింది. కథ రాసేటప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి లొసుగుల్ని పూడ్చటం మర్చిపోతుంటాం, ఏమీ పర్లేదు- మీ కథలో స్ఫూర్తి నాకు అర్థమైందనే అనుకుంటున్నాను. అభినందనలు.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో