నైట్‌ వాచ్‌మన్‌

పొద్దెక్కి నిద్ర మబ్బుతోనే లేచి
నీ పేరు నోరారా పిలవకుండా
జఠరాగ్ని చల్లారేది కాదు
జహంగీర్‌!
నిన్నే విషప్పురుగు ముట్టింది

మూసీలో నీళ్లన్నీ తరలించుకపోయిన
కోబ్రాలింకా
శంకర్‌నగర్‌ కమలానగర్‌లలో
మురికివాడలను కాటేయడానికి తిరుగుతున్నాయా

అపరాత్రీ అర్ధరాత్రి వచ్చినా
మెలకువతో గేటు తెరచి
‘జమానా అచ్ఛా నహీ హై సాబ్‌
జరా హిఫాజత్‌ సే ఫిర్‌నా’
అంటుండేవాడివి

ఆ రాత్రి
నువ్వెందుకు ఇంటి దగ్గర పడుకున్నావు

‘బేటీకే షాదీ ఔర్‌ వలీమాకే దిన్‌ హీ
ఘర్‌ మే రహా
అబ్‌ హమేశాకే లియే సోనేకోహీ
ఘర్‌ కో ఆయా’
అంటున్న ఆమెను ఏమని ఓదార్చనూ

నీ ఇల్లే ఒక పక్షిగూడు లాగున్నది
మా అపార్ట్‌మెంట్స్‌ గేట్‌ నుంచి
మెట్లదాకా
పందికొక్కులు స్వైరవిహారం చేసేంత
స్థలం కూడా కాదు

మేమెంత అబద్ధపు బతుకులు
బతుకుతున్నామో
అర్థం చేయించే చావు నీది

నిద్ర పోవడానికే వీలులేని
డ్యూటీ కదా నీది
అంత దీర్ఘ నిద్ర ఎట్లా సాధ్యమైంది?

దినమైనా పడుకునేవానివనా
కార్లు, బైకులు తుడుస్తూ కడుగుతూ
మేం పురమాయించే పనులు చేస్తూ
కారిడార్లో, మెట్లమీద, కాంపౌండులో
ఎప్పుడూ
పారేసిన వస్తువులో, పేపర్లో ఏరుకుంటూ
రెండు కళ్లే నాలుగు దిక్కులుగా
కనిపెడుతూ
ఎప్పుడూ
కాల్జేతులాడిస్తూ
ఇక్కడేదో అనుబంధం
పాతరేసినట్లుగా
ఉండేవానివి కదా
ఆ రాత్రి అర్ధాంతరంగా
మమ్మల్నెట్లా వదిలి పోయావు

అంతస్తుల కోసమూ అగ్వగొచ్చి బరువుగుంటాయనీ
మేం కంపెనీ పార్టీల
వార్తా పత్రికలు వేయించుకుంటామని
నువు కనిపెట్టినట్లున్నావు
పదిరోజులకోసారి అడిగేవాడివి
‘పేపర్స్‌ హై క్యా సాబ్‌
బేచ్‌నేకే లియే’ అని

శ్రమ విలువ
అమ్మే విలువ కన్నా
వాటిల్లో ఉన్న
విలువ లేమిటని!

నీది అసహజ మరణం నుక
బహుశా
సిటీ ఎడిషన్‌లో వార్త అయి ఉంటుంది

ఖాకీల నుంచి కోవర్టుల నుంచి
నన్ను కాపాడమని
మా ‘ప్రజాప్రతినిధు’ల్ని
నేనెన్నడూ అడుగలేదు
అయినా వాళ్లకే గన్‌మెన్‌లు లేకుండా
కాలు కదలడం లేదు
కంటిమీద కునుకు లేదు

ప్రభుత్వాలు
కంపెనీలకు దోచిపెట్టే సేవలో
ప్రజల మీద యుద్ధం ప్రకటించాయి
వాచ్‌డాగ్‌లు ప్రజల మీద
పరాయి భాషలో మొరుగుతున్నాయి
కొన్ని కరుస్తున్నాయి కూడ

పిడికెడు మనిషివి
తెల్లవార్లూ మేల్కొనే
పురానా షహర్‌ వలె
కనిపెట్టుకొని వున్నావు మమ్మల్ని

అందుకే
నీకు అల్విదా చెప్పను

చాదర్‌ఘాట్‌ రైల్వే బ్రిడ్జి కింద
గోరీల మధ్యన మట్టిలోంచి
సుప్తాస్థికల
జననాంతర సౌహృదమేదో
మా ఆవరణను
అంటి పెట్టుకునే ఉంటుంది.

- వరవరరావు
హైదరాబాద్‌
18 మే 2010

8 అభిప్రాయాలు »కవితలు

8 Responses to “నైట్‌ వాచ్‌మన్‌”

  1. 1
    pravallika Says:

    మంచి ఎలిజి రాసిండ్రు సారు

  2. 2
    Vaidehi Sasidhar Says:

    “గోరీల మధ్యన మట్టిలోంచి
    సుప్తాస్థికల
    జననాంతర సౌహృదమేదో
    మా ఆవరణను
    అంటి పెట్టుకునే ఉంటుంది ”

    చాలా ఆర్ద్రం గా,హృదయాన్ని కదిలించే వాక్యాలు.

  3. 3
    p.mohan Says:

    వాచ్మెన్ల బతుకు చిత్రాన్ని కన్నీటీతొ కడీగారు

  4. 4
    ramnarsimha Says:

    ఈ ప్రపంచంలో అత్యంత దుర్భరమైన బతుకంటే *నైట్ వాచమన్*లదే.

    ఈ కవిత చదివితే ఒక్కరైనా మారతారు.

    rputhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=HKxsJQVpM2Cqpq8x5AKrByhaAZSFxc9U-Kjq_Ae0iBA=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.com

  5. 5
    arcube Says:

    really touching elegy sir

  6. 6
    Pranav Ainavolu Says:

    గుండె బరువెక్కింది.

  7. 7
    gajula Says:

    ఏమి చెప్పినా ,మాట్లాడినా తక్కువే -వొక్క జహంగిరును తెచ్చివ్వడము తప్ప .

  8. 8
    D. Nageswara Rao Says:

    అధ్భుతముగా రాసినారు..చాలా బాగుంది.సారూ..

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో