క్వారంటైన్‌

ఒంటిరెక్క పావురమొకటి నేల మీద ఎగురుతోంది. నడిరోడ్డు మీద నిన్ననే మొలిచిన లేత స్మశానమొకటి తన చిన్న కోరల్ని మినార్ల మీదికి అల్లిస్తూ ఆడుకుంటోంది. దేహాంతరాళాల్లోని చీకటి రాజ్యాల్లో దేశాటనం చేస్తున్న తుప్పు పట్టిన తూటాలా అతను ఆ రోడ్డు మీద డ్యూటీ చేస్తున్నాడు. పెదాల మీద ఎడారుల్ని కనిపించనివ్వకుండా అక్కడందరూ ముఖాల బురుజుల మీద శుక్రవారం నమాజుల్ని కప్పారు. మరికొందరు కర్పూరధూపం కింద గుళ్ళని దాచేశారు. బుల్లి సమాధి మీద నాలుగు పువ్వుల్నీ, గుప్పెడు పుట్నాల్నీ చల్లినట్టు ఆమె తన పిల్లాడికి లాల పోసింది, యూనిఫాం  వేసింది. బూట్లు తొడిగింది. ‘అమ్మీజాన్‌, బడికెలా వెళ్ళాలి?’ పిల్లాడి కళ్ళలో ఇనుప మేకులా అబ్బాజాన్‌ చేతుల్లో గుర్తింపు కార్డు. పొయ్యి కింద పేగులు కాలుతున్నాయి, పొయ్యి మీద గుండెలు వేగుతున్నాయి. చెవుల్లో సీసం పోసినట్టు నా ఖర్జూరపు రోడ్డు మీద కర్ఫ్యూని పారబోసిందెవరు? నా పాదాలకి తెలిసినంత వరకూ ఈ రోడ్డు మీద నడక మాత్రమే నాకున్న పరిజ్ఞానం. కానీ నూటనలభై నాలుగు సంకెళ్లలో పాదాలు, రోడ్డు చిక్కుబడిపోవడాన్ని నేనూహించ లేదు. నడక నేర్చిన తరువాత బతకడమొక్కటే సమస్యనుకున్నాను. కానీ ఇప్పుడింకా ఇక్కడ నడవడమే పెద్దసమస్య! ఏ నాలుగు పాదాలూ కలిసి నడవలేని ఒంటరి దారుల్లో నగరంలోనే ఒక అడవి లాటీలని విరగ్గాసింది. నేల రెమ్మ నుంచి నీడ పువ్వుని తెంపినంత దురుసుగా వాళ్ళు మరణాన్ని ‘రీఛార్జి’ చేస్తున్నారు. ఆర్ ఎ ఎఫ్ , సి ఆర్ పీ ఎఫ్  బూట్ల కింద నా పాదాలన్నీ రెక్కల్ని రాల్చుకున్నాయి.
తిరుగు ముఖం పట్టని దారులన్నీ ఆమెతో పరాచికాలాడుతున్నాయి.
రెండు చేతులు కలిసినా చప్పుడు రాని
నిశ్శబ్దంలో నిలబడి మౌనంగా
ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు?
ఎవరి కోసం ఈ వేణువును తెచ్చావు?
ఎవరి కోసం ఈ వాకిలిని తెరిచావు?
‘అతని కోసం…’
ఎక్కడికెళ్ళాడతను?
ఎంతదూరం వెళ్ళాడతను?
ఏమైనా చెప్పి వెళ్ళాడా?
‘బజారుకెళ్ళాడు…’
ఎవరినైనా వెంట తీసుకెళ్ళాడా?
ఏదైనా ఆనవాలు ఇచ్చి వెళ్ళాడా?
ఇప్పట్లో వస్తాడా?
‘ఎప్పట్లాగే బజారుకెళ్ళాడు
చేతి సంచీ పట్టుకెళ్ళాడు
ఎసట్లోకి బియ్యం తెస్తానన్నాడు
ఇప్పట్లో వస్తాడో, రాడో చెప్పలేను…
కూలికెళితే, కూటేళకొస్తాడని చెప్పేదాన్ని
అతను ఊరుగాని ఊరికెళితే
రేపో, మాపో వస్తాడని చెప్పేదాన్ని
అతను దేశం కాని దేశానికెళితే
ఏళ్ళూ, పూళ్ళూ గడిచాకైనా వస్తాడని చెప్పేదాన్ని
అతను నన్ను వదిలి, ఇంకోదాన్ని తగులుకుని ఉంటే
చచ్చాడని నిష్కర్షగా చెప్పేసేదాన్ని…
కానీ అతనిప్పుడు గుప్పెడు బియ్యం తేవడానికి
పక్కవీధిలో కొట్టుకెళ్ళాడు. అందుకే
ఏమీ చెప్పలేను,
రావచ్చు, రాక పోవచ్చు!
నేను వేణువును తెచ్చేటప్పటికే
గాలివాటుకు బొట్టు పాట లేకుండా
పెదాలెండి పోయాయి
ఇప్పుడీ పిల్లనగ్రోవిలోకి నేనెలా చొరబడను?
నేను యుద్ధాన్ని తెచ్చేటప్పటికే
యోధులంతా మరణించారు
ఇప్పుడీ యుద్ధాన్ని ఏం చేసుకోను?
నేను తెరిచేటప్పటికే వాకిలి నిండా
‘అల్విదా’ అల్లుకుంది, ఇప్పుడిక కన్నీరే తప్ప రెప్పల్లేని
నా వాకిలిని మూసేదెవరు?
వాకిట్లో ముక్కలు ముక్కలుగా తెగి పడిన మనిషొకడు శరీర శకలాల్ని ఏరుకుంటున్నాడు. భూమండలాన్నంతా మాంసఖండంగా మార్చిన దేవుడు మనిషితనాన్ని దేవిడీమన్నా చేసేశాడు. మాంసఖండాలు ముక్కలు ముక్కలుగా తన్నుకుంటున్నాయి. కళ్ళు మూసుకున్న స్మశానాల ఐమాక్స్ తెరమీద త్రీడీలో ఖననానికి నోచుకోని పార్థివ దేహాలు అంతిమ కుసంస్కారాన్ని చూసి పరిహసిస్తున్నాయి.
అక్కడామె చాలా మామూలుగా కూరగాయల కోసం క్యూలో నిలుచుని ఉంది. లాటీనో , రబ్బరు బుల్లెట్లో కనుపాపని చిదిమేస్తే, అతని ఎర్రని చూపులో నల్లబడిన వీధి ఆమె పక్కనే ప్రవహిస్తోంది. అతని గురించిన కబురు ఆమెకి మూగదైంది. ఆమె ఇంకా కూరగాయల కోసం క్యూలో నిలుచునే ఉంది. అనుమానం జావెలిన్‌ త్రో ఆడుతుంటే, ఆ పక్కనే ఇంకెవడో గాయపడి, ఇనుప ఊచల్లో చిక్కున్నాడు. ఎప్పట్లాగే పగలూ, రాత్రీ.., రాత్రీ, పగలూ.., ఎప్పట్లాగేనా… కాదు, రాత్రికీ, పగలుకీ మధ్యన మరేదో విషణ్ణ సమయం. నగరాన్నంతా నిద్రపుచ్చిన ఈ రాత్రి అక్కడ మాత్రం కమ్చీలతో రెప్పల్ని ఛెళ్ళుమనిపిస్తోంది. దారులన్నీ పాదచారిని పలవరిస్తున్నాయి, ఒళ్ళు మరచి పగలే రోడ్ల మీద పరచుకున్న రాత్రి, చెట్టు కింద చెమటలు కక్కుతున్న పోలీసు, విజిల్ కింద పగిలిపోతున్న పలకరింత, పిచ్చుక గూట్లో ఉలికి పడ్డ కువకువలు, ఇనుప సీతాకోక చిలుకలు గాజుపువ్వుల మీద వాలుతున్నాయి, ఇంకా తెలవారదేమీ….?

8 అభిప్రాయాలు »కవితలు

8 Responses to “క్వారంటైన్‌”

  1. 1
    Akkiraju Bhattirprolu Says:

    చాలా బాగుంది!

  2. 2
    sarojini Says:

    అద్భుతమైన వ్యక్తీకరణ. చొప్పదంటు కారణం. చివరికి మీరు కూడా… ఇలా… ట్రోజన్ హార్స్ కూడా అలాగే. మీ ట్రోజన్ హార్స్ రైతులచేత చదివించండి. అర్థమవుతుందేమో అడగండి. ఈ సామాజికీకరణ ఇన్కెప్పుడు ఒదుల్తుంది మనకి.

  3. 3
    sunkoji devendrachari Says:

    karfue ni kallaku kattaru. chaala baagundi.

  4. 4
    ramnarsimha Says:

    దేవేంద్ర గారు,

    మీకు తెలుగు రాదా?

  5. 5
    koteswar rao Says:

    ఇది కవిత్వమా, వ్యాసమా లేక అలిగరీనా…

    యోధులంటే ఎవరండీ. ఇంతకీ ఇంతహేయమైన పరిస్థితిని చాలా బాగుంది అనుకోవడేమేమిటీ ఖర్మ కాకపొతే. మీ కవులు రచయితలంతా ఇంతేనేమో మీకోసం కరువుకాటకాలు రావాలేమో. అది మీరు కళ్ళకుకట్టినట్లు రాసుకుని చాలా బాగుంది అని మీలో మీరు సంతోషపడటేమేమిటీ. ఇటీవల ఒకాయన మా జిల్లాలో ఎంత కరువు ఉంటే మా రచయితలకు అంత సౌభాగ్యం అన్నాడు. తెలుగు సాహిత్యానికి ఈ వెనుకబాటుతనం ఒక మౌలికవస్తువైపోయింది. ఏమంటారు ప్రియమైన విమర్శకులారా (పోరాటాల విమర్శకులు కాదు).

    ఇక ఈ కర్ఫ్యూలొకటి తక్కువ. హైదరాబాదులో కర్ఫ్యూ ముగిసి చాలా రోజులైంది. మళ్ళీ ఆ పీడ కలని గుర్తుకుతెచ్చుకోవాలా ఏమిటి మీ కవిత చదివి. స్పందించి రాసే కవులమీద కొంతకాలం మారటోరియం లేక నిషేధం విధిస్తే బాగుంటుంది. తెలుగులో కవిత్వం కొత్త జన్మ ఎత్తాలి…

  6. 6
    sunkoji devendrachari Says:

    ramanarasimha gaaru
    kavita telugulo vunda, englishlo vunda? telugu raada ani prashnincharu.
    naaku e telugu raayadam raadu.

  7. 7
    ramnarsimha Says:

    ప్రత్యుత్తరం ఇచ్చినందుకు ధన్యవాదాలు..

    నా వ్యాఖ్య మీకు బాధ కలిగించి ఉంటె క్షమించగలరు..

  8. 8
    ramnarsimha Says:

    గీత గారు,

    క్వారంటైన్…. అంటే ఏమిటండి?

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో