Oct2010
ఒక ఆటొమేటిక్ పొయెమ్?
కిటికీ ఇవతల నువ్వు
నీకు తోడుగా ఒక అద్దం
లాయిరి పెట్టెకు అమర్చిన అద్దం
చిన్ని కన్ను తాకితే చెమర్చే అద్దం మొత్తం చదవండి »
ప్రత్యామ్నాయ సాహిత్య పత్రిక
Oct2010
కిటికీ ఇవతల నువ్వు
నీకు తోడుగా ఒక అద్దం
లాయిరి పెట్టెకు అమర్చిన అద్దం
చిన్ని కన్ను తాకితే చెమర్చే అద్దం మొత్తం చదవండి »
Oct2010
మాటలతో ఏమీ చెప్పజాలని అశక్తతలాగే
వెనుకకు తిరిగి చూసినపుడు రాసిన పద్యాల జాడలవెంట
కాంక్షించినదేదీ పలుకని తిరస్కృతిలా
ఎక్కడో దారితప్పి తనచుట్టూ తాను
తిరిగి తిరిగి వేసారే పాదాల వేదనా తీరం మొత్తం చదవండి »
Oct2010
ఆ దారెప్పుడూ చదునుగా ఉండదు
గులకరాళ్ళు గాజు పెంకులు
మొనదేలుతూనే ఉంటాయి
పురాతన కాలం నుండీ
పరుచుకున్న నిరంకుశత్వం మొత్తం చదవండి »
Oct2010
ఊళ్ళను ఖాళీ చేయడం గురించి వాడికే౦ తెలుసు
తరతరాలుగా పురిటినొప్పులు పడి౦దిక్కడే..
ఈ మట్టిని పూసుకొని ఈ రాళ్ళలో
గూళ్ళు కట్టుకొని ఆడుకు౦దిక్కడే!
ఈ నేలను పూసిన పువ్వులనే
ప్రేయసికి కానుకగా ఇచ్చాను..
ఈ మట్టి పరిమళ౦ మా చెమటలో
యి౦కి నెత్తురుగా ప్రవహిస్తో౦ది! మొత్తం చదవండి »
Oct2010
పేరుకి ముందో వెనకో ఖాందాన్ చెప్పుకోని వాడ్ని
చేవ్రాలుకి క్రితమో,తర్వాతో ఇలాకా రాసుకోని వాడ్ని
థిల్లానా రాగానికి “థ్రిల్లర్” స్టెప్పులేయలేను – క్షమించు మొత్తం చదవండి »
Oct2010
మంచి కథ అంటే మనకు అందరికీ ఇష్టమే. కాని, మంచి అంటే ఏంటీ? మంచి ఎలా వుంటుందీ? మంచి కథకు ఉండాల్సిన లక్షణాలేంటీ? ఇలాంటి ప్రశ్నలకు మనందరం ఏకీభవించే జవాబులు లేవు. నాకు మంచివి అనిపించే కథలు మీకు నచ్చకపోవచ్చు. ఈ విషయం గుర్తుంచుకుంటూ, నాకు ఎలాంటి కథలు నచ్చుతాయో, ఎలాంటివి నచ్చవో, ఎందుకు నచ్చవో వివరించటానికి ప్రయత్నం చేస్తాను. మొత్తం చదవండి »
Oct2010
అప్పుడు
ఇప్పుడు
ఎప్పుడైనా
ఇళ్ళవెంట
పెనవేసుకున్న
అనుబంధాల్ని
నెమరేసుకుంటూ మొత్తం చదవండి »
Oct2010
మౌనమైనాన్ని కరిగించి ఒకవాక్యం ఎత్తుకుందామంటే
భయం పాముపిల్ల చాయ కనిపిస్తుంది. మొత్తం చదవండి »
Oct2010
ఎప్పుడో ఐదుంబావుకే వరంగల్లు స్టేషన్ కి రావాల్సిన సింగరేణి ప్యాసింజర్ ఏడుగంట లవుతున్నా రాకపోవడంతో నాలుగున్నరకే వచ్చి కూర్చున్న మాకు భరించలేనంత విసుగ్గా ఉంది. మొత్తం చదవండి »
Oct2010
నర్శింలు బిడ్డ పెండ్లి.
కాలేదు….. పెట్టుకుంటరు.
వాళ్ళు వచ్చి పిల్లను చూసిపోయిండ్రు. నచ్చిందని చెప్పి పంపిండ్రు. నర్శింలుకు ఇష్టమే లేదు. వీళ్ళు పోయి పిల్లగాన్ని చూసి వచిండ్రు. పిల్లగడు నచ్చిండు. పెండ్లి చెయ్యాలనుకున్నరు. అలాలిసకు డేటుకూడా అనుకున్నారు. నర్శింలుతో పని లేకుండా అంతా జరిగిపోయింది.
అప్పుడు మొదలైంది నర్శింలుకు వణుకుడు. ఎట్ల…ఎట్ల…? ఏం జెయ్యాలె…? ఎట్ల నడువాలె…? అనుకుంటుండు. భయపడుతుండు. తొక్కులాడుతుండు. రంది మొదలయింది. మొత్తం చదవండి »
Oct2010
”చూడటానికలా వుంటుంది కానీ అమ్మో ! నెరజాణండీ అది” అన్న సరోజ మాటలు మరోసారి గుర్తొచ్చాయి ఆ అమ్మాయిని చూస్తుంటే.
ఆరోగ్యంగా కళగా వున్న మొహం. ఆమొహంలో ఏదో అర్ధం కాని భావం. దిగులా ! భయమా ! అసహ్యమా ! నిర్వేదమా !
ఈ మహిళా సంరక్షణ కేంద్రం అయిదేళ్ళుగా నడుపుతున్నాను నేను. ఈవూరే కాక చుట్టుప్రక్కల పల్లెటూర్ల నుంచి కూడా ఎందరో ఆడవాళ్ళు వస్తుంటారిక్కడికి.
రకరకాల సమస్యలతో వచ్చిన ఆడవాళ్ళని చూశాను నేను. తమకి అన్యాయం చేసిన వాళ్ళపై దుమ్మెత్తి పోసేవాళ్ళనీ, శాపనార్ధాలు పెట్టేవాళ్ళనీ, ఏడ్చి పెడబొబ్బలు పెట్టే వాళ్ళనీ, ఆపకుండా రాగాలు తీసేవాళ్ళనీ… మొత్తం చదవండి »
Oct2010
ట్రింగ్……ట్రింగ్….ట్రింగ్…
అలారం మోగుతున్నా తన చెవి పక్కనే లెమ్మని సొదపెడుతున్నా కార్తీక్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని నీలిమ అలారం తలపై ఠపీమని అరచేతితో చిన్న దెబ్బ వేసింది.
ఆ దెబ్బకి అలారం ఆగిపోయినా గడియారం దభీమని కింద పడింది. మొత్తం చదవండి »
Oct2010
తెల్లవారింది, వర్షం అలాగే పడుతోంది. ఆగి ఆగి కొంతసేపు, గాలి వీస్తు మరికొంత సేపు, కుండపోతగా మరికొంతసేపు కురుస్తూనే వుంది. రెండురోజుల క్రితం మొదలైన వాన, ఇంపూ తెంపూ లేకుండా కురుస్తూనే వుంది. మొత్తం చదవండి »
Oct2010
గస పోసుకుంటూ రోడ్డు పొంటి దబ్బదబ్బ నడుస్తున్నది వెలుగమ్మ.పెయ్యంతా చెమటతోని తానం చేసినట్ళట్లు అయ్యింది. ఆ డాక్టరమ్మ ఈపారన్న ఉంటదో ఉండదో, బిడ్డకు పొద్దులు. ఇగ ఏ నిమిసంలనన్న కనెటట్లె ఉన్నది. పీహెచ్సీ సెంటర్లగా కమల డాక్టారమ్మ ఉంటెగింటె బిడ్డకు దిలాస. లేకుంటే గా సిస్టరమ్మ గూడంగ మంచిగనే చేస్తది కాన్పు. గామె లేకుంటె ఊర్లె మంత్రసాని ఉండనే ఉన్నది ఏమొ ..మొన్నగా కుమ్మరోల్ల రాజయ్య బిడ్డకు మస్తు రక్తం పోయిందంట… గా పొల్లకు కుట్లెయ్యినీకి దవాఖానాకు కొంటబోయెటాల్లకు సచ్చేపోయిందంట. పెయిల రక్తం సానా పోయిందంట మల్ల గింత అయినంక తను జేపిత్తదా గా మంత్రాసానితోని? మొత్తం చదవండి »
Oct2010
చరిత్ర రచనాక్రమం_నేపధ్యం :
భారతదేశ చరిత్ర రచనను మొదట ప్రారంభించిన వారు వలసవాద చరిత్రకారులు. జె.ఎస్. మిల్, మెకాలే వంటివారు భారతదేశ చరిత్రను వలసవాద దృక్పథంతో పరిశీలించారు. వీరి రచనలలో భారతీయులు వెనుకబడిన అనాగరికులు. వీరికి సంస్కారం నేర్పి, నాగరికులుగా చెయ్యటం పాలకులుగా తమబాధ్యత అనే ధోరణి కనిపిస్తుంది. వీరు భారతదేశ చరిత్రలో ప్రాచీనయుగాన్ని హిందూయుగంగాను, మధ్యయుగాన్ని ముస్లిం యుగంగాను ఆధునిక యుగాన్ని బ్రిటిష్ యుగంగాను విభజించి చరిత్రరచనలో తమ సంకుచితత్వాన్ని చాటుకున్నారు. మొత్తం చదవండి »
Oct2010
అది 1980 వ దశకం. రైతు జీవన యాదార్థ సంఘటనలు కథా కళగా మారుతున్నాయి. జానపద కథ విప్లవ కథగానూ, జానపద వృత్తి గాయకులు విప్లవ గాయకులుగాను మారుతున్నారు. తెలంగాణలో వీరగాధల్ని ఊరూరా పాడుకుంటూ ప్రజల్లో పోరాట చైతన్యం నింపుతున్నారు.తత్ఫలితంగా విప్లవోద్యమం బయలుదేరింది. ఇది అటు కథా కళారంగలోనూ. ఇటు రైతు సంఘంలోనూ గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. ఈ విభిన్నమైన రెండు కోణాల్ని స్పృశిస్తూ “తుమ్మేటి రఘోత్తమ రెడ్డి” గారు “సవారీ” అనే కథను రచించారు. మొత్తం చదవండి »
Oct2010
ఇరవయో శతాబ్దం ప్రథమార్థంలో వచ్చిన తెలుగు సాహిత్య విమర్శను చదువుతుంటే అనేక ఆసక్తికరమైన విషయాలు మన దృష్టికి వస్తాయి. సంప్రదాయ సాహిత్యాన్ని సంప్రదాయ దృష్టితోనే చూసేవర్గం ఒకటి వుండగా, సంప్రదాయ సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో అంచనా కట్టే వర్గం ఇంకొకటి మనకు కనిపిస్తుంది. సంప్రదాయ సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో అంచనా కట్టేవాళ్ళందరూ సారాంశంలో భావజాలంలో ఆధునికులు కాకపోయినా, ఆంగ్లసాహిత్యం ద్వారా కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొత్త కొలమానాలతో ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలించే ధోరణి మాత్రం ఆహ్వానించదగిందే, పి. దక్షిణామూర్తితో మొదలైన (పింగళి సూరన 1892) ఈ ధోరణి కట్టమంచి రామలింగారెడ్డి, వింజమూరి రంగాచార్యులు( కవిత్వతత్వవిచారము, పింగళిసూరనార్యుడూ 1914) తో అది ఒక స్పష్టమైన రూపాన్ని సంతరించుకుంది వీళ్లలో కూడా రెండు మూడు రకాల వాళ్ళు కనిపిస్తారు. మొత్తం చదవండి »