Oct2010
అరుణ్ కాంబ్లె కవితలు రెండు
నే నేభాషలో మాట్లాడాలి
బంజరు భూముల్లో
గొర్రె కాళ్ళగిట్టల వెనుక రోజుల్ని
నెమరువేస్తూ నడుస్తున్నాడు మాతాత
నా శరీరంలో నా ఆలోచనల్లో
ఎన్నో ఏళ్ళుగా గూడుకట్టుకొని
నిలిచి ఉన్నాడు మాతాత
ఎన్నో రోజులుగా కుటుంబభారాన్ని
ఆచారాల బరువుని పోగుచేసుకొని
వీపు కెత్తుకున్నాడు మాతాత
సాయంత్రాల వెలుతురుకోసం
వెన్నెల చుక్కల దారికోసం
నిరీక్షిస్తూ అరుసున్నాడు మాతాత
లంజకొడకా నాలా మాట్లాడు
నే చెప్తున్నట్లు పలుకు….! అంటూ
వేదాల నుండి ఏరుకున్న పడికట్టు
పదాల్ని పలుకుతూ తన్మయత్వంతో
నేతితో తడిచిన జందేన్ని
పదేపదే సవరించుకుంటున్నాడు
నా బ్రాహ్మణ అయ్యవారు
నాతో “వెర్రివాడా నాలా భాషని
సరిగా ఉపయోగించు” అంటున్నాడు
నేనిప్పుడు
నన్ను అడుగుతున్నాను
నే నేభాషలో మాట్లాడాలి?
*** *** *** *** ***
రాజ్యాంగం సాక్షిగా……
మా ఈ బ్రతుకులు మీరూ బ్రతికితే
మీలో కూడా కవితలమంటలు పుట్టుకొస్తాయి
మేము రోజూ పిడికెదు మెతుకుల కోసం
తన్నులుతింటూ, ఊయించుకుంటూ ఊరెలపలికి
నెట్టబడుతున్న ఆందోళన లౌతున్నాం
నువ్వు రోజూ దేవుని పేరుతో పంచభక్ష్య పరమాన్న మౌతున్నావు
మేము మా వారసత్వం తుంగభద్ర కాల్వల్లో త్రొక్కివేయబడుతుంది.
నువ్వు ఒక్కడివే ఋషిలా పూర్వీకుల నుండి జ్ఞానపీఠాన్ని పొందుతున్నావు
మేము నాలిక గీక్కోవడానిక్కూడా అణాపైసల్లేకుండా బ్రతుకుతున్నాం
నువ్వు నైవేద్యంగా హుండీలో బంగారుకిరీటాలు పొందుతున్నావు
మీ శవాలు గంధపుచెక్కలతో కాల్చబడుతున్నాయి.
మా శవాలు ఇసుకలో త్రొక్కబడిన కారంచేడు లౌతున్నాయి.
ఈ పాడులోకం రేపటికైనా మారుతుందన్న నమ్మకం మాకు లేదు
చివరకు మిరు శాసిస్తూ నడిపిస్తున్న నేటి ప్రజాస్వామ్యం
మేము కూడా ఈ దేశపు రాజ్యాంగం సాక్షిగా ఇలాగే బ్రతకాలా..?
అనువాదం
డా.జి.వి.రత్నాకర్
ఫోన్ : ౯౮౪౯౩౦౩౧౭౫
2 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు
October 20th, 2010 at 6:12 am
కవితలు చాలా బాగున్నాయి.
అభినందనలు.
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
November 10th, 2010 at 4:17 am
“మా్ బతుకులు మీరు బతికితే
మీలో కూడా కవితల మంటలు పుట్టుకొస్తాయి.”
అవునండి నిజమే.
మీకు అభినందనలు.
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
(nalgonda)