Oct2010
చివరిలోయ
తెలియదు నాకు
నాసంతకం
ఎన్ని రోజులు ఎన్ని ఘడియలు
లేదూ ఎన్ని క్షణాలు
నమ్మకాన్ని కలిగిస్తోంది!
నా సంతకం నా ముద్ర
మేలైన కాంతిమెరుపుల
కొండలవలయం
వెన్నెలతోతడిసిముద్దయిన
నీ స్వప్ననగరిలో
ఎంతకాలం
ఎరుకగా ఉంటుందో !
నా సామ్రాజ్యం, నా పరిపాలన
శిలాశాసనాలు
నా మొహరు నా సంతకం
సర్వత్రా పతన దిశగా
తూర్పు పడమరల్లో
ఉత్తర దక్షిణాపథాల్లో
సర్వత్రా విశ్వాసఘాతకులు
సేనాధిపతులు కృతఘ్నులు
చేరిపోయారు శత్రుశిబిరాల్లో !
నా సంతకం
తుడుచుకు తుడుచుకుపోతోంది
కన్నీటితోనెత్తుటితో
బ్రద్దలవుతాయి కొండలు
దిశమారుస్తుంది
నదీ ప్రవాహం
నా ఎదుటే ఏమేమి
ఇంకా ఇంకా
ఎలా జరుగుబోతోందో !
నా పాద చిహ్నాలు
చిట్టచివరన
నీ ఇలాకాలో
మెరుస్తూ మెరుస్తూ
నీఇంటా నీ తోటా
కనబడతాయి
స్పష్టంగా గోచరిస్తుంది
నా ప్రతిబింబం
చెప్పు స్పష్టంగా
సమయం ఉండగా
నిశాంధకారంలో
ఇక్కడ భూకంపం రాదని
నదీ ప్రవాహం
దిశని మార్చదని
మెరుస్తున్న కొండ
బ్రద్దలవదని
సమయం మించకుండా
చెప్పు
స్పష్టంగా చెప్పు!!!
ఒరియామూలం: రాజకిషోర్ దాసు
ఒక అభిప్రాయం »అనువాదాలు, కవితలు
October 22nd, 2010 at 4:46 am
మీ అనువాద కవిత చాలా బాగుంది.
అభినందనలు.