Oct2010
దారెప్పుడూ చదునుగా ఉండదు
ఆ దారెప్పుడూ చదునుగా ఉండదు
గులకరాళ్ళు గాజు పెంకులు
మొనదేలుతూనే ఉంటాయి
పురాతన కాలం నుండీ
పరుచుకున్న నిరంకుశత్వంకదా
పెకలించుకుంటూ పోవాలి
దారెప్పుడూ ఇరుకిరుగ్గానే ఉంటుంది
ఇరువైపులా పదునైన రంపాలు బారలు సాచి ఉంటాయి
దోపిడి దొంగలు విస్తరించిన నేల కదా
చెలుక్కుంటూ పోవాలి
దారెప్పుడూ ముళ్ళతోనే నిండి ఉంటుంది
పదునుగా మొనదేలి కరవడానికే చూస్తుంటాయి
బ్రతుకొక యుద్ద భూమే కదా
పటపట విరుచుకుంటూ పోవాలి
దారెప్పుడూ కరుకు కత్తుల బోనులా
నోరు తెరిచే ఉంటుంది
చూసిన వాణ్ణల్లా బంధించడానికే చూస్తుంటుంది
కోరలు పెరికి పారేసుకుంటూ పోవాలి
దారెప్పుడూ అధికార కంఠంతో హుంకరిస్తుంటుంది
వేలెత్తి హెచ్చరిస్తూనే ఉంటుంది
బెదిరింపుల చూపులతో కన్నెర్ర చేస్తూనే ఉంటుంది
ఆకురాళ్లను నూరుకుంటూ పోవాలి
రాదారెప్పుడూ ముసుగులు ధరించే ఉంటుంది
తరతరాలుగా అనుభవించిన నైవేద్యాల ముడుపులు గదా
ఎప్పటికీ అవి మన స్వంతమేనని బ్రమిస్తూ ఉంటుంది
వాటికి ముసుగులి తొలగించాలి
తలలు మార్చెయ్యాలి
సాదరంగా వీడ్కోలు చెప్పాలి
October 9th, 2010 at 5:56 am
మంచి కవిత రాశారు
October 13th, 2010 at 4:37 am
మీ సామర్థ్యానికి తగినట్లుగా రాయలేదు..
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
October 14th, 2010 at 1:29 am
Sir,
You are a Teacher..
Why doesn`t any Teacher concentrate on Reforms in Educations System?
Why don`t any Teacher/Lecturer/Professor write Stories on Studies Pressure?..
You are not only responsible to the Farmers & others but also to the
Students..
Email:ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
October 23rd, 2010 at 5:34 am
“బ్రతుకొక యుద్ధభూమె కదా”
ఈ వాక్యం చాలా బాగుంది.
అభినందనలు..
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
November 20th, 2010 at 2:40 am
మంచికంటి గారు,
పిల్లల కోసం “కథల పుస్తకాలు, గ్రంథాలయాలు” ఏర్పాటు చేస్తున్నందుకు
అభినందనలు.
“మన ప్రభుత్వాలు, విద్యశాఖ అధికారులు”
ఎప్పుడు మేల్కొంటారో మరి?
November 30th, 2010 at 6:08 am
బాగుంది కాని ఇందులొ అసలు ఎవరిని ఉధ్దేశించి రాశారొ అర్థమ్ కాలేదు..
December 3rd, 2010 at 9:50 pm
మంచి కవిత. భావుంది.
January 16th, 2011 at 11:33 am
రాము గారూ నేను అన్ని రకాల కవితలు,కథలు రాశాను.విద్యా వ్యవస్థ మీద కేవలం టీచర్లే కాదు అందరూ బాధ్యత తీసుకోవాల్సిన సమయము ఆసన్న మైంది.అందరిమీ ప్రయత్నించాలి.మీ గురించి తెలియ జేయండి.