Oct2010
కాలానికి బొడ్రాయిని……
పేరుకి ముందో వెనకో ఖాందాన్ చెప్పుకోని వాడ్ని
చేవ్రాలుకి క్రితమో,తర్వాతో ఇలాకా రాసుకోని వాడ్ని
థిల్లానా రాగానికి “థ్రిల్లర్” స్టెప్పులేయలేను – క్షమించు
******
ఇన్నాళ్ళుగా….ఈ పీనుగులు లేచిన ఇంట్లోనే తలదాచుకుంటున్న వాడ్ని
పాడుబెట్టిన గుళ్ళోనే పొట్టపోసుకుంటున్న వాడ్ని
ఆకలి పోగులకు అద్వైతం ప్రభోధించలేను – మన్నించు
******
పావురాయి రెక్కలకింద ప్రేమలేఖలు చదువుకున్న వాడ్ని
పాపాయిలు గుక్కపెట్టని రాత్రులను కలగంటున్న వాడ్ని
ఆకురాలు కాలంలొ విజేతల పక్షాన నిలవలేను – క్షంతవ్యుణ్ణి
******
నీళ్ళవెంట నాగరికతలు విస్తరిస్తాయని
గాలికి కరిగి ఊపిరి మేఘాలు వర్షిస్తాయని
కాలంకంట్లో చుక్కనీరు ఊరుతుందని నమ్మిన వాణ్ణి
ఇప్పుడిలా
ఎడారయిన ఊరికి,ఉరిపోసుకున్న శవానికి కాపలా కాస్తున్న వాడ్ని!
నా ప్రాంతానికి బొడ్రాయినే కానీ, నీ పాపాల పంటకు వడిసెల రాయి కాలేను – అసహాయుణ్ణి
******
పాలగుండెల్లో పొంగును చూసిన వాడ్ని
నూనూగు మీసాల పౌరుషం పారాడిన నేలమీద నిలబడ్డ వాడ్ని
బతుకు తండ్లాటలో బరిమీద కొచ్చాను
ఇప్పుడిక రాజ్యానికే కాదు
నీ నయావలస కుట్రలకూ దేశద్రోహినే
(తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమానికి సంఘీభావంగా……)
October 10th, 2010 at 10:55 pm
నీళ్ళవెంట నాగరికతలు విస్తరిస్తాయని
గాలికి కరిగి ఊపిరి మేఘాలు వర్షిస్తాయని
కాలంకంట్లో చుక్కనీరు ఊరుతుందని నమ్మిన వాణ్ణి
రివేరా మీకే చెల్లు ఇలా రాయడం.. చాన్నాళ్ళకి మరల ఇలా కలబోసినందుకు ధన్యవాదాలు..
October 13th, 2010 at 12:54 am
రివేరా!
చానాళ్ళకి మంచి కవిత చదివాను. ఆప్పుడప్పుడే అయినా బాగా రాస్తున్నావు.-కరుణ
October 22nd, 2010 at 11:18 pm
ఒల్లు పులకరించె గొప్ప కవిత. అభినందనలు.
మీ భాస్కర.
November 19th, 2010 at 10:52 am
రివేరా;
కవిత చాలా బాగుంది.
మహమూద్.
November 20th, 2010 at 2:27 am
మీ కవిత చాలా బాగుంది.
అభినందనలు.
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
February 7th, 2011 at 8:30 am
నా ప్రాంతానికి బొడ్రాయినే కానీ, నీ పాపాల పంటకు వడిసెల రాయి కాలేను – అసహాయుణ్ణి………… బాగుంది