నా తెలంగాణ జ్ఞాపకాల చిత్తరువు

అప్పుడు
ఇప్పుడు
ఎప్పుడైనా
ఇళ్ళవెంట
పెనవేసుకున్న
అనుబంధాల్ని
నెమరేసుకుంటూ
ఈ మట్టితో
మాట్లాడతాను.
ఈ మట్టికీ_నాకు
ఎంతటి అనుబందామో…..?
అనేకానేక
జ్ఞాపకాల్ని
ఒలకబోసుకుంటాం
బ్రతుకు ముచ్చట్లమధ్య
ఆకలికి తావులేక
నిండుకుండ
నారోసం
ఎదురు చూసీ చూసీ
కన్నీరు కారుస్తా…..
కునుకు తీస్తుంది.
నిన్నటి
రాత్రిప్రయాణం తాలూకు
అలసటింకా తీరలే

నెర్రెల్లో ఇంకిన
నీటిచుక్కల కోసం
ఎన్నేసి నడకలో…?
నడిసీ నడిసీ
వాళ్ళకు ఆయాస మొచ్చి
ఎండిన చేట్టునీడలో
నన్ను నేను చూసుకుందును గదా
అచ్చం
ఒట్టిపోయిన
మా బక్కబర్రె మొఖంలా
గిదీ మాతెలంగాణ
బతుకుచిత్రం…..

5 అభిప్రాయాలు »కవితలు

5 Responses to “నా తెలంగాణ జ్ఞాపకాల చిత్తరువు”

  1. 1
    Ramulu Says:

    మీ పోయెమ్ బాగుంది.
    ఒట్టిపోయిన ఆవు మన తెలంగాణ
    కరిమింగిన వెలగపండు మన నేల
    ఇంటిపిల్లను ఇల్లుటమ్ దెచ్చుకోని
    బయటిపిల్లను పొట్టగంజికి తెచ్చుకొన్నట్లు
    మనోళ్ళను మస్కట్టుకు,బహ్రేన్లకు పంపుతున్నం
    మనకు దక్కాల్సిన ఉద్యోగాలల్ల మంది కులుకుతుంటే చూస్తున్నం
    మనపై స్వారీచేస్తుంటే రేన్నంర్రాలోతిగ ఉరుకుతున్నం
    మనలో మనం తన్నుకుంటున్నం
    చిచ్చుబెట్టినోన్ని గుర్తిస్తలేం అందుకే వాన్ని తన్నలేం
    ఎప్పటికి మన వాళ్ళకు తెలివి వచ్చేనో,
    ఎప్పటికి మనోళ్ళు ఒక్కమాటమీద నడిచేరో
    ఎప్పటికి తెలంగాన వచ్చేనో మన్ ఉద్యోగాలు మనకు దక్కేనో.
    ఐనా పోరాడ్తనే ఉంటం

  2. 2
    B S RAMULU Says:

    స గ మె నీల్లు ఉన్నయనుకుదు నిరాస . సగమ్ ఉన్నయనుకునుదు ఆస.
    బి ఎస్ రాములు

  3. 3
    anil Says:

    తెలంగాణ నుండి ఎన్నికైన ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి, ఎం.పిలు..ఎం.ఎల.ఏ లు ఈళ్లేమి ఇన్నాళ్ళ సద్ది ఏమి సెయ్యలేదా? మరి సేస్తే మన తెలంగాన గిట్లగున్నదేమి? మరి గాళ్ళని ఒగ్గేసి, ఎవుల్నయ్య మీరు తిడుతున్రు? బ్రిటీషు గాళ్ళు పచ్చంగున్న మన భారతదేశాన్ని కొల్లగొట్టిండయ్య..నిరుద్యోగం, పేదరికం ఒక్క తెలంగాణ కాదురయ్య..దేశమంత ఉందిరయ్యా.. తెలంగాన్లో ఒక్క ఆంద్రా వాల్లే కాదురయ్య.. ఉత్తర భారతదేశం వాళ్ళు లేరా? ఆళ్ళని ముందు తగిలీండయ్య.. పాకిస్తాన్ లాగా ఉండండయ్యా.. తెలంగాణాని అడ్డుపెట్టు కొని కోట్లు సంపాదించుకొనే వాళ్ళని కూడా జర చూడండ్యా.. నీ కల్మొక్తా బంచెన.

  4. 4
    ramnarsimha Says:

    మంచి కవిత..

    సైదులు గారికి, బి.ఎస్.రాములు గారికి

    అభినందనలు..

  5. 5
    saidulu inala Says:

    అభిప్రాయాలు చెప్పిన అందరికి క్రుతజ్నాతాలు.

    అనిల్ గారికి మరీ మరీ…….
    మేము కావాలనుకునే తెలంగాన దొరల తెలంగాణ కాదు భయ్ సామాజిక తెలంగాణ.

    ఐనాల సైదులు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో