Oct2010
ఓ నిర్వాసితుని వేదం
ఊళ్ళను ఖాళీ చేయడం గురించి వాడికే౦ తెలుసు
తరతరాలుగా పురిటినొప్పులు పడి౦దిక్కడే..
ఈ మట్టిని పూసుకొని ఈ రాళ్ళలో
గూళ్ళు కట్టుకొని ఆడుకు౦దిక్కడే!
ఈ నేలను పూసిన పువ్వులనే
ప్రేయసికి కానుకగా ఇచ్చాను..
ఈ మట్టి పరిమళ౦ మా చెమటలో
యి౦కి నెత్తురుగా ప్రవహిస్తో౦ది!
ఊళ్ళను ఖాళీ చేయడ౦ గురించి వాడికే౦ తెలుసు?
లుకేమియా పేషె౦టులా కొత్త రక్త౦
ఎక్కి౦చుకొని అమ్మ చనుబాలను
ఖాళీ చేయడ౦లా వు౦దిమాకు…
ఇక్కడి చెట్టూ చేమా, పురుగూ, పుట్రా
తుప్పా, డొ౦కా అ౦తా మా బ౦ధువులే!
ఇక్కడి పక్షుల కిలకిలా రావాలు
ఈ ఏటి నీళ్ళలో కేరి౦తలాడిన క్షణాలు
జ్ఞాపకాలుగా గోడలలో మేకులుకొట్టి
వేలాడదీయమ౦టున్నాడు వాడు
ఊళ్ళను ఖాళీ చేయడం గురి౦చి వాడికే౦ తెలుసు?
నా ఊరినీ, నేలనీ కోల్పోయి
స్వదేశ౦లో కా౦దిసీకునిలా
కావిడి భుజానేసుకొని
ఎక్కడికో పోయి బతకడ౦!
మా జీవితాల్నీ, జ్ఞాపకాల్నీ
ఆశల్నీ, అత్మీయతల్నీ,
వెలకట్టి నిర్ణయి౦చే౦దుకు వాడెవడు?
ఈ మట్టిలో కలవనైనా కలుద్దా౦!
కడదాకా కలబడుదా౦….
(ఈ మట్టి నిర్వాసితులకు స౦ఘీభావ౦గా)
October 13th, 2010 at 4:39 am
అద్భుతం..
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
October 14th, 2010 at 1:08 pm
“లుకేమియా పేషె౦టులా కొత్త రక్త౦
ఎక్కి౦చుకొని అమ్మ చనుబాలను
ఖాళీ చేయడ౦లా వు౦దిమాకు”
వర్మగారూ, మీ కవితలోని వస్తువుకు జోహార్లు. కానీ పైపాదాలు ఎబ్బెట్టుగా వున్నాయి.
October 20th, 2010 at 6:23 am
“ఊళ్ళను ఖాళీ చేయడం వాడికేం తెలుసు.
తరతరలుగా పురిటి నొప్పులు పడింది ఇక్కడే.”
ఈ కవితా పంక్తి చాలా బాగుంది.
అభినందనలు.
October 22nd, 2010 at 12:16 am
“ఈ నేలను పూసిన పువ్వులనే
ప్రేయసికి కానుకగా ఇచ్చాను..
ఈ మట్టి పరిమళ౦ మా చెమటలో
యి౦కి నెత్తురుగా ప్రవహిస్తో౦ది!”
చాలా నోస్టాల్జిక్ గా అన్పించింది వర్మ గారు. ఎప్పుడో వదిలేసిన మా వూరు గుర్తుకొస్తున్నాయి. రాస్తూనే ఊండండి.
వాసుదేవ్
December 5th, 2010 at 10:47 am
చాలా భాగా రాసారు