ఒక ఆటొమేటిక్ పొయెమ్?

కిటికీ ఇవతల నువ్వు
నీకు తోడుగా ఒక అద్దం
లాయిరి పెట్టెకు అమర్చిన అద్దం
చిన్ని కన్ను తాకితే  చెమర్చే అద్దం

కిటికీ అవతల కొబ్బరి చెట్ల చెలికత్తెల మధ్యన
బంగరు రంగు ఆకుల, తెల్లని పూల గుత్తుల
సొమ్ములు ధరించిన రాకుమారి టేకు చెట్టు
పేద వాళ్లం, చట్టం దృష్టిలో పుట్టు దొంగలం
మనమిక్కడ వుండకూడదు, పద పద
వదిలెయ్ వూహల్ని ఆకాశంలోనికి
ఎగరెయ్ గాలిపటాల్ని స్లోమోషన్ తూటాల్ని
స్థలంలోనే కాదు కాలంలోనూ ఎగరనీ వాటిని

ఏమో, ఎక్కడో, ఎప్పుడో

నీళ్లలోంచి వచ్చిన వాళ్లం, ముప్పాతిక భాగం నీళ్లం
దప్పిక తీర్చే చన్నీళ్లం దప్పిక పెంచే కన్నీళ్లం
నీళ్లలోంచి వచ్చి ఇన్నాళ్లయినా, పట్టుకోడానికి
గట్టిదేమీ దొరక్క, కాల్జేతులు కొట్టుకుంటున్నాం
తడి తడి కళ్లను మాత్రం తీసి విసిరేస్తున్నాం
విహ్వల విహంగాల్ని చేసి అనంత నీలిమ లోనికి
లబ్ డబ్ జల్లెళ్లు చేసి భూగర్భం లోనికి
మంథర పర్వతానికి చుట్టి సముద్రం లోనికి

ఎద్దు మీద రంగు రంగుల బట్టలేసుకుని
ఆపైన రెండు జోలెలు వేసుకుని
మేళం ఊదుతూ వెళ్తున్న కవీ!
ఫలానా ఇంటికెలా వెళ్లాలో చెప్పగలవా
మాకు తెలిసేలా?

3 అభిప్రాయాలు »కవితలు

3 Responses to “ఒక ఆటొమేటిక్ పొయెమ్?”

  1. 1
    ramnarsimha Says:

    చాలా బాగుంది.

    అభినందనలు.

    ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in

  2. 2
    razu the alpacino Says:

    dear, ——–hrk, your poem fine as countless houses shine after bathing under the sunlight.. that light, the divine lignt, is free,free free free free free free free free free fre forever ages and eras to come, don’t freighten to look at the sun.

  3. 3
    razu the alpacino Says:

    hrk gaaru,

    the reason behind my errand here is ”the papillon’ you mentioned in your book of your own poems. years ago. n dthanks because of that i saw stevemeqveen and dustin hoffman of lone devils island. my english is not in grammmer, because iam an highschool drop out and a drifter in desserts. i learn english slowly as a sloth moves. and with a viguor of backstreet boy or with obediance of a back district person…….

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో