“పోయిన వర్ణమాల” : మూడు ముక్కలు

1

ఎండా కాలం మాడిసన్ వచ్చినప్పుడల్లా మెమోరియల్ లైబ్రరీకి వెళ్ళడమే మంచి అనుభవంలా అనిపిస్తుంది. లేక్ పక్క నించి చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్ళి, కనీసం రెండు గంటలయినా ఇవాళ రాయాలి అనుకొని, లైబ్రరీలోపలికి, నా ఖైదుకొట్టంలాంటి స్టడీ రూములోకి (అది రూము కాదు, నిజంగానే బోను) అడుగుపెడతాను. గంటా, గంటన్నర గడిచాక మ్యాంగో ఐస్ టీ వైపుకి మనసు పరుగెత్తుతుంది. అలా బయటికి వస్తూంటే, “న్యూ అరైవల్స్” షెల్ఫ్ లో దొరికింది లీసా ఓల్స్టైన్ కొత్త కవిత్వం పుస్తకం “లాస్ట్ ఆల్ఫబెట్”

మాంగో ఐస్ టీ తెచ్చుకొని, లైబ్రరీ మాల్ చెట్ల కింద కుర్చీలో కూర్చొని, లీసా పుస్తకం తెరిచాను. మొదటి వాక్యం నించి చివరి వాక్యం దాకా దాదాపు 92 పుటల పుస్తకం ఇట్టే అయిపోయింది. ఇంత గొప్ప “రీడబిలిటి” వున్న కవిత్వం ఈ మధ్య కాలంలో చదవలేదంటే అతిశయోక్తి కానే కాదు. అందునా, కవిత్వం!  ఈ చిన్న అనుభవం నన్ను ఎంత ప్రభావితం చేసిందంటే,ఇక లైబ్రరీలోకి అడుగు పెట్టిన ప్రతిసారీ, బయటికెళ్ళే ప్రతి సారీ ఈ కొత్త పుస్తకాల షెల్ఫు దగ్గిర గడపడం అలవాటైపోయింది.

పఠనయోగ్యత వొక్కటే కాదు, లీసా వాక్యాలలో ఒక వింత ఆకర్షణ ఏదో నన్ను బలంగా లాక్కుంటూ వెళ్ళింది ఈ పుస్తకంలోకి!

మొదటి విషయం: ఆమె కవిత్వంలో పాద విభజన లేదు. రాను రానూ ఎందుకో పాద విభజన అనేది ఒక అర్ధం లేని నియమం అని నాకు అనిపిస్తోంది. నా ఈ అసంతృప్తిలోంచి రాసిన కవిత “రోజ్ రోటి” (ప్రాణహిత)

నా ఈ అసంతృప్తీ, అన్వేషణా సాగుతున్న దశలోనే, లీసా పుస్తకం చదవడం అనుకోని విధంగా కలిసి వచ్చింది.

రెండో విషయం: లీసా కవిత్వంలోని అనుభవ వైవిధ్యం. ఇది నన్ను ఎక్కువగా ఆకట్టుకున్న రహస్యం.

2

ఏ అనుభవం కవిత్వం అవుతుందన్నది ఆ కవి ఆనుభవిక విస్తృతిని బట్టి వుంటుంది. లోకంతో పని లేని లోలాక్షులూ వుంటారు; లోకాన్ని పట్టించుకొని దాని ఆనుపానులు తెలుసుకునే క్రమంలో కవిత్వం నీడన చేరుకునే వారూ వుంటారు. అంత మాత్రాన్న అవి రెండూ వైరి వర్గాలు కానక్కరలేదు. కానీ, అంతిమంగా కవిత్వ ఆల్కెమీ అనేది ఏదో తెలిసివుంటే తప్ప కవిత్వ వాక్యం పుట్టదు. అప్పుడు ఆ వాక్యాన్ని తుంపులు చెయ్యకపోయినా అది కవిత్వమే అవుతుంది. అనుభవాన్ని గురించి లీసా అంటుంది : “కవిత్వం అనుభవానికి ప్రతిబింబమో, పరావర్తనమో కాదు. కవిత్వమే అనుభవం.”

పైథగరస్ నించి అప్పు తెచ్చుకున్న వాక్యం-on starting a journey, do not turn back- తో ఈ “లాస్ట్ ఆల్ఫబెట్” (పోగొట్టుకున్న వర్ణమాల) లోపలికి నన్ను తీసుకువెళ్ళింది లీసా. ఆ తరవాత చివరి వాక్యం-All those we kept from leaving now are ready themselves to return – దాకా ఇది అనేక అనుభవాల రాదారి.

రెండు కవితలు

(ఒక్కటే బతుకు)

ఇక్కడ కాసేపు వుంటాను కదా అనుకున్న చోటికి వచ్చాను. చంద్రుడు వెళ్ళిపోయాక వొకానొక పాలిపోయిన నక్షత్రం కింద నా కంటే ముందు నా నీడ పాకింది. అదేం ఎక్కువ కాలం వుండదులే – వొక వారం, కాదంటే రెండు వారాలు. ఇంతకు ముందెన్నడూ చూసెరగను దాన్ని. నీటిలాంటి  కాంతిలో పారుతుంది రాత్రి. ఏదో వొక క్షణాన అందరూ బయటికి అడుగు పెడ్తారు. ఎందుకో తెలీదు, అయినా నేనూ ఆ జనంలో కలిసిపోతాను.

(మాయా విరోధాభాస)

2 అభిప్రాయాలు »అనువాదాలు, దర్వాజ

2 Responses to ““పోయిన వర్ణమాల” : మూడు ముక్కలు”

  1. 1
    వాసుదేవ్ Says:

    అఫ్సర్‌జీ, ఈ లీసా ఓల్స్టైన్ గురించి విని ఉన్నాను. ఇక్కడ ఆమె రచన గురించి కొంచెం విస్తృతంగానే చర్చ జరిగింది. కానీ మీ వివరణ చదివాక మనసు కుదుట పడింది. అవును మీరు చెప్పినట్టు ఓ కొత్త ఒరవడే.”కవిత్వమే అనుభవం.” అన్న మార్గదర్శకాలు నా బోటి వాడికి అవసరమే. మీకు నా ధన్యవాదాలు.
    వాసుదేవ్

  2. 2
    sivalakshmi Says:

    లోకం తో పని లేని లోలాక్షులు – అనడం బాలా బాగుంది. లీసా కవితల గురించి ఈ మాత్రమైనా తెలిసినందుకు సంతోషం.మీకు ధన్యవాదాలు.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో