తెలుగు కవిత్వంపై మార్క్సిజం ప్రభావం

ప్రతి సమాజంలోని కవి లేక రచయిత ప్రస్తుతం తన ముందున్న దానికంటే అభివ్యక్తీకరణకు కొత్తమార్గం అన్వేషిస్తూనే వుంటాడు. ఈ అన్వేషణతో సాహిత్యంలో అనేకమైన మార్పులు వచ్చినప్పటికీ సాహిత్యపు మాలాలను తలక్రిందులు చేసే మార్పు అభ్యుదయ సాహిత్య యుగంలోనే వచ్చింది. మానవతావాదం యొక్క గుణాత్మక పరిణామమే అభ్యుదయవాదం. అభ్యుదయం అనే శబ్దానికి ప్రగతి, పురోగమనం అనే అర్థంగా భావించవచ్చు. సాహిత్య రంగంలో ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న వచన కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళిత కవిత్వం, మైనారిటీ కవిత్వం పుట్టుకలకు మూలం అభ్యుదయ కవిత్వమే. అభ్యుదయం కవిత్వం అభివృద్ధికి ప్రధాన భూమిక మార్క్సిజం. సంప్రదాయ సమాజంలోని వేళ్ళూనుకొని వున్న సాంఘిక వ్యవస్థలోని లోపాలతో విసిగిన ప్రజలకు ఒక నూతన సమాజాన్ని ఆచరణ ద్వారా చూపించింది. ఈ మార్క్సిస్టు దృక్పథమే.
”అభ్యుదయమనే మాటను నిర్దిష్టమైన అర్ధంలో తీసుకోవాలి. అభ్యుదయ కవిత్వం రావడానికి అది ప్రదర్శించిన ప్రాపంచిక దృక్పథం కారణం. 19వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాలలో పెట్టుబడిదారి వ్యవస్థ సంపూర్ణంగా ప్రాపంచిక దృక్పథం రూపొందింది. అభివృద్ధి యొక్క విరుద్ధ పరిణామ ఫలితంగా మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం రూపొందింది. మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాల్లోనూ, అంతకుమించి రష్యాలో 1917లో విజయవంతమైన సోషలిస్టు విప్లవంలోనూ, మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథానికున్న శక్తి సామర్ధ్యాలు వెల్లడి అయినవి. మొదటి ప్రపంచ యుద్ధం పెట్టుబడిదారి వ్యవస్థలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ఎక్కువ కాలం పరిష్కరించలేకపోయింది. రష్యాలోని సోషలిస్టు వ్యవస్థ ఒక్కటే ఈ పరిణామాలకు గురికాకుండా నిలిచింది. ఈ క్రమంలో ప్రపంచ మేథావులందరు మార్క్సిజం వైపు రావల్సి వచ్చింది.
తెలుగు కవిత్వం ప్రభావితం కావడానికి ముందు భారతీయ జన జీవితం ద్వారా మార్క్సిజం భారతీయ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసింది. మన జాతీయ కార్యక్రమంలో మేడే ఉత్సవం జరుపుకోవడం ఒక అంశంగా ప్రారంభమైన రోజే మన ఆలోచన మార్క్సిజం వైపు మళ్ళిందనుకోవచ్చు. 1921లో సింగారవేలు చెట్టియారు నేతృత్వంలో మద్రాసులో తొలిసారి మే ఉత్సవం జరిగింది. ఆ తరువాత 1925లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించడం, మార్క్సిస్టు విజ్ఞాన వ్యాప్తికి అధ్యయన కేంద్రాలు వేసవి పాఠశాలలు, రాత్రి పాఠశాలలు నిర్వహించడం తదితర సంఘటనలు మార్క్సిజం యొక్క ప్రభావం సంలీనమై ఉన్న వైనానికి నిదర్శనం.

”తెలుగు కవిత్వంపై మార్క్సిజం ప్రభావం అంటే తెలుగు భాషలోని కవులు తమ కవితా వస్తువును మార్క్సిస్టు దృక్పథం నుంచి దర్శించిన రీతి, దాన్ని రూపొందించుటకు అవలంబించిన రచనా రీతి రెండు అన్నమాట. రెండూ అన్యోన్యంగా ఉండవలసినవే అయినప్పటికీ వస్తుదర్శనమే ప్రాధాన్యం వహిస్తుంది. రచయిత యొక్క సామాజిక, చారిత్రక మార్క్సిస్టు అవగాహన వస్తువులోనే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ విధంగా మార్క్సిజం ప్రభావంతో వచ్చిన తెలుగు కవిత్వం మొదట్లో కొంతకాలం అభ్యుదయ కవిత్వంగా ప్రసిద్ధమైంది. భవిష్యత్తును గురించిన ఆశావహమైన అవగాహన పెంపొందించటమే” మార్క్సిస్టు దృక్పథం. ప్రపంచగతిని అర్థం చేసుకొనుటకు ఒక పద్ధతిని మార్క్సిస్టు అవగాహనకు మంచి పునాదిని నిర్మించింది శ్రీశ్రీ.
1939 అక్టోబర్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా 90 వేల మంది కార్మికులు సమ్మె చేశారు. ఈ పరిస్థితుల వల్ల ప్రభావితుడైన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ రాసారు.
” ఏదేశ చరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం
నరసజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం”
అని దేశ చరిత్రల్లోని ఆంతర్యాన్ని సూచిగా చెప్పాడు. ఈగేయం గతితార్కిక భౌతికవాదానికి అద్దం పడుతోంది.
” ఏ శిల్పం ? ఏ సాహిత్యం ?
ఏ శాస్త్రం ? ఏ గాంధర్వం ?
ఏ వెల్గులకీ ప్రస్థానం ?
ఏ స్వప్నం ? ఏ దిగ్విజయం”
ఇదీ మార్క్సిజం ప్రభావంతో శ్రీశ్రీ కవిత్వంగా ప్రతిపాదించిన సాహిత్య సిద్ధాంతం. ఇదంతా చరిత్రను గురించిన మార్క్సిస్టు అవగాహన. ఈ రకమైన అవగాహన సాహిత్యాన్ని రచించడానికి, అర్థం చేసుకోవడానికి కూడా మార్గదర్శకంగా పనిచేస్తుంది.
” కప్పులేని గుడిసెలు వేయ్‌ కలగట్టినోయ్‌
గొ ప్పవారి మేడొ క్కటి కులుకుతుంటాది
వెన్నునంటి కడుపులు వేయే కలగబెట్టెనోయ్‌
ఉన్నవారి బొర్ర ఒకటి ఉబ్బుతుంటాది”
అని అనిసెట్టి సుబ్బారావు ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డల గురించి చక్కగా చెప్పారు. ఉత్పత్తి సాదనకు అత్యధిక సంఖ్యాకులు తమ శ్రమను ధారపోస్తుండగా, ధనికులు సర్వసంపదలు అనుభవిస్తున్నారని దోపిడీ నీతిని నిరసించారు.

ఈ నాగరికతలోని యాంత్రికత్వాన్ని, కపటాన్ని తమ కొన్ని కవితల్లో నారపరెడ్డి రామిరెడ్డి చెప్పారు.
” ప్రతి చేయి నమస్కరిస్తుంది
అయితే ఆ మనస్సులలో
మనస్సులేదు
ఆ చేతులకది
అలవాటయిందీ
సిగ్నల్‌ రెక్కల వలె”
అని ఒక కవితలో ఆయన అన్నారు. పెట్టుబడిదారి వ్యవస్థ అంతకు ముందున్న మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేసి, స్వార్థంతో అన్నార్థమైన ఆర్థిక సంబంధాలను కల్పించింది.
సమాజంలో పేద ప్రజల కష్టసుఖాలను, దోపిడిని వర్గ దృక్పథంతో వర్ణించింది. అభ్యుదయ కవిత్వం ”బానిసల చెడు బ్రతుకులే ఈ ప్రభువుల పానువులా” అని అడవి బాపిరాజు అన్నప్పుడు స్పష్టంగా వర్గ దృక్పథం యొక్క ప్రభావం కనిపిస్తోంది.
” నీ పిల్లలను ఇల్లాలిని
కిల్లీ మాదిరిగా నమిలే
మిల్లు మ్యాగ్రెట్లు
నీవేడి వేడి నెత్తురుతో
‘షవర్‌ బాత్‌’ తీసుకునే
భువనైక ప్రభువులు
వారంతా ప్రభువులు !
ప్రభువులు !! (   )
అని దాశరధి కృష్ణమాచార్యులు వర్గ దోపిడిని చిత్రీకరించారు. ‘కూటి కోసం కూలీ కోసం పట్టణంలో బ్రతుకుదామని’ వచ్చిన వారిని ఆధునిక పరిశ్రమలు పీల్చి పిప్ఫి చేస్తాయి. ఆరుద్ర ‘త్వమేహం’ లోని ‘చిరంజీవి మానవునకు మృత్యువు’ లాంటిది. కవితల్లో ఈమధ్య తరగతి జీవన చిత్రీకరణ కనిపిస్తుంది.
”ఎవడు ఇక్కడ రైతు
ఎవడు ఇక్కడ రాజు
కష్టించు వారొకరు
కాజేయు వారొకరు  (   )

అని పొట్లపల్లి రామారావు గారు తమ ఆత్మనివేదనలో అన్నారు. పై కవితలో శ్రమజీవికి ఉన్న ప్రాధాన్యతను, శ్రమజీవిని దోపిడి చేస్తూ అధికారం చలాయిస్తూ ఉన్నత వర్గాన్ని చిత్రీకరించారు.
నారపరెడ్డి రామిరెడ్డి గారు తమ ‘అశ్రుమల’ అనే కవితా సంపుటిలో రైతుల, కార్మికుల శ్రమను దోపిడి చేస్తున్న విషయాలను తెలిపి, సామ్యవాద ప్రస్తావన చేసి, శ్రమజీవుల రాజ్యంతో దోపిడి అంతమైపోతుందని తన ఆశావాదాన్ని ప్రకటించారు.
”అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం
అనాధుడికి, ఆగర్భ శ్రీమంతుడికీ మధ్య”
అని కె.వి. రమణారెడ్డి ఉన్న, లేనివాని మధ్య జరిగే సంకుల సమరాన్ని ‘అడవి’ అనే కవితా సంకలనంలో వివరించారు.
”భూరి వృక్షం జారిపడ్డపుడే
లేత మొక్కలేస్తుంది పసిడిమేడ పక్కకొ రిగినపుడే
అడుగు గుడిసె నడువనేరుస్తుంది”
అని సి. నారాయణ రెడ్డి ప్రతీకాత్మకంగా పై భావాన్నే వ్యక్తీకరించారు. తెలుగు సాహిత్యంలో నక్సల్బరీ శ్రీకాకుళ పోరాట గర్జనలు వినిపిండం మొదలైనప్పటి నుంచి అప్పటి వరకు పోరాట జీవ ధాతువులో వెలువడిన కవిత్వాన్నంతటినీ విప్లవ కవిత్వమనే అంటున్నారు. ఈ విప్లవ కవిత్వం మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనల ప్రభావంగానే వెలువడింది. విప్లవ కవిత్వం యొక్క ప్రధాన లక్ష్యం విప్లవ చైతన్య ప్రభోదం.
” ఈ దొంగల రాజ్యాంగం
రచనే ఒక కుట్ర అనీ
శ్రమజీవుల శ్వాసలతో
పాడుతాం  పాడుతాం”
అంటూ చెరబండరాజు గొంతు విప్పాడు. ఆధునిక పరిపాలన రూపమైన పార్లమెంటరీల ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఆస్తి సంబంధాలను తెలిపేదిగా వుంటుంది.
1972లో ‘స్వాతంత్య్ర రజతోత్సవాలు జరిగినప్పుడు ఎంతో మంది విప్లవ కవులు బూటకపు స్వాతంత్య్రాన్ని తమ కవితల ద్వారా ఎత్తిచూపారు.

” స్వరాజ్యం అంటే నల్లదోపిడి అనీ
ప్రజాస్వామ్యమంటే పోలీసు రాజ్యమని
సోషలిజం సామ్రాజ్యవాదం ముద్దుపేరని
ఆగస్టు 15 రాకపోతే
మాకు అర్థమయ్యేది కాదు”
ఆ రాజ్యాంగం గొప్పగా ప్రకటిస్తున్న ఆదర్శాలను, నాయకులు, వేదికలెక్కి చెపుతున్న విషయాలను పెండ్యాల వరవరరావు బహిరంగ పరిచారు.
విప్లవ కవిత్వోద్యమ మార్క్సిజాన్ని ఊపిరిగా సాహిత్యపరంగా కంటే సామాజికంగా ఎక్కువ సంచలనాన్ని కల్గించింది.
” చరిత్రలో విరుద్ధ శక్తుల
పరస్పర సంఘర్షణ
పుడమితల్లి పడుతున్న
విప్లవ ప్రసవవేదన”
అంటూ ‘విప్లవం వర్ధిల్లాలి’ కవితలో మార్క్సిజాన్ని నొక్కి చెప్పారు. 1977 తరువాత విప్లవ కవిత్వం వెలువడింది. శ్రీశ్రీ ‘మరోప్రస్థానం’, చెరబండరాజు ‘పల్లవి’, వరవరరావు ‘స్వేచ్ఛ’, శివసాగర్‌, ‘ఉద్యమం నెలబాలుడు’రమణారెడ్డి, ‘జైలు కోకిల’, ‘సూరీడు మావోడు’, నిఖిలేశ్వర్‌ ఈనాటికీ బొ జ్జాతారకం ‘నది పుట్టిన గొంతుక’ మొదలైనవి ఎన్నో కవితా సంకలనాలు వచ్చాయి. తెలుగు సాహిత్యంలో వచన విభాగానికి, కవిత్వ విభాగానికి మార్క్సిజం ప్రభావాన్ని అనన్యంగా కలిగించిన కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, ఈ యువ రచయితల ఉద్రేకం తాము పొందారు. విప్లవ రచయితల సంఘం దాపరికం లేకుండా మార్క్సిజాన్ని తన ధ్యేయంగా ప్రకటించింది. మార్క్సిజం ఆధునిక భావచేతనలో ఒక ప్రధానమైన అంశం. వర్గాలు వాటి మధ్య ఘర్షణలు ఉన్నంతకాలం మార్క్సిజాన్ని కాలదోషం పట్టదు. సాహిత్యంలో మార్క్సిజం ప్రభావం అంతర్‌ ప్రవాహంగా వుంటుంది.

ఒక అభిప్రాయం »Uncategorized, సాహిత్య వ్యాసాలు

One Response to “తెలుగు కవిత్వంపై మార్క్సిజం ప్రభావం”

  1. 1
    kcube Says:

    తెలుగు కవిత్వంపైన అంటే తెలుగు సమాజంపైనే మార్క్సిజం ప్రభావం ఎంతగా వుందో అర్థమతుతోంది. కవిత్వమైనా, పాటైనా, సాహిత్య ప్రక్రియ ఏదైనా సమాజంనుండే వుద్భవిస్తుంది. లేకుంటే దానికి సార్థకత వుండదు. నేడు గ్లోబలైజేషను, సరళీకరణల పేరుతో పెట్టుబడిదారీ సమాజం కా.లెనిన సామ్రాజ్యవాద అంత్యదశకు చేరుకుంటోందన్న దానికి నానాటికీ దాని పతనం మన కళ్ళముందు కనిపిస్తోంది. సంక్షోభాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏదో ఒక బూచి చూపించి యుద్ధాలు చేస్తూ వాయిదాలు పొందడానికి నానా పాట్లు పడుతోందన్నది సత్యం. There is no alternative అని విర్రవీగుతున్న అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఎప్పటికీ మార్క్సిజమే విరుగుడు. సమాజం గతితార్కిక చారిత్రక భౌతిక వాద సూత్రీకరణ ప్రకారం సర్పిలాకారంలో ముందుకు పోతుంది. ఆ క్రమంలోనే అభ్యుదయ, విప్లవ, దళిత, స్రీవాద, మైనారిటీ వాద సాహిత్యం పుట్టుకొస్తోంది. అంతిమంగా ఇది సమ సమాజ లక్ష్యంగానే కొనసాగుతుంది. మీ వ్యాసం ద్వారా నా కర్థమైన భావాన్ని ఇలా ఇక్కడ….
    ధన్యవాదాలు..

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో