Oct2010
ట్రిగ్గర్ మీద ఒకజననం ఎప్పుడూ ఉంటుంది
మౌనమైనాన్ని కరిగించి ఒకవాక్యం ఎత్తుకుందామంటే
భయం పాముపిల్ల చాయ కనిపిస్తుంది.
ఏది ఏమైనా ఓకమరణం నిజమనీ, ఒక భయంచాయ తరుముతున్నప్పుడు
పాముపిల్లను చంపకుంటే,ఒళ్ళంతా పుట్టపెరిగి
పాముల సొది ఔతుంది.
ఒకమరణం తరువాత ఓకన్జననం కూడా ఉండలి.
నన్ను అడిగితే మరణం లేకుండా మనిషిజీవి ఉండాలంటాను.
ఆకలి అనిపించినప్పుడు
అలసట అనిపించినప్పుడు
చరిత భూమిని బెల్లంముక్కలా కొరుక్కు తింటే
ఒకడా…. ఇద్దరా….. ఎందరో మరణం లేకుండా
వాయురెక్కలతో నిప్పుపక్షులై తిరుగుతున్నారు
ఒకమరణం లేకుండగానే_____
ఒకరాత్రి, ఇప్పుడు పగలు కూడా, ఒకపిస్తోలు పేల్చి
మనిషి మనుషులు చచ్చిపోయారని వెర్రి ఆనందంతో…..,
లోపల భయంతో…, కుక్కమూతి నక్కలు
ఎప్పటివలె పైశాచిక కథలు, ఎన్నోమార్లు చెప్పుకున్న
పాకర కథానికలే చెప్పుకుంటున్నవి.
ఇదీ శతజయంతుల ఉత్సవాల శ్రీ వికృతి సంవత్సరం కదా!
మరి ఎన్ కౌంటరుల ఉత్సవాల కథల సంబరాలు కూడా
జరుపుకోవాలిసిందే,
జరుపుకోనీయండి___
రేపు ఎలాగో
పొదల మధ్య….. గుట్టల మధ్య….. చెట్ల ఆకుల మీద…..
ఆకుల తీగల మీద….. పురిటితల్లి పెదవుల మీద…..
రక్తపు చినుకుల జల్లులు…., మౌనాన్ని ముద్దాడి
ఒక వాక్యానికి పురుడు పొస్తుంది ఎప్పటివలె___
నన్ను అడిగితే ఓకజననం ఎప్పుడూ ఉంటుంది
మరణం లేకుండగానే____
విరులు విరులుగానే ఒకపువ్వు ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది.
హిమపర్వత శిఖరానికి శిరస్సుగా ఎప్పుడూ ఓకపిల్లోడు
సూర్యబొమ్మను గీస్తూనే ఉంటాండు_____
మరణం లేకుండా మనీషి
చరిత భూమిని పునీతం చేస్తున్నట్లు…..
ఒకపిస్తోలు తిరిగి పేల్చబడుతుంది
ట్రిగ్గర్ మీద ఓకజననం ఎప్పుడూ ఉంటుంది
మరణం లేకుండగానే___
October 12th, 2010 at 11:04 pm
ఎదను హత్తుకునేలా అమరత్వాన్ని కవిత్వీకరించిన జనజ్వాలకు అభినందనలు. నిజంగానే ఉద్యమ సూరీడు హిమవత్పర్వతాల శిఖరాగ్రాన ఉదయించాలని ఆశిస్తూ..