Search Results for "జ్వాలాముఖి"

శ్రీశ్రీ వచన సాహిత్యం- సామాజిక దృక్పధం

కవిత్వాన్ని ఎంత సామాజిక బాధ్యతగా రాశాడో, వచన రచనలూ అంతే బాధ్యతగా రాసినట్లు శ్రీ శ్రీ గద్య రచనలు చూసినప్పుడు గ్రహించగలం.కవిత్వంలో శ్రీశ్రీ స్పశించిన కోణం లేనట్లుగానే వచనంలో చేపట్టని ప్రక్రియలేదు.శ్రీశ్రీ వచన రచనలన్నిటిని కల్పనాత్మక సాహిత్యం, కల్పనేతర సాహిత్యంగా విభజించవచ్చు.కల్పనాత్మక సాహిత్యంలో నవలలు, కథానికలు , నాటికలు పేర్కోనగా కల్పనేతర సాహిత్య ప్రక్రియల్లో వ్యాసాలు , పీఠికలు, సంపాదకీయాలు, ప్రజ, సమీక్షలను పేర్కోనవచ్చు. వీటిలో సామాజిక దృక్పధాన్ని శ్రీశ్రీ ప్రదర్శించిన తీరును వివరించడం ఈ వ్యాస పరిధి. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

వక్త్‌ కీ ఆవాజ్‌

సలాం హైదరాబాద్‌ లోకేశ్వర్‌ ఆత్మచరిత్రాత్మక నవల. తెలంగాణ నవల అన్నాడు గానీ ఇది చార్మినార్‌ ఆత్మ చరిత్రాత్మక నవల. హైదరాబాద్‌ ఆత్మ చరిత్రాత్మక నవల. 1969లో ప్రత్యేక తెలంగాణ పోరాట ఉద్యమానికి గుండెకాయ వంటి హైదరాబాద్‌ అరుదయిన చరిత్ర, అణచివేయబడిన పోరాట చరిత్ర రాసాడు గనుక తెలంగాణ హైదరాబాద్‌ అద్దంలో తన ప్రతిఫలనం చూసుకున్న నవల. అద్దంలో ప్రతిబింబం తప్ప ప్రతిఫలనం కనిపించదు కదా. అందుకే ఈ నవల అద్దం కాదు. హైదరాబాద్‌ చుట్టూ, స్వామిని, వేణును, హైదరాబాద్‌ను, సికిందరాబాద్‌ను కలిపిన హుసేన్‌సాగర్‌ అలల్లో తమ స్నేహాలను, స్వప్నాలను చూసుకున్న నవల.
స్వామిని, వేణును కలపడమంటే తెలంగాణను శ్రీకాకుళాన్ని కలపడం కూడ. స్వామి దగ్గర బయల్దేరి వేణు దగ్గరికి చేరుతామా, వేణు శ్రీకాకుళ ఉద్యమంలోకి వెళ్లిన ఉత్తరం చదువుకుందామా – శ్రీకాకుళం తెలంగాణకు నడచివచ్చిన, కాదు తూర్పుగాలియో, సముద్ర కెరటమో సుడిగాలివలె, తుపాను వలె నాలుగు దిక్కుల చుట్టివచ్చిన ఉదంతం చదువుకుందామా. తుర్రెబాజ్‌ఖాన్‌, అల్లావుద్దీన్‌ల అమరత్వంతో ఆరంభమై ఈ నవల నడుస్తున్న చరిత్రలోని నలభై ఏళ్ల కింద అధ్యాయం దగ్గర ఆగినట్లు (ముగిసినట్లు కాదు) వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంల అమరత్వంతో సెట్‌ బ్యాక్‌కు గురయి అసంపూర్ణంగా ముగిసిన ప్రజాస్వామిక విప్లవ చరిత్ర చదువుకుందామా. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు, ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

నేనెరిగిన శ్రీశ్రీ

మద్రాసులో పుట్టిపెరగడంవల్లనూ, మా ఇంట్లోని తెలుగు సాహిత్యవాతావరణంవల్లనూ శ్రీశ్రీగారిని నేను చాలాసార్లు, చాలా సందర్భాల్లో చూశాను. మా కుటుంబానికి అనేక తెలుగు స్థానికరచయితల, కళాకారుల కుటుంబాలతో పరిచయాలుండేవి. వీరిలో శ్రీశ్రీ ధోరణి కాస్త వేరుగా ఉండేది. ఆయనకు మా అమ్మకూడా చాలా ఏళ్ళుగా తెలిసినప్పటికీ ఆయన సంభాషణా, సంపర్కమూ మానాన్నవరకే పరిమితంగా ఉండేది. తన కుటుంబాన్ని పరిచయం చెయ్యడంగాని, మా కుటుంబసభ్యులతో మామూలుగానైనా మాట్లాడడంగాని ఆయన చేసేవారుకాదు. మొత్తం చదవండి »

38 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

ఫిబ్రవరి 2009 సూచిక

కవితలు

అభిప్రాయాలు లేవు »సూచిక

జ్వాలాముఖి – తుది పయనం

డిసెంబర్‌ 12 నుంచే జ్వాలాముఖికి ఆరోగ్యం వికటించిందని, ఆయనను ఆసుపత్రిలో చేర్చారని తెలుస్తూనే ఉన్నది. వెళ్లి చూడాలని అనుకుంటుండగానే డిసెంబర్‌ 14 వచ్చేసింది. ఆ రోజు ఆయనను చూడడానికి బయల్దేరుతుండగానే సాయంత్రం నాలుగు గంటల సమయమనుకుంటాను ‘జ్వాలాముఖి చనిపోయారట’ అని రజని ఫోన్‌ చేసింది. వెళ్లే వరకే ఆసుపత్రిలో వందలమంది ఉన్నారు. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సంస్మరణ

జనవరి 2009 సంపాదకీయం

ప్రాణహిత జనవరి 2009 సంచికకు స్వాగతం!
ప్రాణహిత పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

Hope
Hope

చూస్తుండగానే 2008 వెళ్ళిపోయింది. రక్త సిక్తమైన పాదాలతో మన జీవితాల మీదుగా, చెప్పలేనంత దుఃఖాన్నీ ఎన్నెన్నో మానని గాయాల్నీ మిగిల్చి కర్కశంగా వెళ్ళిపోయింది. ఒక పెద్ద సముద్రపుటల ఊడ్చి వెళ్ళిన తర్వాత మిగిలే విషాదమూ, నిశ్శబ్దమూ మిగిల్చి వెళ్ళి పోయింది. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సంపాదకీయం

జనవరి 2009 సూచిక

కవితలు

అభిప్రాయాలు లేవు »సూచిక

నిశ్శబ్ద విప్లవం శీలా వీర్రాజు

- జ్వాలాముఖి

కొందర్ని చూస్తే నమస్కరించాలనిపిస్తుంది. అలాంటి సాత్వికుల్లో శీలావీర్రాజుగారొకరు – సాత్వికత బలహీనత కాదు – అన్నీ తెలిసి కాలపరిమితి కనుగుణంగా చేయదగిన మేలును ఎన్నుకున్న రంగంలో చేయగలగడం తక్షణ కర్తవ్యం.

కవికావడమంటేనే కన్నీటి ప్రపంచాన్ని పట్టించుకోవడం – ఈ కన్నీటి ప్రపంచంలో జీవితపు కొరతలు పేరుకొని పీడిస్తాయి – ఆ పీడనతో కాస్త ఆత్మ స్థైర్యం కలిగించడానికి చేసే సంస్కార ప్రయత్నమే సాహిత్యం.

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు

డా కానూరి హరీష్ స్మృతిలో …

నీవు లేవు నీ మాట ఉంది…

- గుఱ్ఱం సీతారాములు.

వైద్యవృత్తినివదిలి సమాజానికి శస్త్రచికిత్స చేయడం కోసం ప్రాణాలర్పించిన డా|| చాగంటి భాస్కరరావు త్యాగం గూర్చి మనకు తెలుసు. పౌరహక్కుల ఉద్యమంలో రాజ్యం కసాయి తనానికి బలి అయిన డా|| రామనాధం కూడా తెలుసు. వారి స్ఫూర్తితో శాస్త్రీయ అవగాహన, సేవానిరతి, త్యాగం అలపర్చుకొని ప్రజలకు వైద్య సేవలందిస్తూ వచ్చిన ఖమ్మం పట్టణ ప్రముఖ వైద్యులు డా|| కానూరి హరీష్‌ మనకికలేరు. వారు సెప్టెంబర్‌ 22, 2006న కన్నుమూసారు.
మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సంస్మరణ

విశాల ప్రజాస్వామిక సాహిత్య వేదిక అవసరం ఎంతైనా ఉంది – నిఖిలేశ్వర్

Nikhileshwar
Nikhileshwar
“ప్రజాస్వామిక విప్లవం కోసం కృషి చేసేటందుకు
విశాల ప్రాతిపదిక పై సాహిత్య వేదిక ఏర్పడాలి”
- – - – - – -
“దిగంబర కవిత్వం సామూహిక సృష్టి –
ఏ ఒకరూ నాయకుడు కానీ ప్రయోక్త కానీ కాదు”

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »ఇంటర్‌వ్యూలు