మా గురించి
ప్రాణహితకు స్వాగతం!
ప్రాణహిత. ప్రాణాలని నిలిపే నది పేరు. తెలుగు ప్రజలకు ప్రాణసమానమైన గోదావరికి ఉపనది. కరువుతో అల్లల్లాడే తెలంగాణా ప్రాంత ప్రజల జీవనాడిగా కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరిలో సంగమిస్తుంది. ప్రజల ప్రాణాలను నిలపడమే కాదు కలలనీ, కన్నీళ్ళనీ, కష్టాలనీ, పోరాటాలనీ ప్రతిబింబిస్తుంది. ప్రాణహిత పరీవాహక ప్రాంతమంతా గొప్ప చరిత్ర గల ప్రాంతం. చైతన్యం తొణికిసలాడే ప్రజల నిరంతర చలనశీలతకు ప్రాణహిత పర్యాయపదం. నిరంతర పేదరికమూ, కష్టాలూ, దోపిడీ, పీడనల్లోంచి మార్పు కోసం, విముక్తి కోసం, ఒక మంచి సమాజం కోసం, ఒక మెరుగైన భవిత కోసం, తపన పడే ప్రజల కోర్కెలను ప్రతిబింబించే తెలుగు సాహిత్యానికి ఒక వేదిక కాదలుచుకున్నాం కాబట్టే మేము మా వెబ్ పత్రికకు ప్రాణహిత అని పేరు పెట్టాం. నదీమ తల్లి ప్రాణహిత తెలుగు ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ఎట్లా ప్రతిరూపమవుతున్నదో మా వెబ్ పత్రిక కూడా అట్లే ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు సాహిత్య ప్రతిరూపం కావాలని మా కోరిక.
ఇవాళ తెలుగునాట సాహిత్యం విరివిగా వస్తున్నది. రాశిలోనూ, వాసిలోనూ, ప్రపంచభాషల్లో ఏ సాహిత్యానికీ, ఎంత మాత్రమూ తీసిపోని తెలుగు సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. దీనికి కారణాలు అనేకమున్నాయి. తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అంతే విరివిగా అనువాదం చేయబడకపోవడం ఒకటయితే, కెరటం మీద కెరటంలా ముందుకొస్తున్న తెలుగు సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్త పాఠకులకు అందించేందుకు సరియైన వేదికలు లేకపోవడం కూడా ఒక ముఖ్యమైన కారణం. తెలుగు నేలమీద పత్రికలే తెలుగు సాహిత్యానికి సరియైన స్థానం ఇవ్వడంలో కొంత వెనుకబడే ఉన్నాయన్నది వాస్తవం. అందుచేత అంతర్జాతీయంగా పాఠకుల కోసం తెలుగు సాహిత్యానికి సరికొత్త జాగాలని సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరీ ముఖ్యంగా ప్రజల జీవన్మరణ పోరాటాలనీ, రేపటి కోసం వారి కలలనీ ప్రతిఫలించే సాహిత్యానికీ, సమరశీలత గల సాహిత్యానికీ ఇవాళ ఎన్నో వేదికలు కావాలి. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడుతూ, ప్రజల న్యాయమైన కోర్కెలను ప్రతిఫలించే సాహిత్యానికి, బహుళ ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ ద్వారా అట్లాంటి ఒక వేదిక ఏర్పాటు చేయడమే ప్రాణహిత లక్ష్యం.
తెలుగునేల మీద సజీవంగా ప్రవహించే ప్రాణహిత, ప్రజల సజల నయనాల్లో వికసిస్తున్న సాహిత్యాన్ని మీ ముందుకు తేవడానికి, కొత్త ఊపిరులనిస్తూ మాకు ఆలంబనవుతున్నది. మాలో నూతనోత్సాహమై ఉరకలేస్తున్నది.
“అణగారిన ప్రజల కేకలు ఎప్పుడూ న్యాయమైనవే కావాల్సిన అవసరం లేదు, కాని వాటిని వినడానికి నిరాకరిస్తే అసలు న్యాయమంటే ఏమిటో తెలిసే అవకాశం లేదు.” అన్నది ప్రాణహిత మాకిస్తున్న సందేశం.
తెలుగునేల మీదనున్న విభిన్న సమూహాల ప్రజల సాహిత్యం, నిర్దిష్టంగానూ, విస్తారంగానూ, బహుముఖంగానూ ముందుకొస్తున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు తమ ప్రాంతీయతను, సామాజిక, సాంస్కృతిక అస్తిత్వాలను ప్రకటిస్తూ, కుల, మత, లింగ వివక్షలను వ్యతిరేకిస్తూ, అతి సూక్ష్మ నిర్దిష్టతతోనూ, అంతే విశాల విశ్వజనీనతతోనూ, సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. ఉదాహరణకు తెలంగాణా నుండి వస్తున్న సాహిత్యం ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రకటిస్తూ, ప్రపంచీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అట్లే కుల వివక్షను వ్యతిరేకిస్తూ, మరీ నిర్దిష్టంగా రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఉద్యమిస్తూ, గ్లోబల్ గా సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తున్న సాహిత్యం వస్తున్నది. తెలుగు సాహితీ చరిత్రలో ఇది ఒక అపురూపమైన సన్నివేశం. కనీ వినీ ఎరుగని గొప్ప చారిత్రిక సందర్భం. తెలుగు సాహిత్యానికి ఇవాళ ఉన్న వైవిధ్యమూ, విస్తృతీ, భిన్నత్వమూ ఒక అద్భుతమైన వాస్తవం. అటువంటి సాహిత్యం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం విచారకరం. ఒకవేళ వచ్చినా, అనేక అపోహలవల్ల అడ్డంకులవల్ల వడపోతలవల్ల ప్రజల పక్షం నిలిచిన సాహిత్యం వెలుగు చూడడం లేదు , ముందే ఏర్పర్చుకున్న అభిప్రాయాల మధ్య, దురభిమానాల మధ్య దుర్భ్రమల మధ్య ప్రత్యామ్నాయ సాహిత్యం మరుగున పడిపోతున్నది. అణగారిన తెలుగు ప్రజల జీవితాన్ని ప్రతిబింబించే సాహిత్యం, ‘అసలు సాహిత్యమే కాదు’ అనే తప్పుడు కొలమానాలతో, నిర్ణయాలతో తొక్కేయబడుతున్నది. అటువంటి సాహిత్యాన్ని, విలువల కోసం నిలబడ్డ సాహిత్యాన్ని, ప్రాణహిత ద్వారా అందరికీ అందించాలనేదే మా ముఖ్యోద్దేశం. తెలుగునేల మీద ఏ మూల నుండైనా సరే, ఏ ప్రజాసమూహం నుండైనా సరే ప్రజాస్వామిక విలువల కోసం నడుం కట్టి, ప్రజల న్యాయమైన కోర్కెలను ప్రకటించే సాహిత్యం ఏదైనా సరే మేం మీ ముందుకు తేదల్చుకున్నాం. ప్రజల ఆర్తిని, ఆవేదనను వినిపించే సాహిత్యానికి మేము ‘వెర్రిగొంతుకనిచ్చి మోస్తాము’ .
అయితే ప్రజలు తమ కోర్కెలను వ్యక్తీకరిస్తూ ఒక కొత్త విలువల వాతావరణాన్ని నిర్మించే ప్రజాస్వామిక క్రమంలో అనేక విభిన్న అభిప్రాయాలు, వాటి మధ్య స్నేహపూర్వక ఘర్షణలు ముందుకు రావడం సహజం. కొన్ని సార్లు ఈ ఘర్షణ వైరంగా కూడా మారడం జరగొచ్చు. అంతమాత్రాన ఆయా ప్రజల కోర్కెలు న్యాయమైనవి కాకుండా పోవు. అయితే చర్చలు, అభిప్రాయాల మధ్య ఘర్షణ స్నేహపూర్వకంగా, నిర్మాణాత్మకంగా జరిగితేనే అవి వేల పూలు వికసించే వాతవరణాన్ని సృష్టించగలుగుతాయని మా నమ్మకం. అటువంటి స్నేహ పూర్వక చర్చలకు ప్రాణహిత ఎప్పుడూ స్వాగతం పలుకుతూ వీలయినంత వరకు శతృపూరిత వివాదాలకు దూరంగా ఉంటుంది. ప్రధానంగా, విభిన్న గొంతుకల సమ్మేళనమై వినబడే ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యానికి క్రియాశీల వేదిక కావడమే ప్రాణహిత లక్ష్యం. అట్లే ప్రపంచవ్యాప్తంగా, దేశ దేశాల్లో ప్రజల పక్షం నిలబడ్డ సాహిత్యాన్ని తెలుగు చేసి మీకందించే ప్రయత్నం చేస్తాం. మా ప్రయత్నానికి మీ అందరి ఆదరణ, తోడ్పాటు ఎంతో అవసరం. మీ సహకారం లేకుండా మా ప్రయత్నం విజయవంతం కాలేదు. పాఠకులుగా మా వెబ్ పత్రికను చదివి, ఆదరించి, మీ నిర్మొహమాటమైన అభిప్రాయాలు ప్రకటించి మేము మరింత సమర్థవంతంగా మా లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి నిర్మాణాత్మకంగా తోడ్పడాలని మా సవినయ విన్నపం. అలాగే ప్రాణహిత కోసం రచనలని – కవిత్వం, కథ, వ్యాసం, విమర్శ, నవల లాంటి విభిన్న సాహిత్య ప్రక్రియలేవైనా సరే మాకందించాలనీ, ధారావాహికంగా ప్రాణహిత సజీవంగా ప్రవహించడానికి మీవంతు తోడ్పాటునివ్వాలనీ మా విజ్ఞప్తి.
చివరగా ఒక్క మాట. ప్రాణహితలో ప్రచురించే రచనల్లోని అభిప్రాయాలు ఆయా రచయితలవి మాత్రమే.
-
నారాయణ స్వామి
-
ప్రకాశ్
-
ఆనంద్
-
హిమ బిందు
-
మమత
-
జయప్రకాశ్
-
చైతన్య
Sub Pages List
63 అభిప్రాయాలు »
September 11th, 2008 at 2:37 am
తాడేపల్లి గారు
మీ అభిప్రయము తొ విభెదిస్తున్నాను
perception without perspective Perspective without Perception useless
అన్న విశయము మీకు తెలుసా
sectariane bias చారిత్రిక అవసరము
ఒప్పు కొకుంటే adasity అవుతుంది
అస్తిత్త్వ ఉద్యమాలు చారిత్రకముగా సరియైనది
Theoritically wrong.
alaa kaakunte daispora,dalitha streevaada, mainaarity gontulu
kaala garbham lo kalisipoundevi
telusaa
astitwa udyamaalu sangatita udyamaalanu balahinaparichinaa,
konta charcha jaragataaniki tidpadinadane visyaanni marchipokandi
ok http: gurramseetaramulu.blogspot.com lo KONNI EMUKALU INKONNI GINJALU chadavandi .
September 29th, 2008 at 5:58 am
యురేకా, నేను వెతుకుతున్నది దొరికింది. నేను ఈ మధ్యనే బ్లాగులను వెతుకుతున్నాను. ప్రాణహిత నేను అనుకున్నట్లుగా ఉంది. సంపాదకులకు నా అభినందనలు.
February 15th, 2009 at 9:53 pm
మీరు అమెరికా లొ ఇంత మంచి అలొచన తొ చెయదమ్ చాలా గ్త్గొప్ప. All the very best.
March 5th, 2009 at 10:45 pm
ప్రాణహిత పాఠక హితముగా ఉంటోంది.. ముఖ్యంగా ఇందులోని కవితలు బావుంటున్నాయి.
ఇంకా మంచి సాహిత్య వ్యాసాలు రావాలని నా అభిలాష.
June 15th, 2009 at 12:55 pm
మీ పత్రికలో టైపోలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సంపాదకులకు తక్కిన సంపాదకవర్గ సభ్యులు సహాయం చెయ్యకపోతే ఇటువంటి లొసుగులు తప్పవు. రచయితల పేర్లు కూడా (రాచాపాళెం వగైరా) సరిగా పడటంలేదు. ఇది క్షమార్హం కాదు.
June 15th, 2009 at 10:22 pm
కొడవగంటి రోహిణీప్రసాద్ గారి సంగీత వ్యాసాలు చాలా బావుంటున్నాయి.
September 12th, 2009 at 4:10 am
చాలా మంచి ప్రయత్నం. ఇలాగే కొనసాగించండి
సుధకర
December 3rd, 2009 at 1:36 pm
జై తెలంగాణ ! జై జై తెలంగాణ !! జై తెలంగాణ ! జై జై తెలంగాణ !!!
April 25th, 2010 at 2:46 am
ఎ
ఎడిటర్ గారికి,
ఆంగ్ల భాషా వ్యామొహమె మన దెశంలొని అన్ని సమస్యలకు కారణమని నా అభిప్రాయం.
మాత్రుభాషలొ విద్యాబొధన పై చర్చను ప్రారంభించాల్సిందిగా కొరుతున్నాను.
పాటకులకు,
మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాను.
99660_95258.
e_mail : rputhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=HKxsJQVpM2Cqpq8x5AKrByhaAZSFxc9U-Kjq_Ae0iBA=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.com
June 8th, 2010 at 1:58 am
I am not sure how to write in telugu here…
Alternative literature is something really the present world needs…probably , especially, when the literature itself is perceived to be dimnishing.
The founders are commednable for their efforts and wish them all the best !
- Aandhrudu
June 14th, 2010 at 1:09 pm
nenu oka journalistunu, naa peru t.vedanta sury. nenu inta varaku pillala koosam 16 pustakalu rasanu. prathamiknaga manam pillala pai drusti saarinchali. vaari pempakam pai sradha choopali. desha bhvishyattuku nede manam pillala dwara roopa kalpana cheyali. manch samskaram, anubandham, apyayatalu vaariki rangarinch pooyali, anduku manam nadum biginchali. vaariki dabbu, bangaram, bhavanalu kaadu andinchedi. unnata vyktitvam. andu kosam manam okati kaavali. meeru anumatiste nenu articles raastanu.
with regards.
t.vedanta sury
August 23rd, 2010 at 6:07 am
ప్రాణహిత బాగుందండి
October 8th, 2010 at 2:02 am
ప్రాంతీయ భావాలకు అతీతంగా తెలుగు భాష వలన కలిగే ప్రయోజనాలు వెబ్ పత్రికద్వారా ఆంధ్రులందరికి అందుబాటులో వుంచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నాది ప్రాణహిత పత్రిక ప్రధానోద్దేశం.ఆదిశగా రాష్ట్ర నలుమూలల్నినంచి రచయితలు ప్రాణహితను మరింత పఠనీయంగా చేయుటకు తమవంతు కృషి సాగించాలని మనవి.
జాబాలిముని