సూచిక: 'పుస్తక సమీక్షలు'

పడమటి నీడ – సమీక్ష

లోకంలో రెండు రకాల కథకులు ఉంటారు. “నిరుపహతు స్థలము, బంగరు టూగుటుయ్యల, రమణీప్రియ దూతిక, కప్పురపు ఇడెము”లాంటి హంగులు సమకూర్చుకుని, ఊహాలోకాల్లో తేలిపోతూ, పడవల్లాంటికార్లు, ఇంద్ర భవనాలు, అరడజను నౌకర్లు సృష్టించి, పాఠకులను గాల్లో తేల్చేస్తారు కొందరు. ఇక రెండవ రకం కథకులుంటారు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

నవలను చదివించే విమర్శ ‘అతడు – ఆమె : మనం’

మంచి సాహిత్య విమర్శ మంచి సాహిత్యాన్ని చదివేట్టు పాఠకుల్ని ప్రోత్సహిస్తుంది. సాహిత్య పఠనను ప్రోత్సహించడం మాత్రమే గాక, పాఠకులలో సాహిత్యంపట్ల, సమాజంపట్ల ఆలోచనల్ని రేకెత్తించి వాళ్ళ సంస్కారంలో మార్పు తీసుకొని వస్తుంది. రచయితలు సమాజం ఎలా ఉంది, అలా ఎందుకుందో చెబితే; విమర్శకులు సాహిత్యం ఎలా ఉందో, అలా ఎందుకుందో చెబుతారు. ఇద్దరి ప్రయత్నమూ పాఠకులలో ఆలోచనలు రేకెత్తించి కర్తవ్యోన్ముఖులను చేయడమే.

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »పుస్తక సమీక్షలు

కథా, కథనం-రెండూ ‘మనిషి’ సంఘర్షణలే! – వారధి ప్రచురణ ‘నవతరం తెలుగు కథ’

వారధి రచయితల సహకర వేదిక ప్రచురణ ‘నవతరం తెలుగు కథ ‘ సంకలనం.’రచనకు మూలాధారమైన అధ్యయనం వైపుగా దృష్టి సారించడం రచయితల తక్షణ కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ఎంతైనా వుంది’.తక్కువ ఖర్చుతో పుస్తకాన్ని పాఠకులకు అందజేయాలి. మానవ సంబంధాలను నిలిపే రచనలను విద్యార్థులకు పరిచయం చెయ్యడం ‘వారధి తదుపరి లక్ష్యం ‘ అనే సదాశయాలతో రచయితలే ముద్రణ వ్యయంభరించి, వారే నేరుగా పంపిణీ బాధ్యత స్వీకరించి ఈ సంకలనం తెచ్చారు. 287 పేజీల పుస్తకం, 24 కథలు – 60 రూపాయలకు అందిస్తున్నారు.’పది సంవత్సరాల ఇవతల కథని భుజానికెత్తుకున్న’ రచయితల కథలు ఇవి. ‘కథలన్నీ  దాదాపుగా కథకులకు నచ్చిన కథలే . ఎంపికకు ప్రాతిపదిక అదే ‘ అని చెప్పారు మంచికంటి. అదే సమయంలో వినయ పూర్వకంగా సాహిత్య సంప్రదాయ విఙ్ఞతతో ‘ప్రతి కథకుడికీ తన కథల పట్ల ప్రేమ ఉంటుంది’ అని చెప్పారు. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

కల్లోల కాలంలో అల్లిన కావ్యం ‘మగ్గం బతుకు’

అప్పటిదాకా రాయలసీమకే పరిమితమనుకుంటున్న కరువు 2000 – 2003 సంవత్సరాలలో రాష్ట్రమంతా పాకింది. అభివృద్ధికి మారుపేరైన గోదావరి ప్రాంతంలో కూడా పైర్లు ఎండిన వాస్తవాన్ని గమనించాం. అప్పటిదాకా కరువు వస్తే జనం పొట్ట చేతబట్టుకొని వలసలు పోవడం, పశువులకు మేత లేకుంటే కబేళాలకు అమ్మేయడం చూశాం. కాని ఈ కాలంలో వచ్చిన మార్పు రైతులు, చేనేత వృత్తికారులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఆకలి, అప్పులు కలిసి బతికున్న మనిషిని నిలువునా శవంగా మార్చడం ఏ జాతికైనా తలవంపులు తెచ్చేదే. ఈ ఆత్మహత్యల దుష్పరిణామం తెలుగు రాష్ట్రాన్ని అట్టుడికించింది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

కథను గురించి కె.పి

తెలుగుకథా సాహిత్య విమర్శ 21వ శతాబ్దంలో ముందంజలో ఉంది. కవిత్వ విమర్శ కంటే కథా సాహిత్య విమర్శ సమకాలీన యుగంలో విస్తృతంగా వస్తున్నది. కథను గురించి లోతైన విశ్లేషణలు, ఆలోచనలు విరివిగా వస్తున్నాయి. ఒక సంవత్సర కాలంలో వెయ్యి కథలు వస్తే సుమారు పది పదిహేను కథా విమర్శన పుస్తకాలు, విరివిగా వ్యాసాలు వస్తున్నాయి. సమాజంలోని వ్యక్తులు ఆవేశాంతరంగం కంటే ఆలోచనాంతరంగం వైపు ఈనాడు దృష్టి సారిస్తున్నారు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »పుస్తక సమీక్షలు

మన ‘ముంగిలి’లో మన సాహిత్యం

21వ శతాబ్దపు తొలి అడుగులో సాహిత్య చరిత్రలోనూ, సాహిత్య వాతావరణం లోనూ ఉధృతి ఏర్పడింది.సాహిత్య చరిత్రలో తొలిరచనల పునర్మూల్యాంకన , సాహిత్య వాతావరణంలో అస్తిత్వ ఉద్యమాలలో ప్రాంతీయత భావన చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంలో తెలంగాణా ప్రాంతం ముందున్నదని కూడా విమర్శకులు భావిస్తున్నారు. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

జాతశ్రీ రచన ‘ఆర్తా రావం’ కథల సంపుటి పై సమీక్ష

కుమ్మరి , దొమ్మరి, గౌడ. సాలె, పాకీ , వడ్రంగి, గూర్ఖా, బెస్త … … …, ఇవన్నీ లోక వ్యవహరంలో కులాలు కావచ్చేమో… … …కానీ, ప్రపంచం మొత్తం మీద రెండే రెండు కులాలున్నాయి. ఒకటి ఉన్నవాడు, రెండోది లేనివాడు. ఉన్నవాడు లేనివాడి రక్త మాంసాల్ని, బ్రతుకుల్ని, ఆలిబిడ్డల్ని దోచుకుని బలుస్తాడు. లేనివాడు ఈ ఉన్నవాడి దాష్టీకానికి ‘బలి’ అవుతూ ‘ ఆర్తనాదం’ చేస్తాడు.బ్రతకడానికి దోవ దొరక్క విలవిల్లాడిపోతారు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »పుస్తక సమీక్షలు

ఆర్.వసుంధరా దేవి కథలు – సమగ్రజీవన సూచికలు

మనిషి పుట్టిన తరువాత జీవించడం అనివార్యం. పేదస్థితిలో నైనా, సంపన్నులైనా జీవించే విధానంలో దుర్భరస్థితిలోనైనా, దరిద్రులైనా దర్జాగా కాకున్నా జీవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవితమ్మీద ఇష్టం లేక కొందరు జీవితమే సరిగ్గా లేదని కొందరూ ఇవాళ జీవితాలను అంతం చేసుకుంటూఉన్నారు. సహజంగా మరణము వచ్చేంత వరకూ మరణాన్ని మన చేతుల్లోకి తీసుకోకపోవడమే జీవన సూత్రం. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

కవిత్వపు కన్నీటి తెర: మహాశూన్యం

కొంత మంది మనుషులకు ఊహ తెలిసిన నాటి నుంచే వునికి వుండదు. అంటే వాళ్ళు క్షణంలో మరణిస్తారు. క్షణంలో జన్మిస్తారు. తాము వున్నట్టా? బతికి వున్నామా లేమా? అన్న సందేహం కలుగుతూ ఉంటుంది. కారణాలు ఏవైనా అది యదార్థం.

వాళ్ళు మామూలు మనుషులయితే ఏమవుతారో కానీ శిఖామణులవుతారు. తెలుగులో అట్లాంటి కవులు ఇద్దరే. ఒకరు బైరాగి , రెండో వారు శిఖామణి.

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

కవిత్వ పరుసవేది బాణాల ‘పర్యాయపదం’

జీవితం సంక్షోభంలోకి నెట్టివేయబడటానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. ఇప్పుడు అనుభవిస్తున్నది పైకి సుఖంగానే కన్పిస్తుంది. ఏదో ఒక అశాంతి , అభద్రత నీడలాగా వెంటాడుతుంది. గతం కంటే భిన్నమైన జీవితం దుర్భరంగా తోస్తున్న సందర్భంలో మనిషి ఆలోచనలు బాల్యం వైపు, గత ఙ్ఞాపకాల వైపు మళ్ళడం, అస్థిత్వం కోసం ఆరాటపడటం , కలవరించడం, పలవరించడం అనివార్యమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా అతను కవి అయితే ఆవేదన కవిత్వంగా రూపదాల్చుతుంది.

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

మతోన్మాదాన్ని నిరసించే మానవతావాదుల ఆక్రందన “లజ్జ”

“మనందరికీ ఒకరినొకరు ద్వేషించుకోవడమే తెలుసు, కొందరికి మాత్రమే ప్రేమించడం తెలుసు,” అనే జొనాదన్ స్విఫ్ట్ మాటలను మననం చేసుకుంటూ, చూట్టూ చెలరేగుతున్న మత మౌఢ్యాలను, మతకల్లోలాలను, వివక్షతలను ఎదిరించాలని తపనపడే కొందరు మానవతావాదుల ఆక్రందన “లజ్జ”. మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

అచ్చమైన మనిషిలా మిగిలిపోతాం

ఉద్యోగ రీత్యా బదిలీ అయి గత ఏడాది డిసెంబరు 8 న ఉదయం హైదరాబాదుకు వచ్చాను. నేరుగా మిత్రుడు గోపిని కరుణాకర్ ఇంటికి వచ్చాను. తర్వాత జూబ్లీహిల్స్ లోని మా ఆఫీసు కార్యాలయానికి వెళ్ళాను. నేను హైదరాబాదులో రైలు దిగినప్పటినుంచీ ఆఫీసుకు చేరే వరకు కనీసం ప్రతి అరగంటకోసారైనా కోకిల పాటలు వినిపించాయి. నా సెల్ రింగ్ టోన్ కూడా అదే!

మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

తెలంగాణ చరిత్రలో ఒక మొహొంజొదారో

ఈ పుస్తకాన్ని చదివి గొప్ప ఎక్సైట్ మెంట్ ఫీలయ్యానని ఈ పుస్తకావిష్కరణ సభలో వరవరరావు సముచితంగా చెప్పిండ్రు. నేను కూడా దీన్ని చదివి అంతే ఎక్సైట్ అయినాను. పై శీర్షిక పెట్టటానికి ఆ ఎక్సైట్ మెంటే కారణం. మొత్తం చదవండి »

8 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

ఇదీ… కవిత్వం!

కవిత్వాన్ని అనుభూతి చెందాలే తప్ప ఎవరూ నిర్వచించలేరు. జీవితంలో నుంచి స్వీకరించిన అనుభవాలే, గుండెను కదిలించగల కవిత్వం అవుతుంది. తాను దర్మించిన జీవిత పార్శ్యాల్ని కవిత్వీకరించి “ఇదీ జీవితం” అంటూ సంపుటీకరించారు కవి  పి.శ్రీనివాస్ గౌడ్. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

మత్తులోకి లాక్కెళ్ళి ప్రేమలోముంచెత్తే శరచ్ఛంద్ర ఛాయ-బంధన ఛాయ

గ్రీష్మతాపం పెచ్చరిల్లుతున్న అకవిత్వపు కాలంలో, హృదయాల నుండి హృదయాలకు సన్నజాజి పరిమళం వంటి సమ్మోహనపు సమయాలు కొడిగడుతున్న కాలంలో కవిత్వమంటే కేవలం దేహ సంబంధమైనదే అనుకుని పైపై మాటలతో వ్యాకరణాంశాలుగా మారిపోయిన గ్రీష్మతాపంలో బంధన చాయ చిరు జల్లై మనోవల్మీకంలోకి జొరబడిపోయింది.

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »పుస్తక సమీక్షలు

ముఠ్ఠీ

- డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

‘కవిత్వం నా గుండె మంట’- అంటాడు అన్వర్‌. అన్నింటికి దూరమౌతున్నా కవిత్వానికి దూరం కాలేక పోతున్నానన్న కవి బలహీనతే బహుశా పై రెండు మాటలకు బలాన్నిస్తున్నాయి. ‘ముఠ్ఠీ’ (పిడికిలి) కవితా సంపుటిలోని 51 కవితలు చదివితే కవి నిరంతర పరిణామశీలమైన సమాజంలోని పరిణామాలకు భాగస్వామి అవుతూనే ఆలోచనని, ఆవేశాన్ని బాహ్య ప్రపంచంతో కలిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »పుస్తక సమీక్షలు

అందుబాటులోకి వచ్చిన కథా రచయితలు

పరిశోధనాంశాల్లో, రచయితలు, వాళ్ళ రచనలు కూడా ఒక కీలకాంశం, కవితా నిర్మాణ వ్యూహాలు, శిల్పం, కావ్యాత్మ, రసం ధ్వని అనుభూతి లాంటి వివిధాంశాల గురించిన పరిశోధన వివేచన తెలుగు సాహిత్యంలో పుష్కలంగానే జరిగింది. తెలుగు సాహితీవేత్త ఈస్తటిక్స్‌ ప్రపంచ సాహిత్యంలో మరెవరికీ తీసిపోని విధంగా నిలబడింది. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

Next »