Feb2009
గుర్రం సీతారాములు
ఆగస్టు 5 వ తేదీన ఖమ్మం నుండి కొంతమంది సాహితీ మిత్రృలం ముదిగొండ మృతవీరుల కుటుంబాలను పరామర్శించి, ఓ చిన్నపాటి కవి సమ్మేళనం నిర్వహించాలని వెళ్ళాం. మాతోబాటు కొత్తగూడెం, పాల్వంచ, విజయవాడ, హైద్రాబాద్ నుండి విరసం, జనసాహితీ, సాహితీ స్రవంతి మిత్రులమంతా యాదృచ్ఛికంగా ముదిగొండ సెంటర్‌లో కలుసుకున్నాం.
మొత్తం చదవండి »
చౌరస్తా
Nov2008
ప్రాణహిత
- రమణ
నేను తెలంగాణా ప్రాంతం నుంచి వచ్చిన వాణ్ణికాను. కె.సి.ఆర్, గౌడులు గురించి ఎలాంటి అభిప్రాయం వున్నా, ఏ చెట్టూ లేని చోట – పురుగులు పట్టిన – ఆముదం మొక్కల్లా కనబడుతున్న ప్రస్తుత ప్రత్యేక ఉద్యమ నాయకత్వాన్ని, ‘వాళ్ళ కారణాలు ఏమైనా కనీసం వాళ్ళైనా ప్రత్యేక రాష్ట్రం గురించి కృషి చేస్తున్నారు’ కదా అన్న కారణంతో బహిరంగంగా శపించకుండా వుండాల్సిన ఆబ్లిగేషన్ తెలంగాణా సోదరులకి వున్నట్టుగా నాకు లేదు. మొత్తం చదవండి »
చౌరస్తా
Sep2008
వేలూరి వెంకటేశ్వర రావు
- వేలూరి వెంకటెశ్వర రావు
Mahaprasthanam, Sri Sri
నిజంగానే నిఖిల లోకం
నిండు హర్షం వహిస్తుందా?
మానవాళికి నిజంగానే
మంచికాలం రహిస్తుందా?
అని శ్రీశ్రీ సందేహం (?) వెలిబుచ్చుతూ వ్రాసినప్పుడు (1941?) రెండవ ప్రపంచయుద్ధానికి నిజమైన అంకురార్పణ మొదలైయిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
మొత్తం చదవండి »
చౌరస్తా
Aug2008
జయప్రకాశ్ తెలంగాణ
స్వాతంత్రం అంటే?
‘Can we look beyond the FREEDOM that is being marketed to us?’ is the million Dollar question? (ఎందుకంటె రూపాయిల భాష ఎవరు మాట్లాడుతలేరు కాబట్టి). ఇప్పుడు ఉన్న తరం మార్కెట్ శక్తులకు ఎంత ప్రభావితం అయితుందో వేరేగ చెప్పనవసరం లేదు. ఎనభైలు, తొంభైల తరాలకన్న ఇప్పటి (ఇంటర్నెట్) తరం ఆశలు ఆశయాలల్ల చాల మార్పులొచ్చినయి. మొత్తం చదవండి »
చౌరస్తా
Jul2008
హిమబిందు
నా స్నేహితురాలు ఒకామె ఈ మధ్య పింక్ బ్యాండ్ ఒకటి ప్రజంట్ చేసింది. అప్పుడప్పుడూ తను ఆ బ్యాండ్ చేతికి ధరించడం నాకు పరిచయమే, అలాగే తను వేసుకునే డ్రస్ ల మీద కూడా పింక్ రిబ్బన్ పెట్టుకోవడాన్నికూడా చాలా సార్లు గమనించాను. ఏదో ఒక “అవేర్నెస్ “తో ఇలా బ్యాండ్లు ధరించడం అనే కాన్సెప్ట్ తెలిసినప్పటీకీ, ఆమెని నేను ఎప్పుడూ అడిగే ప్రయత్నం చెయ్యలేదు. మొత్తం చదవండి »
చౌరస్తా
May2008
హిమబిందు
దాదాపు ఏడెనిమిది నెలల క్రితం, ఓ తెలిసిన అమ్మాయి ఫోన్ చేసినపుడు, “పిల్లలకి అన్ని టీకాలూ వేయించాలంటారా? అవసరం లేదు…” అని మాటల మధ్యలో అంది. ఆ క్షణంలో, అసలామె ఏం మాట్లాడిందో లేదా అడిగిందో కూడా నాకు అర్ధం కాలేదు…. కాబట్టి మౌనంగా వుండిపోయాను. కానీ ఫోను పేట్టేసిన తరువాత మాత్రం ఆమె చెప్పింది తలుచుకుని గుండె గుభేలుమంది. మొత్తం చదవండి »
చౌరస్తా, సాహిత్య వ్యాసాలు
Apr2008
హిమబిందు
చరిత్ర తెలుసుకోవడం నాకున్న వ్యాపకాల్లో ఒకటి. అందునా భారతదేశ వాతావరణంలోకి కొత్త సంస్కృతిని, తమ ఆచార వ్యవహారాలని మిళితం చేసిన మొగలుల (మంగోల్ –తుర్క్ లేదా టర్కీ సంతతి) పాలన మీద ప్రత్యేక ద్రృష్టి ఉండటం వల్ల “జోధా -అక్బర్” సినిమా విడుదల గురించి ఆసక్తిగా ఎదురు చూసాను. 16వ శతాబ్దంలో ఓ ముస్లిం చక్రవర్తికి, హిందూ రాకుమారికి పెళ్ళి జరగటం అంటే, “ఫస్ట్ జనరేషన్” మతాంతర వివాహంగా తీసుకోవచ్చు కనుక ఆనాటి సామాజిక, రాజకీయ, చారిత్రక అంశాల మీద కొద్దో గొప్పో అవగాహన పెంచుకోవచ్చుననేది నా ఆశ. మొత్తం చదవండి »
చౌరస్తా, సాహిత్య వ్యాసాలు
Mar2008
హిమబిందు
”మీ గురించి మాకు, అంటే… అమెరికన్లకి ఉండె అపోహ ఏమిటో చెప్పండి?.” అంటూ ఎబిసి ఛానల్ జర్నలిస్టు ఒకరు అరబ్ ఎమిరెట్స్ కి చెందిన ముగ్గురు యువతులతో ఇటీవల జరిపిన ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. వారిలో ఇద్దరు యువతులు బ్రెస్ట్ కాన్సర్ ని జయించినవారైతే ఒకరు డాక్టర్. ఇంతకీ ఈ ప్రశ్నకి వారిచ్చిన సమాధానం….’మేము రాతి యుగంలోనో, చీకటి లోకంలోనో లేము” అని. మొత్తం చదవండి »
చౌరస్తా, సాహిత్య వ్యాసాలు
Feb2008
హిమబిందు
అమెరికా అధ్యక్షపదవికి డెమోక్రాట్ల అభ్యర్థిని ఎంపికచేసుకునే ప్రక్రియలో ఆఫ్రో-అమెరికన్ జాతికి చెందిన మహిళలపై ‘జెండర్ సెన్సిటివిటీ కంటే జాతిపరమైన భావోద్వేగ ప్రభావమే ఎక్కువగా ఉందం’టూ ప్రముఖ న్యూస్ ఛానల్ సి ఎన్ ఎన్ ఒక స్టోరీని ప్రసారం చేసినపుడు, మొదట గందరగోళపడ్డప్పటికీ, ఆచరణలో లేదా మానసికంగా అది వాస్తవానికి దగ్గరేననిపించింది. మొత్తం చదవండి »
చౌరస్తా, సాహిత్య వ్యాసాలు
Jan2008
హిమబిందు
ఆఖరికి పగవాడు మరణించినా…, మనిషన్నవాడికి అదొక కుదుపే! అందునా, మన ఆనవాళ్లు కనిపిస్తేనే ప్రాణం లేచొచ్చినట్టనిపించే పరదేశ జీవితంలో మనవాళ్ల తాలూకు దుర్ఘటనలు విన్నప్పుడు, లేదా చూసినపుడు చాలా దిగులుగా అనిపిస్తుంది. ఆ దుర్ఘటనకు చెందిన వ్యక్తులు వ్యక్తిగతంగా మనకు తెలియకపోవచ్చు. కానీ ఒకే మట్టికి చెందిన వాళ్లం కనుక… ఆయా కుటుంబాలు కోల్పోయే సంతోషం, జీవితాంతం పడే క్షోభ, పలకరిస్తే చాలు, కోల్పోయిన తమ బిడ్డల గురించి కన్నవారు చెప్పే ఊసులు, చనిపోయిన వారిపై ఆధారపడి ఉన్నవారు ఎదుర్కోబోయే ఆటుపోటులకు చెందిన అనేక అంశాలపై ఎంత వొద్దనుకున్నా మనసు పరిపరివిధాల పోతుంది. మొత్తం చదవండి »
చౌరస్తా, సాహిత్య వ్యాసాలు