సూచిక: 'దర్వాజ'

“పోయిన వర్ణమాల” : మూడు ముక్కలు

1

ఎండా కాలం మాడిసన్ వచ్చినప్పుడల్లా మెమోరియల్ లైబ్రరీకి వెళ్ళడమే మంచి అనుభవంలా అనిపిస్తుంది. లేక్ పక్క నించి చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్ళి, కనీసం రెండు గంటలయినా ఇవాళ రాయాలి అనుకొని, లైబ్రరీలోపలికి, నా ఖైదుకొట్టంలాంటి స్టడీ రూములోకి (అది రూము కాదు, నిజంగానే బోను) అడుగుపెడతాను. గంటా, గంటన్నర గడిచాక మ్యాంగో ఐస్ టీ వైపుకి మనసు పరుగెత్తుతుంది. అలా బయటికి వస్తూంటే, “న్యూ అరైవల్స్” షెల్ఫ్ లో దొరికింది లీసా ఓల్స్టైన్ కొత్త కవిత్వం పుస్తకం “లాస్ట్ ఆల్ఫబెట్”

మాంగో ఐస్ టీ తెచ్చుకొని, లైబ్రరీ మాల్ చెట్ల కింద కుర్చీలో కూర్చొని, లీసా పుస్తకం తెరిచాను. మొదటి వాక్యం నించి చివరి వాక్యం దాకా దాదాపు 92 పుటల పుస్తకం ఇట్టే అయిపోయింది. ఇంత గొప్ప “రీడబిలిటి” వున్న కవిత్వం ఈ మధ్య కాలంలో చదవలేదంటే అతిశయోక్తి కానే కాదు. అందునా, కవిత్వం!  ఈ చిన్న అనుభవం నన్ను ఎంత ప్రభావితం చేసిందంటే,ఇక లైబ్రరీలోకి అడుగు పెట్టిన ప్రతిసారీ, బయటికెళ్ళే ప్రతి సారీ ఈ కొత్త పుస్తకాల షెల్ఫు దగ్గిర గడపడం అలవాటైపోయింది.

పఠనయోగ్యత వొక్కటే కాదు, లీసా వాక్యాలలో ఒక వింత ఆకర్షణ ఏదో నన్ను బలంగా లాక్కుంటూ వెళ్ళింది ఈ పుస్తకంలోకి!

మొదటి విషయం: ఆమె కవిత్వంలో పాద విభజన లేదు. రాను రానూ ఎందుకో పాద విభజన అనేది ఒక అర్ధం లేని నియమం అని నాకు అనిపిస్తోంది. నా ఈ అసంతృప్తిలోంచి రాసిన కవిత “రోజ్ రోటి” (ప్రాణహిత)

నా ఈ అసంతృప్తీ, అన్వేషణా సాగుతున్న దశలోనే, లీసా పుస్తకం చదవడం అనుకోని విధంగా కలిసి వచ్చింది.

రెండో విషయం: లీసా కవిత్వంలోని అనుభవ వైవిధ్యం. ఇది నన్ను ఎక్కువగా ఆకట్టుకున్న రహస్యం.

2

ఏ అనుభవం కవిత్వం అవుతుందన్నది ఆ కవి ఆనుభవిక విస్తృతిని బట్టి వుంటుంది. లోకంతో పని లేని లోలాక్షులూ వుంటారు; లోకాన్ని పట్టించుకొని దాని ఆనుపానులు తెలుసుకునే క్రమంలో కవిత్వం నీడన చేరుకునే వారూ వుంటారు. అంత మాత్రాన్న అవి రెండూ వైరి వర్గాలు కానక్కరలేదు. కానీ, అంతిమంగా కవిత్వ ఆల్కెమీ అనేది ఏదో తెలిసివుంటే తప్ప కవిత్వ వాక్యం పుట్టదు. అప్పుడు ఆ వాక్యాన్ని తుంపులు చెయ్యకపోయినా అది కవిత్వమే అవుతుంది. అనుభవాన్ని గురించి లీసా అంటుంది : “కవిత్వం అనుభవానికి ప్రతిబింబమో, పరావర్తనమో కాదు. కవిత్వమే అనుభవం.”

పైథగరస్ నించి అప్పు తెచ్చుకున్న వాక్యం-on starting a journey, do not turn back- తో ఈ “లాస్ట్ ఆల్ఫబెట్” (పోగొట్టుకున్న వర్ణమాల) లోపలికి నన్ను తీసుకువెళ్ళింది లీసా. ఆ తరవాత చివరి వాక్యం-All those we kept from leaving now are ready themselves to return – దాకా ఇది అనేక అనుభవాల రాదారి.

రెండు కవితలు

(ఒక్కటే బతుకు)

ఇక్కడ కాసేపు వుంటాను కదా అనుకున్న చోటికి వచ్చాను. చంద్రుడు వెళ్ళిపోయాక వొకానొక పాలిపోయిన నక్షత్రం కింద నా కంటే ముందు నా నీడ పాకింది. అదేం ఎక్కువ కాలం వుండదులే – వొక వారం, కాదంటే రెండు వారాలు. ఇంతకు ముందెన్నడూ చూసెరగను దాన్ని. నీటిలాంటి  కాంతిలో పారుతుంది రాత్రి. ఏదో వొక క్షణాన అందరూ బయటికి అడుగు పెడ్తారు. ఎందుకో తెలీదు, అయినా నేనూ ఆ జనంలో కలిసిపోతాను.

(మాయా విరోధాభాస)

2 అభిప్రాయాలు »అనువాదాలు, దర్వాజ

గుర్తొస్తే చిత్రమే అనిపిస్తుంది


కవిత్వానికీ పరిసరాలకీ చాలా చుట్టరికమే వుంది. కవిత్వానికీ చుట్టూ కమ్ముకున్న వివిధ సంఘటనల కారు మబ్బులకి చాలా చుట్టరికమే వుంది. కళ్ళు మూసుకొని నడి రోడ్డు మీద నడవలేము. కళ్ళు తెరుచుకొని వున్నంత కాలం చుట్టూ జరిగే వాటికి అంధులుగా వుండలేము. కళ్ళలో పడిన దృశ్యాన్ని అక్షరానికి బట్వాడా చెయ్యడం అంత తేలికా కాదు! ఆ కష్టాన్ని భరించలేక కాసేపు ఆకుపచ్చ కవిత్వం రాసుకుంటాం. అడివిలో నడుస్తున్నప్పుడు కూడా పక్షి పాట తీయదనాన్నే కాదు, ఆ పక్షిని వెంటాడే తుపాకి చేతుల్ని కూడా చూసే వాడి చూపు కవిది. ఆకుపచ్చదనంలోని అందంతో పాటు ఆ పత్ర హరితాన్ని హరిస్తున్న కర్కశత్వాని చూసే సున్నితమయిన చూపు కవిత్వం.  జూడీ జోర్డాన్  అలాంటి కవిత్వం రాస్తోంది. అమెరికాలోని కరోలినాలో వొక చిన్న రైతు కుటుంబంలో పుట్టిన జూడీ జోర్డాన్ నానా కష్టాలూ  పడి వర్జీనియా యూనివర్సిటీలో కవిత్వంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకుంది.  2000 లో ఆమె మొదటి కవిత్వ సంపుటి “కారొలినా ఘోస్ట్ వూడ్స్” అనే పేరుతో వెలువడింది.  కవిత్వంలో స్థానికత వొక బలమయిన గుణంగా ఎలా మారుతుందో చెప్పడానికి ఆమె కవిత్వం మంచి వుదాహరణ.  ఒక దీర్ఘ కవితకి ఇది స్వేచ్చానువాదం ……

గుర్తొస్తే చిత్రమే అనిపిస్తుంది

ఎక్కడో వో మూలన
వో ఇంట్లో వో గదిలో వో పక్క మీద-
ఎందుకో ఇప్పటికీ
ఆ 1863
ఆ బానిస నెత్తుటి కేక

వినిపిస్తూ వుంటుంది.

అది 1976 అనిపిస్తూ వుంటుంది
కాని

ఇప్పుడీ క్షణమే అనిపిస్తుంది.

వో నల్ల పిల్లాడితో
టెన్నిస్ ఆడి వచ్చాక
ఎవరో నా వేపు తుపాకి గురి పెట్టి
నన్ను గోడకి బాదీ బాదీ
“ఆ నల్లాడి పేరు చెపూ చెప్పూ”
అని గద్దిస్తున్నట్టే వుంది ఇంకా.

కాదు, కాదులే, అది 1969.
అమ్మ వొక మైనపు బొమ్మలా
చావులోకి కరిగిపోయినప్పుడు
ఆమె అంత్య క్రియల అంతిమ వాసనలు
నన్ను తాకినప్పుడు
చంద్రుడు వో ఆకుపచ్చ వెన్న ముద్దయి
చేతికి చిక్కినప్పుడు

అప్పటికేమీ తెలియదులే నాకు,
ఎవరు ఎవరి మీద తుపాకులు గురిపెడ్తున్నారో
కొందరి దేహాలు మాత్రమే
నెత్తుటి ముద్దలు ఎందుకవుతున్నాయో

బీచి కెళ్ళిన వొకామె
మూడో రోజు శవమయి ఎందుకు వచ్చిందో

ఏమీ తెలియనప్పుడు

అప్పుడు కూడా కావచ్చు
ఎప్పుడో ఏదో గుర్తుంటే
ఇక లేనిదేముంది?

ఆ గొంతులన్నీ
నా దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి ఈ క్షణాన్న!

తెలిసినవన్నీ అబద్ధాలనీ
తెలుస్తూనే వుంది.

*

ఇంకా ఏ ఏ అబద్ధాలు
ఈ కాలం గోడలో దిగబడి వున్నాయో!

మేకులు ఇంకా గోడ వొంటిని సలుపుతున్నాయి.

7 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు, దర్వాజ

అమీరీ బరాక: ఈ కాలపు విప్లవాగ్ని !

అమీరి బరాకా అంటే దట్టించిన ఫిరంగి. అతని కవిత్వంలోని ప్రతీ పంక్తీ వొక రాజకీయ ప్రకటన, వొక ధిక్కార కవితాగ్రహం. ఈ కాలంలో కవిత్వాన్ని అంత బలంగా అంత ఆవేశంగా అంత పొగరుగా రాసిన వాళ్ళు అరుదు. ఇప్పుడు మీరు చదవబోతున్న కవిత అమీరి బరాక అంటే ఏమిటో బలంగా చెబుతుంది. వొక కవి గట్టిగా నిలబడి స్పష్టంగా గొంతు విప్పితే అది ఎంత రాజుకొని నలుదిక్కులూ అంటు కుంటాయో అనుభవంలోకి తెచ్చిన కవిత ఇది. ఈ కవిత అచ్చయాక అమెరికా కంటి మీద కొన్నాళ్ళు కునుకు కరువయింది. ఇవి ఆ దీర్ఘ కవితలోని కొన్ని పంక్తులు మాత్రమె. 1934 లో అమెరికాలోని న్యూ జర్సీ నూవార్క్ లో పుట్టిన బరాక తన కవిత్వం నిండా విప్లవ గాలులని పోత్తంగా వూదిన వాడు. ఎక్కడ విప్లవాగ్నులు రగిలితే అక్కడికి అతని కవిత్వ వాక్యాలు ప్రయాణించాయి. మొత్తం చదవండి »

12 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు, దర్వాజ

నల్ల నినాదం అతని కవిత్వం!

చాలా కాలంగా వెంటాడుతున్న కవి లాంగ్స్టన్ హ్యూస్!

ఎప్పుడో 1902లో పుట్టి, ఏ 1967లోనో కన్నుమూసిన ఈ కవి ఇప్పుడు నా లోకంలో ఎలా కన్ను తెరుచుకున్నాడు?! అతని కవిత్వ పాదాల్లోని ఏ శక్తి నన్ను అటు వైపు జర జరా ఈడ్చుకెళ్ళింది? ఇటీవల హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో హెన్రీ గేట్స్ అనే వొక నల్ల ప్రొఫెసర్ మీద పోలీసు దాడికి నిరసనగా “తోలు మందం” అనే శీర్షికతో (ఈ కవిత నా కొత్త సంపుటి “వూరి చివర” లో వుంది) కవిత రాసినప్పటి నించీ లాంగ్స్టన్ హ్యూస్ కవిత్వం రోజూ కొంత కొంత చదువుతున్నా. వొకే సారి అతన్ని అంతా చదవడం కష్టం. మొత్తం చదవండి »

7 అభిప్రాయాలు »దర్వాజ

గులాబీలు, ఓ వేసవి చివర

(మేరీ ఆలివర్ 2004 కవిత్వం “బ్లూ ఐరిస్ “లో “రోసెస్, లేట్ సమ్మర్” కి అనువాదం)

ఏమవుతుంది,

mary-oliver1
mary-oliver1

ఈ ఆకులన్నీ
ఎరుపెక్కి, బంగారు రంగు దాల్చి
రాలిపోయాక? మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు, దర్వాజ

ఒక వీరశైవ, ధీర సూఫీ అర్ధనారీ ‘స్వరం’ : నీలం మాయ

అయిల సైదాచారి మనకు కొత్త కాదు. అతని కవిత్వం ఇంతకు ముందే మనకు తెలుసు. అందరికీ తెలిసిన అందరూ మరచి పోవాలనుకునే వొక అనుదిన నేపథ్యం నించి సైదా చారి కవిత్వ అనుభవ మంటపంలోకి ప్రవేశించాడు. అతని కవిత్వం మొదటి సారి చదివినప్పుడు ఇది వొక భిన్నమయిన భాష అని మనకి వెంటనే అనుభవమవుతుంది. కాని, ఆ అనుభవం మనల్ని అంత తేలికగా వూపిరదనివ్వాడు. మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »దర్వాజ

నిప్పు రెక్కల పక్షి: మాయా ఎంజెలో

Maya Angelou
Maya Angelou

మాయా ఎంజెలో అంటే కేవలం కవిత్వం కాదు, వొక ఆగ్రహ కెరటం.
ఆమె పదాలు సున్నితంగానే వుంటాయి, కాని వాటి లోతు కత్తి లోతు.
ఆమె వచనం సూటిగానే వుంటుంది, కాని, ప్రతి వాక్యం వొక వుద్విగ్న కెరటం.
ఇక…మాయ ఎంజెలో గొంతు విప్పిందా…వుద్రిక్త కవిత్వమూ, నగ్న వచనమూ కలిసి విరుచుకు పడే సముద్రం.

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »దర్వాజ

అమెరికన్ కవిత్వంలో ఒక దక్షిణం గాలి… కాజిం అలి

“తెలుగు” అన్న మూడక్షరాలు వినగానే కాజిం అలి హృదయం పసిపిల్లాడిలా కేరింతలు కొట్టింది, అతని హైదరాబాదీ బాల్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చి.

వొక ఆదివారం మధ్యాన్నం ఆస్టిన్ లోని “బార్న్స్ అండ్ నోబల్స్” పుస్తకాల షాపులో నాకు ఎంతో ఇష్టమయిన కొబ్బరి ముక్కలు తురిమిన కాఫీ తాగుతూ మొదటి సారి కాజిం అలి కవిత్వం చదివాను. ఆ కాఫీ రుచికీ, కాజిం అలి కవిత్వానికి కాస్త చుట్టరికం వుంది. కొబ్బరి ముక్కా, కాఫీ రెండూ భిన్నమయిన రుచులు. కొబ్బరి ముక్క అనగానె నాకు మా ఖమ్మంలో పెద్ద కొండ మీద కొలువైన నరసిం హ స్వామి , ఆ గుడికి కొబ్బరి ముక్కల ప్రసాదం కోసం వెళ్తూండే నా బాల్యం గుర్తొస్తాయి, కాఫీ అంటే నాకు అమెరికా. ఇక్కడికి రాక ముందు నాకు కాఫీ అలవాటు లేదు. ఈ భిన్నమయిన రుచుల కలయిక నాలుక మీద ఆడుతూండగా , కాజిం అలి కవిత్వం చదివాను.

మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »అనువాదాలు, దర్వాజ

లోరీన్! నువ్వే వొక కవిత!

Lorine Niedecker
Lorine Niedecker

Lorine Niedecker

ఈ శనివారం మాడిసన్-విస్కాన్సిన్ కి 45 నిమిషాల దూరంలో వున్న ప్రసిద్ధ అమెరికన్ కవయిత్రి లోరీన్ నైడెక్కర్ ఇల్లూ, సమాధి చూడడానికి వెళ్ళాం నేనూ, నా కవిమిత్రుడు ఆస్టిన్ స్మిత్. మాడిసన్ వచ్చిన కొత్తలో వొక పాత పుస్తకాల షాపులో కవిత్వం పుస్తకాలు చూస్తున్నప్పుడు నా పక్కనే వున్న వొక అమెరికన్ కవయిత్రీ, స్నేహితురాలు “ఈ కవిత్వం చదువు” అంటూ అప్పటికప్పుడు లోరీన్ పుస్తకాన్ని కొని ఇచ్చింది. మొత్తం చదవండి »

14 అభిప్రాయాలు »దర్వాజ

చలి కొండల నుంచి కొన్ని మాటలు

Hanshan
Hanshan
(దిక్కుల్ని కలిపే దారం కవిత్వం అనిపిస్తుంది కొన్ని కవితలు చదువుతూంటే – ఈ కవితలు చైనా మహాకవి హాన్ షన్  (అంటే చలి కొండ ) రాసినవి. వీటిని నేను అమెరికాలోని ప్రసిద్ధ కవి గేరీ స్నైడర్ అనువాదంలో చదివాను.  గెరీ స్నైడర్ హాన్ షన్ ని వూరికే అనువదించ లేదు. అతని మాటల్లోని అంతస్సారాన్ని తన పదాల్లోకీ, ఆలోచనల్లోకీ ఇంకించుకున్నాడు. మొత్తం చదవండి »

16 అభిప్రాయాలు »దర్వాజ