Oct2009
ప్రాణహిత
డా|| కె. బాలగోపాల్
బాలగోపాల్ ఇంక లేరు అనే వార్త ఎంత మాత్రం నమ్మశక్యంగా లేదు. అది క్రూరమైన వాస్తవమని తెలుస్తున్నప్పుడల్లా, అది అబద్దమైతే ఎంత బాగుండు అని గొంతుకు పుట్టెడు దుఃఖం అడ్డు పడుతున్నది. నిద్రపోతున్నట్టే ఉన్న ఆయన నిర్జీవ శరీరం ఫొటొల్లో చూస్తున్నప్పుడల్లా కన్నీళ్ళు ఆగకుండా దుంకుతున్నయి. మొత్తం చదవండి »
సంపాదకీయం
May2009
ప్రాణహిత
ప్రాణహిత మే సంచికకు స్వాగతం!
ఏప్రిల్ 30 మహాకవి శ్రీ శ్రీ జయంతి. 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో శ్రీ శ్రీ జన్మించి ఇప్పటికి 99 ఏండ్లు! ఈ సంవత్సరం మనం శ్రీ శ్రీ శతజయంతి సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 1930 – 40లలో తన మహాప్రస్థాన గీతాలతో ఒక ప్రచండ ఝంఝామారుతంలా ప్రవేశించి తెలుగు సాహిత్యాన్ని ఊగించి శాసించి ఖండించి దీవించిన మహత్తర శక్తి మహాకవి శ్రీ శ్రీ . మొత్తం చదవండి »
సంపాదకీయం
Apr2009
ప్రాణహిత
ప్రాణహిత ఏప్రిల్ 2009 సంచికకు స్వాగతం. ప్రాణహిత పాఠకులందరికీ విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు! ఈ విరోధినామ సంవత్సరం ప్రజాకంటకులకు విరోధియై, వైరుధ్యాలని పరిష్కరించి వైవిధ్యాలని ప్రసాదిస్తుందని ఆశిద్దాం.
సాహిత్యం ప్రజల వైపు నిలవాలా ప్రజాకంటకుల వైపు నిలవాలా అంటే ప్రజల వైపే నిలవాలని, రాజ్యం పక్షం వహించాలా, రాజ్యంచే అణచివేతకు గురవుతున్న వారి పక్షం వహించాలా అంటే నిస్సందేహంగా పీడక రాజ్యాన్ని ప్రతిఘటించాల్సిందేనని ప్రజాస్వామిక దృక్పథంగల వాళ్ళందరూ దాదాపుగా అంగీకరిస్తారు. అయితే ప్రజల మధ్య వైరుధ్యాలని, విభిన్న సమూహాల ప్రజాస్వామిక ఆకాంక్షల మధ్య వైరుధ్యాలను సాహిత్యం ప్రతిఫలించినప్పుడు అనేక సున్నితమైన సమస్యలు ముందుకొస్తాయి. అప్పుడు అన్నీ నలుపు తెలుపుల్లా స్పష్టంగా ఉండకపోవచ్చు. ఒకరికి ప్రజాస్వామికంగా అనిపించింది మరొకరికి అప్రజాస్వామికమనిపించవచ్చు. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే సంయమనమూ, సాహిత్య విమర్శా ఎంతో ఉపయోగపడతాయి.
మొత్తం చదవండి »
సంపాదకీయం
Mar2009
ప్రాణహిత
పత్రికను క్రమం తప్పకుండా ప్రతి నెలా మొదటి రెండు మూడు రోజుల్లో (వీలయినంతగా మొదటి తారీకు నాడే) తీసుకురావాలనే మా ప్రయత్నాలు సఫలీకృతమౌతున్నాయి. వీలయినన్ని ఎక్కువ రచనలతో మీముందుకు తీసుకు రావాలని, తెలుగు నేల నుంచి సమకాలీన తెలుగు ప్రజా, సామాజిక జీవన వైరుధ్యాలని ప్రతిబింబించే సాహిత్యాన్ని, మీకు అందజేయాలని మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం – ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాము. మొత్తం చదవండి »
సంపాదకీయం
Jan2009
ప్రాణహిత
ప్రాణహిత జనవరి 2009 సంచికకు స్వాగతం!
ప్రాణహిత పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
Hope
చూస్తుండగానే 2008 వెళ్ళిపోయింది. రక్త సిక్తమైన పాదాలతో మన జీవితాల మీదుగా, చెప్పలేనంత దుఃఖాన్నీ ఎన్నెన్నో మానని గాయాల్నీ మిగిల్చి కర్కశంగా వెళ్ళిపోయింది. ఒక పెద్ద సముద్రపుటల ఊడ్చి వెళ్ళిన తర్వాత మిగిలే విషాదమూ, నిశ్శబ్దమూ మిగిల్చి వెళ్ళి పోయింది. మొత్తం చదవండి »
సంపాదకీయం
Oct2008
ప్రాణహిత
ప్రాణహిత అక్టోబర్ సంచికకు స్వాగతం !
Bathukamma by Aelay Laxman
అక్టోబర్ నెల రాగానే మనకంతా గొప్ప సంబరం. తెలుగు వాళ్ళకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగలు బతుకమ్మ, దసరా సాధారణంగా ఈ నెలలోనే వస్తాయి. వర్షాలు పడితే, చెరువులన్నీ నిండి కళ కళ లాడుతూ, చేన్లలో చెలుకల్లో గునుక పూలు, తంగెడి పూలు ఇంకా తీరున్నొక్క పూలతో తెలంగాణ నేలంతా రంగు రంగులుగా విరగబూస్తుంది. ఈ కాలం ప్రకృతి సంబరాన్ని, విరగ బూసిన పూలల్లో, వాడ వాడలా సాయంత్రాలు మార్మోగే పాటలతో, తళ తళ లాడే చెరువుల నీటి మిలమిలల్లో తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగగా జరుపుకుంటారు. మొత్తం చదవండి »
సంపాదకీయం
Sep2008
ప్రాణహిత
Mahmoud Darwish
ప్రాణహిత సెప్టెంబర్ సంచికకు స్వాగతం. గత చాలా సంచికలుగా మీకు ప్రాణహితను ప్రతినెలా మొదటి వారానికల్లా అందించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము. అయినప్పటికీ తెలుగునేల నుండి మాకు సరైన సమయానికి, సరైన లిపి (ఫాంట్) లో సాహిత్యం అందడం, దాన్ని మేము అచ్చుతప్పులు సరిదిద్ది, క్రమపద్దతిలోనుంచి మీకందించడం – ఇవన్నీ అనుకున్న కాలానికి సక్రమంగా జరగడం అన్ని వేళలా వీలుపడలేదు. అందుకే చాలా సంచికలు తీవ్రమైన జాప్యంతో – ఏమిటీ ప్రాణహిత ఆగిపోతుందా అనే ప్రశ్న పాఠకులలో ఉదయించేంతగా – వెలువడినయి. అనేక అవాంతరాలెదురైనప్పటికీ ప్రతినెలా ప్రాణహిత నందించాలనే తపన తో, స్థిర లక్ష్యంతో పనిచేసాం. జాప్యమైనా అందించగలిగాం. అయితే ఈ క్రమాన్ని ఒక నిర్ణీత సమయానికి అనుకూలంగా మార్చడానికి, అనుకున్న పద్ధతిలో ప్రాణహితను మీకు ప్రతి నెలా మొదటి వారానికల్లా అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. మా పరిస్థితినీ, మేమెదుర్కుంటున్న ఇబ్బందులనూ అర్థం చేసికొని, ప్రతినెలా ప్రాణహితను ఆదరిస్తున్న పాఠకులకు మేము సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇకముందు కూడా ఇట్లాగే ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
మొత్తం చదవండి »
సంపాదకీయం
Jul2008
ప్రాణహిత
ప్రాణహిత జూలై సంచికకు స్వాగతం. ఈ సంచికతో ప్రాణహిత ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నది. గత సంవత్సర కాలంలో ప్రాణహిత పదకొండు సంచికలు వెలువడింది. తెలుగు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలని ప్రతిఫలించే సాహిత్యాన్ని అంతర్జాతీయ పాఠకులకు అందించడానికి పూనుకున్న ప్రాణహిత, ఒక సంవత్సర కాలంగా నిరాఘాటంగా వెలువడడం చెప్పుకోదగ్గ విజయంగా మేము భావిస్తున్నాము., మీ ప్రోత్సాహం, క్రియాశీలక భాగస్వామ్యం, సలహాలు సూచనలూ లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. అందుకు కారణమైన మీ అందరికీ ప్రాణహిత వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది. మీ అందరికీ కానుకగా జూన్ సంచికను జూలై సంచికతో కలిపి ప్రత్యేక వార్షిక సంచికగా మీముందుకు తెస్తున్నాము. ఈ ప్రత్యేక వార్షిక సంచికలో మీ కోసం మరిన్ని కవితలు, కథలు మరియు ప్రత్యేక సాహిత్య వ్యాసాలు అందిస్తున్నాము.
మొత్తం చదవండి »
సంపాదకీయం
May2008
ప్రాణహిత
ప్రాణహిత మే నెల సంచికకు స్వాగతం!
కార్మికుల దినోత్సవం మే డేప్రపంచవ్యాప్తంగా మే నెలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అంతర్జాతీయంగా జరుపుకునే కార్మికుల దినోత్సవం మేడే తో ప్రారంభమవుతుంది. పనిగంటలు తగ్గించడానికి మెరుగైన పని పరిస్థితుల, మెరుగైన జీవితమూ, సమాజమూ కోసం కార్మికుల జరిపిన, ఇంకా జరుపుతున్న అనేక పోరాటాలకు మేడే స్ఫూర్తి. రోజువారీ సమస్యలనుండి మొదలు అనేకానేక సామాజిక సంక్షోభాలను పరిష్కరించేందుకు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు జరిపిన అనేకానేక పోరాటాలు ఎంతో విలువైన, ఉన్నతమైన సాహిత్యసృష్టికి కారణమయ్యాయి. అనేకమైన మహోజ్వలమైన రచనలు ఉద్భవించడానికి కారణభూతమయ్యాయి.
మొత్తం చదవండి »
సంపాదకీయం
Apr2008
ప్రాణహిత
బాబ్ డిలాన్ప్రాణహిత ఏప్రిల్ సంచికకు స్వాగతం. ఎప్పటిలాగే ఈ సంచికలో కూడా తెలుగు నేల నుండి వీస్తున్న ప్రజల సాహిత్యపరిమళాల్ని మీకందించే ప్రయత్నం చేస్తున్నాం.
అమెరికాలో ప్రతిఏటా ప్రింట్ జర్నలిజం, సంగీతం, సాహిత్య రంగాల్లో నిష్ణాతులకు పులిట్జర్ బహుమతి ప్రకటిస్తారు. జోసెఫ్ పులిట్జర్ అనే ఒక ప్రచురణకర్త పేరు మీద న్యూ యార్క్ లోని కొలంబియా విశ్వ విద్యాలయం ప్రతి ఏటా ఈ బహుమతిని ఆయా రంగాల్లో ఉన్నత విలువలు సాధించిన వారికి ప్రకటిస్తారు. ఈ సారి సంగీతంలో పులిట్జర్ బహుమతి ప్రఖ్యాత సంగీతకారుడు బాబ్ డిలాన్ కు ప్రకటించారు. మొత్తం చదవండి »
సంపాదకీయం
Mar2008
ప్రాణహిత
International Women’s Day
ప్రాణహిత మార్చి సంచికకు స్వాగతం. మార్చి నెలలో 8 వ తారీకును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. మార్చి నెల అంతర్జాతీయ మహిళాదినోత్సవం అందరిలో ఉత్సాహం నింపుతుంది. 1911 లో కోపెన్ హేగన్ లో మార్చి 8ని ప్రపంచ మహిళాదినంగా జరుపుకోవాలని క్లారా జట్కిన్ చేసిన ప్రతిపాదన ఆమోదం పొందింది.1908లో న్యూ యార్కులో బట్టల మిల్లుల కార్మికురాండ్రు తమ పనికి వేతనం పెంచాలని, పని గంటలు తగ్గించాలని ‘బ్రెడ్ అండ్ రోజెస్’ కావాలనే డిమాండుతో రోడ్లమీదకు వచ్చి పోరాటాలు జరిపారు. వీరి పోరాటాలకు గుర్తింపుగా మార్చి 8ని జట్కిన్ ఎంచుకోవడం జరిగింది. ఈ అతి సామాన్య పేద స్త్రీలు సృష్టించిన చరిత్రే అంతర్జాతీయ మహిళాదినం మార్చి 8. మొత్తం చదవండి »
సంపాదకీయం
Feb2008
ప్రాణహిత
Painting ‘Black History Month’ప్రాణహిత ఫిబ్రవరి సంచికకు స్వాగతం. ఈ నెలను బ్లాక్ హిస్టరీ మంత్ గా పిలుస్తారు. ఈ నెలంతా అమెరికా లో నల్ల జాతీయుల హక్కుల కోసం, స్వేచ్ఛా సమానత్వాల కోసం పోరాడిన వాళ్ళ జీవితాలనీ, చరిత్రలో ముఖ్య ఘట్టాలనీ తలుచుకుంటారు. అమెరికా చరిత్ర ని రెండు కోణాల్లో పరిశీలించవచ్చు.. ఒకటి సాధారణంగా ప్రధాన స్రవంతిలో ప్రచారంలో ఉన్న కోణం. ఇక్కడ పాలిస్తున్న వారి కోణం. ఇక్కడి ఆధిపత్య సమూహాల దృష్టి నుండి చరిత్రను చూసి చెప్పే పద్దతి. అంటే టూకీ గా చెప్పుకోవాలంటే కొలంబస్ రాక తో ఈ ఖండం మీద అడుగు పెట్టిన ‘యాత్రీకుల’ (తెల్ల వారి) చరిత్ర.. వారి విజయాల చరిత్ర. అట్లా వచ్చిన ‘యాత్రీకులు’ (pilgrims) ఇక్కడ తమ స్థిర నివాసాలనీ, రాజ్యాలనీ స్థాపించుకుని ఏర్పర్చుకున్న సామ్రాజ్యం దృక్కోణం నుండి చూసే చరిత్ర. రెండోది దీనికి పూర్తిగా భిన్నమైన కోణం.
మొత్తం చదవండి »
సంపాదకీయం
Jan2008
ప్రాణహిత
జనవరి ప్రాణహిత కు స్వాగతం. ప్రాణహిత పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
21 వ శతాబ్దిలో మరో సంవత్సర కెరటం కాలసముద్రంలో కలిసిపోయింది. 2007 సంవత్సరం వెళ్తూ వెళ్తూ కొన్ని విషాదాలను మిగిల్చి పోయింది. మరీ ముఖ్యంగా సంవత్సరాంతంలో, మనందరికీ సుపరిచితుడు, ఆత్మీయుడూ అయిన ప్రముఖ నవలా రచయిత అల్లం రాజయ్య ఏకైక కుమారుడు అల్లం కిరణ్ కుమార్ అమెరికా లో లూసియానా స్టేట్ యూనివర్సిటీ కాంపస్ లో దొంగతనానికి వచ్చిన కొందరు దుండగులచే అతి దారుణంగా కాల్చి చంపబడ్డాడు. అతనితో పాటు సహ విద్యార్థి కొమ్మా చంద్రశేఖర్ రెడ్డి కూడా దారుణంగా హత్యకు గురయ్యాడు. మొత్తం చదవండి »
సంపాదకీయం
Dec2007
ప్రాణహిత
చిత్రం: ఏలే లక్ష్మణ్ప్రాణహిత డిసెంబర్ సంచికకు స్వాగతం. ఈ సంచిక తీసుకు రావడంలో అనూహ్యంగా ఆలస్యమైనందుకు క్షంతవ్యులం. కొన్ని అనివార్య కారణాలు ఈ ఆలస్యానికి కారణం. ఐతే ఆలస్యమైనా ప్రాణహిత ఈ సారి అద్భుతమైన రచనలతో మీ ముందుకొస్తున్నది. తెలుగు నేల మీద జరుగుతున్న అపారమైన సాహిత్య కృషిని కొంతనైనా మీ ముందుకు తీసుకు రాగలుగుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈనాడు తెలుగులో వస్తున్న సాహిత్యం మీద మనం తరచూ కొన్ని అపవాదులు వింటూ ఉంటాం. సాధారణంగా ఈ అపవాదుల వెనుక ముఖ్య కారణం, ఈ నాడు వెలువడుతున్న సమకాలీన తెలుగు సాహిత్యం పూర్తిగా అందుబాటులో లేక పోవడమే. తెలుగులో వస్తున్న సాహిత్యాన్నంతా ప్రజా బాహుళ్యానికి, దేశదేశాల్లో ఉన్న సాహితీ ప్రియులకు అందడంలేదు.
మొత్తం చదవండి »
సంపాదకీయం
Nov2007
ప్రాణహిత
‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామినవంబర్ ఒకటి – ప్రముఖ సాహితీయోధుడు వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి. 1915 లో తెలంగాణ లోని ఒక పల్లెటూర్లో జన్మించిన ఆళ్వారుస్వామి, తన 46వ ఏట 1961 లో మరణించారు. తన 46 ఏళ్ల పరిమిత జీవితంలోనే అపరిమిత విజయాలు సాధించారు. జీవితకాలమంతా సాహిత్య జీవనం, సంఘ కార్యాలు తన రెండు బుజాలుగా పనిచేసారు. ప్రజల మనిషి’, ‘గంగు’ – రెండు నవలలు రాసారు. ‘జైలు లోపల’ మరికొన్ని ఇతర కథలు రాసారు. ‘రామప్ప రభస’ అనే రాజకీయ వ్యంగ్య రచనలు చేసారు. ‘వీణ’, ‘తెలుగు తల్లి’ పత్రికలను నిర్వహించారు. ‘దేశోద్ధార గ్రంథమాల’ ను నెలకొల్పి దాదాపు 30 పుస్తకాలు తన ముద్రతో ప్రచురించారు. గ్రంథాలయోద్యమం లో క్రియాశీలకంగా పాల్గొని, రచయితగా అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘాల్లో పనిచేసారు. సామాజిక చైతన్యకారుడిగా ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభల్లో, రాజకీయ కార్యకర్తగా స్టేట్ కాంగ్రెస్ , కమ్యూనిస్టు పార్టీల్లో, కార్మిక నాయకుడిగా ‘గుమస్తాల సంఘం’, ‘రిక్షాకార్మికుల సంఘం’, ‘రైల్వే కార్మికులసంఘం’ కార్యకలాపాల్లో అంకిత భావంతో పనిచేసారు.
మొత్తం చదవండి »
సంపాదకీయం
Oct2007
ప్రాణహిత
చిత్రం: ఏలే లక్ష్మణ్సెప్టెంబర్ 9 ఆదివారం సాయంత్రం హైదరా‘బాధ’లో మరో దారుణం జరిగింది. నగరంలో, జనసమ్మర్దం తో అత్యంత రద్దీ గా ఉండే పంజగుట్ట లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ హఠాత్తుగా కూలిపోయింది. అనేక వాహనాలు కూలిన ఫ్లై-ఓవర్ కాంక్రీట్ దిమ్మలకింద నజ్జు నజ్జై పోయినయి. ఇద్దరు మరణించారు. పదుల కొద్దీ తీవ్రంగా గాయపడ్డారు. ఫ్లై-ఓవర్ కూలడానికి కారణాలు వెదికే క్రమంలో, ఫ్లై-ఓవర్ నిర్మిస్తున్న గామన్ కన్‌స్ట్రక్షన్ కంపనీ తన తప్పేమీ లేదని, అంతా హైదరాబాదు మున్సిపాలిటీ, వాటర్ వర్క్స్ వాళ్ళ పాపమే అనీ, లేదు తప్పంతా ప్రభుత్వానిదే అని ప్రతి పక్షాలూ, ప్రతి పక్షాలు అన్నీ రాజకీయం చేస్తున్నాయని ప్రభుత్వమూ పరస్పర నేరారోపణ చేసుకున్నారు. చివరికి విచారణ సంఘం గామన్ కంపనీదే బాధ్యత అని ప్రకటించింది.
మొత్తం చదవండి »
సంపాదకీయం
Aug2007
ప్రాణహిత
ప్రాణహిత ఆగస్టు సంచికకు స్వాగతం. మా జూలై సంచికను సహృదయంగా ఆదరించి, మాకు విలువైన అభిప్రాయాలను, సలహాలను, సూచనలను అందించిన మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అంచనాలకు అనుగుణంగానే ఆగస్టు సంచిక మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం చదవండి »
సంపాదకీయం