సూచిక: 'సాహిత్య వ్యాసాలు'

మంచి కథ అంటే…

మంచి కథ అంటే మనకు అందరికీ ఇష్టమే. కాని, మంచి అంటే ఏంటీ? మంచి ఎలా వుంటుందీ? మంచి కథకు ఉండాల్సిన లక్షణాలేంటీ? ఇలాంటి ప్రశ్నలకు మనందరం ఏకీభవించే జవాబులు లేవు. నాకు మంచివి అనిపించే కథలు మీకు నచ్చకపోవచ్చు. ఈ విషయం గుర్తుంచుకుంటూ, నాకు ఎలాంటి కథలు నచ్చుతాయో, ఎలాంటివి నచ్చవో, ఎందుకు నచ్చవో వివరించటానికి ప్రయత్నం చేస్తాను. మొత్తం చదవండి »

7 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

దళితసాహిత్యం-చరిత్ర

చరిత్ర రచనాక్రమం_నేపధ్యం    :
భారతదేశ చరిత్ర రచనను మొదట ప్రారంభించిన వారు వలసవాద చరిత్రకారులు.  జె.ఎస్.     మిల్, మెకాలే వంటివారు భారతదేశ చరిత్రను వలసవాద దృక్పథంతో పరిశీలించారు.  వీరి రచనలలో భారతీయులు వెనుకబడిన అనాగరికులు.  వీరికి సంస్కారం నేర్పి, నాగరికులుగా చెయ్యటం పాలకులుగా తమబాధ్యత అనే ధోరణి కనిపిస్తుంది.  వీరు భారతదేశ చరిత్రలో ప్రాచీనయుగాన్ని హిందూయుగంగాను, మధ్యయుగాన్ని ముస్లిం యుగంగాను ఆధునిక యుగాన్ని బ్రిటిష్ యుగంగాను విభజించి చరిత్రరచనలో తమ సంకుచితత్వాన్ని చాటుకున్నారు.  మొత్తం చదవండి »

9 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

కథా సాహిత్యం – రైతు జీవన చిత్రణ

అది 1980 వ దశకం. రైతు జీవన యాదార్థ సంఘటనలు కథా కళగా మారుతున్నాయి. జానపద కథ విప్లవ కథగానూ, జానపద వృత్తి గాయకులు విప్లవ గాయకులుగాను మారుతున్నారు. తెలంగాణలో వీరగాధల్ని ఊరూరా పాడుకుంటూ ప్రజల్లో పోరాట చైతన్యం నింపుతున్నారు.తత్ఫలితంగా విప్లవోద్యమం బయలుదేరింది.    ఇది అటు కథా కళారంగలోనూ. ఇటు రైతు సంఘంలోనూ గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. ఈ విభిన్నమైన రెండు కోణాల్ని స్పృశిస్తూ “తుమ్మేటి రఘోత్తమ రెడ్డి” గారు “సవారీ” అనే కథను రచించారు. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

అలనాటి మన సాహిత్య విమర్శ “కవిత్రయ కవితా విమర్శనము”

ఇరవయో శతాబ్దం ప్రథమార్థంలో వచ్చిన తెలుగు సాహిత్య విమర్శను చదువుతుంటే అనేక ఆసక్తికరమైన విషయాలు మన దృష్టికి వస్తాయి. సంప్రదాయ సాహిత్యాన్ని సంప్రదాయ దృష్టితోనే చూసేవర్గం ఒకటి వుండగా, సంప్రదాయ సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో అంచనా కట్టే వర్గం ఇంకొకటి మనకు కనిపిస్తుంది. సంప్రదాయ సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో అంచనా కట్టేవాళ్ళందరూ సారాంశంలో భావజాలంలో ఆధునికులు కాకపోయినా, ఆంగ్లసాహిత్యం ద్వారా కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొత్త కొలమానాలతో ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలించే ధోరణి మాత్రం ఆహ్వానించదగిందే, పి. దక్షిణామూర్తితో  మొదలైన (పింగళి సూరన 1892) ఈ ధోరణి కట్టమంచి రామలింగారెడ్డి, వింజమూరి రంగాచార్యులు( కవిత్వతత్వవిచారము, పింగళిసూరనార్యుడూ 1914) తో అది ఒక స్పష్టమైన రూపాన్ని సంతరించుకుంది వీళ్లలో కూడా రెండు మూడు రకాల వాళ్ళు కనిపిస్తారు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

తెలుగు కవిత్వంపై మార్క్సిజం ప్రభావం

ప్రతి సమాజంలోని కవి లేక రచయిత ప్రస్తుతం తన ముందున్న దానికంటే అభివ్యక్తీకరణకు కొత్తమార్గం అన్వేషిస్తూనే వుంటాడు. ఈ అన్వేషణతో సాహిత్యంలో అనేకమైన మార్పులు వచ్చినప్పటికీ సాహిత్యపు మాలాలను తలక్రిందులు చేసే మార్పు అభ్యుదయ సాహిత్య యుగంలోనే వచ్చింది. మానవతావాదం యొక్క గుణాత్మక పరిణామమే అభ్యుదయవాదం. అభ్యుదయం అనే శబ్దానికి ప్రగతి, పురోగమనం అనే అర్థంగా భావించవచ్చు. సాహిత్య రంగంలో ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న వచన కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళిత కవిత్వం, మైనారిటీ కవిత్వం పుట్టుకలకు మూలం అభ్యుదయ కవిత్వమే. అభ్యుదయం కవిత్వం అభివృద్ధికి ప్రధాన భూమిక మార్క్సిజం. సంప్రదాయ సమాజంలోని వేళ్ళూనుకొని వున్న సాంఘిక వ్యవస్థలోని లోపాలతో విసిగిన ప్రజలకు ఒక నూతన సమాజాన్ని ఆచరణ ద్వారా చూపించింది. ఈ మార్క్సిస్టు దృక్పథమే. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »Uncategorized, సాహిత్య వ్యాసాలు

డయాస్పోరా సాహిత్యానికి ఒక కానుక ఎస్ . నారాయణస్వామి కథాసంకలనం ‘రంగుటద్దాల కిటికీ’

ఈ మధ్య కాలంలో తెలుగు డయాస్పోరా సాహిత్యం మీద కొన్ని వ్యాసాలు వచ్చినయి, చర్చలు జరుగుతున్నయి. డయాస్పోరా సాహిత్యం అంటే ఏమిటి, దాన్ని సృష్టించేదెవరు, చదివేదెవరు, సాహిత్యం లో ఉండే అంశాలేమిటి, దానికీ వలస జీవితానికీ, వలస రాక ముందు తెలుగుదేశం లోని జీవితానుభవానికి సంబంధమేమిటి, ఈ డయాస్పోరా సాహిత్యానికి ప్రత్యేక ప్రయోజనమేమైనా ఉందా, ఉంటే అదేమిటి, ఎవరికి -  ఇలాంటి అనేక విషయాలపై చర్చ జరిగింది, జరుగుతోంది,. ఈ సందర్భంలో ప్రచురితమైన ఒక మంచి కథా సంకలనం ఎస్ . నారాయణస్వామి గారి ‘రంగుటద్దాల కిటికీ -  కథలు”.  మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు

మధురాంతకం రాజారాం కథల్లో స్త్రీ

తెలుగు కథా సాహిత్యంలో మనిషితనానికి పట్టంగట్టి, గొప్ప మానవీయ విలువలతో కథలు రాసి , తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న గొప్ప రచయిత కీ.శే  మధురాంతకం రాజారాం. ఒక ఉపాధ్యాయుడుగా అతి సాధారణమైన జీవితాన్ని గడిపిన రాజారాం పల్లెపట్టులలోని జనం మధ్యతరగతి ప్రజలు , ఉద్యోగస్తులు సాగిస్తున్న సాధారణ జీవితాన్ని అతి దగ్గరగా చూసి , తన కథల్లోకి ఆ జీవితాన్ని యధాతధంగా ఒంపుకున్న రచయిత రాజారాం. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

శ్రీశ్రీ వచన సాహిత్యం- సామాజిక దృక్పధం

కవిత్వాన్ని ఎంత సామాజిక బాధ్యతగా రాశాడో, వచన రచనలూ అంతే బాధ్యతగా రాసినట్లు శ్రీ శ్రీ గద్య రచనలు చూసినప్పుడు గ్రహించగలం.కవిత్వంలో శ్రీశ్రీ స్పశించిన కోణం లేనట్లుగానే వచనంలో చేపట్టని ప్రక్రియలేదు.శ్రీశ్రీ వచన రచనలన్నిటిని కల్పనాత్మక సాహిత్యం, కల్పనేతర సాహిత్యంగా విభజించవచ్చు.కల్పనాత్మక సాహిత్యంలో నవలలు, కథానికలు , నాటికలు పేర్కోనగా కల్పనేతర సాహిత్య ప్రక్రియల్లో వ్యాసాలు , పీఠికలు, సంపాదకీయాలు, ప్రజ, సమీక్షలను పేర్కోనవచ్చు. వీటిలో సామాజిక దృక్పధాన్ని శ్రీశ్రీ ప్రదర్శించిన తీరును వివరించడం ఈ వ్యాస పరిధి. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

మహాప్రస్థానం అంకితం కొంపెల్ల జనార్దనరావు కోసం మాత్రమేనా?

బరంపురంలో మనం ఇంకా
నిన్న గాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!
కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును
కలకల లాడించింది నీ నవ్వు…
విశాఖపట్టణం వీథుల్లో మనం
‘ఉదయిని’ సంచికలు పట్టుకు తిరగడం
జ్ఞాపకం ఉందా? మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

ఆడేపు లక్ష్మీపతి కథల్లో స్త్రీ పాత్రలు

సాంఘిక జీవితంలోను  ఆ జీవితాన్ని ప్రతిబింబింపచేసే కళారంగంలోనూ ఎన్నోమౌలికమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాహిత్యాన్ని అర్థం చేసుకోవాల్సిన తీరులో ఒక కొత్త దృష్టి వచ్చింది. పునాదుల్ని కదిలించే చర్చయివ్వాళ సాహిత్యంలో ప్రవేశించింది. స్త్రీలను గురించిన ఆలోచన ఆవేదన సమాజం లో స్పష్టంగా కన్పిస్తోంది. అలాంటి సాహిత్యంలో ఒక భాగంగా మనం కథాసాహిత్యాన్ని విశ్లేషించుకొంటున్నాం. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

‘అనంత’ కథానిక ప్రస్థానం

1910లో పుట్టిన తెలుగు కథానిక 1940  తర్వాత గాని రాయలసీమ లోకి అడుగు పెట్టలేదు. అందుకు గల కారణాలు చాలా వున్నప్పటికీ, ప్రధాన కారణం ఇక్కడ ఆధునిక జీవితమే ఆలస్యంగా ఆరంభం కావటం ! మరొక కారణం రాయలసీమ రచయితలు, కవులు గ్రాంధిక భాషా వ్యామోహం నుంచీ, ప్రాచీన సాహిత్య వస్తు రూపాల నుండీ బయట పడక పోవటం.! మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

జానపద గేయాల్లో మానవీయ విలువలు

ఆదిమ మావవుడు అవతరించినప్పటి నుండి నాగరికత ఎన్నో మలుపులు తిరిగింది.మానవీయ విలువలకు ప్రాధన్యమిచ్చి సంస్కృతీ, సంప్రదాయాలు రూపొందాయి.నాడున్న మానవీయ విలువలు నేడు మసకబారుతున్నాయి.పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావం వల్ల మనిషిలో స్వార్థం వేళ్ళూనికొని పోతోంది. తోటివారిని చిన్న చూపు చూడడం, పక్కవారికి ఏమి జరిగినా స్పందించకపోవడం నేడు అంతటా కనిపిస్తోంది. దిగజారి పోతున్న మానవీయ విలువలను గురించి భవిష్యత్తు తరాలవారికి బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

వక్త్‌ కీ ఆవాజ్‌

సలాం హైదరాబాద్‌ లోకేశ్వర్‌ ఆత్మచరిత్రాత్మక నవల. తెలంగాణ నవల అన్నాడు గానీ ఇది చార్మినార్‌ ఆత్మ చరిత్రాత్మక నవల. హైదరాబాద్‌ ఆత్మ చరిత్రాత్మక నవల. 1969లో ప్రత్యేక తెలంగాణ పోరాట ఉద్యమానికి గుండెకాయ వంటి హైదరాబాద్‌ అరుదయిన చరిత్ర, అణచివేయబడిన పోరాట చరిత్ర రాసాడు గనుక తెలంగాణ హైదరాబాద్‌ అద్దంలో తన ప్రతిఫలనం చూసుకున్న నవల. అద్దంలో ప్రతిబింబం తప్ప ప్రతిఫలనం కనిపించదు కదా. అందుకే ఈ నవల అద్దం కాదు. హైదరాబాద్‌ చుట్టూ, స్వామిని, వేణును, హైదరాబాద్‌ను, సికిందరాబాద్‌ను కలిపిన హుసేన్‌సాగర్‌ అలల్లో తమ స్నేహాలను, స్వప్నాలను చూసుకున్న నవల.
స్వామిని, వేణును కలపడమంటే తెలంగాణను శ్రీకాకుళాన్ని కలపడం కూడ. స్వామి దగ్గర బయల్దేరి వేణు దగ్గరికి చేరుతామా, వేణు శ్రీకాకుళ ఉద్యమంలోకి వెళ్లిన ఉత్తరం చదువుకుందామా – శ్రీకాకుళం తెలంగాణకు నడచివచ్చిన, కాదు తూర్పుగాలియో, సముద్ర కెరటమో సుడిగాలివలె, తుపాను వలె నాలుగు దిక్కుల చుట్టివచ్చిన ఉదంతం చదువుకుందామా. తుర్రెబాజ్‌ఖాన్‌, అల్లావుద్దీన్‌ల అమరత్వంతో ఆరంభమై ఈ నవల నడుస్తున్న చరిత్రలోని నలభై ఏళ్ల కింద అధ్యాయం దగ్గర ఆగినట్లు (ముగిసినట్లు కాదు) వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంల అమరత్వంతో సెట్‌ బ్యాక్‌కు గురయి అసంపూర్ణంగా ముగిసిన ప్రజాస్వామిక విప్లవ చరిత్ర చదువుకుందామా. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు, ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

రైతు రాజయ్యే రోజొకటుందా?

వ్యవసాయం మానవ జీవిత చరిత్రలోనే సాటిలేని ఒక అద్భుతం.
చరిత్రలో మొట్టమెదటి సృజనాత్మక కళాకారుడు రైతే.
మట్టిని బంగారంగా మార్చే సువర్ణ విద్య తెలిసిన ఆల్ కెమిస్ట్ రైతు. దిగంతాల మధ్య ఆకాశమే కప్పుగా పచ్చదనాల మట్టితోటిదే రైతు జీవితం…. వ్యవసాయం చుట్టూ అల్లుకున్న మానవ జీవితమే ఒక గొప్ప సంస్కృతి అంటారు కుటుంబరావు గారో చోట…….. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

నేనెరిగిన శ్రీశ్రీ

మద్రాసులో పుట్టిపెరగడంవల్లనూ, మా ఇంట్లోని తెలుగు సాహిత్యవాతావరణంవల్లనూ శ్రీశ్రీగారిని నేను చాలాసార్లు, చాలా సందర్భాల్లో చూశాను. మా కుటుంబానికి అనేక తెలుగు స్థానికరచయితల, కళాకారుల కుటుంబాలతో పరిచయాలుండేవి. వీరిలో శ్రీశ్రీ ధోరణి కాస్త వేరుగా ఉండేది. ఆయనకు మా అమ్మకూడా చాలా ఏళ్ళుగా తెలిసినప్పటికీ ఆయన సంభాషణా, సంపర్కమూ మానాన్నవరకే పరిమితంగా ఉండేది. తన కుటుంబాన్ని పరిచయం చెయ్యడంగాని, మా కుటుంబసభ్యులతో మామూలుగానైనా మాట్లాడడంగాని ఆయన చేసేవారుకాదు. మొత్తం చదవండి »

38 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

రాయలసీమ జానపద సాహిత్య సౌరభం

రాయలసీమ రతనాలసీమ. రతనాలకంటే విలువైన జానపద సాహిత్యానికి కూడా ఈ సీమే ప్రసిద్ధి. జానపద సాహిత్యం అక్షర ఙ్ఞానం లేని పల్లీయుల సాహిత్యం. మనదేశంలో నూటికి 75 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్తూ పల్లెల్లోనే జీవిస్తున్నారు. శిష్ట సాహిత్యాన్ని మనమెంత చదువుకున్నా మన తెలుగు సాహిత్యంలోని సౌరభాల్ని, స్వచ్ఛతను, తియ్యదనాలను రుచి చూడాలంటే జానపద సాహిత్యాన్ని పరిశీలించక తప్పదు. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

తెలంగాణ సాహిత్యం – ప్రాంతీయత

స్థల కాలాల చైతన్యంతో, ప్రాంతీయ ముద్రతో , జనహితాన్ని కోరుతూ సమాజాన్ని ముందుకు నడిపించే ఉత్తమ సాహిత్యం. మన పూర్వ లాక్షణికులు  చెప్పినట్టుగా ఆనందోపదేశాలతో మంచికి దోహదం చేసేదే అసలైన సాహిత్యం. రచయిత పేరు లేకుండా కథను చదివితే స్థలకాలాల చైతన్యముండి అది ఫలానా ప్రాంతం నుండి వచ్చిందని తెలుసుకోగలిగే కథే ప్రాంత ముద్ర గల కథవుతుంది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

Next »