Apr2010
మంగాపురం అరుణకుమారి
సాహిత్యలోకానికిదివరకు పరిచయం లేని కొత్త కథా వస్తువుల్ని పరిచయం చేసినవాడు రాసాని. రాసాని విద్యావంతుడే గాక నవలాకారుడుగా, కథకుడిగా, కవిగా, సాహిత్య విమర్శకుడిగా అంతకుమించి నాటకకర్తగా, నటుడిగా బహుముఖమైన ప్రఙ్ఞని కనబరిచినవారు. కథా, నవలా సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలిగిన రాసానిని స్వామి, సింగమనేని వంటివారు సాంస్కృతిక రచయితగా మన్నన చేసి వున్నారు. అణగారిన కులాల వారి పట్ల , దారిద్ర్య రేఖకు దిగువనున్న తాడితుల పట్ల దీన స్త్రీ జనం పట్ల అపారమైన కరుణను రచనల్లో ప్రతిఫలింపచేసిన వాడు రాసాని. అంతే గాక రాయలసీమలోని చిత్తూరు జిల్లా యాసను, మాండలికాన్ని తన రచనల ద్వారా మధురంగా పలికించడం తెలిసిన రచయిత. అందుకే ఇతని రచనల్లో ఆయా సామాజిక వర్గ మాండలికాలు (sociolect), వ్యక్తి మాండలికాలు (ideolect) అతి సహజంగా ఒదిగి వుంటాయి. ఎక్కడ అభ్యుదయ అంశమున్నా, ప్రాచీన సాహిత్యంలోనైనా సరే వెదికి పట్టుకొని రచనలు సాగించినవాడు రాసాని. రాసాని ఇదివరకు వందకు పైగా కథలు, 7 నవలలు , ఆరు నాటకాలు కొన్ని వందల వ్యాసాలు, కవితలు రాశాడు. రెండు కథల సంపుటాలు, రెండు పరిశోధనా గ్రంథాలు వెలువరించారు. ప్రతి ఏడూ వచ్చే ‘కథా వార్షిక’ లకు సహ సంపాదకత్వం వహిస్తున్నారు. మొత్తం చదవండి »
ఇంటర్వ్యూలు
Jan2010
వేముగంటి మురళీకృష్ణ
– వేణుగోపాల్ రెడ్డి
ఇవాళ తెలుగు కథ ఏ స్థాయిలో ఉన్నది
తెలుగు కథ లో వైవిధ్యం బాగా ఉన్నది. వస్తు వైవిధ్యం కూడా ఉన్నది .శిల్ప పరంగా చాలా మార్పులు వచ్చినాయి. అయితే చిన్నకథ (ఇంగ్లీషు లొ short story అంటారు )లో- బుచ్చిబాబు , గొపీ చంద్ లాంటి రచయితలు వ్రాసిన కథల్లో ఉన్న సమాంతరత ఇపుడు రాస్తున్న ఆధునిక కథకు రచనలో కనిపించడం లేదు. ఏదో సంఘటన ప్రధానంగా రాసినప్పటికి కూడా గత తరం రచయితలు సఫలీకృతం అయినంతగా ఈ తరం రచయితలు కావట్లేదనిపిస్తుంది. మొత్తం చదవండి »
ఇంటర్వ్యూలు
Apr2009
ప్రాణహిత
కె.ఎన్.వై.పతంజలి ఇంటర్వ్యూ, గమనం సౌజన్యంతో పగడాల నాగేందర్
కథలు, నవలలు మీరు ఎందుకు రాస్తారు?
పతంజలి
సహజంగా రాస్తాను. రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తాను. నాకు రాయబుద్ది అవుతేనే రాస్తాను. నా 11వ ఏట నుంచే రాయడం అలవాటైంది. ఎదుటి వాళ్ళకు ఏవైనా బోధించాలనుకునే దురహంకారం నాకెప్పుడూ లేదు. నా రచనల్లో తిట్లు ఉండొచ్చు గాని, కేవలం తిట్టడానికే నేనెప్పుడూ రచనలు చేయలేదు. కథల వెనుక, నవలల వెనుక, పాత్రల వెనుక దాక్కోవడానికి నేను వ్యంగ్యాన్ని ఆశ్రయించలేదు. స్పష్టంగా జీవితంలో ఉన్నదే, రచనల్లో చూపాను. మొత్తం చదవండి »
ఇంటర్వ్యూలు
Oct2008
ప్రాణహిత
‘కవిత్వానికి చిరునామా’ గుంటూరు శేషేంద్ర శర్మతో ఇంటర్వూ
- సబ్బని లక్ష్మీనారాయణ
తన కవిత్వాన్నంతా ‘ఆధునిక మహా భారతం‘ అని ప్రకటించుకొన్న గుంటూరు శేషేంద్ర శర్మ గారితో ఆగస్టు 28, 2004 నాటి సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సంభాషణ సారాంశమే ఈ ఇంటర్వ్యూ. ప్రశాంతంగా, నిర్మలంగా శేషేంద్ర నుండి వచ్చిన జవాబుల రూపం ఇది.
ప్ర: మీ సాహిత్య నేపథ్యమేమిటి?
శేషేంద్ర: నాకు ఇప్పుడు 78 ఏళ్ళు. నేను 4,5 సంవత్సరాల వయస్సున్నపుడు ఈ దేశ పరిస్థితులను ఊహించుకోవచ్చు. మొత్తం చదవండి »
ఇంటర్వ్యూలు
Oct2007
ప్రాణహిత
ప్రాణహిత: దాదాపు రెండు వేల ఏళ్ల తెలుగు సాహిత్యంలో రైతును అనేక విధాలుగా వర్ణించారు. రైతు గురించి పద్యాలు రాసారు.
అశోక్: రైతు రామాయణం రాసాడు ఒకాయన.
ప్రాణహిత: అవును! ఏటుకూరి వెంకటనర్సయ్య రైతు మీద కావ్యం రాసారు. అట్లాగే దువ్వూరి రాంరెడ్డి కూడా రైతు గురించి రాసారు. శ్రీశ్రీ ‘పొలాలనన్ని హలాలు దున్ని’ అని రాసారు. కానీ మీరు రైతుని ఒక కొత్త పద్ధతిలో పట్టుకున్నారు. చందమామతో పోలుస్తూ ‘ఆకుపచ్చ చందమామ’ అన్నారు. ఆ పాట జలపాత రహస్యం చెప్తారా? మొత్తం చదవండి »
ఇంటర్వ్యూలు
Oct2007
ప్రాణహిత
ప్రాణహిత: పాట చాలా శక్తివంతమైన మాధ్యమం దీన్ని మనం వాడుకోవాలి అన్నారు. అట్లా వాడుకునే పద్ధతిలో, ప్రజలకు ఉపయోగపడే విధంగా, లేదా మీరు చెప్పే భావాలకు ఉపయోగపడే విధంగా సినిమా రంగాన్ని వాడుకునే ప్రయత్నాన్ని మీరేమైనా చేస్తున్నారా? మొత్తం చదవండి »
ఇంటర్వ్యూలు
Oct2007
ప్రాణహిత
ప్ర: మీరు కార్లో ప్రయాణం చేస్తూ రాయడం చూసాను?
నె: నేనెక్కడ ఎప్పుడు రాయగలిగినా రాస్తాను. ఎల్లప్పుడూ రాస్తూ ఉంటాను.
ప్ర: మీరెప్పుడూ రచనలన్నీ చేత్తోనే రాస్తారా? లేదా టైపు యంత్రం వాడతారా?
నె: నేను ప్రమాదం లో నా వేలు విరగ్గొట్టుకుని టైపు యంత్రాన్ని కొన్ని నెలలు వాడలేక, మళ్ళీ చేత్తో రాసే నా యవ్వనపు రోజుల్లోని అలవాటు వైపు మళ్ళాను. మొత్తం చదవండి »
అనువాదాలు, ఇంటర్‌వ్యూలు, ప్రపంచ సాహిత్యం
Sep2007
ప్రాణహిత
తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ పాటకు మకుటం లాంటి వాడు, సుద్దాల అశోక్ తేజ తానా మహాసభల కోసం అమెరికా వచ్చిన సందర్భంగా ఆయన పాటల నేపథ్యాన్ని, అనుభవాల్నీ, జీవన యాత్రనూ, సాహితీ యాత్రనూ, అద్భుతమైన కవిత్వం నిండిన అతని పాటల జలపాత పుట్టుక రహస్యాలను తెలుసుకోవడానికీ, కష్ట జీవుల జీవితం ప్రతిబింబిస్తూ, పద పదానా శ్రమ గొప్పతనాన్నీ, శ్రమైక జీవన సౌందర్యాన్నీ చాటే అతని పాటల జీవనాడిని పట్టుకోవడానికి ‘ప్రాణహిత’ ఆయనతో ముచ్చటిస్తున్నది. మొత్తం చదవండి »
ఇంటర్వ్యూలు
Sep2007
ప్రాణహిత
ప్రాణహిత: మీ ప్రాపంచిక దృక్పథం, ఆలోచనా స్రవంతి గురించి వివరిస్తారా?
అశోక్: ఈ ఆలోచనా దృక్పథం, ప్రాపంచిక దృక్పథం ఇదంతా కాదు గానీ మొత్తం మీద ఒక్కటి – నేను చూసి ఎక్కడయితే బాధ పడుతానో, నేను ఎదురుగా చూసింది ఏదయితే నాకు బాధ కలిగిస్తందో దాన్ని పాటగా మార్చే ప్రయత్నం చేస్తాను. లేదా నేను ఏదయినా ఒక వార్త విన్నప్పుడు ఆ బాధ ను ఊహించగలను. మొత్తం చదవండి »
ఇంటర్వ్యూలు
Sep2007
ప్రాణహిత
(గత సంచిక తరువాయి)
ప్ర: మీరు పేరెందుకు మార్చుకున్నారు? పాబ్లో నెరూడా అనే పేరు ఎందుకు ఎంచుకున్నారు?
నె: నాకు సరిగ్గా గుర్తు లేదు. నేనప్పుడు పదమూడో పద్నాలుగో ఏండ్లున్నాననుకుంటా! నేను కవిత్వం రాయాలనుకోవడం మా నాన్నకు సుతరామూ ఇష్టం లేదు. నేను రాయడం వల్ల నాకు మా కుటుంబానికీ వినాశం కలుగుతుందనీ, ముఖ్యంగా నన్ను పూర్తిగా పనికి రానివాడిగా తయారు చేస్తుందని ఆయన – మంచి ఉద్దేశ్యంతోనే – నమ్మే వాడు. మొత్తం చదవండి »
అనువాదాలు, ఇంటర్‌వ్యూలు, ప్రపంచ సాహిత్యం
Aug2007
ప్రాణహిత
Nikhileshwar “ప్రజాస్వామిక విప్లవం కోసం కృషి చేసేటందుకు
విశాల ప్రాతిపదిక పై సాహిత్య వేదిక ఏర్పడాలి”
- – - – - – -
“దిగంబర కవిత్వం సామూహిక సృష్టి –
ఏ ఒకరూ నాయకుడు కానీ ప్రయోక్త కానీ కాదు”
మొత్తం చదవండి »
ఇంటర్వ్యూలు
Aug2007
ప్రాణహిత
పారిస్ నుండి వెలువడే ప్రముఖ సాహిత్య పత్రిక పారిస్ రివ్యూ అనేక మంది ప్రసిద్ధి చెందిన రచయితలను, కవులనూ ఇంటర్వ్యూ చేసింది. ప్రపంచ సాహిత్య రంగంలో ఈ ఇంటర్వ్యూలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా ప్రఖ్యాత లాటిన్ అమెరికన్ మహాకవి పాబ్లో నెరూడా ను పారిస్ రివ్యూ తరఫున రీతా గ్యూబర్త్ ఇంటర్‌వ్యూ చేసింది. దానికి ఆమె రాసిన ఉపోద్ఘాతం ఇది. మొత్తం చదవండి »
అనువాదాలు, ఇంటర్‌వ్యూలు, ప్రపంచ సాహిత్యం