Jun2010
నేర పరిశోధన
(గత సంచిక తరువాయి)
పై జాబితాలో అతని ఫిడేలు వాయింపు గురించి ప్రస్తావించాను. అతనికిందులో ప్రావీణ్యం చాలా వుంది. కాని ఇతర విషయాలలో లాగే ఇందులొ కూడా అతనికి ఒక పద్ధతిలేదు. అతను నా కోరికపై మెండల్ సోన్, లైడర్ మొదలైన వారి పాటలు వాయించాడు. కాని తనకుతానై వాయించుకునేటప్పుడు అతని వాయింపులో సంగీతం గాని, గుర్తించదగిన పాటగాని సామాన్యంగా వుండేదికాదు. సాయంకాలంపూటల కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుని ఫిడెలు మోకాళ్ళమీద అడ్డంగా పరుచుకుని కమానుతో గీకేవాడు.అతను వాయించే స్వరాలు ఒకప్పుడు శ్రావ్యంగా వుండేవి. ఒకప్పు డు విషాదంగా వుండేవి. ఒక్కొక్కప్పుడు విడ్డూరంగానూ, ఉత్సాహంగానూ ఉండేవి. అతని భావాలు ఆ స్వరాలలో ప్రతిబింబితమయేవన్నదిమటుకు స్పష్టం. అయితే యీ భావాలకు సంగీతం దోహదమే చేసేదో , లేక అతని భావాల ఫలితంగా బాణీలయేవో నిర్ణయించటంమటుకు నా వల్ల కాలేదు. ఇటువంటి వాయింపు తరవాత అతను నాకిష్టమైన పాటలు కొన్ని వరుసగా వాయించి నాకు పరిహారం చేసేవాడు. మొత్తం చదవండి »

