సూచిక: 'సాహితీ సదస్సులు – రిపోర్టులు'

‘మనలో మనం’ సాహిత్య సదస్సు

‘మనలో మనం ‘  విశాఖలో తనను తను పరిచయం చేసుకుంటూ వునికిని చాటు కుంటూ అవిష్కరించుకుంది. వరంగల్ లో  తెలంగాణ దళిత స్త్రీల సాహిత్యం పై, కడపలో ముస్లిం మైనారిటీ మహిళల సమస్యలను చర్చిస్తూ ,గుంటూరులో క్రైస్తవ మైనార్టీ మహిళల స్త్రీల సాహిత్యం. బి.సి, కోస్తాంధ్ర స్త్రీల సాహిత్యం పై రాష్ట్ర స్థాయి స్త్రీల రచయిత్రుల సదస్సును విజయవంతంగా జరుపుకుంది. రెండు రోజుల సదస్సులో భాగంగా విష్ణుప్రియ పాటతో సభ మొదలైంది. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

తెలంగాణ వాలే జాగో …………జగావో

గడచిన అరువైయేండ్ల సమైక్యవాద పొత్తుల సంసారంల తెలంగాణ బతుకు భాష, యాస , సంస్కృతి అంతా ఆగమైంది. అడివైందని అన్ని రంగాల్లో కోస్తాంధ్ర వలసవాదుల కుట్ర క్షణ క్షణానికి బలిపెట్టాలనే చూస్తూంది.తెలంగాణ గుండె కాయలాగ తెలంగాణ సంస్కృతికి, చరిత్రకు నిలువెత్తు సాక్షమైన హైదరాబాద్ ను ప్రీజోన్ పేరిట పూర్తి స్థాయిలో హస్తగతంచేసే కుట్రకు పాల్పడుతుండ్రు. చూస్తున్న కవిగాయకుల కండ్లల్ల కారం పొడి చల్లి, నడుస్తున్న ఉద్యమతొవ్వల్ల నడవకుంట మంగముండ్లు నాటి నినాదపు గొంతికెలయిన హైద్రాబాద్ కు ప్రీజోన్ పేరిట ఉరివెడ్తండ్రు. గందుకే తెలంగాణా కవులం, కళాకారులం అందరం ఒక్కపారి క్యాలికి అయి క్యాలి (మేల్కొల్పు)చేయాలనే ఉద్దేశ్యంతో “మేహైద్రాబాద్ హమారా హై / హమారా హీ రహేగా!/ జాగో ఔర్ జగావో !!!” నినాదాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినాన్ని నిరసన దినంగా, తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణను గ్రంధాలయోద్యమ కర్తయై అక్షరాల్తో మేల్కొల్పిన మట్టిమనిషి ‘వట్టి కోట ఆళ్వారుస్వామి’శాందిరి కింద పొద్దుగాల పదిగంటలకు సభ సురువైంది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

విమర్శకునితో ఒక సాయంత్రం

ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య కె.కె.రంగనాధాచార్య గారితో కేంద్ర సాహిత్య అకాదమి వారు “విమర్శకునితో ఒక సాయంత్రం” అనే కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్యదర్శి ఇళంగోవన్ అధ్యక్షత వహించారు.

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

వారధి – రచయితల సహకార వేదిక

ఆధునిక వస్తువినిమయ ప్రపంచం విసిరిన సవాళ్ళు ఎదుర్కోవడానికి మనిషి విశ్వప్రయత్నం చెయ్యాలి. తనను తాను తెలుసుకోగలిగినప్పుడే మనిషి మనిషిగా మిగులుతాడు. అలా తెలుసుకోవడానికి అవకాశాన్ని కల్పించేదే సాహిత్యం. అలాంటి సాహిత్యం లో రచయితలు కొత్త కోణంలో చూడడం, కొత్తకొత్తగా ఆలోచించడం, కొత్తగా రాయడం, నూతన తరహాలో కార్యక్రమాలు నిర్వహించడం , కొత్త పాఠకుల దగ్గరకు పోవడం, కొత్త వస్తువులను ఆవిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది రచయితల సహకారంతో ఏర్పడిందే వారధి రచయితల సహకార వేదిక.

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

తెలంగాణ ప్రచురణలు “ముంగిలి” ఆవిష్కరణ

డా.సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సంకలనం చేసిన తెలంగాణ ప్రాచీన సాహిత్యం “ముంగిలి” ని ప్రముఖ సంస్కృత పందితుడు డా. ఆచార్య రవ్వా శ్రీహరి గారు ఆగష్టు 2 వతేదీన ఇఫ్లూ (సీఫెల్) లో ఆవిష్కరించారు.

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

తెలుగు కథా సాహిత్యంలో రైతు జీవిత చిత్రణ పై కేంద్రసాహిత్య అకాడమి సదస్సు

తెలుగు కథా సాహిత్యంలో రైతు జీవితం ఎలా చిత్రించడమైనది, ఇంకా ఏయే అంశాలను కథాసాహిత్యం పట్టుకోవలసి వుంది, ఇంతవరకు చిత్రించిన సాహిత్యపు బలాలు, పరిమితులు ఏమిటి అనే అంశాలపై చర్చించేందుకు గాను కేంద్రసాహిత్య అకాడమి తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ సహకారంతో రెండు రోజుల సదస్సును జులై 13, 14 తేదీలలో నిర్వహించింది. ఈ సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుండి వివిధ కథా రచయితలు, విమర్శకులు పాల్గొన్నారు. మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

విప్లవకవి శ్రీశ్రీ శతజయంతి సభ

విరసం సిటీ యూనిట్ జూలై 3న శ్రీ శ్రీ శతజయంతి సభ నిర్వహించింది. ఈ సభకు అధ్యక్షురాలిగా డా.గీతాంజలి వక్తలుగా వేణు సంకోజీ, వరవరరావు, ఎన్.వేణు గోపాల్ వచ్చి ప్రసంగించారు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

తెలంగాణా రచయితల వేదిక సమావేశం

ఇటీవల తెలంగాణా రచయితల వేదిక సభ హైదరాబాద్ లోని సుందరయ్య విఙ్ఞాన భవన్లో జరిగింది. ఈ సమావేశానికి వచ్చి ప్రారంభోపన్యాసము చేసిన ప్రముఖ రచయిత అల్లం రాజయ్య మాట్లాడుతూ “నే వీరుల త్యాగాల్ని అక్షర బద్దం చేసి కథల్ని రాసాను, కాని ఇప్పటి సమాజం అనుకున్నదానికంటే భ్రష్టుపట్టిపోయింది. రానురాను వాతావరణం హింసాపూరితమైతున్నది. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

తెలంగాణా కథా వేదిక “దస్కత్” ఆవిర్బావం

ఉద్యమాల పురుటిగడ్డ మీద కథా సాహిత్య ప్రక్రియను మరింత విస్తరించేందుకు తెలంగాణ యువకథకుల ఆద్వర్యంలో తెలంగాణ కథావేదిక “దస్కత్” ఆవిర్భవించింది. తెలంగాణ నేల మీద జరిగిన, జరుగుతున్న పోరాటాల్లో సాహిత్యం తనవంతు పాత్రను క్రియాశీలకంగా పోషించింది. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »సాహితీ సదస్సులు – రిపోర్టులు

‘మనలో మనం’కు మనోబలాన్ని పెంచిన రాయలసీమ సదస్సు

ప్రాంతాల వారీగా, అస్తిత్వాల వారీగా స్త్రీల సాహిత్య విమర్శను సమగ్రం చేసుకోవడంలోబాగంగా మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక జూన్ 27, 28 తేదీలలో రాయలసీమ సాహిత్య సదస్సును నిర్వహించింది. విశాఖ పట్నం, వరంగల్ సదస్సుల అనంతరం మరింత స్పష్టమయిన అవగాహనతో మనలో మనం ముందడుగు వేసింది. మొత్తం చదవండి »

7 అభిప్రాయాలు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

విమల ‘మృగన’ ఆవిష్కరణ

విమల కవిత్వం ‘మృగన’ ఆవిష్కరణ 09 మే 2009న, సుందరయ్య విజ్ఞాన భవనం మినీ హాల్‌లో జరిగింది. ప్రముఖ రచయితలు, రచయిత్రుల మధ్య ‘మృగన’ను విప్లవ కవి వరవరరావు ఆవిష్కరించారు.

పర్‌స్పెక్టివ్‌ ప్రచురణ కర్త ఆర్కే మాట్లాడుతూ ఇంతవరకు మేము వ్యాసాలు,కథల అనువాదాలు వేసినప్పటికి కవిత్వాన్ని వేయడం ఇదే మొదటిసారి, విమల కవిత్వంలో అద్భుతమైన ఆర్తి ఉన్నదని అన్నారు.

మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

జీవజలం చలం

తేది 18-05-2009న చలం 115వ జయంతి సందర్భంగా చలం భావన ఆధ్వర్యంలో సమావేశం ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. చలం భావన బాధ్యులు నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ సాంప్రదాయ అడ్డుగోడల్ని బద్దలు చేసేవిధంగా చలం రచనలు ఉన్నాయి, స్త్రీ పాత్రలు చాలా చైతన్యంతో కూడుకున్నవని అన్నారు.

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

వివక్షా రహిత సమాజం – ఒక ఉమ్మడి ప్రయత్నం

- మల్లీశ్వరి.

మనిషి సామూహిక జీవనం నుంచి విడి వడి వ్యక్తిగత ప్రయోజనాల సాధనే ఏకైక లక్ష్యంగా రూపాంతరం చెందడం వెనుక ఒక చారిత్రక క్రమం వుంది. అవసరాలు, అన్వేషణాశక్తి పునాదులుగా మార్పు చెందిన మనిషి ఈ రోజు ఒంటరి పోరాటాల్లోని క్లిష్టతను గుర్తించాడు. వేర్వేరు సమస్యల్ని ఎదుర్కొనే వర్గాలు ఉమ్మడి శత్రువుతో పోరాడటానికి ఐక్య సంఘటనలు కడుతున్న రోజులివి. సమిష్టితత్వంలోని బలాన్ని గుర్తిస్తూ కొన్ని తాత్కాలిక సర్దుబాట్లతో ప్రజాస్వామిక దృక్పధంతో ఇలాంటి కూటములు ఏర్పాటవుతున్నాయి.

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »సాహితీ సదస్సులు – రిపోర్టులు

వైవిధ్య పరిమళాలు వెదజల్లిన ‘మట్టిపూలూ’ ఆవిర్భావ సభ

భరతఖండం, భారతదేశం, హిందుస్థాన్ మొదలైన అనేకానేక పేర్లతో పరిఢవిల్లుతున్న మన దేశంలో కొన్ని వర్గాలు ఐదుతలల అగ్రవర్ణసర్పాల వేటుకు గురవుతున్నారు. ఆధిపత్యకులాల కుట్రల్లో భాగంగా ఎన్నో విధాల వివక్షలతో పాటూ ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ స్త్రీలు మరికొన్ని అదనపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పితృస్వామ్య, కుల, కుటుంబ హింసకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల ఫలితాలేవి వీరికి చేరట్లేదు. మొత్తం చదవండి »

9 అభిప్రాయాలు »సాహితీ సదస్సులు – రిపోర్టులు

విరసం కథా వర్క్ షాపులు-కరీంనగర్‌లో కథకుల సమావేశం

కళా నైపుణ్యం వ్యక్తికి వుంటుంది.సృజనాత్మకత సాధ్యమయ్యేది మాత్రం సమూహానికే అంటాడు గోర్కి. సమాజంలోని సృజనాత్మకతను స్వీకరించే మార్గాల ద్వారానే వ్యక్తిలోని కళానైపుణ్యం వికసిస్తుంది రచయితలు, కళాకారులు తమకు తెలిసీ, తెలియకా కూడా ఈ పనిలో ఉంటారు. దానికి బైటి నుండీ చోదక శక్తి తోడయితే మరింత కళాత్మకమైన, ప్రయోజనకరమైన రచనలు వెలువడతాయి.

విరసం కథా వర్క్ షాపుల స్పిరిట్ ఇదే. సమాజం పట్ల ప్రేమ, రచన పట్ల నిబద్దత ఉండీ తమ ప్రయత్నంలో సహాయం కోసం చూసే యువ రచయితలకు తోడ్పాటు ఇవ్వటం వీటి ఉద్దేశం. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »సాహితీ సదస్సులు – రిపోర్టులు