సూచిక: 'సంస్మరణ'

బాలగోపాల్ ఙ్ఞాపకాలు

2009 అక్టోబర్ 8, రాత్రి  పదిన్నర , బాలగోపాల్ ఆరోగ్యం బాగాలేదు అన్న వార్త టి.విలో చూడటానికి, ఆయన మనకిక  లేడన్న వార్త వినటానికి మధ్య ఎడంలేదు. బాలగోపాల్ మరణాన్ని తట్టుకోలేక , చెప్పలేక పెద్దపెట్టున ఏడ్చేసిన నామిత్రుడు పొరుగింటి బుర్రారాములు దుఃఖం లో నేను కూడా………. మానవహక్కుల ఉద్యమపుకాడిని రాములు ఒక్కడి భుజం మీద వదిలేసి బాలగోపాల్ ఎందుకలా వెళ్ళిపోవలసి వచ్చిందని ఎవరి మీదో తెలియని ఏదోకోపం………….. అక్రోశం……………… మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు, సంస్మరణ

హక్కుల నేత బాల గోపాల్ కు నివాళి

హక్కులనేత బాల గోపాల్ ఆకస్మిక మరణం ప్రజాస్వామిక వాదులందరిని నిర్ఘాంత పరిచింది. హక్కుల ఉద్యమ ప్రస్థానంలో ఆయనలేని లోటు ఇప్పట్లో భర్తీ చేయడం కష్టసాధ్యం. వాస్తవానికి హక్కుల ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఒక గుర్తింపును విశ్వసనీయతను తీసుకురావడంలో బాలగోపాల్ చేసిన విశేష కృషి దాగివుంది. హక్కుల ఉద్యమానికి ఒక కొత్త ఒరవడినీ, దృక్పధాన్నీ ఇవ్వడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. సమాజంలో హక్కుల ఉల్లంఘనను విపరీతంగా పట్టించుకునే బాలగోపాల్ తన ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆ అలక్ష్యమే తనని అక్టోబర్ 8 రాత్రి 10 గంటలకు మన నుంచి శాశ్వతంగా దూరం చేసింది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »సంస్మరణ

ఉద్యమమే జీవితమై…బాలగోపాల్ కు నివాళి

కే.బాలగోపాల్
కే.బాలగోపాల్

బాలగోపాల్

ప్రజలకు సమస్యలున్నంత కాలం విశ్రమించకూడదని బాలగోపాల్ విశ్వసించాడు. విశ్వాసానికి, ఆచరణకు మధ్య అభేదం పాటించిన పిడికెడు మందిలో బాలగోపాల్ ను అగ్రగణ్యుడిగా నిలుస్తాడు. అవకాశవాదాన్ని దరి చేరనీయలేదు. చెప్పిందొకటి చేసింది మరోటి లేదు. అందుకే బాలగోపాల్ ఆకస్మిక మరణం ఇంతగా తెలుగు సమాజాన్ని కలచివేసింది. బాలగోపాల్ వంటి ఉద్యమకారుడు, మేధావి తెలుగు సమాజానికి ప్రస్తుతం ఎంతైనా అవసరం ఉంది. అవకాశవాదం వ్యవస్థీకృతమైన నేటి పరిస్థితుల్లో బాలగోపాల్ మరణం ప్రజలకు, తెలుగు సమాజానికి తీరని లోటు.

మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »సంస్మరణ

ఉద్యమాలు వున్నా లేకున్నా కవిత్వం వుంటుంది శ్రీ శ్రీ వుంటాడు

1.

కవులలో… తెలుగు కవులలో కూడా… వుద్యమాల కోపు కాచిన కవులున్నారు, వుద్యమాలకు దూరంగా వున్న వాళ్లున్నారు. ఉద్యమాలకు కవిత్వానికి సంబంధం ఉండకూడదనే వాళ్లూ వున్నారు. ఈ విధంగా వుద్యమానుకూలురు, తటస్థులు, వ్యతిరేకులు అని కవులను వర్గీకరించడం… ఆ దృక్ఫధం లోంచి కవిత్వాన్ని చూడడం బాగానే జరిగింది. ఇప్పటికీ జరుగుతోంది. ఈ రకం వర్గీకరణ (టాక్సొనామికల్‍) దృక్పథం వల్ల జరిగిన మేలు కన్న కీడే అధికం.

మొత్తం చదవండి »

12 అభిప్రాయాలు »సంస్మరణ

నరేన్ … నరేన్….

- మునికిష్ణ

అది 1990ల ప్రాంతం. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతాలనుంచి పలమనేరు బంగారుపాళ్యం మండలాలలోకి ఏనుగులు చొచ్చుకొని వచ్చి అటవీ ప్రాంతపు పొలాలపై దాడులు చేయసాగింది.ఈ సమస్య పై అన్ని దిన పత్రికలు వార్తలు ప్రచురించాయి.ఏనుగుల సమస్యపై అప్పటికీ మా చిత్తూరు జిల్లా పౌరహక్కుల సంఘం యూనిట్ ఏనుగుల రాజ్యం అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించి వుంది. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సంస్మరణ

తన గురించి తాను – కమలాదాస్

2009 మే 31 న కన్ను మూసిన కమలాదాస్ తొలిదశలో “మాధవీ కుట్టి” పేరుతో మళయాళంలో కథలు రాశారు. ఆ తర్వాత కమలాదాస్ గా ఇంగ్లీషు కవిత్వం రాసి అంతర్జాతీయ స్థాయిలో భారతీయ కవితా కేతనాన్ని ఎగరేశారు. బడికి వెళ్ళి ఏమీ చదువుకోకుండానే, ఇంట్లో కొద్దిపాటి భాషా పరిజ్ఞానంతోనే ఆమె సాహిత్య రంగంలో సంచలనం సృష్టించారు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సంస్మరణ

నిరంతరాన్వేషి, నిత్య చలనశీలి – కమలాదాస్

నేను డిగ్రీ పూర్తి చేసి నాకొక ఉనికిని, అస్తిత్వాన్ని వెతుక్కుంటూ హైదరాబాద్ చేరిన తొలిరోజులు. చదువుకున్నది తెలుగు మాధ్యమంలోనే అయినా మా హిస్టరీ లెక్చరర్ నాకు ఆంగ్ల సాహిత్యం పట్ల ఎంతో ఇష్టాన్ని, ఆసక్తిని రేకెత్తించారు. ఆవిడ ప్రేరణతోనే డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీష్ సబ్జక్టుగా తీసుకున్నాను. టెంత్ క్లాసులో సంస్కృతం, ఇంటర్ లో స్పెషల్ తెలుగు, డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీషు చదవడం వల్ల సాహిత్యం పట్ల ఎనలేని ప్రేమ ఏర్పడింది. మొత్తం చదవండి »

9 అభిప్రాయాలు »సంస్మరణ

ఒక ధృవతారకు నివాళి

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరి పోతే
నిబిడాశ్చర్యం తో వీరు!

నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరె!

1958వ సంవత్సరం – ఆగస్టు నెల 29 వ తేది – అమేరికా లోని ఇండియానా రాష్ట్రంలోగల గేరీ అనే చిన్న పట్టణంలో ఎవరూ ఊహించి ఉండరు ఆరోజు ఒక తార జన్మించబోతోందని, రాబోయే యాభై సంవత్సరాల్లో సంగీతప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తుందని – ఎవరూ అనుకుని ఉండరు ఆ రోజు జన్మించబోయే తార భవిష్యత్తులో అనేక సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువౌతుందని – ఒక సంగీత వ్యవస్థనే సృష్టిస్తుందని… ఆ తార పేరే మైఖెల్ జాక్సన్! మొత్తం చదవండి »

7 అభిప్రాయాలు »వీడియో / ఆడియో, సంస్మరణ

నా విస్తరాకు

- నామిని సుబ్రమణ్యం నాయుడు

రామోజీ రావును నేనేడిపించినానా, ఆయన నన్నేడిపించినాడా అంటే చెప్పడం కష్టం. చూడండి – అమాసను మించిన తమాసా.
సందర్భం ఏమిటిదంటే-
నేను ఈనాడు వాళ్ళన్యూస్ టుడే డెస్క్ లో సబ్బెడిటరుగా ఒకటిన్నర సంవత్సరం దాకా తిరుపతి ఎడిషన్లో (పని) చేసినాను. నన్ను పర్మనెంటుగా తీసుకొని ట్రైనింగు ఇచ్చుకోవచ్చునా అనేదాని మింద పది మందితో పాటు హైద్రాబాదులో నాకు పరీక్ష.

మొత్తం చదవండి »

16 అభిప్రాయాలు »సంస్మరణ

పతంజలి ఒక అపురూప జ్ఞాపకం

- కె వి కూర్మనాధ్

పతంజలిది ఎంత అసాధారణ వ్యక్తిత్వమో అంత సాధారణమైన వ్యక్తిత్వం. చిట్టచివరి వరకూ సాహిత్యానికీ జర్నలిజానికీ అంతకంటే ముఖ్యంగా మానవీయ విలువలకూ ఒక జీవన విధానంగా గడిపేరు. నమ్మిన సిద్ధాంతాలొకటి, రాసే రచనలొకటి, బతికిన బతుకు మరొకటి కావు పతంజలికి. నమ్మిందే రాసి, రాసిన వాటిల్లోని విలువలను పాటించేరు. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సంస్మరణ

పతంజలి వర్సెస్ ఏక్యుఖాన్

- పి. మోహన్

పతంజలి చనిపోలేదు. అనునిత్యం చస్తూ బతికినవాళ్ళే నిజంగా చచ్చిపోతుంటారు. పతంజలి అనునిత్యం బతికారు. చుట్టూ ఉన్న మనుషుల పట్ల పిల్ల తెమ్మెర లాంటి ఆప్యాయానురాగాలతో గౌతమబుద్దుడిలా జీవించారు. ఆయన సాహిత్యం గురించి ఆయన భౌతికంగా బతికున్నప్పుడు ఇప్పుడూ చాలామందే రాసారు. రాస్తున్నారు. పతంజలి రచనల్లో మాదిరే ఆయన కూడా! మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »సంస్మరణ

పతంజలి గారితో మూడు దశాబ్దాలు

పతంజలిగారిని మొదటిసారి చూసి దాదాపు ముప్పై ఏళ్లు కావస్తోంది.

కె. యెన్ . వై. పతంజలి
కె. యెన్ . వై. పతంజలి
సృజన అక్టోబర్ 1980 సంచిక అచ్చువేయించడానికి బెజవాడ వెళ్లి కృష్ణక్క వాళ్లింట్లో ఉన్నప్పుడు మొదటిసారి ఆయనను చూశాను. అప్పుడు వేణుగోపాల రావు గారు సిద్ధార్థ కాలేజికి ప్రిన్సిపాల్ గా ఉన్నారు. బెంజి సర్కిల్ కు ఇటువైపు కృష్ణక్క వాళ్లిల్లు. అటువైపు ఈనాడు ఆఫీసు. పతంజలి గారు అప్పటికి ఈనాడులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఒక మధ్యాహ్నం వాసు (కె. వాసుదేవరావు) గారితో కలిసి పతంజలి గారు కృష్ణక్కవాళ్లింటికి వచ్చారు. అప్పటికే చతురలో పతంజలి గారి నవల ఖాకీవనం అచ్చయి ఉంది. అంతకు ఒకటి రెండు సంవత్సరాల ముందే ఉత్తరప్రదేశ్ లో పోలీసుల సమ్మె, ఆ నేపథ్యంలో వచ్చిన ఖాకీవనం నవల, అది కలిగించిన సంచలనం వల్ల ఖాకీవనం రచయితను కలవడం, దగ్గరిగా చూసి మాట్లాడడం అద్భుతాలుగా తోచాయి. ఒక రకమైన యాసతో, సన్నని, వ్యంగ్యం ధ్వనించే గొంతుతో, తక్కువ మాటలే అయినా చతురోక్తులతో ఆయన మాట్లాడుతుంటే వినడం ఒక అనుభవం. మొత్తం చదవండి »

8 అభిప్రాయాలు »సంస్మరణ

కొత్తపల్లి- ఒక జ్ఞాపకం, ఒక నివాళి

కవిగా కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణను నేను 1974లో ఆయన ”వెలుతురు పిట్టలు” కావ్యాన్ని రాసినప్పటినుండి ఎరుగుదును. నా కంతకుముందు పరిచయంలేని ఈ కవి రాసిన ఈ కావ్యాన్ని చదివినప్పుడు ఒక మంచి కవిత్వాన్ని చదువుతున్నానన్న అనుభూతి కలిగింది. అందుకే అనిపించింది. కొత్త పల్లిలా నిజమైన కవిత్వం చెప్పగలిగినవాళ్ళు తెలుగు దేశంలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు’. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సంస్మరణ

జ్వాలాముఖి – తుది పయనం

డిసెంబర్‌ 12 నుంచే జ్వాలాముఖికి ఆరోగ్యం వికటించిందని, ఆయనను ఆసుపత్రిలో చేర్చారని తెలుస్తూనే ఉన్నది. వెళ్లి చూడాలని అనుకుంటుండగానే డిసెంబర్‌ 14 వచ్చేసింది. ఆ రోజు ఆయనను చూడడానికి బయల్దేరుతుండగానే సాయంత్రం నాలుగు గంటల సమయమనుకుంటాను ‘జ్వాలాముఖి చనిపోయారట’ అని రజని ఫోన్‌ చేసింది. వెళ్లే వరకే ఆసుపత్రిలో వందలమంది ఉన్నారు. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సంస్మరణ

డా కానూరి హరీష్ స్మృతిలో …

నీవు లేవు నీ మాట ఉంది…

- గుఱ్ఱం సీతారాములు.

వైద్యవృత్తినివదిలి సమాజానికి శస్త్రచికిత్స చేయడం కోసం ప్రాణాలర్పించిన డా|| చాగంటి భాస్కరరావు త్యాగం గూర్చి మనకు తెలుసు. పౌరహక్కుల ఉద్యమంలో రాజ్యం కసాయి తనానికి బలి అయిన డా|| రామనాధం కూడా తెలుసు. వారి స్ఫూర్తితో శాస్త్రీయ అవగాహన, సేవానిరతి, త్యాగం అలపర్చుకొని ప్రజలకు వైద్య సేవలందిస్తూ వచ్చిన ఖమ్మం పట్టణ ప్రముఖ వైద్యులు డా|| కానూరి హరీష్‌ మనకికలేరు. వారు సెప్టెంబర్‌ 22, 2006న కన్నుమూసారు.
మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సంస్మరణ

హరి పురుషోత్తమ రావు సంస్మరణ సభ

Hari Purushotthama Rao
Hari Purushotthama Rao

ఆగస్ట్ 14వ తేదీన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన భవనంలో ప్రముఖ మార్క్సిస్ట్ సాహిత్య విమర్శకులు హరిపురుషోత్తమ రావు సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన రచనల్ని ‘విభిన్న’ అనే పేరుతో పర్స్పెక్టివ్‌ ప్రచురణ సంస్థ వారు ఒక పుస్తకాన్ని వెలువరించారు. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సంస్మరణ

సాహిత్య చరిత్ర మీద హరి సంతకం సుస్థిరం

హరి గురించి రాయాలంటే ఎన్నెన్నో రాయాలి. కలిసినప్పుడల్లా తన మాటలతో ఒక మెరుపు మెరిపించే, ఒక వెలుగు విరిసే, ఒక చారిత్రక అనుభవ శకలం వివరించే, ఒక కొత్త చూపు విశ్లేషణను ప్రసరించే హరిని దాదాపు ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నాను. హరి, రహి, వసుధ వంటి అనేకపేర్లతో ఆయన చేసిన రచనలను చదువుతూ, వేదికలమీద కొన్ని డజన్లసార్లు, ఏకాంత, సామూహిక సంభాషణల్లో కొన్ని వందలసార్లు ఆయన మాటలను వింటూ పొందిన ఆశ్చర్యాలకు ఇక ముగింపు. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »సంస్మరణ

Next »